కేసీఆర్ ఎందుకు గెలుస్తారు?

Thu,November 8, 2018 10:52 PM

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, నగర ఆర్థిక వ్యవస్థనూ సమాంతరంగా అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించి నడిపించిన నాయకుడు నిస్సందేహంగా కేసీఆరే. రాబోయే ఎన్నికల్లో గెలిచేదీ, నిలిచేదీ కేసీఆరే.

తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి టీఆర్‌ఎస్ విజయావకాశాలపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి వారు కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులో ఉన్నదో.. తాము ఏదైతే జరుగాలని కోరుకుంటున్నారో (విష్‌ఫుల్ థింకింగ్ అంటారు). ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగు చ్చి.. ఓ వార్తా కథనాన్ని అల్లుతారు. తాము చెప్పిందే నూరు శాతం జరుగుతుందంటూ నమ్మబలుకుతారు. ఆ వారా ్తకథనంపై రోజంతా చర్చ. మర్నాటికి మరో కొత్త పోస్టు, దానిపై విశ్లేషణ. ఇలా ఫోకస్ అంతా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్, ఆ పార్టీ అభ్యర్థులపైనే ఉన్నది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు చాలా టైట్‌ఫైట్ నడుస్తున్నదని ఒకాయనంటారు. ఎందుకయ్యా అంటే.. ఢిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొన్నారు కాబట్టి. అంతకు ముందు బాగానే ఉన్నప్పటికీ, రాత్రికిరాత్రి ప్రజల్లో చంద్రబాబుకో, కాం గ్రెస్‌కో అనుకూలంగా అభిప్రాయం మారిపోయిందని విశ్లేషిస్తారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి రాలేదని, ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారు కాబట్టి ప్రజలంతా గంపగుత్తగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని మరొకరు వ్యాఖ్యానిస్తారు. గత ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదనీ, అందువల్లే కేసీఆర్ గెలుపు కష్టసాధ్యమం టూ ఇంకొకరు విశ్లేషిస్తారు. నెరవేర్చని హామీలు ఏమిటయ్యా అని అడిగి తే.. అదంతేనంటూ తప్పించుకొంటారు. గత నెలరోజులుగా మీడియాలో తెలంగాణ వ్యతిరేక మీడియా.. తెలంగాణ వ్యతిరేకశక్తులన్నీ ఏకమై రకరకాల కథనాలు రాస్తున్నాయి. పోనీ ఈ ప్రచారానికి హేతుబద్ధత ఏమైనా ఉన్నదా అంటే ఎంతమాత్రం కనిపించదు. సెఫాలజిస్టులు ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తుంటారు. వారు కొన్ని శాంపిల్స్ తీసుకొని ఒక అంచనా కు వచ్చి ఫలానా కారణంగా ఈ విధంగా జరుగవచ్చునని చెప్తారు. అప్పటికీ తమ అంచనాలో రెండు నుంచి మూడు శాతం ఎర్రర్ (తప్పు) ఉండే అవకాశం ఉన్నదని కూడా చెప్తారు. తెలంగాణలో కేసీఆర్ గురించి కానీ, టీఆర్‌ఎస్ గురించి కానీ అంచనా వేసేటప్పుడు ఈ హేతుబద్ధత గురించి ఆలోచించకపోతే కచ్చితంగా తప్పు చేసినట్టే.

ఏ ఎన్నికలు జరిగినా.. అం దులో పార్టీల గెలుపోటములకు పలు రకాల కారణాలు దోహదపడుతా యి. ప్రభుత్వ పనితీరుతో పాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలపైనా ఆధారపడుతాయి. మనిషికి రెండొందలిస్తే ఇరువై వేల ఓట్లు గ్యారంటీగా పడుతాయంటూ ఓ స్వాములవారు ప్రవచించినట్టు జరుగ దు. గతంలో మాదిరిగా మందుకో.. మనీకో ఓట్లు వేసే వాతావరణం దాదాపుగా తగ్గిపోయింది. కొంత సంప్రదాయ ఓటు ఉంటుంది. మరికొం త ఆ పార్టీతో జరిగిన మేలు వల్ల వచ్చే ఓటు ఉంటుంది. సామాజిక వర్గా ల ఓటు ఇంకొంత ఉంటుంది. అభ్యర్థిపై ఇష్టాయిష్టాలు.. ప్రత్యర్థుల మధ్య మంచిచెడులుంటాయి. అభ్యర్థిని మించి ఆ పార్టీ.. దాని అధినేతకు ఉన్న విశ్వసనీయత అన్నదీ ప్రధానంగా ఉంటుంది. ఆ పార్టీతో తమకు మంచి జరుగుతుందా? లేదా? అన్న విషయంలో ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు. పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ రాజకీయాల ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక పార్టీ గెలుపోటములను నిర్ణయిస్తాయి. 2009లో తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగినప్పుడు అయిదేండ్లపాటు ఇదేరకమైన ప్రచారం జరిగింది. రాజ్యాంగంలోని మూడో అధికరణం, 371 డీ ఆర్టికల్, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం, చివరి రోజు వరకూ చిత్తం వచ్చినట్లు రాశారు. న్యాయనిపుణులు రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అవరోధాలుండవని రాజ్యాంగ నిపుణులు చెప్పినా కూడా తాము రాయాలనుకున్నది, చెప్పదలచుకున్నది పదేపదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కచ్చితంగా ఓడిపోతారని రాయలేరు (వాళ్లకే నమ్మకం లేదు కాబట్టి). గెలుస్తారని రాయడం ఇష్టం ఉండదు. అందుకే వితండ విశ్లేషణ చేస్తారు. ఖాయమైన గెలుపు: అవును.. కేసీఆర్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. ఈ చిత్రవిచిత్రమైన విశ్లేషణలు చూస్తున్నప్పుడు ఒక రాజకీయపరమైన అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. 2014లో తెలంగాణ అప్పుడే ఏర్పడి ఇంకా అస్తిత్వంలోకి రాని దశలో ఎన్నికలు జరిగాయి. అప్పటికి స్వరాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో.. పరిపాలన ఎలా కొనసాగుతుందో పూర్తిగా అవగాహనలోకి రాని పరిస్థితి.

అదే సమయంలో తెలంగాణేతర ప్రాంత వాసులకు భద్రత ఉండదంటూ.. విద్యుత్ లేక అంధకారంలో మగ్గిపోతుందంటూ జరిగిన తప్పుడు ప్రచారాలనులు.. జనం ఇంకా పూర్తిగా మరిచిపోని సందర్భం. రకరకాల అనుమానాలు.. సందిగ్ధత.. నెలకొని ఉన్న వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఒకటిన్నర దశాబ్దం పాటు రక్తపు బొట్టు చిందించకుండా ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించిన నాయకుడిపై ప్రజలు నమ్మకాన్ని ఉంచి పగ్గాలను అప్పగించారు. 2014 జూన్ 2 తర్వాత తెలంగాణలో స్వపరిపాలన ప్రారంభమైనప్పటి నుంచీ రాజ కీయ సమీకరణాలు రోజురోజుకూ వేగంగా మారుతూ వచ్చాయి. వైసీపీ, బీఎస్పీ రాష్ట్ర శాఖలు పూర్తిగా టీఆర్‌ఎస్‌లో విలీనమైపోయాయి. టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోయింది. ఆ పార్టీ క్యాడర్ మొత్తం క్రమంగా టీఆర్‌ఎస్ వైపు మళ్లింది. ఓటుకునోటు కేసుతో టీడీపీ భూస్థాపితమైపోయింది. ద్వితీయ శ్రేణి నాయకులు తప్ప మిగతా నేతలంతా టీఆర్‌ఎస్‌తో మమేకమైపోయారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ పరిణామం ప్రస్ఫుటమైంది. 2014లో 10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొన్న పార్టీ.. రెండేండ్లకే పత్తా లేకుండా పోయింది. మరోవైపు కాంగ్రెస్‌లో కూడా గట్టిగా నిలబడే నాయకుడే లేకుండాపోయారు. ప్రస్తు త ఎన్నికల విషయానికి వస్తే, అసెంబ్లీలోని 119 స్థానాల్లో గ్రేటర్ పరిధిలోనే 23 నియోజకవర్గాలున్నాయి. టీఆర్‌ఎస్ మిత్రపక్షం ఎంఐఎం సంప్రదాయ స్థానాలు ఏడు మినహాయించినా మిగతా స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు గణనీయంగా మెజార్టీ స్థానాలు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మంలోనూ అదే పరిస్థితి. 2014లో టీఆర్‌ఎస్ గెలుచుకున్నది ఒకేఒక్క స్థానం. ఇప్పుడక్కడ టీడీపీ, వైసీపీలు పూర్తిగా కనుమరుగైపోయాయి. దీంతో అక్కడ టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక్కడ ఎనభై శాతం సీట్లు టీఆర్‌ఎస్‌కే వచ్చే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండల్లోనూ గత ఎన్నికల నాటి టీఆర్‌ఎస్, ఇప్పటి టీఆర్‌ఎస్ పరిస్థితికీ హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందనే విశ్వాసం.
k-santosh-kumar
మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు టీఆర్‌ఎస్ కంచుకోటలు. ఈ జిల్లాల్లో టీఆర్‌ఎస్ దూకుడును ఆపగలిగే నాయకులు ప్రత్యర్థి శిబిరంలో ఒకరిద్దరికి మించి కనిపించరు. ఆదిలాబాద్‌లో, వరంగల్‌లోనూ 2014లో గెలుపొందిన సంఖ్యకు (7,8) తక్కువ అయ్యే అవకాశాల్లేవు. దీనికితోడు ఎంఐఎం పూర్తిస్థాయిలో ఇస్తున్న మద్దతు.. మైనార్టీ ఓటు బ్యాంకు పరంగా టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అంచనా వేస్తే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కామన్‌సెన్స్ ఉన్నవారెవరికైనా తేలికే. వీటికితోడు దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమలుచేసి న సంక్షేమ పథకాలు ఎలాగూ ఉన్నాయి. లబ్ధిదారుల్లో నలభై శాతం మంది ఓట్లేసినా సాధారణ మెజార్టీ వచ్చేస్తుంది. ఇక లబ్ధిదారులంతా ఓట్లేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతకుమించి గత నాలుగున్నరేండ్ల కాలంలో పరిపాలనాదక్షుడిగా కేసీఆర్‌కు వచ్చినంత పేరు దేశంలో మరే ముఖ్యమంత్రికీ రాలేదు. వివిధ సామాజిక వర్గాలవారీగా ప్రగతి భవన్‌కు గత మూడేండ్లలో వచ్చినంత మంది గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ రాలేదు. సీఎం గా కేసీఆర్ ఆయా వర్గాల సమస్యలపై చర్చించినంతగా మరే ముఖ్యమంత్రీ చర్చించలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, నగర ఆర్థిక వ్యవస్థనూ సమాంతరంగా అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించి నడిపించిన నాయకుడు నిస్సందేహంగా కేసీఆరే. రాబోయే ఎన్నికల్లో గెలిచేదీ, నిలిచేదీ కేసీఆరే.

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles