ప్రజలు పట్టించుకోని కూటమి

Tue,November 6, 2018 10:28 PM

రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని మరో విమర్శ. రాష్ట్ర అభివృద్ధి గురించి 2014కు ముందు ప్రస్తుత పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తే తెలుస్తుంది. కళ్లుండి చూడలేని కబోదులు, మనసుండి ఆలోచించలేని మందమతులకు ఏమీ కన్పించదు.

ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, పార్టీలలో చేరికలు చూస్తుంటే ఎంత వారలైన కాంత దాసులేఅనే సామెత గుర్తుకు వస్తున్నది. దీన్ని కొం త సవరిస్తే ఎంత వృద్ధులైనా పదవీ వ్యామోహులే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజాకవిగా పేరుగాంచిన గద్దర్ ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేక ఇంతదాకా ఓటు హక్కును వినియోగించుకోలేదు. అలాంటి ఆయన ఢిల్లీలో సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని కలిశారు. అవసరమైతే అందరి మద్దతుతో గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీచేస్తానని ప్రకటించారు. వెనుకబడినవర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఆర్. కృష్ణ య్య మహాకూటమి (ప్రజాకూటమి) నాయకులతో ఫోటోకు ఫోజులివ్వడం చూస్తుంటే పై సామెత గుర్తుకు వస్తున్నది. 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. వారి పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆ పార్టీతో అంటీముట్టనట్టు ఉంటూ ఎప్పటిలాగే వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కృష్ణయ్య కూడా మహాకూటమి పంచన చేరడం విచారకరం. అలాగే కోదండరాంకు కేసీఆర్ పాలన నచ్చలేదంటే ఒప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్‌తో పొత్తు ఏమిటి? పొత్తుల పేరుతో కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ చదరంగంలో ఆయన పావుగా మారిపోయాడు. పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ఆచార్యుల వారిని చూస్తుంటే జాలేస్తున్నది.రేపు మాపు అంటూ కాంగ్రెస్ నాయకులు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు. కోదండరాం కాంగ్రెస్ కపట నాటకాన్ని గుర్తించడం లేదా? లేక గుర్తించినా తప్పదని వారి చుట్టూ పరిభ్రమిస్తున్నారా? సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఇచ్చిన ప్రాధాన్యం టీజేఎస్, సీపీఐలకు ఇవ్వడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నామమాత్రంగా సీట్లు విదిలించినా కోదండరాంను ఎటూ పాలుపోని స్థితిలోకి నెట్టడమే కాంగ్రెస్ ఆడుతున్న వికృత క్రీడ. మేధావిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న కోదండరాంను ఈ దుస్థితిలో చూడటం మాలాంటి వారికి కూడా మనసు ద్రవిస్తున్నది.

చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు సృష్టించాడో తెలిసిందే. ఆ తర్వాత ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ఉద్యోగుల విభజనకు ఎన్ని అవరోధాలు కలిగిస్తున్నారో కనిపిస్తున్నది. అలాంటి తెలంగాణ వ్యతిరేకితో పొత్తుపెట్టుకుని కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

అధికారం కోసం వీళ్లంతా మహాకూటమిలో చేరడాన్ని గమని స్తే నవ్వి పోదురు గాని నాకేటి సిగ్గు అన్నది గుర్తుకు వస్తున్నది. భాగస్వామ్యపక్షాలలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి చూసి ఆత్మాభిమానం గల ప్రతి తెలంగాణవాది అసహ్యించుకుంటున్నాడు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కంటే సీమాంధ్ర నాయకులే నయమట. ఇది ఎంత జుగుప్సాకరమైన అభిప్రాయం! దశాబ్దాలుగా సీమాంధ్ర ముఖ్యమంత్రులకు గులాంలుగా వ్యవహరించిన వారు స్వతంత్రంగా బతుక డం కొంచెం కష్టమే. ఈ విషయం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉపన్యాసాలలో బైటపడుతున్నది. అలాగే.. ఇంతకూ రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నట్టు? ఇటీవల ఆం ధ్రాబాబు తెలంగాణకు వచ్చినప్పుడు రేవంత్ అతడిని పొగడ్తలతో ముం చెత్తాడు. ఈ విధానం చూస్తే ఆయనింకా టీడీపీలోనే ఉన్నారా అనిపిస్తున్నది. చంద్రబాబు మాటల్లో కూడా కేసీఆర్‌ను గద్దె దించాలని, తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలన్న తాపత్రయమే కనబడింది. అధికారం కోసం సీట్ల త్యాగానికైనా సిద్ధం కావాలని శ్రేణులకు హితబోధ చేశారు. చంద్రబాబు నాలుగేండ్ల పాటు మోదీ ఆశ్రమంలో ఉన్నారు. దాని నుంచి బైటికి రాగానే కేసీఆర్ తనతో పాటు కలిసి పోరాటం చేస్తే కేంద్రం మెడ లు వంచవచ్చట. పద్నాలుగేండ్ల పాటు అకుంఠిత పోరాటం చేసిన కేసీఆర్ ఇంకొకరికి గులామా? తెలంగాణ ప్రజల కష్టసుఖాలు, జీవన విధా నం తెలిసిన వ్యక్తిగా, వారికి అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు వేరేవారితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కూటమి పేరుతో రాజకీయ పార్టీలు చేస్తున్న అన్ని విమర్శలకు సమాధానాలు ఉన్నాయి. కుటుంబపార్టీ అనేవారు కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలచేత ఎన్నుకోబడిన విషయం గుర్తించాలి. చంద్రబాబు కొడుకు వలె ఎమ్మెల్యే కాకున్నా నేరుగా మంత్రి కాలేదు. చంద్రబాబు, వారి కొడుకు, వారి వియ్యంకులను చూసినప్పు డు కూటమిలోని నేతలకు కుటుంబ పార్టీ కనిపించదు.

ఉద్యమంలో ఉన్న హరీశ్‌రావు, కేటీఆర్, కవితలకు లోకేశ్‌కు పోలికా? కేసీఆర్ కుటుం బ సభ్యులైనా వారికి అప్పగించిన బాధ్యతలను నలుగురు మెచ్చే విధం గా నిర్వర్తిస్తున్నారు. ఈ మధ్య రేవంత్‌రెడ్డి కుటుంబ పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చారు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఆమె తర్వాత రాజీవ్‌గాంధీ, అతను హత్యకు గురైన తర్వాత సోనియా, ఆ తర్వాత రాహుల్ రాజకీయాలలో లేరట! మరి వారికి ఏ ప్రతిభా పాటవాలు ఉన్నాయని ఏకంగా ప్రధానులుగా చేశారు. దేశంకోసం త్యాగం చేసిన వారు, సమర్థులు లేరా? వంశపారంపర్యంగా రావడానికి ఇదేమైనా రాచరిక పాలనా? నెహ్రూ తర్వాత ఇందిరను కొంతవరకు సమర్థించవచ్చు. పదవి లేకున్నా నెహ్రూ కాలంలో ఇందిరా గాంధీ కొంత రాజకీయ అనుభవం సంపాదించారు. కానీ ఎంతోమంది రాజకీయ అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఉన్నప్పుడు రాహుల్‌గాంధీ ఏ ప్రాతిపదికన ప్రధాని పదవికి అర్హుడు? ఒక్క నెహ్రూ కుటుంబ వారసుడని తప్ప! ఇక రెండవది నియంత పాలన అనే విమర్శ. ప్రస్తుతం ఏ పార్టీకైనా సమర్థుడు, నలుగురిని అదుపులో పెట్టగలిగేవాడే పరిపాలన చేయగలడు. ఈ లెక్కన చంద్రబాబు ఆ పార్టీకి నియంత కాదా? తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత వారి పాలనా కాలంలో నియంతలుగా వ్యవహరించారన్న అపవాదు ఉన్నది. కానీ కేసీఆర్‌తో పోలిక పెట్టడం ఈర్ష్యా ద్వేశాలే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇతరుల ను విమర్శించేముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని మరో విమర్శ. రాష్ట్ర అభివృద్ధి గురించి 2014కు ముందు ప్రస్తుత పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తే తెలుస్తుంది. కళ్లుండి చూడలేని కబోదులు, మనసుండి ఆలోచించలేని మందమతులకు ఏమీ కన్పించదు. 24 గంటల నిరంతర కరెంటు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి.

వలస జిల్లాగా పేరు పొందిన పాలమూరు, ఫ్లోరోసిస్‌తో తల్లడిల్లిన నల్లగొండ జిల్లాలలో ప్రస్తుతం కనిపిస్తున్న పచ్చదనాన్ని చూడాలి. అలాగే రైతుబంధు పథకంతో వ్యవసాయం కళకళలాడుతున్నది. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు గిరిజన సోదరులు మాట్లాడుతూ కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన రైతుబంధు వల్ల మాకు వ్యవసాయంపై భరోసా కలిగింది. నాకు ఐదు ఎకరాలకు నలభై వేలు వస్తాయి. నేను రెండు రోజులు సంపాదిస్తే మిగతా రోజులు వ్యవసాయం చేస్తున్న. మా పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నార న్నా రు. ఈ మాటలు అంటున్నప్పుడు వారి కండ్లలో నీళ్లు తిరిగాయి. అలాగే మా ఊరికి వెళ్లినప్పుడు వృద్ధులను పలకరిస్తే ఏం అవ్వా బాగున్నావా? అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోకపోయినా ఫికర్ లేదు. నెల నెలా వెయ్యి రూపాయల పింఛన్ వస్తున్నదన్నారు. వివిధ వృత్తులపై ఆధారపడిన వారు వారి వృత్తులు చేసుకుంటున్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాయి. ఇక డబుల్ బెడ్‌రూం ఇండ్లు చాలా ఊళ్లలో ఇచ్చారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగేది. కాబ ట్టి అన్నీ ఒకేసారి కట్టడం ఆచరణకు అసాధ్యం. కట్టినచోట మాత్రం ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నది. ఒక కొత్త సంసారం సదురు కోవాలంటే కొంత సమయం పడుతుంది. సదురుకున్న కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే పదింతల సమయం పడుతుంది. అటువంటిది ఒక కొత్త రాష్ట్రంలో అన్ని సమకూరాలంటే మరికొంత వ్యవధి కావాలి. అరువై ఏండ్లలో జరిగిన అభివృద్ధితో గడిచిన నాలుగేండ్లలో జరిగిన ప్రగతిని బేరీజు వేస్తే రాష్ట్రం ఎంత ముందుకు పోయిందో అర్థం అవుతుంది.
c-alwal-reddy
చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు సృష్టించాడో తెలిసిందే. ఆ తర్వాత ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ఉద్యోగుల విభజనకు ఎన్ని అవరోధాలు కలిగిస్తున్నారో కనిపిస్తున్నది. అలాంటి తెలంగాణ వ్యతిరేకితో పొత్తుపెట్టుకుని కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ సంగతి కూటమిలోని వారికి తెలుసు. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు నిసిగ్గుగా వ్యవహరిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు!

497
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles