టీఆర్‌ఎస్ నెత్తిన పాలుపోసిన కాంగ్రెస్

Tue,November 6, 2018 10:27 PM

ఎన్నికలు మరో నెలరోజులలోకి వచ్చాక కూడా ఇంకా మహాకూటమిలోని పార్టీలు సీట్లకోసం బాహాటంగా కొట్టుకుంటున్నాయి. కాళ్ళు, చేతులు కోసుకుంటున్నారు. సెల్ టవర్స్ ఎక్కుతున్నారు. వీధుల్లో పడి వీరంగాలు వేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రేపు వీరికి అధికారం ఇస్తే ప్రజలను బతకనిస్తారా? మహాకూటమి అనేది ఒక మాయా కూటమి, మూర్ఖ కూటమి.

ఇటీవల నేను ఒక దినపత్రికలో రాసిన వ్యాసాన్ని చదివి ఐదారుగురు వ్యక్తులు ఫోన్ చేశారు. వారిలో ఇద్దరి సం భాషణ చాలా ఆసక్తిదాయకంగా ఉన్నది. ఒకరు వరంగల్ నుంచి అరవై ఏళ్ల వ్యక్తి. మేము చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులం. గెలిచినా, ఓడినా, కాంగ్రెస్ పట్ల మమకారంతో ఉన్నవాళ్ళం. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీడీపీ నాయకులను, వారి విధానాలను విమర్శిస్తుంటాం. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాలాంటి సంప్రదాయ ఓటర్ల మనోభావాలతో నిమిత్తం లేకుండా టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. ఇప్పుడు మేం టీడీపీని ఎలా విమర్శించాలి? నిన్నటిదాకా తిట్టిన నోటితోనే టీడీపీని, చంద్రబాబును పొగడాల్సి వస్తున్నది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. ఇప్పుడు మా ముందున్న ప్రత్యామ్నాయం ఒకటే. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వెయ్యడం. నా లాంటి అనేకమంది కాంగ్రెస్‌పార్టీ అభిమానులు టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపక తప్పడం లేదు అంటూ తన ఆవేదనను వెళ్లబుచ్చారు. మరొక వ్యక్తి నల్గొండ నుంచి మాట్లాడారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి టీడీపీ కోసం పనిచేశాం. టీడీపీ తరపున ఎవరు నిలుచున్నా ఓటు వేశాం. గత ఎన్నికల్లో కూడా టీడీపీకే ఓటేశాం. కాంగ్రెస్ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఏమాత్రం పొసగదు. కానీ, మా పార్టీ ఉన్నట్లుండి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది. మా అంతరాత్మను చంపుకుని ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎలా సమర్థించాలి? మాలాంటి వాళ్ళం ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను నమ్ముకోవాలని చూస్తున్నాం.కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీడీపీ తన గొయ్యిని తానే తవ్వుకున్నది అంటూ వాపోయాడు.

కాంగ్రెస్-తెలుగుదేశం అనైతిక పొత్తు ప్రజల మనోభావాలను ఎంతగా దెబ్బతీశాయో చెప్పడానికి పైన ఉదహరించిన రెండు ఉదంతాలు సరిపోతాయి. మూడున్నర దశాబ్దాలు పరస్పరం కలహించుకున్న కాంగ్రెస్, టీడీ పీ పార్టీలు హటాత్తుగా కేవలం కేసీఆర్‌ను అధికారం నుంచి దూరం చెయ్యడానికి ఎంతగా దిగజారిపోయాయో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. కాంగ్రెస్ వలన టీడీపీకి లాభమా? లేక టీడీపీవలన కాంగ్రెస్‌కు లాభమా అని ప్రశ్నించుకుంటే రెండుపార్టీలు నష్టపోతాయి అన్న జవాబు మాత్ర మే వస్తున్నది. వాస్తవం చెప్పుకోవాలంటే, ప్రభుత్వం అనేది ఎంత ప్రజారంజకంగా పాలించినప్పటికీ, ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలోనే ప్రతిపక్ష విజ్ఞత బయల్పడుతుంది. టీఆర్‌ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, మళ్ళీ ఎనభై సీట్లతో టీఆర్‌ఎస్ గెలుస్తుందనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కొంతైనా పుంజుకుంటుందని చాలామంది భావించారు. నిన్నటివరకూ కాంగ్రెస్ పార్టీ కనీసం ముప్పై సీట్లు అయినా గెలుచుకునే అవకాశం ఉన్నదని నమ్మినవారి ఆశలమీద కాంగ్రెస్ పార్టీ తన అవివేకంతో నీళ్లు కుమ్మరించేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడ్డాడని, తెలంగా ణ ప్రభుత్వాన్ని కూల్చెయ్యడానికి ప్రయత్నించాడని, ఓటుకు నోటు కేసు లో ఇరుక్కుని అమరావతికి చెక్కేసిన చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజలకు తీవ్రమైన ఆగ్రహం ఉన్నది. టీడీపీని తెలంగాణలో భూస్థాపితం చెయ్యాలని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చచ్చిన పార్టీని బతికించడానికి కాంగ్రెస్ ప్రయత్నించడం పట్ల ప్రజలు రగిలిపోతున్నారు.

కాంగ్రెస్ ఎందుకింత వేగంగా పాతాళానికి పయనమైంది? చంద్రబా బు ఆశ చూపించిన డబ్బు. నిధుల లేమితో కటకటలాడుతున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఆశపెట్టిన అయిదు వందల కోట్ల రూపాయల కోసం కక్కుర్తి పడిందన్నది సందేహాతీతం. అలాగే తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్లు తమకు లభిస్తాయన్న దురాశ! తెలంగాణలో స్థిరపడి న సీమాంధ్రులందరూ టీడీపీ అభిమానులని కాంగ్రెస్ ఎలా భావిస్తున్నదో ఊహాతీతం. వారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులున్నారు. జగన్ మోహన్‌రెడ్డి అభిమానులున్నారు. బీజేపీ అభిమానులున్నారు. జనసేన అభిమానులు ఉన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించి, జగన్ మీద అక్ర మ కేసులు పెట్టి జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర వైఎస్సార్, జగన్ అభిమానులు ఓట్లు ఎలా వేస్తారు? బీజేపీ, జనసేనలతో సంబంధాలను తెంచుకున్న టీడీపీకి ఆ పార్టీల అభిమానులు ఎలా ఓట్లు వేస్తారు? గత నాలుగేళ్లుగా కేసీఆర్ పాలన పట్ల సంతృప్తులుగా ఉన్న సీమాంధ్రులు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారు. బీజేపీ అభిమానులు బీజేపీకే వేస్తారు. పవన్ అభిమానులు టీడీపీ, కాంగ్రెస్ కూటమికి ఓట్లు వెయ్యరు. చంద్రబాబు మీద ఆగ్రహంతో వారంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారు. మరి టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్ సాధించుకున్నది ఏమిటి? మహాకూటమి ప్రయోగం కారణంగా గతంలో టీఆర్‌ఎస్‌కు ఓటువెయ్యని వర్గాలు కూడా ఇప్పుడు దానికి ఓటు వెయ్యక తప్పని పరిస్థితి నెలకొన్నది. రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు ఢిల్లీలో కౌగిలించుకున్నంతమాత్రాన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, టీడీపీల అభిమానులు కూడా వాటేసుకుంటారని నమ్మితే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు.

ఎందుకంటే నాయకులు సిగ్గు విడిచినంత సులువుగా కార్యకర్త లు సిగ్గు వదలరు. నిద్రలేస్తే నిత్యం ముఖాలు చూసుకునే సామాన్య ప్రజలు తమ మనస్సులను రాత్రికిరాత్రే మార్చుకోలేరు. తమ అంతరాత్మలను తప్పకుండా ప్రశ్నించుకుంటారు. టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోగానే మహాకూటమి మహాబలిమి చెందినట్లు, తెలంగాణ ప్రజల మనస్సుల్లో పెద్దమార్పు వచ్చినట్లు, మహాకూటమి సునాయాసంగా విజయం సాధించబోతుందని కొన్ని పచ్చపత్రికలు అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశాయి. చంద్రబాబుకు అమ్ముడుపోయిన క్షుద్రపత్రికలు చంద్రబాబు అంత మహాబలుడే అయితే, పదిసీట్లకోసం కాంగ్రెస్ పార్టీని ఎందుకు దేబిరిస్తాడన్న ఇంగితం కూడా విస్మరించడం విచిత్రమే కదా? గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది కేవలం ఒకే ఒక కార్పొరేటర్ స్థానం అన్న సంగతి వాటంగా మరచిపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో సీమాంధ్రులు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా తెరాస ఘనవిజయం సాధించింది. అప్పుడు చంద్రబాబు, లోకేశ్ ఎంత ప్రచారం చేసినా సీమాంధ్రులు వారిని విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తాము తెలంగాణ పౌరులం అయ్యామన్న స్పృహ వారి లో అంకురించింది. టీడీపీకి ఓట్లు వెయ్యడం వృథా అన్న నిర్ణయానికి వచ్చారు.
m-mohana-rao
ఆనాటి పరిస్థితే అలా ఉన్నప్పుడు, నేడు మళ్ళీ తగుదునమ్మా అని టీడీపీ కాంగ్రెస్ కబంధహస్తాల్లో ఇరుక్కునిపోయాక ఇక ఆ పార్టీకి మళ్ళీ ఆదరణ దక్కుతుందా? ఎన్నికలు మరో నెలరోజులలోకి వచ్చాక కూడా ఇంకా మహాకూటమిలోని పార్టీలు సీట్లకోసం బాహాటంగా కొట్టుకుంటున్నాయి. కాళ్ళు, చేతులు కోసుకుంటున్నారు. సెల్ టవర్స్ ఎక్కుతున్నారు. వీధుల్లో పడి వీరంగాలు వేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రేపు వీరికి అధికారం ఇస్తే ప్రజలను బతకనిస్తారా? మహాకూటమి అనేది ఒక మాయా కూటమి, మూర్ఖ కూటమి. రేపు అందించబోతున్నారు ఓటర్లు దానికి తిరుగులేని ఓటమి.

728
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles