తెలంగాణను బాబు బతుకనిస్తడా?

Mon,November 5, 2018 11:01 PM

ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు నడుస్తున్నయి కదా.. మళ్లీ చంద్రబాబు మరోసారి తన మాయరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ఈ సత్పురుషుడు రాసిన ఉత్తరాలు ఉపసంహరించుకుంట డా? ఆస్తుల పంపిణీలో తేరగా మన ఆస్తులను దొబ్బిపోదమని సుప్రీంకోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకుంటడా? ఉద్యోగులు విభజన, ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో మన రాష్ట్రం వాటాలను కాపాడుతా అని రాసి ఇస్తడా?

పున్నమి కోసం పూజలు చేస్తే.. అమాస అడ్డం వచ్చినట్టుగా ఉన్నది తెలంగాణ ప్రజల పరిస్థితి. చంద్రబాబు కుటిల రాజకీయాల పుణ్యమా అని తెలంగాణ వచ్చిన సంబు రం లేకుండాపోయింది. వచ్చిన తెలంగాణను సక్కగా పాలించుకుందమంటే ఎప్పుడూ కాళ్లల్ల కట్టె పెట్టుడు కార్యక్రమమే ఆయే. తెలంగాణలో మేం కూడా ఉంటమని లొల్లి మోపు చేసే, ఇక్కడి నుంచే పాలించే ప్రయ త్నం చేసే. అట్లెట్ల అంటే.. పదేండ్లు హైదరాబాద్ మా రాజధానని లొల్లి లొల్లిచేసే. హైదరాబాద్‌లో ఆంధ్రాపోలీసులు కూడా ఉంటరని మంకుపట్టుపట్టే. వేరుపడ్డ అత్తకొడండ్ల లెక్క ప్రతీ పోలీసుస్టేషన్ల ఆంధ్రా పోలీసులకు గదులు కావాలని పంచాయితీపెట్టె. ఒక్కటా రెండా.. చంద్రబాబు కుట్రలు. ఇట్లాంటి చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రె స్, టీడీపీ, కోదండరాం లాంటి వాళ్లు జమై మళ్లోసారి తెలంగాణను బాబు పాదాల కాడ పెడుదమని ప్రయత్నం చెయ్యబట్టే? ఇదెక్కడి అన్యాయం? మోసం చేయడం, మోసాన్ని కూడా త్యాగంగా ప్రచారం చేస్కోవడం, వంచన చేయడం.. ఆ వంచనను కూడా గొప్ప కార్యంగా ప్రపంచాన్ని నమ్మించడంలో గోబెల్స్ తమ్ముడు చంద్రబాబుది అందెవేసిన చెయ్యి. మాటమార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణపై విషం చిమ్మడం ఆయన జీవిత పరమార్థం. అలాంటి వ్యక్తి డైరెక్షన్‌లో మహాకూటమి నడుస్తున్నది. ఇట్లాంటి కూటమి మన బతుకుల్ని మార్చుతుం దా! అన్న సంగతి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఆస్తుల విభజనపై, నీటి పంపకాలపై నిత్యం పేచీలు పెడుతున్న సీమాంధ్ర బాబు రేపు మహాకూటమి వస్తే తెలంగాణను బతుకనిస్తడా? హైదరాబాద్‌ను చండీగఢ్‌తో పోల్చిన బాబు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ కు అప్పగించాలని చేసిన కుట్రలను మర్చిపోదమా? ఉమ్మడి రాజధాని పేరిట బాబు చేసిన బాగోతం తెలవందెవ్వరికి.

తెలంగాణను వంచించిన చంద్రబాబుతో కలిసి కట్టిన మహాకూటమి ఒకవైపు, తెలంగాణ కోసం ప్రాణాలివ్వడానికైనా వెనుకాడని నాయకత్వం మరోవైపు. ఈ సందర్భంలో మనం ఎటువైపన్నది తేల్చుకోవల్సిన తరుణం ఆసన్నమైంది. మోసగాళ్లకు ఓటేసి గోసపడదమా? మనల్ని గుండెల్లో పెట్టుకునే కారుకు జైకొడదమా?

సెక్రెటరియేట్ నుంచి సీమాంధ్ర పాలన కొనసాగించే పేరిట తెలంగాణ సర్కారును పడగొట్టే పన్నాగం పన్నిన బాబు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికేవరకు తెలంగాణను వదిలిపెట్టలేదన్న సంగతి మరిచిపోదమా? తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు నిరంతరం కోర్టుల్లో కేసులు వేయించడం, ప్రాజెక్టులను అడ్డుకోవడం బాబు దినచర్య. కృష్ణానది నీటిని సీమాంధ్ర కు తరలించుకుపోయేందుకు, బోర్డుకు లేఖలు రాస్తూ ఏకాంగా బోర్డునే తప్పుదారిపట్టించిన మాయగాడు చంద్రబాబు. నీటిపారుదలకు సంబంధించిన ప్రతి విషయంలో సుప్రీంకోర్టులో కేసులు వేయడం, నిర్మాణం లో ఉన్న మన ప్రాజెక్టులను ముందుకు పోకుండా చేయడం ఆయన విధానం. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు నడుస్తున్నయి కదా.. మళ్లీ చంద్రబాబు మరోసారి తన మాయరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ఈ సత్పురుషుడు రాసిన ఉత్తరాలు ఉపసంహరించుకుంట డా? ఆస్తుల పంపిణీలో తేరగా మన ఆస్తులను దొబ్బిపోదమని సుప్రీంకోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకుంటడా? ఉద్యోగులు విభజన, ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో మన రాష్ట్రం వాటాలను కాపాడుతా అని రాసి ఇస్తడా? మోదీతో యుద్ధం చేసే మొనగాడే అయితే మొన్నటిదాక ఏం చేసిండు? ఇప్పుడు తెలంగాణ ఎన్నికలప్పుడే ఎగిరేగిరి గంతులేయడం దేనికి సంకేతం? అసలు నీకు, మోదీకి నడుమ పంచాయితీకి తెలంగాణ ఎన్నికలను ఎట్లా వేదికను చేస్కుంటవ్? నాలుగేండ్లు అంటకాగినప్పుడు లేని దుగ్ధ తెలంగాణ ఎన్నికలప్పుడే ఎందుకు వచ్చింది? మోదీని ఎదురొడ్డి నిలిచిన నాయకత్వం తెలంగాణది. నలభైసార్లు నాలు క మడతేసినా ఇంకా సత్యహరిశ్చంద్రునిలా ఫీలవుతున్న నీ బండారం తెలంగాణ ప్రజలకు తెలవదని అనుకోవడం నీ మూర్ఖత్వం.

నిన్ను నమ్మి ధృతరాష్ట్ర కౌగిట్లో ఇరుకున్న కాంగ్రెస్ దౌర్భాగ్యం. మోదీని ఓడగొట్టాలనే నీ వేషాలన్ని తెలంగాణను మళ్లీ సీమాంధ్రుల మోచేతి కిందకు తీసుకుపోవాలనే. అవకాశవాదం చంద్రబాబు ఇంటిపేరు, వెన్నుపోటు ఆయన వంటిపేరు. నరనరాల్లో తెలంగాణపై ద్వేషాన్ని నింపుకున్న ద్రోహి. అయినా తెలంగాణ నాయకత్వం ఎవ్వరితో గొడవలు పెట్టుకోలేదు. కొత్త రాష్ట్రం, ఆపై పక్కరాష్ర్టాలతో పేచీలకు పోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడతదనే సదుద్దేశంతో జిత్తులమారి నక్కైన నీకు సైతం స్నేహహస్తం అందించింది తెలంగాణ నాయకత్వం. సాక్షత్తు అసెంబ్లీలోనే.. ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టాలి, ఆంధ్రులు బాగుపడాలని కాంక్షించిన గొప్ప నాయకత్వం తెలంగాణది. కానీ చంద్రబాబు మాత్రం ఆనాటి మోదీ అండదండలు చూసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంతలో సరుకులకంటే హీనంగా టీఆర్‌ఎస్ శాసనసభ్యులను కొనాలని ప్రయత్నం చేసిండు. తెలంగాణ యంత్రాంగం అప్రమత్తమై బాబు బండారం బయటపెట్టడంతో తోకముడిచి సీమాంధ్రకు పరుగులు పెట్టిండు. బ్రీఫ్డ్ మీ అంటూనే ఎంత బ్రీఫ్‌గా తెలంగాణ ను వంచించిండో ప్రపంచమంత చూసింది. కాంగ్రెస్ నాయకుల చేతకానితనం, నాయకత్వలేమి, ఆత్మవిశ్వాస లోపంతో మళ్ళీ మహాకూటమై కూసుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలియని ఈ నాయకులు, గత ఎన్నికల్లో ఓటు వేయలేదనే అక్కసుతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడాని కే బాబుని మన నెత్తిన రుద్దుతున్నరేమో అనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలను, ప్రయోజనాలను తాకట్టు పెట్టి అధికారం అందుకోవాలనే కాంగ్రెస్ నాయకుల వైఖరి జుగుస్సాకరం. అధికారం బాబు చేతిలో బందీ అయ్యా కా వచ్చే పీఠాలు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడాటానికి పనికి రానప్పుడు.. కాంగ్రెస్ నాయకులు సాధించేది ఏంటిది? ఎవరి కోసం ఈ గారడీ విన్యాసాలు? సీమాంధ్ర నాయకత్వం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని బ్లాక్ మొయిల్ చేస్తున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో కనీసం తెలంగాణలోనైనా అధికారంలోకి రాకపోతామా అనే పొలిటికల్ ఈక్వేషన్స్ తోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది తప్పా.. అసలు కాంగ్రెస్‌కు తెలంగాణపై ఏనాడు ప్రేమలేదు.

ఉంటే వందల మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యేదాక చూసేదే కాదు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టేదాక టైంపాస్ చేసేదే కాదు. జాతీయపార్టీలన్నీ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయా లు తీసుకుంటాయి. అందులో భాగంగానే ఈ తెలంగాణ నిర్ణయం వెలవడింది తప్పా ఇందులో కాంగ్రెస్ త్యాగం లేదు. కాంగ్రెస్‌కు ఓటు వెయ్యకపోతే ఆంధ్రలో కలిపేస్తమని దిగజారుడు మాటలు మాట్లాడిం డ్రు. ఈ పిచ్చి కూతలకు ప్రజలు విసుగుచెంది నక్కవాతలు పెడితే నోర్ముసుకున్న నాయకులు, ఇప్పుడు ప్రజలపై ప్రతీకారం తీర్చుకునేందుకు చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నరు. ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? కేవలం కుర్చీ కోసం, అధికారం కోసం ప్రజలను అమ్ముకుంటున్న ఈ నాయకులను చూస్తే బందీపోటు ముఠాలు కూడా సిగ్గుపడాల్సిందే. తెలంగాణను కండ్లల్ల పెట్టుకొని సూసుకునుడే నాయకత్వానికి పెద్దపని అయ్యింది. ఇందులో కేసీఆర్ నూటికి నూరు శాతం విజయం సాధించి న్రు. ఆంధ్రప్రదేశ్ రీయార్గనైజేషన్ యాక్టు బూచీ చూపి తెలంగాణను ఆడుకుందమనుకున్న చంద్రబాబు ఎత్తులను కేసీఆర్ చిత్తుచేసిన్రు. పదేండ్లకు అనుకున్న హైకోర్టు విభజనను ఐదేండ్లు కాకముందే కొలిక్కి తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ సగర్వంగా నిలబడ్డది. మరోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే సాధించిన రాష్ట్రం ముందడుగు వేస్త ది. కానీ ఇప్పుడు తొండి ఆట మొదలయ్యింది. తెలంగాణను వంచించి న చంద్రబాబుతో కలిసి కట్టిన మహాకూటమి ఒకవైపు, తెలంగాణ కోసం ప్రాణాలివ్వడానికైనా వెనుకాడని నాయకత్వం మరోవైపు. ఈ సందర్భంలో మనం ఎటువైపన్నది తేల్చుకోవల్సిన తరుణం ఆసన్నమైం ది.
s-ramana
మోసగాళ్లకు ఓటేసి గోసపడదమా? మనల్ని గుండెల్లో పెట్టుకునే కారుకు జైకొడదమా? పరాయి నాయకత్వం కింద పరేషాన్ అయిద మా? స్వీయనాయకత్వంలో ఆత్మగౌరవ జెండా మరోసారి ఎగరేద్ద మా? ఇవి ఎన్నికలు కాదు, ధర్మానికి, అధర్మానికి నడుమ యుద్ధం. ఇవి ఓట్లు మాత్రమే కాదు మన బతుకుల్ని మార్చే పోరాటం. ఇప్పుడు బానిసత్వానికి జైకొడదమా? స్వపరిపాలనలో తలెత్తి బతుకుదమా..రెండే బాటలు. ప్రజలారా మీరంతా విజ్ఞులు.. మీదారి ఎంచుకోండి. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి. బంగారు తెలంగాణను బానిసపాలకులకు మాత్రం బలియ్యకండి.

598
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles