బీజేపీ చేసిందేమిటి?

Sat,October 13, 2018 11:10 PM

ఒక వర్గానికి చెందిన వారితో మాత్రమే సయోధ్యగా ఉం డాలనుకునే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మానవ హవనా న్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. దేశమంటే అన్ని మతాల, విశ్వాసాల ప్రజలుంటారని మరిచిపోయిన ఏ నాయకుడు ప్రజానాయకుడిగా కానీ, పార్టీ ప్రజల మేలుకోరే పార్టీలా కానీ ఎదుగలేదు. ఏవో కారణాల వల్ల తాత్కాలికం గా అధికారం చేజిక్కినా అది తాత్కాలికమే.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన మళ్లీ అదే ధోరణిలో బీజేపీ జాతీ య అధ్యక్షుడు అమిత్ షా తన నోరు పారేసుకొని, నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలి, తన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసినా, కరీం నగర్ సభ కాని, హైదరాబాద్‌లో ఆయ న ఏర్పాటుచేసిన పదాధికారుల సమావే శం కానీ తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయి. తెలంగాణలో పోటీ చేయడానికి కనీ సం పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా లేని బీజేపీ టీఆ ర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకో వడం చూస్తుంటే వెర్రి వెయ్యిరకాలు అన్నట్లుగా ఉన్నది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో అంటకాగి, తన ఉనికిని చాటుకొ నే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు సొంతగా తెలం గాణలో అధికారంలోకి రాగలమనే పగటి కలలు కంటున్నది. అలాగే తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం రెండు లక్షల కోట్ల నిధులను ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరకాల అభివృద్ధి చేయడానికి, వ్యవసాయానికి మూడు పంటలకు నీళ్లు ఇవ్వడానికి కాళేశ్వరం లాంటి బృహత్ పథకా లను ప్రారంభించిన రాష్ర్టానికి ఒక్క జాతీయ నీటి పారుదల ప్రాజెక్టు అయినా ఇవ్వాలని కోరిన కూడా పట్టించుకోని కేంద్రం తెలంగాణకు దోచిపెట్టినట్లు ప్రకటించడం వింతగా ఉన్నది. అసలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేదెంతా, రాష్ట్రం నుం చి పన్నుల రూపేణా కేంద్రం వసూలు చేస్తున్నదెంతో అసలు అమిత్ షాకు తెలుసా. జాతీయ ఆర్థిక సంఘం నిబంధనల మేరకే కేంద్రం రాష్ర్టా లకు నిధులు కేటాయిస్తుంది.

అది కూడా ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ భారత రాష్ర్టాలకు నిధులు తగ్గిస్తున్నా రని గత రెండేండ్లుగా ఇక్కడి ప్రభుత్వాలు గోగ్గోలు పెడుతు న్న సంగతి అమిత్ షాకు తెలియదనుకోవాలా లేక పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు తాము చేసే పనులు, వివక్ష ప్రజలకు తెలీయదని గుడ్డిగా వాగుతున్నారో వారికే తెలియా లి. ప్రజలు వారనుకునేంత అమాయలు కారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలుచేసిన పన్నుల్లో 52 శాతం ఉంచుకొనే 42 శాతం మాత్రమే తెలంగాణకు ఇస్తుం దనే సంగతి అందరికీ తెలుసు. అసలు విషయాన్ని దాచిపెట్టి తెలంగాణకు ఏదో ఇతర రాష్ర్టాల ఆదాయాన్నంతటిని దోచిపెడుతున్నామనే రీతిలో ప్రచారం చేయడం ఆయన అవివేకమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను చూసిన ఉత్తరాది రాష్ర్టాలు ఎన్నికల సమయంలో తమ రాష్ర్టాల్లో ప్రవేశపెడుతున్న మాట నిజం. బాలింతలకు కేసీఆర్ కిట్ అనే పథకం దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఊహించని పథ కం. అలాగే రైతులకు పంట పెట్టుబడి, జీవిత బీమా పథకా లను గురించి ఏ నాయకుడు కూడా కలలోనైనా ఆలోచించ నివి. స్వామినాథన్ కమిషన్ వ్యవసాయంపై ఇచ్చిన నివేదిక ను అమలుచేయమని రైతులు ముంబై, ఢిల్లీల్లో ధర్నాలు, నిరాహారదీక్షలు చేస్తే వారిపై రాక్షసగా పోలీసులను ఉసిగొల్పి న కేంద్రప్రభుత్వం నిర్లజ్జగా తెలంగాణ ప్రభుత్వంపై నిందా రోపణలు చేయడం గురివింద సామెతలా ఉన్నది.

దేశంలో మాట సామరస్యం కావాలని ఒకపక్క ప్రచారం చేస్తూనే, తెలంగాణలో ఎం.ఐ.ఎం. పార్టీతో సఖ్యతగా ఉన్న టీఆర్‌ఎ స్‌ను గెలిపించవద్దని కోరడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. గత నాలుగున్నరేండ్లుగా తెలంగాణలో ఎలాంటి మాట ఘర్షణలు లేకుండా ప్రజలంతా అన్నదమ్ములా గంగా జెమునా తెహజీబ్ సంస్కృతిని దేశానికి కళ్ళకు కట్టి నట్లు చూపుతుంటే టీఆర్‌ఎస్ పట్ల విషం కక్కడం బీజేపీ నాయకులకే చెల్లుతుంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం నిరుపేద ముస్లిం ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చేసి, కేంద్రానికి పంపింది, ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ చట్టాన్ని ఆమోదించక నిరుపేద ముస్లిం ప్రజలను అవమానపరుస్తున్నది. దేశంలో ఉన్నవారంతా భారతీ యులనే బీజేపీ నాయకత్వం మరి ముస్లిం ప్రజలను వేరుగా ఎందుకు చూస్తున్నదో వారికే తెలియాలి. నిరు పేదలందరికి ఆర్థి క స్వావలంభన కల్పించాల్సిన ప్రభుత్వా లు తమ బాధ్యత మరి చి, ఒక వర్గానికే ప్రాతినిధ్యం వహించ నట్లు మాట్లాడు తూ, మరో వర్గ ఆర్థికంగా, మానసికం గా అణగదొక్కాలని చూడటం ఏ విధంగా రాజ్యాంగబద్ధ పాలన? బడుగు బలహీనవర్గాలదే మన జనాభాలో 85 శాతం సంఖ్యాపరమైన ప్రాతినిధ్యం ఉన్నది. కానీ వారిలో కనీసం 50 శాతం కూడా విద్య, ఉపాధి రంగాల్లో లేరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల లెక్కలే చెబుతున్నాయి. పేరుకు ఓబీ సీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించినా, ఆరు వారాల్లో ఆ కమిషన్ ఓబీసీల వర్గీకరణ గురించి, కులాల మార్పుచే ర్పుల గురించి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆ కమిషన్‌ను కోరినా, ఏడాది గడిచినా కనీసం మధ్యంతర నివేదిక కూడా సమర్పించలేదు.

అయినా కేంద్ర ప్రభుత్వం దానిగురించి పట్టించుకోవడం లేదని అన్నివర్గా లు విమర్శిస్తున్నా, అమిత్ షా దానిగురించి మాత్రా మాట్లాడ టం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఓబీసీలకు. ముఖ్యంగా అతి వెను కబడిన కులాల వారికి ఆర్థిక స్వావలంభన కల్పించాలని ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వెయ్యికోట్ల నిధులు మం జూరు చేసింది. ఈ 21వ శతాబ్దంలో కూడా, కుల వృత్తులనే జీవనోపాధిగా ఎంచుకొని జీవనోపాధి పొందుతున్న కులాల వారికి ఆ వృత్తిలోనే వెసులుబాటు కల్పించాలని, చేపల పెం పకం, గొర్రెల పెంపకం, ఈత వనాల పెంపకం కోసం ఆర్థికం గా వేలకోట్ల రూపాయల సహాయం అందజేస్తున్నది. ఇందు లో దాదాపు తొంభై శాతం సబ్సిడీగానే ప్రభుత్వం లబ్ధిదారు లకు అందజేస్తున్నది. రాజకీయ లబ్ధి కోసం కొన్ని వర్గాలను సంతృప్తిపరుచాలనే దుర్బుద్ధితో, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ప్రజారంజ కంగా పాలించే ప్రభుత్వాలను విమర్శించడం నాయకత్వ లక్షణం అనిపించుకోదు. రాజకీయంగా ఎదుగాలనే తపన ప్రతి పార్టీకి ఉండవచ్చు. కానీ ప్రజలను కుల, మాట, వర్గా లుగా విడదీసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం రాక్షసత్వ లక్షణంగా చెప్పుకోవాలి. ఒక వర్గానికి చెందిన వారితో మాత్రమే సయోధ్యగా ఉం డాలనుకునే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మానవ హవనా న్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. దేశమంటే అన్ని మతాల, విశ్వాసాల ప్రజలుంటారని మరిచిపోయిన ఏ నాయకుడు ప్రజానాయకుడిగా కానీ, పార్టీ ప్రజల మేలుకోరే పార్టీలా కానీ ఎదుగలేదు. ఏవో కారణాల వల్ల తాత్కాలికం గా అధికారం చేజిక్కినా అది తాత్కాలికమే.

chv-prabhakar-rao
అధికారం చేజి క్కింది కదాని, కోతి చేతికి కొబ్బరికాయలా, ఒళ్లు మరిచి ప్రజా నాయకులను, ప్రజా ప్రభుత్వాలను విమర్శిస్తే అది సూర్యునిపై ఉమ్మివేసినట్లే ఉంటుంది. తెలంగాణలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనుకొనే ఏ పార్టీ కూడా ఇతరులను తిట్టి, ప్రజల మన్నలను పొందాలునుకుంటే అది పూర్తిగా అవివేక చర్యే అవుతుంది. టీఆర్‌ఎస్ అందిస్తున్న నిజమైన ప్రజారంజక పాలనను హర్షిస్తూ, తెలియకుండా జరిగిన లోపాలను, పొరపాట్లను ఎత్తిచూపుతూ, తమకు సిద్ధాంపరంగా ఉండే విభేదాలను ఎత్తిచూపితే అది నిజమైన వివేకవంతుల లక్షణమవుతుంది. భారతీయ ఐతిహాసాలు, వేదాలు, వేల ఏండ్ల సంస్కృతి కూడా సర్వేజనా సుఖినోభ వంతు అని ఘోషిస్తున్నాయి. మనిషి సాత్విక భావనలతో, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెపుతున్నాయే కానీ వ్యక్తిగత స్వార్థంతో మూర్ఖునిలా ప్రవర్తించమని కాదనే విష యం భారతీయతకు ప్రతినిధులం అనుకొనే నాయకులకు ఇతరులు చెప్పాల్సిన అవసరం రాకూడదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)

366
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles