కృషి నాస్తి-ఆర్భాటం జాస్తి

Fri,October 12, 2018 10:37 PM

ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని ప్రజలను మాయచే సే చౌకబారు ట్రిక్కులు దేనికి? నువ్వు పదిగంటలు చేశావా, ఇరువై గంటలు చేశావా అని ఎవ్వరూ పట్టించుకోరు. ప్రజలకు కావలసింది ఫలితమే.

జలగం వెంగళరావు నుంచి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరిని చూశాను. అందరి పనితీరును పరిశీలించాను. నా దృష్టి లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జల గం, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రా జశేఖరరెడ్డి కడు సమర్థులైన ముఖ్యమంత్రులు. పెద్దగా చదువుకోకపోయినా, టంగుటూరి అంజయ్య కూడా మంచి పాలనే అందించారు. చంద్రబాబు కొన్ని మంచిపనులు చేసినప్పటికీ, ఆయన భయంకరమైన అవినీతి ముందు ఆ మంచిపనులు ఏ మాత్రం నిలబడవు. అరువై ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా నేను చంద్రబాబుకు ఓటు వేస్తాను.

ఎన్టీఆర్ అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు నిద్రలేచి నాలుగు గంటలకల్లా ఆఫీసు పనిలో మునిగేవా రు. ఏ ముఖ్యమంత్రి కూడా తాను 18 గంటలు పనిచేస్తానని, ప్రజల కోసమే తెల్లారులూ కష్టపడుతున్నానని చెప్పుకోగా నేను వినలేదు. ఇక రాష్ట్రం విడిపోయా క తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. గత నాలుగున్నరేండ్లలో నేను రోజుకు ఇన్నిగంటలు పనిచేస్తున్నానని ఆయన చెప్పుకోగా నేను వినలేదు. కానీ చంద్రబాబుకు మాత్రం రోజూ తాను ఎన్ని గంట లు కష్టపడుతున్నానో చెప్పుకుంటూ సానుభూతి సం పాదించుకునే వ్యాధి ఒకటి ఉన్నది.

చంద్రబాబు ఒంటరిగా కూర్చుని ఏదో పనిచేసుకుంటున్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. గోడకు వేలాడుతున్న గడియారం 11:40 నిమిషాలు చూపిస్తున్నది. అది ఉదయ మే తెలియదు, రాత్రో తెలియదు. చం ద్రబాబు ముఖం చూస్తుంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నది. అది రాత్రివేళ అయ్యుంటే ఆయన వదనం అంత తళతళలాడుతుండదు.
ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని ప్రజలను మాయచేసే చౌకబారు ట్రిక్కులు దేనికి? నువ్వు పదిగంటలు చేశావా, ఇరు వై గంటలు చేశావా అని ఎవ్వరూ పట్టించుకోరు. ప్రజలకు కావలసింది ఫలితమే. 200 4 వరకు తాను రోజూ ఇరువై గంటలు కష్టపడుతానని చంద్రబాబు విపరీతంగా ప్రచారం చేసుకునేవారు. పచ్చమీడియా కూడా ఆయనకు చిడతలు వాయిస్తుండేది. కానీ, ప్రజలు మాత్రం పదేండ్ల పాటు ఆయన్ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు.

నేనొక రోజు ఆఫీసులో సాయంత్రం ఆరున్నరకు కూడా పనిచేస్తుంటే మా సీఈవో వెళ్ళిపోతూ నా దగ్గరి కు వచ్చి మనకు రేపు అనేది ఒకటి ఉంటుంది. మన ఆఫీస్ ఆరు గంటలకు క్లోజ్ చెయ్యాలి. ఆఫీస్ టైమిం గ్స్ అయిపోయాక కూడా నువ్వు పనిచేస్తున్నావంటే నువ్వు అసమర్థుడివైనా అయ్యుండాలి, లేదా పని ఎక్కువైనా అయ్యుండాలి. నాకు తెలిసి మనకు అంత హెవీ వర్క్ ఏం లేదన్నాడు. వెంటనే నేను సిస్టం ఆఫ్ చేసి బ్యాగ్ తీసుకున్నాను. పరిపాలకులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.
Murali-Mohan-Rao

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles