రైతు సంక్షేమ రాజ్యం

Fri,October 12, 2018 12:15 AM

యాభై శాతానికి పైగా జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి రంగం. అందుకే ఈ రంగంలో పెట్టుబడులతో ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయన్న ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ సూత్రీకరణను రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా నిజం చేసింది. రైతే జెండా, అజెండాగా రూపొందించి, అమలుచేసిన విధానాలు సత్ఫలితాలనిచ్చాయి. రైతుకు ఆర్థిక చేయూతగా అక్కరకొచ్చాయి. సంక్షుభిత వ్యవసాయం నుంచి ఒడ్డును చేరేలా రైతులకు ఆపన్న హస్తన్నిఅందించాయి. ఫలితంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయిక లీడింగ్ స్టేట్‌గా తెలంగాణ నిలబడింది. పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా పంటల సాగు ఉన్నప్పటికీ, దానిని విశిష్ఠ సాగుగా గుర్తించిన పాలకులు గానీ, ప్రభుత్వాలు గానీ లేవు. మూడొంతుల వర్షాధారం, తరచూ దెబ్బతీస్తున్న పత్తి పంటకు తోడు కాలువల ద్వారా సాగునీటి వసతి లేని భూములు వరుసగా నష్టపోయాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో చిల్లిగవ్వ కూడా చేతిలో లేని పరిస్థితి రైతులది. ఇప్పటికే వ్యవసాయిక లీడింగ్ రాష్ర్టాలుగా పేరొందినవి కూడా సాధించలేని ఫలితాలను తెలంగాణ అనతికాలంలో సాధించగలిగింది. ఒక రైతు బాధ మరో రైతుకు మాత్రమే ఇంగితమయితయి. అదీ తెలంగాణలో బోరుబావుల వ్యవసాయ చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పథకాలను రూపొందించింది. అత్యంత విలువైన పోషకాలను అందించే తృణధాన్యాలు సహా వరి పంటలకు సైతం నీటి వసతిని కల్పించింది. గ్రామాలకు జీవనాధారాలైన చెరువుల పునరుద్ధరణతో వెంటనే సాగునీరు అందుబాటు పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. మిషన్ కాకతీయ కు శ్రీకారం చుట్టింది. 46 వేల పైచిలుకు చెరువుల పునరుద్ధరణ మహాయజ్ఞంగా జరుగుతున్నది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు రాష్ట్రమంతటా పెరిగాయి. బోరుబావులు నిండుకుండల్లా మారాయి. చెరువు మట్టితో పొలాల సారవంతమై, పంటల ఉత్పాదకత పెరిగిందని, పోషకాలు, ఎరువులపై పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గాయని ఇక్రిశాట్ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక దాదాపు అన్ని పంటల్లో రాష్ట్రంలో పెట్టుబడి ఖర్చులు అత్యంత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రభుత్వం నిర్మించే కాల్వల ద్వారా సాగునీటి అందుబాటు లేకపోవట మే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అర్థం చేసుకున్నది. మొదటి బడ్జెట్ నుంచి ఏటా బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నది.

ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతే అజెండాగా విధానాలు, కార్యక్రమాలు రూపొందిస్తున్నది. అందుకే ఆకుపచ్చ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. రైతు సంక్షేమాన్ని సాధిస్తున్న రాజ్యంగా పేరు పొందుతున్నది. ఈ వ్యవసాయ విధానాలు ఇలాగే కొనసాగితే వ్యవసాయం పండుగ అనేది ఆచరణలో కనిపిస్తుంది.

అలాగే పెండింగ్‌లో ఉన్న చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తూ పొలాలకు నీటిని అందించగలిగింది. ఏటా బడ్జెట్‌లో సాగునీటికి సరాసరిన రూ.25 వేల కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ర్టాలు ఇప్పటివరకు లేవు. భవిష్యత్తులో ఆశించలేం. రాష్ర్టాలు ఏర్పడిన నాటినుంచి ఇతర రాష్ర్టాలు సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని కేవలం ఒక పరిపాలనాకాలంలో సాధించటం చరిత్రే. ఫలితంగా పెరిగిన భూగర్భ జలాలు, అదనపు సాగునీరు లభ్యత, 24 గంటల ఉచిత విద్యుత్‌తో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డు స్థాయి వరి పంట ఉత్పత్తి సాధించగలిగాం. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు 86 శాతానికి పైనే. అయితే వీరికి సాగులో పెట్టగలిగే పెట్టుబడి సామర్థ్యం చాలా తక్కువ. రైతులకు పొలంలో ఉన్న పంటే వారి ఆస్తి. వర్షాధారం కావటంతో ఏండ్ల తరబడి పంటలు కోల్పోయి, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. వారిని వ్యవసాయంలో కొనసాగేలా చూడాలంటే అప్పులు ఊబిలోంచి బయటపడేయాలి. మళ్లీ సాగుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అదే సాహసం చేసింది. 34 లక్షల మంది పైచిలుకు రైతుల పంట రుణాలను మాఫీ చేసింది. ఆ తర్వాత ఎకరానికి రెండు పంటల కు కలిపి రూ.8 వేల పెట్టుబడి మద్దతు పథకంగా రైతుబంధు ప్రవేశ పెట్టింది. ఇప్పటికే వానకాలం పంటలకు రైతు ఖాతాలో నేరుగా చెక్కుల ద్వారా అందజేసింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు కొనుగోలు చేసి, పంటసాగులో మొదట అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నది. 55 లక్షల పైచిలుకు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఫలితంగా రైతులు గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల విషవలయంలోంచి బయటపడగలిగారు. సంతోషంగా సాగులో నిమగ్నమయ్యారు. దేశమే గర్వించదగ్గ మరో గొప్ప పథకం రైతు బీమా. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది.

రైతుకు ఉచితంగా ఏటా రైతు తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తున్నది. రూ.5 లక్షలు జీవిత బీమాగా రైతుకు అందిస్తుంది. ముందటి ప్రభుత్వా లు రైతులు కష్టాలు, నష్టాల ఊబిలో పడి గౌరవంగా జీవించలేక ఆత్మహ త్యలు చేసుకుంటే, సవాలక్ష ఆధారాలు చూపిస్తే గానీ, ఎక్స్‌గ్రేషియా అం దించేవి కావు. తెలంగాణ ప్రభుత్వం ఏ కారణం చేత మరణించినా బీమా వర్తించేలా పథకాన్ని బీమా సంస్థలతో మాట్లాడి ప్రవేశపెట్టింది. రైతు మరణించిన పదిరోజుల కాలంలో బీమా మొత్తం నామినీలకు అం దుతున్నాయిప్పుడు. రైతు మరణించినా కుటంబ సభ్యులకు రైతు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేలా రూపొందించిన పథకం రైతుల ఆదరణ చూరగొన్నది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు వ్యవసాయ, ఉద్యాన, విద్య, పరిశోధన, విస్తరణలో రైతులకు తమదైన శైలితో మేధో సంపత్తితో వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తల కొరతతో లేకుండా ప్రభుత్వం ఒకే దఫా దాదాపు 300 పైచిలుకు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి విశ్వవిద్యాలయాలను మరింత బలోపేతం చేసింది. అదేవిధంగా వ్యవసాయశాఖలో మూడు వేలకు పైగా వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యానశాఖలో 75 మందికి పైగా ఉద్యాన అధికారుల పోస్టులు భర్తీచేసి రైతులకు అందుబాటులో ఉంచింది. ఫలితంగా మేలైన, ఆధునిక వ్యవసాయ పద్ధతులు రైతులకు నేడు అందుతున్నాయి. కత్తెర పురుగు వంటి అధిక నష్టం చేసే పురుగును సైతం సమర్థవంతంగా ఎదుర్కోవటం అప్రమత్తంగా ఉన్న నిపుణులు, విస్తరణ వ్యవస్థ వల్లే సాధ్యమయ్యింది. వ్యవసాయదారుల్లో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం రైతు శక్తిని ఏకం చేసింది. తద్వారా తమ పంటలకు గిట్టుబాటు ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని రైతులకు కల్పించింది. బోరుబావుల వ్యవసాయంలో విద్యుచ్ఛక్తి అందుబాటు అత్యంత కీలకం. నాణ్యతలేని కరెంట్‌ను గత ప్రభుత్వాలు సరఫరా చేశాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం 24X7 నాణ్యమైన ఉచిత త్రీఫేజ్ విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నది.

బోరుబావుల వ్యవసాయానికి మహర్దశను ఇచ్చింది. ఇక రాష్ర్టాన్ని భారత విత్తన భాండాగారంగా మార్చటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. విత్తన ఎగుమతులకు OECD నోడల్ ప్రాం తంగా ఉంటూ వేల క్వింటాళ్ల విత్తనాలను ఎగుమతికి వాతావరణం కల్పిస్తున్నది. రైతులే విత్తనోత్పత్తిదారులుగా ఉండేలా ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇజ్రాయెల్ తరహాలో హరిత గృహా ల్లో పంటల సాగుకు 32 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తున్నది. ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా చేయని సాహసం ఇది. తోట పంటలకు విస్తీర్ణం పెంచటంలో, బిందు, తుంపర సేద్యాన్ని విస్తరించటంలో ఏటా ప్రత్యేక కేటాయింపులతో ఉద్యాన రంగానికి ప్రోత్సాహాన్నిస్తున్నది. యాసంగిలో పాలమూరు లాంటి వర్షాభావ ప్రాంతాలు నేడు పచ్చగా కళకళలాడుతు న్నాయంటే కారణం ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న బిందు, తుంప ర సేద్యాలే. తెలంగాణ ప్రభుత్వం అనతికాలంలో వ్యవసాయ సంస్కరణలతో వ్యవసాయరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. పలు రాష్ర్టాలకు తెలంగాణ వ్యవసాయ సంస్కరణలు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తు న్నాయి. పంటల పెట్టుబడికి ప్రభుత్వమే సాయం అందిస్తున్నది. కేవ లం వర్షాలపైనే ఆధారపడకుండా ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందిస్తున్నది. శాస్త్రీయ సాగు సూచనల కోసం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసింది. తెలంగాణ ప్రభుత్వం బిందు, తుం పర సేద్య పద్ధతులను అవలంబిస్తూ కూరగాయల కొరత తీర్చింది. ఈ సాగు విస్తీర్ణంలో దేశంలోనే రాష్ర్టాన్ని మొదటి వరుసలో నిలిపింది. ధర లు పడిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ జోక్యపు నిధితో ప్రతి పంటను కొని రైతుల కనీస పెట్టుబడి ఖర్చులు తిరిగివచ్చేలా చేస్తున్నది.
dr-pidigem-saidaiah
గిట్టుబాటు ధర వచ్చేవరకు ధాన్యం, ఇతర ఉత్పత్తులు నిల్వ ఉంచుకునేందుకు లక్షల కోట్ల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగులు నేడు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దురదృష్టవశాత్తు రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు బీమాతో మరింత భరోసా నింపింది. అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసేలా సేకరణ వ్యవస్థలు ఏర్పాటుచేసింది. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేసే పకడ్బందీ వ్యవస్థ నేడు రాష్ట్రంలో ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలం టే తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతే అజెండాగా విధానాలు, కార్యక్రమా లు రూపొందిస్తున్నది. అందుకే ఆకుపచ్చ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. రైతు సంక్షేమాన్ని సాధిస్తున్న రాజ్యంగా పేరు పొందుతున్నది. ఈ వ్యవసాయ విధానాలు ఇలాగే కొనసాగితే వ్యవసాయం పండుగ అనేది ఆచరణలో కనిపిస్తుంది.
(వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

398
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles