కేసీఆరే మళ్లీ రావాలి

Fri,October 12, 2018 12:15 AM

తెలంగాణ తొలి ప్రభుత్వంపై ఎన్నో కుట్రలు చేసి తెలంగాణ ఒక విఫల ప్రయోగమని చూపజూసిన టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని స్వతంత్ర తెలంగాణలో తన ఆధిపత్యం కొనసాగించాల నే కుట్ర మొదలుపెట్టింది. ఆ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టి తెలంగాణ సత్తాను మరోసారి చాటిచెప్పాలి.

నేడు తెలంగాణలో ఏ గడపకు వెళ్లి పలుకరించినా ఒకే మాట.. కేసీఆర్ మళ్లీ రావాలి ఎందుకంటే ఆయన వల్లే మా బతుకులు మారాయి, మారుతాయంటూ జనం తమ వాణి వినిపిస్తున్నా రు. నిజమే తెలంగాణ ఒక బలమైన శక్తిగా ఉండాలన్నా, భవిష్యత్తులో ఎన్ని శక్తులు వచ్చినా ఎదుర్కొని నిలబడాలన్నా తెలంగాణకు ఒక స్వీయరాజకీయ అస్తిత్వం అవసరమని ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పలు వేదికలపై ప్రస్తావించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో బలమైన నాయకత్వం లేక ఉద్యమం పలుమార్లు నీరుగారిపోయింది. తెలంగాణ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురైంది. ఈ సమయంలో కేసీఆర్ రూపంలో తెలంగాణకు ఒక బలమైన నాయకత్వం దొరికింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణలో మొట్టమొదటి సర్కార్ కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడగానే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగింది. ఈ కుట్రను కేసీఆర్ తెలివిగా తిప్పికొట్టారు. అనంతరం జరిగిన రాజకీయ వలసలు, టీఆర్‌ఎస్ నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ నాయకత్వ పటిమ టీఆర్‌ఎస్ ఒక బలమైన రాజకీయశక్తిగా మార్చాయి. తెలంగాణ పగ్గాలు ఢిల్లీ చేతిలో, పరాయి ప్రాంత నాయకత్వం చేతిలో ఉండకూడద నే కేసీఆర్ ఆలోచనకు ప్రజలు మద్దతు తెలిపారు. అందులో భాగంగానే కాంగ్రెస్ టీడీపీల ఉనికి ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు కొత్తగా పొత్తుల పేరుతో ఢిల్లీ నాయకత్వం కలిగిన కాంగ్రెస్, ఆంధ్ర నాయకత్వం కలిగిన టీటీడీపీ జట్టుకట్టి తెలంగాణపై పెత్తనానికి రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు బలమైన శక్తి ఈ ప్రాంతంలో పుట్టిన టీఆర్‌ఎస్ రూపంలోనే ఉండాలని కేసీఆర్ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు.

కేసీఆర్ మళ్లీ ఎందుకు రావాలి? ఆయన నాయకత్వమే అవసరం ఎం దుకని ప్రజలు భావిస్తున్నారు? ఆయనతోనే తెలంగాణ బాగు సాధ్యమని ఎందుకు నమ్ముతున్నారు? ఈ మూడు విషయాలను ఒకసారి విశ్లేషించుకుందాం. ఉద్యమకాలం నుంచి నిన్నటి వరకు కేసీఆర్ ప్రజాభీష్టం మేరకే పనిచేశాడు. నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. తెలంగాణ అణువణువుపై, భూ భాగంపై, సాగునీటిరంగంపై, ప్రజల జీవనస్థితిగతులపై నాటి నుంచే పట్టు, అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ ఉద్యమ అజెండాలను రాష్ట్రంలో అమలుచేసి చూపించారు. సామాన్యుల జీవితాల్లో సమగ్ర మార్పుకోసం ఆయన ప్రయత్నం సాగింది .తెలంగాణ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల రూపం లో అనేక విధాలుగా ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేశారు. ఉద్యమ సమయం నుంచి నేటివరకు తెలంగాణ వాదాన్ని, అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఇప్పుడు అధికార దాహం కోసం అన్ని పార్టీలు ఏకమవుతుండటం ప్రజలను ఆలోచనకు, ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నాడు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. అయినా సీమాంధ్ర నాయకత్వాన్ని ఎదుర్కొని కేసీఆ ర్ తెలంగాణ సాధించడం అనిర్వచనీయం. అయితే నేడు స్వపరిపాలనలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు, ప్రత్యేకం గా ఎప్పుడూ ఉప్పు నిప్పు వలె కాంగ్రెస్, టీడీపీలు జత కట్టడం విడ్డూ రం. అయితే వీరి కలయిక ప్రజలను ఆలోచింపజేసింది. ఫలితంగా కేసీఆ ర్‌పై ప్రజల్లో మరింత అనుకూలత పెరిగింది. తద్వారా ఆయా పార్టీల పొత్తును చిత్తు చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజలు కేసీఆర్‌ను ఆరాదించడానికి, ఆయన నాయకత్వాన్ని కోరుకోవడానికి కారణాలు అనేకం. పేదింటి ఆడబిడ్డ మనసు తెలిసిన ఒక అన్న గా అందించిన కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్య కిట్ల పంపిణీ పేద ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు సుస్థిర స్థానం సాధించి పెట్టాయి.

ఎంత గొప్ప మనసుంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేయాలనే ఆలోచన వస్తుందో ప్రజలు అర్థం చేసుకున్నారు. నిజంగా కేసీఆర్ మనసున్న మహారాజు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాం గుల బాధలు అర్థం చేసుకొని అడుగకుండానే ఆసరా పింఛన్లను పెంచా రు. అందుకే ఇయ్యాళ్ల ఏ వృద్ధురాలిని అడిగినా కేసీఆర్ నా పెద్ద కొడుకు అంటున్నారు. ఏ ఒంటరి మహిళను అడిగినా కేసీఆర్ నా పెద్దన్నతో సమా నం అంటున్నారు. ఇదిలా ఉంటే సర్కార్ బడుల్లో సన్నబియ్యం, ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పన, గురుకులాల ఏర్పాటు, అంగన్వాడీ, హోంగార్డు ల జీతాల పెంపు, ఆశావర్కర్లకు సరైన గుర్తింపు ఇలా అనేక రకాలుగా పేద ప్రజలకు అనేకరకాలుగా, అన్ని విధాలుగా ఆదుకొని పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన పలు ప్రసంగాలు రైతుల పట్ల, వారి సమస్యల పట్ల ఆయనకున్న అవగాహనను, బాధ్యతను రైతులకు తెలియజేశాయి. కోతల్లేని 24 గంటల నిరంతర విద్యుత్, సబ్సిడీ యంత్రాలు, కొరత లేకుండా ఎరువులు, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతు బీమా ద్వారా రైతుకు భరోసా కల్పించేందుకు కృషిచేశారు. ప్రాజెక్టుల నిర్మా ణం, చెరువుల పునరుద్ధరణతో కేసీఆర్‌కు ఉన్న దూరదృష్టిని తెలియజేసింది. తెలంగాణ రైతన్న ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలనే ఆయన సంకల్పాన్ని చూసి కేసీఆర్‌కు జై కొట్టని రైతు లేడు. నేడు ఏ చేనుకు వెళ్లినా ఒకటే చర్చ. మన బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని. ప్రజల్లో కేసీఆర్ అంటే ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. ఆయన నాయకత్వం అవసరమని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందనేది ప్రజల విశ్వాసం. రైతుల విశ్వాసానికి తగ్గట్టు ఇప్పటికే వ్యవసాయం పలు సంస్కరణలు తీసుకొచ్చిన కేసీఆర్ తిరిగి అధికారం చేపడితే రైతులకు మేలు జరుగుతుంది. ప్రాజెక్టులు పూర్తవుతాయి. ముమ్మాటికీ తెలంగాణకు ఒక బలమైన స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరం. ఆ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగా ణను పునర్నిర్మిస్తున్న పార్టీగా టీఆర్‌ఎస్ పార్టీనే ఆ బాధ్యత తీసుకున్నది.
t-vijay
ఉద్యమ సమయంలో, తెలంగాణ తొలి ప్రభుత్వంపై ఎన్నో కుట్రలు చేసి తెలంగాణ ఒక విఫల ప్రయోగమని చూపజూసిన టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని స్వతంత్ర తెలంగాణలో తన ఆధిపత్యం కొనసాగించాల నే కుట్ర మొదలుపెట్టింది. ఆ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టి తెలంగాణ సత్తాను మరోసారి చాటిచెప్పాలి. విష కౌగిళ్ల నుంచి తెలంగాణ ను రక్షించాలంటే, రాష్ట్రం మరింత ముందుకు వెళ్లాలంటే, తెలంగాణ ప్రజల బతుకుల్లో మరింత మార్పు రావాలంటే కేసీఆర్ మళ్లీ రావాల్సిం దే. నాడు ఉద్యమంలో తెలంగాణ కోసం కేసీఆర్ ఎత్తుకున్న నినాదం ఔర్ ఏక్ దక్కా తెలంగాణ పక్కా నేడు కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు ఎత్తుకున్న నినాదం ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్ ఇదే జరుగబోతున్నదని ప్రజల విశ్వాసం.

418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles