అనైతిక పొత్తులు

Fri,October 12, 2018 12:13 AM

రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పక్క రాష్ట్ర పార్టీతో పొత్తుపెట్టుకోవడాన్ని తెలంగాణ ప్రజలు తప్పుబడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను అడ్డుకుంటున్నది. అంతేకాదు కేంద్రానికి లేఖలు రాస్తూ, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసింది. దీన్ని మరిచిపోయి రాష్ట్రంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం ఇలాంటి కూటములు కట్టడం సరికాదు. మాట్లాడితే గతంలో మీరు పొత్తు పెట్టుకోలేదా అని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణ అనే ఒకే అజెండాగా నాడు పొత్తుకు కారణమైంది. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ పదాన్నే నాడు అసెంబ్లీలో ఉచ్చరించకుండా చేసిన పార్టీ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేసిన పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. అది ముమ్మాటికీ ఆంధ్రా పార్టీగానే భావించారు. అందుకే వివిధ ఎన్నికల సందర్భాల్లో ఆ పార్టీకి తగిన బుద్ధిచెప్పారు. అయినా చంద్రబాబు తన వైఖరి మార్చుకోలేదు. తెలంగాణను అస్థిరపరుచడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యా డు. ప్రతిపక్షాలకే ఈ విషయం అర్థం కావడం లేదు.
- పి.మోహన్, కరీంనగర్

వాస్తవాలు గ్రహించాలి

తెలంగాణ ఉద్యమం ప్రజల్లో చైతన్యం పెం చింది. ఎవరేమిటో వారికి కొత్తగా చెప్పాల్సి న పనిలేదు. విశ్వసనీయతే పార్టీలను నిలబెడుతుంది. గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాదు, మ్యానిఫెస్టోలో చెప్పని అనే పథకాలను కూడా తెచ్చింది. సంక్షేమానికి దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అధికంగా ఖర్చుచేస్తున్నది. అందుకే కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మారు. కానీ ప్రతిపక్షాలు అధికారం కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల సమయం లో ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆయా పార్టీలున్నాయి. కానీ వాస్తవాలను ప్రజలు గ్రహిస్తున్నారు.
- బి.మురళీధర్, హైదరాబాద్

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles