కన్నీళ్లను తుడిచే భగీరథ నీళ్లు

Wed,October 10, 2018 11:01 PM

తెలంగాణలో స్వచ్ఛభారత్ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలుకావాలంటే మిషన్ భగీరథ లాంటి పథకాలకు కేంద్రం పెద్ద మొత్తంలో సహాయాన్ని అందించాలి. ఇలాంటి బహుముఖ ఉపయోగాలుండే పథకాలను ఇతర రాష్ర్టాల్లో కూడా అమలయ్యే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి. ప్రజలకు వాస్తవికమైన అభివృద్ధిని చేస్తూ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి కేంద్రం తోడ్పాటునందించాలి. ఈ విధమైన ఆచరణాత్మక విధానాలతోనే దేశం ముందుకుపోతుంది. అన్నింటా ఆదర్శంగా నిలుస్తుంది.
bhagiratha-water
ప్రపంచ శ్రీమంతులు పరిశుద్ధమైన బాటిల్ నీళ్లను కొనుగోలు చేయడానికి మూడు వందల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రపంచంలో 110 కోట్ల నిరుపేదలు ఏ విధమైన శుద్ధి చేయని నీటిని తాగుతున్నారు. అందులో ముఖ్యంగా 15 కోట్ల 90 లక్షల మంది కుంటలు, చెరువులు, నదులలోని కలుషితమై న నీరు తాగడం దారుణమైన విషయం. నీటి సమస్య 41 దేశాల్లో భయంకరంగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. దీంతో కలుషితమైన నీరు తాగడం వల్ల అతిసారం, విరేచనాలు, హెపటైటిస్ ఎ, టైఫాయిడ్, కలరా, పోలియో వంటి వ్యాధులతో ఏటా 8 లక్షల 42 వేల మంది మరణిస్తున్నారు. అందులో 3 లక్షల 61వేల మంది ఐదేండ్ల లోపు చిన్నారులే ఉంటున్నారని ఆ నివేదిక తెలియజేసింది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో మనిషి రోజుకు సగటున 580 లీటర్ల నీటిని అతని నిత్యావసర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే, భారతదేశంలో నీటి వసతి ప్రభుత్వాలు కల్పించకపోవడంతో అంతే నీటి ని మన దేశంలో నలుగురు సర్దుబాటు చేసుకుంటున్నారు. అనేక సర్వేల అధ్యయనం ప్రకారం 2015లో భారతదేశంలో 88 శాతం ప్రజలు మాత్రమే కనీసంగా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. ఇంకా ఈ దేశంలో దాదాపు 15 కోట్ల మంది శుద్ధి చేయని నీటిని వాడుతున్నారు. ఇందులో ప్రతి ఐదుగురిలో నలుగురు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే ఉండటం గమనార్హం. దీంతో డ్బ్భై కోట్ల మంది మరుగుదొడ్లు ఉన్నా, లేకున్నా నీటి లభ్యత లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు.

గత పాలకులకు చిత్తశుద్ధి, ముందుచూపు లేకపోవడంతో కనీసంగానైన శుద్ధిచేసిన 100 లీటర్ల మంచినీరు ప్రజలకు అం దించకపోవడంతో ఏటా వానకాలం రోగాల కాలంగా మారి ధన, ప్రాణ నష్టం పెరిగిపోతున్నది. ఇక మెట్రోపాలిటన్ నగరాల్లో గృహ నీటి సరఫరా ప్రజల గొంతుకలు నింపకపోగా కనీస నిత్యావసరాలైన కాలకృత్యాలకు, వంటలకూ నీళ్ళ కటకటే. దేశంలో 35 పెద్ద నగరాల్లో త్రివేండ్రంలో మాత్రమే 24 గంటల నీటి సరఫరా జరుగుతున్నది. 20 నగరాల్లో రోజు కు కేవలం సగటున 4.3 గంటలు మాత్రమే నీళ్ల సరఫరా జరుగుతున్నది. ముంబై లాంటి మహానగరంలో రోజూ నీటి సరఫరా జరుగుతూ కొంత మెరుగ్గా ఉంటే మేమే హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశామని చెప్పిన గత పాలకుల నిర్వాకం వల్ల నేడు 2 నుంచి 4 రోజులకోసారి నీటి సరఫ రా జరుగుతున్నది. దీనికి తోడు నాసిరకం పైపులతో లీకేజీలు జరిగితే వాటి మరమ్మతు అయినప్పుడు వారం రోజులకోసారి నీటి సరఫరా అవుతున్నది. దీన్ని ఆసరా చేసుకొని హైదరాబాద్‌లో పుట్టగొడుగుల్లా నాలుగు వేల మినరల్ వాటర్ కంపెనీలు వెలిశాయి. అందు లో 350 కంపెనీలు మాత్రమే ఐ.ఎస్.ఐ. ముద్ర కలిగి ఉన్న చట్టబద్ధత కంపెనీలు. ఇక తెలంగాణ గ్రామాల్లో, మండలాల్లో వెలిసిన 95 శాతం మినరల్ వాటర్ కంపెనీలకు ఐ.ఎస్.ఐ. ముద్ర లేకపోవడం శోచనీయం. వీటి నీళ్లు తాగడం వల్ల కొత్త రోగాన్ని కొని తెచ్చుకొని దవాఖానకు వెళ్లాల్సి వస్తున్నది. అందుకే కొద్దిరోజులు మినరల్ వాటర్ వాడిన ప్రజలు మళ్లీ వాడటానికి భయపడుతున్నారు. కలుషితమైన నీరైనా ఫర్వాలేదని తెలిసినా శుద్ధి చేయని బోరుబావి నీటిని వినియోగిస్తున్నారు.

అందుకే తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను అధిగమించడానికి, ప్రజలు ఉన్నత ప్రమాణాలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉం డటానికి, ప్రజలు నీళ్ళపై పెడుతున్న వృథా ఖర్చును అరికట్టడానికి బాధ్యతాయుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాలకుడిగా రాష్ట్ర పరిస్థితి గురించి, ప్రజల అవసరాల గురించి, అధ్యయనం చేసిన, సృజనాత్మకంగా ఆలోచించిన, ఆధునిక భావాలు కలిగిన రాజకీయ నేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిన అద్భుతమైన పథ కంమిషన్ భగీరథ. ఈ పథకం చరిత్రలో మైలురాయి. సాగునీటి, తాగునీటిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు పరిశుద్ధ నీటిని అందివ్వడానికి ఎంత ఖర్చయినా భరించడానికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావ డం సాహసోపేతమైన నిర్ణయం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ప్రతి పౌరునికి నిత్యావసర నీటిని అందించడం కోసం సగటున ప్రతీ వ్యక్తిపై 12,500 రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. సగటున నలుగురు సభ్యులున్న కుటుంబంపై రూ.50 వేలను మంచినీటి మీద ఖర్చు పెడుతున్నది దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దీనివల్ల ప్రతిరో జు గ్రామీణ వ్యక్తికి 100 లీటర్ల నీళ్లను, పట్టణ వ్యక్తికి 135 లీటర్ల నీటిని సరఫరా చేయడం ద్వారా దేశంలోనే ఒక సంచలానత్మకమైన పథకంగా మిషన్ భగీరథ నిలుస్తుంది. దీంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని సాంకేతిక సమాచార వ్యవస్థను ప్రజలకు అందించడం కోసం 25 వేలకు పైగా గ్రామాలకు 65 పట్టణాలకు 1,35,000 కిలో మీటర్ల ఇంటర్నెట్ కేబుల్ ను వేయడం చరిత్రాత్మకం. కాగా ఇది ఆధునిక హంగులకు నిదర్శనం. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల మధ్య నీళ్ల గొడవలు తగ్గుతాయి. రోజూ నీటి సరఫరా కావడం తో ప్రజలు తమ అవసరాల కోసం, పరిశుభ్రత కోసం నీటి ని తగిన మేర ఉపయోగించుకునే అవకాశం ఉన్నది.
dr-bhairi-niranjan
రాత్రి నల్లా గురించి నిద్రపోకుండా జాగారాలు చేయడం తప్పుతుంది. ప్రజలు మినరల్ వాట ర్ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆ మేరకు ఇతర ఆహార వస్తువులను కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకువచ్చింది. కానీ మరుగుదొడ్లల్లో నీటి వసతి కల్పించకుండా కేవలం ప్రచారం చేయ డం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక మనిషి కనీసంగా మరుగుదొడ్డిని ఉపయోగించినప్పుడు ముప్ఫై లీటర్ల నీటిని వినియోగించడం జరుగుతుంది. ఆ నీరే లేకపోతే బహిరంగ బహిర్భుమికే మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణలో స్వచ్ఛభారత్ కార్యక్రమం పూర్తిస్థా యిలో అమలుకావాలంటే మిషన్ భగీరథ లాంటి పథకాలకు కేంద్రం పెద్ద మొత్తంలో సహాయాన్ని అందించాలి. ఇలాంటి బహుముఖ ఉపయోగాలుండే పథకాలను ఇతర రాష్ర్టాల్లో కూడా అమలయ్యే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి. ప్రజలకు వాస్తవికమైన అభివృద్ధిని చేస్తూ ప్రజలు ఆత్మగౌరవంగా జీవించడానికి కేంద్రం తోడ్పాటునందించాలి. ఈ విధ మైన ఆచరణాత్మక విధానాలతోనే దేశం ముందుకు పోతుంది. అన్నింటా ఆదర్శంగా నిలుస్తుంది.

438
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles