గాంధీ బాటలో కేసీఆర్

Mon,October 8, 2018 10:54 PM

ఆయన జన్మించి 150 ఏండ్లయింది. మతోన్మాదం, విపరీత విద్వేషం, అమానుష అసహనం పిస్టల్ గుండ్లతో ఓ సాయంత్రం, ఒక ప్రార్థనా సమావేశంలో ఆయనను బలిగొని 70 ఏండ్లయింది. అయినా ఆయన మరణించలేదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనుల హృదయ కుహరాల్లో, మానవాళి మనో మందిరంలో జీవించే ఉన్నాడు, సూర్యచంద్రులు వెలుగులు విరజిమ్ముతున్నంత కాలం ఆయన జీవించే ఉంటాడు. ఆయన అమూల్య బోధనలు, సిద్ధాంతాలు, శాంతియుత సమర విధానాలు సకల మానవజాతికి, నాడు ఆయనను పరిహసించిన వారికి సైతం మార్గదర్శకం, ప్రశంసాపాత్రం అవుతున్నాయి.

14 ఏండ్ల మహోద్యమాన్ని నిర్వహించి రాష్ట్రాన్ని సాధించి, దివ్య తెలంగాణ రూపకల్పనకు కంకణధారణ చేసిన ఘనత కేసీఆర్‌దే! ఆధునిక యుగంలో ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మహాత్ముడు గాంధీజీ-మానవాళి ఆయనను మరిచిపోలేదు. మానవాళి అవనతమై ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తుంది.

ఆయనే గాంధీజీ.. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, ఆయనే మహాత్ముడు. 46 ఏండ్లు నిండేవరకు, దక్షిణాఫ్రికాలో 22 ఏండ్లు అక్కడి తాడితులు, పీడితులు, శ్వేతజాతి పాలనలో వర్ణ వివక్షకు, అణిచివేతకు గురైనవారు, అనాథుల పక్షాన నిలిచి అపూర్వరీతిలో శాంతియుత సత్యాగ్రహ సమరం జరిపేవరకు ఆయన మానవ మాత్రుడే, కేవలం గాంధీజీయే. రస్కిన్, థోరూ, టాల్‌స్టాయి రచనలచే ప్రభావితుడైన వాడు. 1888 సెప్టెంబర్‌లో ఉన్నత విద్యార్జనకు బారిస్టర్ చదువు కోసం, లండన్ వెళ్లి మూడేండ్లు ఉన్నప్పుడు భగవద్గీత, బైబిల్ మత గ్రంథాల అధ్యయనం జరిపి, మానవతా దృక్పథం అలవరుచుకున్నవాడు. అప్పటివరకు ఆయన కేవలం గాంధీజీయే. భారత స్వాతంత్య్ర, జాతీయోద్యమ నాయకులు గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధరతిలక్ తదితరుల అభ్యర్థనను శిరసావహించి గాంధీజీ 1915 జనవరిలో స్వదేశం తిరిగి వచ్చారు. 22 ఏండ్ల అనుబంధం ఉన్న దక్షిణాఫ్రికాకు శాశ్వతంగా వీడ్కోలు పలికి. తక్షణమే ఆయన రాజకీయరంగంలో, స్వాతంత్య్ర సమరంలో అడుగుపెట్టలేదు. గోఖలే సలహాను గౌరవించి గాంధీజీ కాలి నడకన, మూడవ తరగతి రైలు పెట్టెలో ప్రయాణించి దేశమంతటా పర్యటించాడు.

తన దేశ ప్రజలు బ్రిటిష్ పాలనలో ఎంతటి ఘోరమైన పేదరికాన్ని, దారిద్య్రాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని అనుభవిస్తున్నారో, ఎంతటి విపరీతమైన సామాజిక దురాచారాలకు, అంధ విశ్వాసాలకు, మూఢ నమ్మకాలకు గురవుతున్నారో గాంధీజీ స్వయం గా గుర్తించారు. రాజకీ య స్వాతంత్య్రం, విముక్తి, ప్రజాస్వామ్య వ్యవస్థ, సుపరిపాలన, అధికార వికేంద్రీకరణతో పాటు ఆర్థిక అభ్యున్నతి, సమానత్వం, సంక్షేమం అత్యావశ్యకమని గాంధీజీ భావించారు. మత సామరస్యం, సహనశీలతకు ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. భారత స్వాతంత్య్ర, జాతీ యోద్యమాల్లో నాయకత్వ పాత్ర నిర్వహించడానికి ముం దు 1915లో గాంధీజీ, అహ్మదాబాద్‌లో సబర్మతీ నదీతీరాన సబర్మతి ఆశ్రమాన్ని తన కార్యకలాపాలన్నింటికి కేంద్రంగా స్థాపించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ సబర్మతీ ఆశ్రమానికి వచ్చి ఒక ఉపనిషత్ శ్లోకం పఠిస్తూ గాంధీజీని మహాత్మా అని సంబోధించారు. నాటి నుంచి ఆయన భారత ప్రజలకే కాదు అఖిల ప్రపంచానికి ఆరాధనీయుడైన మహాత్ముడు గాంధీజీ. దురభిమానం లేని దేశభక్తిలో, విద్వేషం, వివక్ష లేని జాతీయవాదంలో ఇద్దరిది దృక్పథం ఒక్కటైనా, గమ్యం ఒక్కటైనా, బంధనాల్లేని భావనలో, వల్మీ కం చుట్టుకొని మస్తిష్కం విషయంలో ఇద్దరూ ఒక్కటైనా గాంధీజీ, టాగోర్ అభిప్రాయ భేదాల్లేని వారు కాదు. వారిద్దరి మధ్య ఆత్మీయత అణుమాత్రం తగ్గలేదు. వ్యక్తి స్వేచ్ఛ పట్ల ఇద్దరి ఆలోచన ఒక్కటే. గాంధీజీ అన్నారు.. You can chain me, you can torture me, you can even destroy this body, but you will never imperish my mind.... టాగోరు ఆలోచన అదే. తన మనసును, మస్తిష్కాన్ని శృంఖలాలతో బంధించలేరని గాంధీజీ అన్నారు. అదే భావాన్ని వ్యక్తపరుస్తూ టాగోరు.. Where the mind is witout fear and the hea d is held high, where knowledge is free.... into that heaven of freedom, my father, let my country awake

గాలిబ్ ఒక గీతాన్ని అనువదిస్తూ మహాకవి దాశరథి నరుడు నరుడౌ ట దుష్కరము సుమ్ము అంటాడు. మనిషి మనిషి కావడమే కష్టమైనప్పుడు మహాత్ముడు కావడం మరింత కష్టం. ఈ దేశంలో అడుగుపెట్టిన వెంటనే గాంధీజీకి భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో మహా నాయకుల మధ్యనే ఛిద్రాలు, ఛీత్కారాలు, స్పర్థలు వ్యర్థ వివాదాలు కనిపించాయి. ఈ అడ్డంకులను అధిగమిస్తూ, నాయకత్వం బాధ్యతను ఒక సవాలుగా స్వీకరిస్తూ గాంధీజీ తన సిద్ధాంతాలను, తన సత్యం, అహింసల శాంతియుత పోరాటపథాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ భ్రమపడుతున్నాడని, ఆయన నిర్వచించి ప్రతిపాదించిన శాంతియుత విధానాలతో స్వాతంత్య్ర సాధన సాధ్యం కాదని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, చక్రవర్తి రాజగోపాలచారి వంటి ఉద్ధండ నాయకులు తమ సందేహాలను వ్యక్తపరిచా రు. (తండ్రి మోతీలాల్‌కు ఎన్ని సందేహాలున్నా కుమారుడు జవహర్‌లాల్ మొదటినుంచి గాంధీజీ సిద్ధాంతాలు, విధానాలే శరణ్యమని భావించా డు!). పలు సందేహాలను వ్యక్తపరచిన అతిరథ మహారథ నాయకుల్లో నేతాజీ బోస్‌బాబు మినహా అందరూ గాంధీజీ మార్గంలోకి వచ్చారు, ఆయనకు అత్యంత విధేయులైన అనుచరులు, సహచరులై నారు. ప్రారంభంలోనే కాదు తర్వాత రోజుల్లో కూడా గాంధీజీ విధానాలతో విభేదించిన అతివాదులు, అభ్యుదయవాదులుగా చెలామణి అయిన వారు కూడా ఆయన మార్గంలోకి రాక తప్పలేదు. మతోన్మాదం నిలువెల్లా ఆవహించి ప్రకోపించినవారు గాంధీజీని హతమారిస్తే గాంధేయ సిద్ధాంతాలు నశిస్తాయనుకున్నారు. నశించడానికి బదులు ఆయన తర్వాత ఆయన సిద్ధాంతాలు విరాట్ స్వరూపంతో విశ్వవ్యాప్త మైనా యి.

ఆయన హంతకుల వారసులు ఈరోజు ఆయన ముందు మోకరిల్లుతున్న దృశ్యాలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. మార్క్సిజం మంటలతో బుర్రల్లో తొర్రలు పడ్డవారు అనేకులకు మానసిక చికిత్స, మానసిక ప్రశాంతి కోసం గాంధేయ సిద్ధాంతాలు అపారంగా ఉపకరించాయి. ఆసి యా, ఆఫ్రికా ఖండాల్లో అనేక దేశాల ప్రజలు దాస్య శృంఖలాల నుం చి విముక్తి పొందడానికి, యూరప్, అమెరికా ఖండాల ప్రజలు అసంఖ్యాకులు ప్రాథమిక మానవ హక్కులు పొందడానికి అమితంగా స్ఫూర్తి కలిగించినవి గాంధేయ సిద్ధాంతాలే. మండేలా, మార్టిన్ లూథర్‌కింగ్, ఒబామా ప్రభృత ప్రపంచ నేతలు శ్వేతజాతి దురహంకారాన్ని, ఆధిపత్యాన్ని ఎదుర్కొని నిలువడానికి గాంధీజీ సిద్ధాంతాలు చేయూతనిచ్చా యి. అమెరికా అధ్యక్షుడిగా భారత పార్లమెంట్‌లో నిల్చొని ప్రసంగిస్తూ తనను ఈ స్థానానికి తెచ్చింది గాంధేయ సిద్ధాంతాలేనని ఒబామా ప్రకటించారు. 1915లో గాంధేయ సిద్ధాంతాలు, విధానాలు ఇక్కడి స్వాతంత్య్రోద్యమ నాయకులకు, ఉద్యమకారులకు, దేశభక్తులకు చోద్యం కలిగించి ఉంటాయి. ఇవి పనికి వస్తాయా అన్న అనుమానాలను రేకెత్తించి ఉంటాయి. కానీ, అవి, ఆయన సిద్ధాంతాలు, విధానాలు, సత్యం, అహింస ప్రబోధాలు అంతకుముందు నిరంతరంగా 22 ఏండ్లు దక్షిణాఫ్రికాలో అగ్ని పరీక్షను తట్టుకొని ఓటమి ఎరుగని అభేద్య అస్ర్తాలుగా ప్రపంచమంతటా ప్రసిద్ధి పొందాయి. 1909 మార్చిలో, గాంధీజీ మొట్టమొదట సత్యాగ్రహాన్ని ప్రారంభించింది దక్షిణాఫ్రికాలోనే. 1909 ఏప్రి ల్‌లో గాంధీజీ ప్రెటోరియా (దక్షిణాఫ్రికా) సెంట్రల్ జైలులో నిరాహార దీక్ష చేశారు. దక్షిణాఫ్రికా శ్వేత పాలకులు గాంధీజీ చేతులకు సంకెళ్లతో రోడ్ల మీద నడిపించారు. ఈ విషయాన్ని లండన్‌లో, బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభలో కొందరు సభ్యులు ప్రస్తావించారు. అంతకుముందు 1893లో, పీటర్ మారిట్స్ బర్గ్ స్టేషన్‌లో నడిరాత్రి చలిలో బ్రిటిష్ అధికారులు గాంధీజీని రైలుపెట్టె నుంచి నెట్టేసి దౌర్జన్యం జరిపిన సంఘటనను లండన్‌లో ప్రజాతంత్రవాదులు ఖండించారు. మొదట దక్షిణాఫ్రికాలో, తర్వాత స్వదేశంలో 54 ఏండ్లు శాంతియుత, సత్యాగ్రహ సమరాల్లో గాంధీజీ 17 పర్యాయాలు నిరాహార దీక్షలు జరిపారు, 15 పర్యాయాలు అరెస్టయి కారాగార శిక్షలు అనుభవించారు.

స్వదేశంలో అడుగు పెట్టగానే సత్యాగ్రహ సమరం కోసం గాంధీజీ దృష్టి గ్రామీణ భారతం మీద ప్రసరించింది. ఆయన ఈ దేశంలో నిర్వహించిన ప్రథమ సత్యాగ్రహ సమరం బీహార్ మారుమూల గ్రామీణ ప్రాంతంలోని చంపారన్ లో. ఆయన మార్గదర్శకత్వంలో నిర్వహించిన బార్డోలి సత్యాగ్రహ సమరంలో రైతులు ముందు నిలిచారు. చౌరీచౌరాలో హింస ప్రజ్వరిల్లగానే పోరాటాన్ని విరమించి గాంధీజీ అతివాదులకు అసంతృప్తి కలిగించారు. దండి ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభం కాగా 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి సేవాగ్రామ్ (వార్ధా) ఆశ్రమంలో అంకురార్పణ జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అతివాదులుగా, సోషలిస్టులుగా పేరొందిన జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతలు తర్వా త గాంధేయ వాదులైనారు.
prabhkar
మతోన్మాది గాడ్సే పిస్టల్ దాడి జరుగడానికి ఒకరోజు ముందు గాం ధీజీ ఢిల్లీలో కె.ఎమ్.మున్షీతో హైదరాబాద్ సంస్థానంలోని (సంస్థానంలో ముఖ్యమైన భాగం తెలంగాణ ప్రాంతమే) క్లిష్ట పరిస్థితి గురించి చర్చించా రు. హైదరాబాద్ సంస్థానం సమస్య శాంతియుతంగా పరిష్కా రం కావాలని ఈ చర్చలలో గాంధీజీ కోరారు. 1969 గాంధీజీ శతజయంతి సంవత్సరం. శాంతిదూత, అహింసామూర్తి గాంధీజీ శతజయం తి సంవత్సరం లో ఏపీలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం (ఈ ప్రభుత్వంలో తెలంగాణ కాం గ్రెస్ నేతలు కూడా భాగస్వాములు!) తెలంగాణ రాష్ట్ర శాంతియుత ఉద్యమకారులపై, విశేషించి విద్యార్థులపై పలు పర్యాయాలు పోలీసు కాల్పులు జరిపి, 4 వందల మందిని పొట్టన పెట్టుకోవడం ఎన్నడూ క్షమించరాని నేరం. గాంధీజీ రాజకీయవారసులుగా చలామణి అవుతున్న కాంగ్రెస్ నేత ల ధోరణికి భిన్నంగా గాంధేయమార్గంలో 14 ఏండ్ల మహోద్యమాన్ని నిర్వహించి రాష్ట్రాన్ని సాధించి, దివ్య తెలంగాణ రూపకల్పనకు కంకణధారణ చేసిన ఘనత కేసీఆర్‌దే! ఆధునిక యుగంలో ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మహాత్ముడు గాంధీజీ-మానవాళి ఆయనను మరిచిపోలేదు. మానవాళి అవనతమై ఆయన కు శ్రద్ధాంజలి ఘటిస్తుంది.

620
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles