కొండెక్కిన దీపం కొత్త రాగం

Mon,September 17, 2018 11:47 PM

కుట్రలు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు కొత్త కాదు. వాటిని ఛేదించేందుకు తెలంగాణ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. బాబు ఎన్ని ముసుగులు వేసుకొని వచ్చినా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు. ఆ కుట్రలను ఛేదించేందుకు కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు అండగా ఉన్నది. ఆ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలపర్చుకొని చంద్రబాబు లాంటి శకునిలను పొలిమేరలదాకా తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో తన దీపం కొండెక్కడంతో కొండెక్కిన దీపానికి కొత్త రాగం వస్తున్న చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టి తెలంగాణ శక్తిని చాటాల్సిన అవసరం ఆసన్నమైంది.

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతిపక్ష వెకిలి చేష్టలకు, ప్రజాక్షేత్రంలోనే జవాబు చెప్పేందుకు కేసీఆర్ సిద్ధ మయ్యారు. ప్రతిపక్ష తీరును ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ ఈ నెల 6న ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు పోతున్నట్టు ప్రకటించా రు. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయనే స్పష్టమైన సం కేతాలు అందుతున్నాయి. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కానీ తాజాగా ఓ కొండెక్కిన దీపం కొత్తరాగం అందుకున్నది. ఉనికి కోల్పోయిన టీడీపీ ఇక్కడున్న అధికార దాహ కాంగ్రెస్‌తో కలిసి భారీ కుట్రకు వ్యూహం పన్నింది. తెలంగాణపై కుట్రలు చేయడంలో తన కుతానే సాటి అనగలిగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో కొత్త రాగం అందుకున్నాడు.

తెలంగాణపై ఆయన కుట్రలు కొత్త కాదు. ఉద్యమ సమయంలో తెలంగాణకు లేఖ ఇచ్చినట్టు ఇచ్చి డిసెంబర్ 9న ప్రకటన వెలువడగానే వెను కాల ఉండి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించాడు. రాజీనామాల పేరు తో డ్రామాలకు తెరదీసి తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్లేలా కుట్రచేసి ఎం దరో విద్యార్థుల చావుకు కారణమయ్యాడు. తెలంగాణ రాకను ఆలస్యం చేశాడు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఆయన దగ్గరున్న గజక ర్ణ, గోకర్ణ టక్కుటమారా విద్యలన్నింటిని ప్రయోగించినప్పటికీ కేసీఆర్ పోరాటం, ప్రజా మద్దతు, అమరుల త్యాగాల అనంతరం తెలంగాణ ఏర్పాటైంది. ప్రభుత్వం కొలువుదీరాక ఓటుకు నోటు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరిగింది. చంద్రబాబు కుట్రను కేసీఆర్ సమర్థంగా ఎదుర్కొని తిప్పికొట్టగలిగాడు. జాతీయ మీడియా సైతం ఈ సంఘటనపై బాబును కడిగి పారేసింది. దెబ్బకు పెట్టె, బేడా సదురుకొని ఏపీకి తన మకాం మార్చుకున్నా తెలంగాణపై కుట్రలను ఆపడం లేదు.

ఇప్పుడు తాజాగా సానుభూతి పవనాల కోసం ఓ కొత్త పాట ముందరేసుకున్నాడు. నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ పేరుతో కొత్త నాటకం మొదలెట్టాడు. 2010లో ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్ నేతలు రాజీనామాలు చేశారు. అందుకు వచ్చిన ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నట్టు ఓ డ్రామాకు తెరదీశాడు. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు గురించి చేసిన ఆందోళనలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అయితే గత ఎనిమిదేండ్లుగా 26 మార్లు మహారాష్ట్ర కోర్టు దర్మాబాద్ పోలీసులు హాజరవ్వాల్సిందిగా బాబుకు నోటీసులు పంపారు. కానీ కోర్టులపై గౌరవం లేకుండా వ్యవహరించి హాజరవ్వకపోవడంతో అరెస్టు వారెంట్లు జారీచేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇన్నిరోజులు ఆ నోటీసులు పట్టించుకోకుండా ఇప్పుడే ఆ అరెస్ట్ వారెంట్ వచ్చినట్లు నాటకం ఆడుతున్నాడు.

ఇదే అదనుగా బాబు అనుకూల ఆస్థాన మీడియా థాట్ పోలీసింగ్ మొదలుపెట్టింది. ఒక్కసారిగా భూగోళం బద్దలవుతున్నట్టు చంద్రబాబుపై సెంటిమెంట్ పవనాలు వీచేలా బ్యానర్ ఐటం చేసి వార్తలను ప్రచురించింది. ఈ కేసు ఏదో కొత్తదైనట్టు, ఇదివరకు అతనికి నోటీసులే రానట్టు పాత ముచ్చటను ముందరేసి బాబుకు లబ్ధి చేకూర్చి, ప్రజల దృష్టిని మరల్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ కోసం చంద్రబాబు పోరాడితే అతనికి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని అతని ఏజెంట్లు కొత్త రాగం ఎత్తుకున్నారు. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిం డి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి, కృష్ణాబోర్టుకు లేఖలు రాసింది నిజం కాదా? కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలో 25 టీఎంసీలు ఉంటే దానికి 45 టీఎంసీలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని అడ్డుకుంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యా దు చేసింది నిజం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ కేంద్రానికి లేఖలు రాసింది నిజం కాదా? ఇలా బాబు గారి బాగోతాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణ ప్రయోజనాలపై నిరంతరం కుట్ర లు చేసే చంద్రబాబు బాబ్లీ పేరుతో కొత్త డ్రామా మొదలుపెడితే అదికూడా ఎన్నికల స్టంట్‌గా తెలంగాణ ప్రజలు తెలుసుకోలేరు అనుకోవటం పెద్ద పొరపాటు.

ఎన్నికలే కేంద్రంగా తెలంగాణపై చంద్రబాబు భారీ కుట్రకు తెరదీశా డు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన ఇంటెలిజెన్స్‌కు తెలంగాణలో ఏం పని? ఇంటెలిజెన్స్ ముసుగులో ఏపీ డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ డెన్‌గా మార్చి పార్టీ సామర్థ్యంపై ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా ఆరాదీస్తూ, అక్కడినుంచి భారీ మొత్తంలో డబ్బులు చేతులు మార్చేందు కు రంగం సిద్ధం చేయటం ప్రజాస్వామ్య వ్యతిరేకం.

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నది. తెలంగాణ సీఎంగా కేసీఆ ర్ అఖండ విజయం సాధించి దేశం మన్ననలు అందుకున్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు, దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్‌గా తీసుకున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక అభివృద్ధిలో పోటీ పడలేక కేసీఆర్‌కు వస్తున్న పేరును చూసి ఓర్వలేక తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ప్లాన్ రచించాడు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ పరిణామాలపై ప్రజలే అసహ్యించుకొని తెలంగాణలో టీడీపీ అవసరం లేదంటూ తిర స్కరించారు. అయినా అత్యాశను చంపుకోలేని బాబు కొత్త నాటకాలతో తెలంగాణలో తిష్ట వేయాలని చేసిన ఆలోచనలను ప్రజలు తిప్పికొట్టాలి.
Vijay
చంద్రబాబుది ముందునుంచీ కుట్రల చరిత్రే. ఆయనకు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. సుభిక్షం గా వర్ధిల్లుతున్న తెలంగాణలో కాలకేయుని దండయాత్రలా ముందుకొస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి వలె కేసీఆర్ తిప్పికొట్టినప్పటికీ మరోమారు కాలకేయులను అంతం చేసేందుకు బాహుబలి-2 ప్రయోగిస్తారు తెలంగాణ ప్రజలు. సానుభూతి పేరుతో చంద్రబాబు ఎత్తుకున్న కొత్త నాటకాన్ని ప్రజలు విశ్వసించరు. దురదృష్టం ఏమంటే 125 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉనికే లేని టీడీ పీతో పొత్తుకు ఆతృత పడుతుండటం! చంద్రబాబు కుట్రలను అమలు చేసేందుకు ఆశ్రయం ఇవ్వడం నిజంగా కాంగ్రెస్ తెలంగాణకు దాపురించిన శనిగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమం పేరుతో తెరపైకి వచ్చి ఓ పార్టీ పెట్టిన మేధావి కలుషితం లేని రాజకీయాలు చేస్తానని, ఉద్యమ ద్రోహులతో కలువనని ప్రతినబూని అతని అభిమానులను సైతం అమాయకులను చేసి తెలంగాణపై కుట్ర చేస్తున్న బాబుతో చేతులు కలుపుతుండటం విషాదం.

కుట్రలు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు కొత్త కాదు. వాటిని ఛేదించేందుకు తెలంగాణ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. బాబు ఎన్ని ముసుగులు వేసుకొని వచ్చినా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు. ఆ కుట్రలను ఛేదించేందుకు కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు అండగా ఉన్నది. ఆ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలపర్చుకొని చంద్రబాబు లాంటి శకునిలను పొలిమేరలదాకా తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో తన దీపం కొండెక్కడంతో కొండెక్కిన దీపానికి కొత్త రాగం వస్తున్న చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టి తెలంగాణ శక్తి ని చాటాల్సిన అవసరం ఆసన్నమైంది.

442
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles