అక్రమ చొరబాటు

Sat,September 15, 2018 11:06 PM

ఏ పార్టీ అయినా ప్రైవేట్ సంస్థలను ఎంచుకొని వారికి ఇలాంటి బాధ్యతలను అప్పగిస్తే ఎలాంటి తప్పు లేదు. కానీ, తమ పార్టీ విజయావకాశాలను గమనించడానికి ప్రభుత్వ పోలీసులను వినియోగించుకోవడం అక్షరాలా నిబంధనలకు విరు ద్ధం. అంతేకాకుండా, ప్రశాంతంగా కలిసిమెలిసి సోదరుల్లా జీవిస్తున్న తెలంగాణ-ఆంధ్రుల మధ్య కలతలు రేపడం, చిచ్చు పెట్టడం మాత్రమే అవుతుంది. ఇటీవల ఈ వ్యాసకర్త వారం రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించినపుడు అనేకమంది కేసీఆర్ పాలన పట్ల హర్షం వ్యక్తం చెయ్యడమేగాక, గతంలో కేసీఆర్ పట్ల ఉన్న అపోహలు తొలిగిపోయాయని, తెలంగాణలో నివసిస్తున్న తమ బంధువులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

శతాబ్దాల నుంచి హైదరాబాద్ భారతదేశంలోని అన్నిరకాల కాందిశీకులకు ఆశ్రయం ఇచ్చే కల్పవృక్షంలా ఎదిగిం ది. హైదరాబాద్‌కు దేశంలో మిగిలిన 28 రాష్ర్టాల్లోని ప్రజలు వలసలు వచ్చి పొట్టపోసుకుంటూ ఆర్థికంగా ఎదిగి, తాము తెలంగాణలో ఉంటున్నామన్న భావనే మరిచి పోయి శాంతిసామరస్యాలతో, సౌభ్రాతృత్వంతో జీవిస్తున్న సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరినపుడు కూడా తెలంగాణకు శత్రువులుగా భావించే సీమాంధ్రులకు రవ్వంత కూడా అపకారం జరుగలేదు. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులు తెలంగాణ వాళ్లే అని ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలోనూ, ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా పలుమార్లు ప్రకటించారు. ఉద్యమవేడి ని చల్లారకుండా చూడటానికి అప్పుడప్పుడు సీమాంధ్రుల పట్ల కొంత పరుష పదజాలాన్ని ప్రయోగించినా, అంతలోనే తమాయించుకొని సీమాంధ్రుల దేహం మీద ఈగ కూడా వాలకుండా జాగ్రత్తపడ్డారు కేసీఆర్. ఇక రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణవాసుల నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయం కొంత కలిగినా, అతి కొద్దికాలంలోనే ఆ వాతావరణం మాయమైపోయింది. సీమాంధ్రులను తమ సోదరులుగానే భావించిన తెలంగాణ వాసులు అసలు ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వేరైపోయిందన్న ఆలోచననే మర్చిపోయి తమ పనులను తాము చేసుకోసాగారు. దేశంలోని అనేక ఇతర రాష్ర్టాల వారు జీవిస్తు న్నట్లు గానే సీమాంధ్రులు కూడా అనే భావనలోకి వచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించాలి. ఇక ఆ తర్వాత కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారు.

అవి తెలంగాణ వాసులకు మాత్రమే పరిమితం చెయ్యలేదు ఆయన. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలాంటి పథకాలు ఏ మాత్రం పక్షపాతం లేకుండా తెలంగాణ వారితో సమానంగా సీమాంధ్రులకు, ఇతర ప్రాంతీయులకు కూడా వర్తింపజేశారు. కేసీయార్ చేపట్టిన అనేక సంక్షేమ పథకాల పట్ల మక్కువ పెంచుకున్న సీమాంధ్రులు కేసీఆర్‌ను తమ అభిమాన నాయకుడిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన, తెలంగాణలో కేసీయార్ పాలనను పోల్చుకుంటూ, కేసీయార్ లక్ష రెట్లు మెరుగు అనే నిర్ణయానికి వచ్చా రు. వారు కేసీయార్ అంటే భయపడి కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నా రు అనుకుంటే అంతకంటే అవివేకం మరొక టి ఉండదు. ఎం దుకంటే ఈ దేశంలో జన్మించిన పౌరుడు ఈ దేశంలో ఏ మూల అయినా జీవించవచ్చు.. స్థిరనివాసం ఏర్పరచుకోవ చ్చు. రాజ్యాంగం ద్వారా తనకు లభించిన అన్ని హక్కులను అనుభవించవచ్చనే జ్ఞానం అందరిలాగే సీమాంధ్రులకు కూడా ఉన్నది. అందుకే వారు తెలంగాణలో నిర్భయంగా జీవిస్తున్నా రు. ఎప్పటిలాగే ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇళ్ళు వాకి ళ్లు నిర్మించుకుంటున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే సీమాంధ్రులు అంద రూ తెలంగాణ ఖాళీచేసి వెళ్ళిపోతారనే వదంతులు మొదట్లో గట్టిగా వినిపించా యి. నాకు తెలిసి, రాష్ట్రం విడిపోయాక ఒక్క కుటుంబం కూడా తెలంగాణను వది లి ఆంధ్రకు వెళ్లిపోలేదు. రాజ్యాంగబద్ధంగా ఒక రాష్ట్రం రెండు భాగాలు అయ్యాక, ఎవరి ఆస్తులు, అప్పు లు వారు పంచుకున్న తర్వాత, ఎవరి ప్రభుత్వం వారు ప్రజాతీర్పు ద్వారా ఏర్ప రుచుకున్న తర్వాత, ఎవరి పాలన వారు చేసుకుంటున్న తర్వాత ఒకరి వ్యవహారం లో మరొకరు జోక్యం చేసుకోవడం అనైతికం.

అనుచితం కూడా. ఓటుకు నోటు కేసులో నాటి తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి లంచం ఇస్తూ ఏసీబీకి పట్టుబడ టం, అదే సమయంలో చంద్రబాబు స్వరం రికార్డ్ కావడం లాంటి విపరిణామాల తర్వాత, ఉమ్మడి రాజధానిగా హైద రాబాద్ మీద హక్కులను వదులుకుంటూ చంద్రబాబు తన రాజధానిని అమరావతికి తరలించారు. అయితే ఆ సమయం లో హైదరాబాద్‌లో సెక్షన్ ఎనిమిది అమలు చేయాలని, హైద రాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్స్ పెడుతామని కొంత గొడవ చేసినా, ఆ తర్వాత అది సద్దుమణిగింది. పరిస్థితి ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు హైదరాబాద్‌లో మకాం వేసి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం విజయావకాశాలను రహస్యంగా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి. వీరంతా తెలంగాణలో క్యాంప్ వేసి నాలుగు వర్గాలుగా విడిపోయి కాం గ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఏయే స్థానాలను గెలువచ్చో ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఇరువై స్థానాల్లో కన్నేసి, సవివరమై న నివేదిక అందించాలని చంద్రబాబు వీరిని కోరారట. సీమాంధ్రులు ఎక్కువగా నివసిస్తున్న కొన్ని ప్రాంతా ల్లో వీరి గూఢచ ర్యం సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఏ పార్టీ అయినా ప్రైవేట్ సంస్థలను ఎంచుకొని వారికి ఇలాంటి బాధ్యతలను అప్పగిస్తే ఎలాంటి తప్పు లేదు. కానీ, తమ పార్టీ విజయావకాశాలను గమనించడానికి ప్రభుత్వ పోలీసులను వినియోగించుకోవడం అక్షరాలా నిబంధనలకు విరుద్ధం.

murali-mohana-rao
అంతేకాకుండా, ప్రశాంతంగా కలిసిమెలిసి సోదరుల్లా జీవిస్తున్న తెలంగాణ-ఆంధ్రుల మధ్య కలతలు రేపడం, చిచ్చు పెట్టడం మాత్రమే అవుతుంది. ఇటీవల ఈ వ్యాసకర్త వారం రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించినపుడు అనేకమంది కేసీఆర్ పాలన పట్ల హర్షం వ్యక్తం చెయ్యడమేగాక, గతంలో కేసీఆర్ పట్ల ఉన్న అపోహలు తొలిగిపోయాయని, తెలంగాణ లో నివసిస్తున్న తమ బంధువులు అందరూ చాలా సంతోషం గా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే మాటను కొందరు వైసీపీ నాయకులు కూడా ఈ రచయితతో పంచుకున్నారు. ఇలాంటి చక్కని వాతావరణాన్ని ఆంధ్రా పోలీసులు చెడగొట్టకుండా ఉంటే మంచిది.

381
Tags

More News

VIRAL NEWS