పర్యావరణం అందరి బాధ్యత

Sat,September 15, 2018 11:04 PM

నెమలీకల అందాలు, పక్షుల కిలకిల రావాలు, సింహగర్జనలు, ఏనుగుల ఘీంకారాలు, వానల్లో వెల్లివిరిసే సింగిడీలు, సీతాకోకలు, మిణుగురులు, పారే సెలయేళ్లు అన్నీ ప్రకృతి అందించిన వరాలే. మానవ శ్రమతో కడుపుల ఆకలి తీర్చే పంట పొలాలతో భూమికి పచ్చని చీరలను నేసే ఆకుపచ్చ చందమామలైన రైతన్నల కృషితో ఆనందాల హరివిల్లుగా మారతున్న లోకమిది. దీన్ని జాగ్రత్తగా చూసుకుందాం. భవిష్యత్‌ను కాపాడుకుందాం.

ప్రకృతే మన ప్రాణనాదం, ప్రకృతే మన పం చప్రాణం, ప్రకృతే మన ప్రగతిరథం, ప్రకృ తే మన కన్నతల్లి, ప్రకృతే మన కల్పవల్లి అంటా డు మన ప్రకృతికవి జయరాజ్. ఆకాశం వైపు చూస్తే ఎన్నో అబ్బురాలు కనపడుతాయి. ప్రకృతి లో ప్రతీదీ మనకు వింతే. వినీలాకాశంలో ధగధగలాడే సూర్యుడు, వెండివెన్నెలను కురిపించే చం ద్రుడు. నక్షత్రాల సోయగం, జలపాతాల గలగల లు, ఏడురంగుల సింగిడీలు, పచ్చనివనాలు, కొం డాకోనలు, ఉరుముల మెరుపుల వానలు ఒకటనేమిటీ ప్రకృతిలో ప్రతీదీ మనకు ఆనందార్ణవమే. మనసుకు ఉత్తేజభరితమే. అలాంటి ప్రకృతిని చూసి పరవశించని ప్రాణి ఉంటుందా? ప్రకృతి మనలను ఉల్లాసపరిచే ఆనందార్ణమే కాదు. మనం బతుకడానికి మూల కారణం. ఆకలైతే కమ్మని పండ్లను, పోషకాహారాన్ని అందించిన కన్నతల్లి. నిలువనీడ, నివసించడానికి నివాసం, సాధనా లు చేసుకోడానికి వనరులను అందించి మన జీవన గమనాన్ని సులభతరం, సౌకర్యవంతం చేసిన కల్పవల్లి. మనకు తోడుగా కోటానుకోట్ల జీవజాతులను ఇచ్చి ఒంటరిగా మనుషులొకరే విడిగా మనలేరని నిరంతరం హెచ్చరించే మార్గదర్శి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి మన సర్వస్వం. అలాంటి ప్రకృతిని మనమేం చేస్తున్నాం. మన అవసరాలను తీర్చడమే కాదు. మన కు ఈ విశ్వంలో వేటివల్ల ప్రమాదా లు రాకుండా అనేక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. మనమేమో మన దురాశతో వాటిని ధ్వంసంచేసి మన బతుకులను మనమే నాశ నం చేసుకుంటున్నాం.

ఈ భూమి ప్రతీ ఒక్కరి అవసరాలను సంతృప్తి పరుచడానికి కావాల్సినంత ఇస్తుంది కానీ మన దురాశలను తీర్చడానికి కాదంటాడు మహాత్మాగాంధీ. మనం మాత్రం ఈ మాటలను పెడచెవిన పెట్టి ప్రకృ తి వనరులను అవసరాలకు మించి విచ్చలవిడిగా వాడేస్తున్నాం. వనరుల పొదుపనేదీ లేకుండాపోయింది. ఫలితం ఎన్నడూ లేనట్లు ప్రకృ తి బీభత్సాలు. ఉత్తరాఖండ్, కేరళ వరదలు, అమెరికా హరికేన్లు, తుఫాన్లు, ఇంకోవైపు వానలు లేక ఇబ్బందులు. ఒకవైపు అతివృష్ఠి, ఇంకోవైపు అనావృష్ఠి. ఎల్‌నినోలు, లానినోలు విజృంభిస్తున్నాయి. ఎందుకని? మన భూమికి గొడుగువలె రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు చిల్లులు పడి దెబ్బతింటున్నది. భూమి జ్వరం వచ్చినట్లు వేడి పెరిగిపోయి భూతాపం మనం బతుకలేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నది. అందరం కలసి మన ప్రకృతిని ధ్వంసం చేసుకుంటున్నాం, మనం బతుకడానికి కావాల్సిన సమతుల వాతావరణ పరిస్థితులను ప్రకృతి మనకు అందిస్తే మనం విషాలను వదిలి కలుషితం చేస్తు న్నాం. ప్రాణాంతకంగా మార్చుకుంటున్నాం. తలసరి కార్బన్‌డై ఆక్సై డ్ ఉద్గారాల విడుదల అమెరికా 16.5 మెట్రిక్ టన్నులు మన దేశం 1.7 మెట్రిక్ టన్నులు వినియోగిస్తున్నది. అభివృద్ధి అంటూ మనం పరిగెడుతున్నది మన వినాశనం వైపా లేక మన వికాసం వైపా? 2013లో వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతార్జాతీయ పానెల్ ఇలా చెప్పింది. మానవ జోక్యం ప్రకృతిలో పెరుగడం వల్ల గ్రీన్‌హజ్ వాయువులైన కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాటి విడుదల 20వ శతాబ్దం నుంచి ఎక్కువగా పెరుగుతున్నది.

భూ ఉపరితల ఉష్ణోగ్రత 4.7 శాతం డిగ్రీల నుంచి 8.6 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇది సముద్ర జలాల ఉపరితలాలు పెరుగడం, భూమి మీదకు సముద్రాలు చొచ్చుకురావడం, ఏడారులు పెరుగడం, జీవజాతులు విలుప్తమవడం, హిమానీనదాలు కరుగడం, వేడిగాలుల తీవ్రత పెరుగడం, కరువులు, వరదలు ఏర్పడటం, ఆమ్ల వర్షాలు కురువడం వంటి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నది. శిలాజాల ఇంధనం విచ్చలవిడి వాడ కం వాతావరణ మార్పులకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఆస్ట్రేలియా కార్బ న్‌డై ఆక్సైడ్ విడుదల్లో మిగితా ప్రపంచంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా విడుదల చేస్తున్నది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలకన్నా రెట్టింపు, ప్రపంచ సగటు కంటే నాలుగురెట్లు ఎక్కువగా విడుదల చేస్తున్నది. విద్యుదుత్పత్తి ప్రధాన కారణం. 73 శాతం విద్యుత్ బొగ్గును మండించడం ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. అమెరికాలో 40 శాతం విద్యుదుత్పత్తి ద్వారా కార్బన్‌డై ఆక్సైడ్ ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నది. 93 శాతం విద్యుదుత్పత్తి బొగ్గును మండించడం ద్వారా జరుగుతుంది. విద్యుత్ వాడకం తగ్గించుకోగలిగితే వాతావరాణాన్ని కాపాడుకోగలం. 33 శాతం ఉద్గారాలు కార్ల వాడకం వల్ల అవుతున్నాయి. మీథేన్ విడుదల మరొక కారణం. స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు మనం జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఈ భూమ్మీద మన మనుగడ అసాధ్యమవుతుంది. మనం ఇంకో గ్రహాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థుతుల్లో తప్పేలా లేదు. అందుకే వెంటనే మనం మరో గ్రహాన్నీ చూసుకోవాలి. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే భవిష్యత్‌తరాలకు ఈ భూమి మిగలదు.

అందుకే ఇప్పటి నుంచి ప్రతీ ఒక్కరం ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించాలి. తెలంగాణ ప్రభు త్వం అడవులను పెంచడానికి హరిత హారం కార్యక్రమం చేపట్టడం ఈ దిశలో పెద్ద ముందడుగు. ఈ ఆలోచనకు మూలమైన సీఎం కేసీఆర్ అభినందనీయులు. ప్రజల భాగస్వామ్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ అంతా హరియాలి వెళ్ళివిరియాలి. ఈ స్ఫూర్తితో ప్రకృతి ప్రేమికులంతా కదలాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశంతో దస్వాస్ సంస్థ 17, 18 తేదీల్లో ప్రకృతి ప్రేమికుల సమ్మేళాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుపుతున్నది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ కాలు ష్య నియంత్రణ మండలి, తెలంగాణ పర్యాటకశాఖ వంటి వాటితో పాటు అనేక సంస్థల సహకారంతో ఇది నడుస్తున్నది. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రింట్ మీడియా భాగస్వామిగా ఉన్నది. ముఖ్యంగా యువత ప్రకృతి రక్షణ గురించి ఆలోచించాలి. తోటి మిత్రులతో చర్చించాలి. తమ ఆలోచనలకు పదునుపెట్టాలి. ప్రకృతి రక్షణలో సృజనశీల ఆలోచనలతో భాగస్వాములు కావాలి. ప్రకృతి ప్రేమికుల కలయికగా ప్రకృతి 2కె ఎయిటీన్ పేరుతో పర్యావరణ, సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరం కలుద్దాం. ప్రకృతిని కాపాడుకుం దాం. యువత, విద్యార్థినీ విద్యార్థులు ప్రకృతి రక్షణ కోసం కదలాలి. ప్రకృతి ప్రేమిస్తే పోయేదేమీ లేదు. అద్భుతమైన భవిత ఏర్పడుతుంది. స్వర్గం ఎక్కడో లేదు. ఈ సుందరనందన భూ లోకమే మన స్వర్గధా మం. దీన్ని నరకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.

vinutha-reddy
నీటి వినియోగం, ప్రకృతి వనరుల వినియోగం ప్రతిదానిలో పొదుపు పాటించాలి. అవసరాల మేరకే వినియోగించుకోవాలి. నెమలీకల అందాలు, పక్షుల కిలకిల రావాలు, సింహగర్జనలు, ఏనుగుల ఘీంకారాలు, వానల్లో వెల్లివిరిసే సింగిడీలు, సీతాకోకలు, మిణుగురులు, పారే సెలయేళ్లు అన్నీ ప్రకృతి అందించిన వరాలే. మానవ శ్రమతో కడుపుల ఆకలి తీర్చే పంట పొలాలతో భూమికి పచ్చని చీరలను నేసే ఆకుపచ్చ చందమామలైన రైతన్నల కృషితో ఆనందాల హరివిల్లుగా మారతున్న లోకమిది. దీన్ని జాగ్రత్తగా చూసుకుందాం. భవిష్యత్‌ను కాపాడుకుందాం.

482
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles