అప్పుడు, ఇప్పుడు

Fri,September 14, 2018 10:56 PM

మిత్రుడు యాదగిరి హఠాత్తుగా అనారోగ్యం పాలు కావడం ఆయన మిత్రులందరికీ ఆందోళన కలిగించింది. నిజం చెప్పాలంటే (వారిజాక్షులందు వైవాహికములందు.. అన్న మినహాయింపు సూత్రాన్ని పాటించకుండా నిజమే చెప్పాలె) యాదగిరి చాలా సెన్సిటివ్. రెండేండ్ల కిందట నవంబర్ 8న అసుర సంధ్య వేళ భారత ప్రధాని మోదీజీ టీవీలోకి వచ్చి నోట్లరద్దు గురించి ప్రకటించినప్పుడు యాదగిరి అనారోగ్యం పాలయిండు. బహుశా అప్పుడు దేశంలో కొన్నికోట్ల మంది ఆరోగ్యం దెబ్బతిని ఉంటుంది. వారిలో యాదగిరి ఒకడు. తరువాత దెబ్బలకు యాదగిరి క్రమంగా అడ్జస్ట్ అయిండు. జాతీయ సమైక్యత కోసం నిరుపమాన కృషిజరిపి, విచ్ఛిన్నకరశక్తులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం నడిపి, జాతిపిత హత్య అనంతరం వెంటనే ఆర్‌ఎస్సెస్‌ను నిషేధించిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్‌ను ఇప్పుడు ఆర్‌ఎస్సెస్- బీజేపీ విధేయుడిగా చిత్రిస్తున్నారు. అధ్యాత్మిక ప్రపంచానికి అధినేతగా భాసించిన వివేకానంద కూడా తమ కోవకు చెందిన వాడన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.

యాదగిరి, యాదగిరి వంటి కొన్ని లక్షలమంది తెలంగాణ రాష్ట్రంలో మోదీజీ దెబ్బలను తట్టుకొని కోలుకోవడానికి, వాళ్ల ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదపడినవి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి అద్భుత ఫలితాలు. అడుగకుండా అమ్మయినా పెట్టదంటారు. కేసీఆర్ ప్రభుత్వం అడుగకుండానే ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నదని యాదగిరి అంటాడు. ఇటీవల సెప్టెంబర్ 2న యాదగిరి, ఆయన కుటుంబసభ్యులు, ఎందరో మిత్రులు కొంగరకలాన్ వెళ్లివచ్చా రు, తిరుగు ప్రయాణంలో యాదగిరి వెంట ఆయన బంధువులు కొంద రు హైదరాబాద్ వచ్చి ఆయన ఇంట్లోనే మకాం పెట్టారు. తెలంగాణ సభ్యతతో అన్ని మర్యాదలు చేసి, కట్నాలు గూడపెట్టి యాదగిరి వాళ్ల ఊళ్లకు పంపించాడు. కొంగరకలాన్‌లో కొండంత ఉత్సాహం నిండిన పిదప కూడా హఠాత్తుగా యాదగిరి బలహీనుడై మంచం ఎం దుకు పట్టాడు? కారణమేమిటి? చిన్నప్పుడు వరంగల్ మట్టెవాడ ప్రభు త్వ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు మద్రాసు నుంచి ప్రచురితమవుతున్న రెండు తెలుగు పత్రికల్లో (హైదరాబాద్ నుంచి ప్రచురితమైన గోలకొండ పత్రికలో మాత్రం కాదు) ప్రతిరోజు అవళందారు హత్యకేసు విచారణ విశేషాలు వివరంగా ప్రచురితమయ్యేవి. అవళందారును పట్టపగలు హత్యచేసి, శవాన్ని ఒక పెట్టెలో పెట్టి, రైలుపట్టాల పక్క న వదిలిందెవరు? హంతకులెవరు? ఒకరా ఇద్దరా? ఎక్కువమందా? హత్యకు కుట్ర జరిగిందా? హత్యకు కారణాలేమిటి? తదితర ప్రశ్నలే గాని, ఏరోజూ సమాధానాలు కనిపించకపోయేవి! ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు, ఎన్ని రోజులైనా కొనసాగే ఎపిసోడ్లు! రేపు ఏం వస్తుందో ఏమో అన్న ఉత్కంఠతో విడువకుండా రోజూ స్కూలు పక్కనే ఉన్న లైబ్రరీలో కూర్చొని చదివేవాళ్లం.

తర్వాత 3వ పేజీలో చూడండి అని చిన్న నోట్ ఉండేది. మొదటి పేజీ ఒక పాఠకుడి చేతిలో ఉంటే, 3వ పేజీ మరో పాఠకుడి చేతిలో ఉండేది. ఆయన చదివేవరకు ఓపిక పట్టాలె. ఉత్కంఠను, టెన్షన్‌ను తట్టుకోలేం-బడి బచ్చాలమ్ గదా! (తిరిగి ఇప్పుడు ఈ ముం దస్తు ఎన్నికల వాతావరణంలో అదే ఉత్కంఠ, అదే టెన్షన్. ఎవరు, ఎప్పుడు, ఎవరితో ముఠా కట్టుతున్నారో, ఎవరెక్కడున్నారో తెలియడం లేదు. నాడు కురుక్షేత్ర సంగ్రామరంగంలో అందరి బీపీ పెరుగుతుంటే, కృష్ణ పరమాత్ముడు మాత్రం హాయిగా మురళి వాయిస్తూ నిల్చి ఉన్న మరోహర దృశ్యం కన్పిస్తున్నది!) పాంచ్‌కడీదేవ్, అర్థర్ కానన్ డాయిల్ డిటెక్టివ్ నవలలు చదువుతున్నప్పుడు కలిగిన ఉత్కంఠ, టెన్షన్ అవళందారు హత్యకేసు వివరాలు చదువుతున్నప్పుడు కలిగేవి. ఒకవంక సురవరం వారి గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల సమస్యలను వివరిస్తుం టే మరో వంక మద్రాసు తెలుగు పత్రికలు రెండు క్షుద్ర వార్తలతో అమాయక పాఠకుల్లో సెన్షేషన్‌ను రేకెత్తించి ధనార్జన జరిపేవి. చాలా దూరం వచ్చాం. ఇంతకు మిత్రుడు యాదగిరి నిరుత్సాహానికి, అనారోగ్యానికి కారణం ఏమిటి? ఆయనే చెప్పాడు.. తట్టు మాటల మూట మోదీ జోడి మాట అంటూ యాదగిరి వచన కవిత్వంతో ఆరంభించాడు. మొన్న ఢిల్లీలో పాలకపక్షం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీజీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌జీ చేసిన ప్రకటనలు తన అనారోగ్యానికి ప్రధాన కారణమని అసలు సంగతి వెల్లడించాడు. భారత్ అని స్వతంత్ర భార త్ రాజ్యాంగంలో ఉంది. పార్లమెంట్‌కు వెళ్లి భారత్ రాజ్యాంగంలో అధికారికంగా ఎటువంటి సవరణ చేయకుండానే ప్రధాని మోదీజీ తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ దేశం పేరు మార్చడం, ఇక నుంచి భారతదేశం అజయ్ భారత్ అని ప్రకటించడం, అంబేద్కర్ ఆత్మకు అశాంతి కల్గించడం సమంజసమా అని సామాన్యుడు యాదగి రి బాధపడుతున్నాడు. అజయ్ అంటే ఎవరు? మోదీజీ కుడిభుజం అమిత్ షా కుమార రత్నం అజయ్‌షా. అజయ్‌షా గత నాలుగేండ్ల స్వల్ప వ్యవధిలో తన వర్తకాన్ని వందల రెట్లు పెంచి మిరాకిల్ సృష్టించాడు. ఆయన పేరు మీద అజయ్ భారత్ అవతరించనుందా. తన మిత్రుడి పుత్రరత్నం ఎంత ముద్దయినా మోదీజీ ఆ అబ్బాయి పేరుతో దేశం పేరు మార్చాలని అనుకుంటున్నారని యాదగిరి అనుమానం.

యాదగిరి అనారోగ్యానికి, మనస్తాపానికి ఢిల్లీ సమావేశంలో అమిత్‌షాజీ చేసిన ప్రకటన కూడా కారణమైంది. 2019 ఎన్నికల్లో గెలిచి మోదీజీ తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తారని, ఆ తర్వాత వరుసగా ఇక యాభై ఏండ్లు కేంద్రంలో బీజేపీ రాజ్యమే నడుస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటన యాదగిరి గుండెల్లో గుబులు పుట్టించింది. నందో రాజా భవిష్యతి అంటారు. ఏమైనా జరుగొచ్చు. ఎందుకంటే, భారత రాజ్యాంగాన్ని మార్చడానికే అధికారంలోకి వచ్చామని మోదీజీ ప్రభుత్వంలోని ఒక మంత్రి గతంలో బాహాటంగా ప్రకటించాడు. ఇప్పుడు ప్రభుత్వాలు మనవే, న్యాయవ్యవస్థ మనదే, మీడియా మనదే, అందువల్ల మనం ఏమైనా చేయగలం అని ఒక బీజేపీ మంత్రి తొడలు కొట్టి, ఛాతీ విప్పి చెప్పాడు. ఆర్థికవ్యవస్థ చక్కబడటానికి ఎన్ని సూచనలు చేసినా ప్రధాని మోదీజీ కార్యాలయం ఖాతరు చేయలేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ ఒక పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణకు కేసుల కేటాయింపు సవ్యంగా జరుగడం లేదని నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 9 నెలల కిందట మీడియా ముందుకొచ్చి తమ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తపరిచినా వ్యవస్థ చక్కబడిన సూచనలు కన్పించడం లేదు.

అత్యున్నత న్యాయస్థానం నిర్వహణ, వ్యవహారసరళి అనుమానాలకు, విమర్శలకు గురైనప్పుడు న్యాయవ్యవస్థ పట్ల దేశ ప్రజలకు విశ్వాసం కలుగుతుందన్న నమ్మకం లేదు. అమెరికా అమెరికాదే అన్న ట్రంపిజం నినాదం ఇతర దేశాల సంగతేమోగానీ విశేషించి భారతదేశానికి తీవ్రనష్టం కలిగించే సూచనలు, అమెరికాకు (యూఎస్‌ఏ) ఒక ఉపగ్రహంగా మారి వాణిజ్య, రక్షణ రంగాల్లో భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారత్ రూపాయి విలువ గత 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతకు ముందెన్నడూ లేనంత దీనంగా దిగజారుతున్నది. భారతదేశానికి తమ ఎగుమతులు హెచ్చాలె, తమకు భారత్ ఎగుమతులు తగ్గాలె, తమ నుంచి మన దిగుమతులు పెరుగాలన్నది అమెరికన్ పాలకుల విధానం. పాకిస్థాన్‌కు తమ గ్రాంట్లు తగ్గిస్తున్నట్లు అమెరికన్ పాలకులు తరచూ ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ మతోన్మాద టెర్రరిజానికి పాక్ ప్రోత్సాహం తగ్గడం లేదు. జమ్మూకశ్మీరులో గవర్నర్ మారినా, ప్రభుత్వాలు మారుతున్నా భారత్ సైన్యం, ఇతర సాయుధ దళాలు తీవ్రవాదులతో పోరాడవలసి వస్తున్నది. గత నాలుగేండ్ల 4 నెలల నుంచి మోదీయుల పాలనలో దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో హద్దులుదాటి చెలరేగుతున్న అసహనానికి ప్రతిక్రియగా జమ్మూకశ్మీరులో మతోన్మాద టెర్రరిజం విజృంభిస్తున్నదన్న అభిప్రాయం బలపడుతున్నది.
prabhakar
గాంధీ, నెహ్రూ సహచరుడిగా భారత స్వాతంత్రోద్యమంలో అద్వితీ య పాత్ర నిర్వహించి, అప్పటి వైస్రాయ్ లార్డ్‌మౌంట్ బాటన్‌తో సూటి గా ఇక మీరు ఈ దేశాన్ని పాలించలేరు అని హెచ్చరించి, జాతీయ సమైక్యత కోసం నిరుపమాన కృషి జరిపి, విచ్ఛిన్నకరశక్తులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం నడిపి, జాతిపిత హత్య అనంతరం వెంటనే ఆర్‌ఎస్సె స్‌ను నిషేధించిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్‌ను ఇప్పుడు ఆర్‌ఎస్సెస్- బీజేపీ విధేయుడిగా చిత్రిస్తున్నారు. అధ్యాత్మిక ప్రపంచానికి అధినేతగా భాసించిన వివేకానంద కూడా తమ కోవకు చెందిన వాడన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. 1893 సెప్టెంబర్ 11న షికాగో నగరంలో వివేకానందుడు భారత సంస్కృతి వైశిష్ట్యం, హైందవధర్మ ప్రాశస్త్యం గురిం చి ప్రపంచానికి వివరించడానికి, హైందవధర్మం సహనశీలతను తెలియ జెప్పడానికి వివిధ, విభిన్న మతాల ప్రపంచ పార్లమెంట్లో అద్భుతంగా ప్రసంగించి, ప్రపంచానికి ఆశ్చర్యం కల్గించారు. అమెరికా హృదయం ఆనందంతో ఉప్పొంగిన మహత్తర సమయం అది. If you want to know India, study Vivekananda.. అని రవీంద్రనాథ్ ఠాగోర్ ఫ్రెంచి తత్త్వవేత్త రోమరోలాకు సలహా ఇచ్చారు. He alone lives who lives for others అని వివేకానందుడు ప్రబోధించాడు. అసహనంతో ఇతరులను ద్వేషించే వారిది జీవితమే కాదన్నారు. షికాగో చరిత్రాత్మక ప్రసంగంలో వివేకానందుడు ఉద్ఘోషించిన సత్యం If any -body dreams of the exclusive survival of his own reli -gion and the destruction of others I pity him.. Assi -milation and not destruction.. Harmony and peace and not dissension వివేకానంద స్వామి షికాగో ప్రసంగంలో సర్వమత సౌభ్రాతృత్వం కోరుతూ అందించిన సద్భావ సందేశానికి విరుద్ధంగా ఈ 2018 సెప్టెంబర్ 11వ తేదీన) ఆర్‌ఎస్సెస్-వీహెచ్‌పీ అదే నగరంలో ప్రపంచ హిందూ కాంగ్రెస్ ఏర్పాటుచేసి అదే అసహనాన్ని వ్యక్తపరిచా యి, హిందువుల సంఖ్య పెరుగాలని పిలుపునిచ్చాయి. సహనం అప్పు డు, అసహనం ఇప్పుడు!

627
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles