విజయతీరాలకు ప్రయాణం

Fri,September 14, 2018 10:54 PM

గతంలో జరిగిన లోక్‌సభ, శాసనసభ రద్దుల విషయంలో అప్పటి నేతల వ్యూహప్రతివ్యూహాలనేఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్నారు. ఈ లెక్కన ముందస్తు ప్రయాణాలన్నీ విజయతీరాలను అందించినట్లుగానే.. ఈ సారి ఎన్నికల్లో కూడా కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయం.

ముందస్తు ఎన్నికలు. ఇవి తొలి తెలంగాణ రాష్ర్టానికి మొదటివే అయినా.. ఆరు దశాబ్దాల భారతదేశ చరిత్రలో చాలాసా ర్లు శాసనసభలు రద్దయి ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇలా జరిగిన ప్రతి ముందస్తులోనూ అసెంబ్లీలను రద్దుచేసిన ప్రభుత్వాలే తిరిగి అధికారంలోకి వచ్చాయి. తాము అమలుచేసిన పథకాలు తిరిగి అధికారం చేజిక్కించుకుంటామన్న ధీమాతో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీలను రద్దుచేసిన ప్రతి ప్రభుత్వమూ తిరిగి అధికారం చేజిక్కించుకొని విజయతీరాలను చేరుకున్నది. కానీ.. అలిపిరి దాడిని సానుభూతిగా వాడుకొని తిరిగి గద్దెనెక్కాలని చూసిన చంద్రబాబు మాత్రమే ముందస్తు ముంగిట బోర్లా పడ్డారు. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్న పాపానికి ఆ ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకెళ్లి అధికారాని కి దూరంచేశారు నారా వారు. ఫలితంగా దేశంలో ముందస్తుకు వెళ్లి ఓడిపోయిన జాబితాలో వాజపేయి, బాబు ప్రభుత్వాలు మాత్రమే మిగిలిపోయాయి.

నేడు కేసీఆర్ 9 నెలల ముందు అసెంబ్లీని రద్దుచేయగానే కాంగ్రెస్ నేతలు నానా యాగీ చేస్తున్నారు. 1970లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాం ధీ ఏడాదిముందే లోక్‌సభను రద్దుచేశారు? వందేండ్ల కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక కారణంగా తనకు పదవీగండం తప్పదని భావించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అంతేకాదు, 1979 లో చరణ్‌సింగ్ ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా మద్దతు ఉపసంహరించుకొని మరోసారి లోక్‌సభ రద్దుకు కారణమయ్యారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన రెండేండ్లకే హర్యానాలో అసెంబ్లీ రద్దయ్యింది. కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ పరిస్థితి చోటుచేసుకున్నది. దేశంలో తొలి శాసనసభ రద్దు ఇదే. 1969లో బీహార్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలు కూడా రద్దయి ముందస్తు ఎన్నికలు వచ్చా యి. అప్పటివరకు ఒక్క పార్టీ చేతిలో అధికారం ఉన్నప్పటికీ చీలికల కారణంగా చిన్నచిన్న పార్టీలుగా ఏర్పడి మళ్లీ హంగ్ ద్వారా అధికారం వారి చేతుల్లోకే వెళ్లింది. అనంతరం 1970లో ఇందిరా ప్రధానిగా 4వ లోక్‌స భను రద్దుచేశారు. దేశ చరిత్రలో లోక్‌సభ రద్దు కావడం ఇదే ప్రథమం. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ప్రజల మన్ననలు అందుకున్న ఇందిరా పార్టీలో మాత్రం శత్రువుల సంఖ్యను పెంచుకున్నది. ఫలితంగా వందేండ్ల కాంగ్రెస్ చరిత్రలో చీలిక ఏర్పడి రెండు వర్గాలుగా విడిపోయింది. తనపై సొంత పార్టీ నేతలే పెట్టిన అవిశ్వాసాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇం దిరాగాంధీ తన సామర్థ్యాన్ని ప్రజల ఓట్లతోనే నిరూపించుకోవాలని నిర్ణయిచుకున్నది. లోక్‌సభను రద్దుచేసి.. 1971లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తన సత్తా నిరూపించుకున్నారు.

ఆ తర్వాత ప్రధానిగా ఎమర్జెన్సీని విధించి దేశ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా 30 ఏండ్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభు త్వం ఏర్పడింది. అయితే.. పార్టీ అంతర్గత కలహాల వల్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో 1979లో చరణ్‌సింగ్ ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఇక్కడే ఇందిరా తన రాజకీయ చతురతను ప్రదర్శించింది. అనూహ్యంగా చరణ్‌సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించున్నారు. ఫలితంగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. అలా మరోసారి లోక్‌సభ రద్దుకు కారణమైన ఇందిరాగాంధీ ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకున్నారు.

ఆ తర్వాత జరిగిన శాసనసభల రదు, ముందస్తు ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఎమ్మెల్యేల తిరుగుబా టు, ఫిరాయింపుల కారణంగా 1984లో సీఎం హోదాలో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దుచేశారు. 1985 మార్చిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మెజార్టీ సాధించి మళ్లీ సీఎం అయ్యారు. 1991లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీని ఏడాదిముందే అప్పటి సీఎం జ్యోతిబసు రద్దుచేశారు. ముందస్తు ఎన్నిక ల్లో భారీ మెజార్టీ సాధించి జ్యోతిబసు మళ్లీ సీఎం అయ్యారు. గోద్రా అల్ల ర్ల నేపథ్యంలో 2002లో ఏడాది ముందుగానే ప్రస్తుత ప్రధాని, అప్పటి సీఎం నరేంద్ర మోదీ అసెంబ్లీని రద్దుచేశారు. తర్వాత డిసెంబర్‌లో జరిగి న ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

ముందస్తు ఎన్నికలు జరిగిన ప్రతిసారి రద్దుకు కారణమైన వారికే విజ యం చేకూరింది. ఒక్క బాబు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యిం ది. అలిపిరి వద్ద నక్సల్స్ జరిపిన దాడి నుంచి బయపటడిన చంద్రబాబు సానుభూతితో ముందస్తుకు వెళ్లాలని భావించారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని భావించిన బాబుకు చుక్కెదురైంది. 2004 ఎన్నికల్లో బాబు నేతృత్వంలోనే టీడీపీ ఓటమి పాలైంది. అంతేకాదు.. అప్పుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ప్రధాని వాజపేయిని సైతం ముందస్తుకు ఒప్పించింది. ఫలితంగా కేం ద్రంలో ఎన్డీయే, ఏపీలో టీడీపీ అధికారానికి దూరమయ్యాయి.
nagarjuna
14 ఏండ్ల తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు వెళ్లింది. నాలుగేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 465 సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. కాళేశ్వరం, మిషన్ భగరీథ, రైతుబంధు, రైతుబీమా వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అయితే ఎన్నికలు సమీపిసున్నవేళ విపక్షాలు ప్రభుత్వంపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయ త్నం ప్రారంభించాయి. ఈ తరుణంలో ముందస్తుకు వెళ్లడం వల్ల మళ్లీ టీఆర్‌ఎస్‌కే అధికారం దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంతో శాసనసభరద్దుకు సిఫార్సు చేశారు కేసీఆర్. అయితే విపక్షాలు ఆరోపిస్తున్నట్లు సరైన కారణం లేకుండా శాసనసభ రద్దును ఆమోదించరు. సర్కారియా కమిషన్ నివేది క ఆధారంగా సరైన కారణాలున్నప్పుడు మాత్రమే నిర్ణీతకాల వ్యవధి ముగియకుండా అసెంబ్లీ రద్ద్దును ఆమోదిస్తారు. 1967లో పంజాబ్, 1968లో ఉత్తరప్రదేశ్, 1969లో మధ్యప్రదేశ్, 1971లో ఒరిస్సా, 2003లో మాయావతి ప్రభుత్వాలు శాసనసభల రద్దుకు విజ్ఞప్తులు చేశా యి. కానీ సరైన కారణాల్లేని కారణంగా వాటికి అనుమతి లభించలేదు. దీనివల్ల విపక్షాలు చేస్తున్నవి అనవసర ఆరోపణలే.

మొత్తంగా.. గతంలో జరిగిన లోక్‌సభ, శాసనసభ రద్దుల విషయంలో అప్పటి నేతల వ్యూహప్రతివ్యూహాలనే ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్నారు. ఈ లెక్కన ముందస్తు ప్రయాణాలన్నీ విజయతీరాలను అందించినట్లుగానే.. ఈ సారి ఎన్నికల్లో కూడా కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయం.

544
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles