చదువుల సంగతేంది?

Fri,September 14, 2018 10:53 PM

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం యూజీసీ గుర్తింపు పొందిన 223 యూనివర్సిటీల పేర్లు ప్రకటించిది. కానీ మిగతా యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నది చెప్పలేదు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో వేలాదిమంది ఆయా కోర్సుల్లో విద్య పూర్తిచేశారు. బీఈడీ, డీఈడీ లాంటి వృత్తివిద్య కోర్సులు మొదలుకొని పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను చేసిన వారు లక్షలాదిగా ఉంటారు. అలాంటివారు ఉద్యోగాల కోసం పోటీ పరీక్ష లు రాస్తున్నవారు ఉంటారు. అలాంటివారికి ప్రభుత్వ నిర్ణయం తీవ్ర నష్టం చేసేదిగా ఉన్నది. కాబట్టి కటాఫ్ సంవత్సరం ప్రకటించి చదువుకున్న వారికి ఊరట కలిగించాలి.
- డాక్టర్ పోలమ్ సైదులు, ఉస్మానియా యూనివర్సిటీ


కాంగ్రెస్ బుద్ధి మారాలె


అధికారదాహంతో విలవిలలాడుతున్న కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోని హామీలను ప్రకటిస్తున్నది. ఆ హామీలు ఆచరణకు సాధ్యం కావని ప్రజల కూ తెలుసు. కాంగ్రెస్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలె.
- పుల్కం సంపత్, రాములపల్లె, పెగడపల్లి, జగిత్యాల జిల్లా

నాణ్యత పెరుగాలె


ఈ మధ్యకాలంలో ఆకాశవాణి ప్రోగ్రాములు చాలా అధ్వాన్నంగా ఉంటున్నా యి. ప్రసారం చేయటానికి ప్రజోపయో గ కార్యక్రమాలు లేకపోతే ఏవో కొన్ని సినిమా పాటలు వేసి చేతులు దులుపుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ప్రజలకు ఉపకరించే అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. లేనప్పుడు ఆణిముత్యాల్లాంటి పాటలు కూడా ఉన్నాయి. వాటి ని ప్రసారం చేసినా బాగుంటుంది. అంతేకానీ ఏ విధమైన నాణ్యతాప్రమానాలు పాటించకుండా ప్రోగ్రాములు ప్రసారం చేయటం కాకుండా మంచివి ప్రసారం చేయాలని శ్రోతలు కోరుకుంటున్నారు.
- సీవీఆర్ కృష్ణ, హైదరాబాద్

117
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles