నీటి పొదుపే భవిష్యత్తుకు భరోసా

Mon,September 10, 2018 11:19 PM

ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండల్లా మారిన ఎల్లంపల్లి, అక్కంపల్లి రిజర్వాయర్లను చూసివస్తేగాని మా మనసుకు తృప్తి లేదు. మరో ఏడాది దాకా హైదరాబాద్ నగర ప్రజలకు నీటి ఢోకా లేదని చెప్పాలని మా మనసు ఉవ్విళ్ళూరుతున్నాయని మాటల సందర్భంలో జలమండలి ఎండీ దానకిషోర్‌ను పాత్రికేయులు అడిగిన అయిదు నిముషాల్లో సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు వెళ్లాయి.హైదరాబాద్ నగరానికి వచ్చే ఏడాది వరకు మంచినీటికి ఢోకా లేదని తెలిసిపోయింది. అంతమాత్రాన నీటి విషయంలో ప్రజలు అజాగ్రత్తలు చేయకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవడం అలవాటుచేసుకోవాలి. రోజుకు సుమారు కోటిన్నర మందికి హైదరాబాద్ జలమండలి మంచినీటిని అందిస్తున్నది. వ్యయప్రయాసలకు ఓర్చి తెస్తున్న ఈ నీటిని వృథా కానివ్వకుండా ప్రజలు జాగ్రత్తలు పడినపుడే ముందుతరానికి కూడా మనం మంచినీటిని అందించగలుగుతాం.

పాత్రికేయ మిత్రులకు మొదట గోదావరి నీటిని అందిస్తు న్న ఎల్లంపల్లి రిజర్వాయర్ చూపించి, ఆ తర్వాత కృష్ణా నీటిని అందిస్తున్న అక్కంపల్లి రిజర్వాయర్ కూడా చూపించి రెండువైపులా ఉన్న రెండు నదుల నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని అం దిస్తున్న విధానాన్ని పాత్రికేయ బృందానికి చూపించమన్నారు.

ఆగస్టు 25, శనివారం ఉదయం ఏడున్నర గంటలకు వివిధ పత్రిక లు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సుమారు 40 మంది పాత్రికేయులు, జలమండలికి చెందిన సీనియర్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎల్లంపల్లికి బయల్దేరాం. సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, అంతర్గాం మీదుగా సుమారు 186 కిలోమీటర్లు ప్రయాణించి ఎల్లంపల్లి బ్యారేజ్‌పైకి చేరుకున్నాం. అక్కడ జలమండలి డైరెక్టర్ ట్రాన్స్ మిషన్ ఎం.బి.ప్రవీణ్‌కుమార్, ఇతర డైరెక్టర్లు ఎం.ఎల్.ప్రవీణ్‌కుమార్, పి.రవి, జనరల్ మేనేజర్ బి.శివరాజ్‌తో పాటుగా పలువురు ఉన్నతాధికారులు పాత్రికేయ బృందానికి స్వాగతం పలికారు. అంతకు రెండ్రోజు ల ముందే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పై నుం చి వచ్చే నీటి ప్రవాహం కొద్దిగా తగ్గడంతో రెండు రోజుల కిందే బ్యారేజీ గేట్లను మూసివేయడంతో కిందికి ప్రవహించకుండా నన్ను ఎందుకు ఆపేసారన్నంత కోపంతో ఎత్తయిన భారీగేట్లకు నీటి అలలు బలంగా తాకుతూ చేస్తున్న పెద్ద శబ్దం ఒకవైపు, ఎత్తయిన బ్యారేజీపై నుంచి వీస్తు న్న హోరుగాలి మరోవైపు బ్యారేజీపై నిలబడిన మా అందరిలోనూ ఒక్కసారిగా రోజూవారీ యాంత్రిక జీవనం నుంచి బయటపడేసింది. అద్భుతమైన ఆ ప్రకృతి దృశ్యం అందరిలోనూ ఆనందాన్ని నింపింది. గేట్ల సైడ్ వెంట ఉన్న చిన్నచిన్న సందుగుండా పెద్ద శబ్దంతో నీటి ధారలు కిందికి దూకుతూ నీటి ప్రవాహంలో కలిసిపోవడం చూస్తుంటే ప్రకృతి రమణీయత ముందు ఏదీ పనికిరాదనిపించింది. నీటివేగం ఎంత ఉధృతం గా ఉంటుందో ఆ దృశ్యం చూస్తే తెలుస్తుంది. ఇంతలోనే డైరెక్టర్, ట్రాన్స్ మిషన్ ఎం.బి.ప్రవీణ్‌కుమార్ హ్యాండ్‌మైక్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు గురిం చి చెపుతూ 20 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించారని, ఇందులో 10 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి మంచినీటి కోసం తీసుకుంటున్నామని, మిగతా నీరు స్థానిక అవసరాల కోసం డిజై న్ చేశారని పాత్రికేయ మిత్రులకు చెబుతూ అక్కడి వాతావరణాన్ని కొద్ది గా మార్చారు. 172 మిలియన్ గ్యాలన్ల నీరు ప్రతిరోజూ ఈ నది నుంచి మనం హైదరాబాద్ నగరానికి తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రాజెక్ట్‌పై ఉన్న కొద్దిసేపు ఆనందాన్ని అనుభవించిన అనంతరం మరో అయిదారు కిలోమీటర్లు మట్టి రోడ్డుపై ప్రయాణించి ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో హైదరాబాద్ నగరానికి పంపింగ్ చేసే ముర్ముర్ పంపిం గ్ స్టేషన్‌కు వచ్చాం. అక్కడున్న పెద్దపెద్ద మోటార్లతో బ్యాక్‌వాటర్‌ను సుమారు 40 మీటర్ల లోతు నుంచి పుంపులు ఎంత వేగంతో రిసీవ్ చేసుకుంటాయో వివరిస్తూ అంతే వేగంతో 53 కిలోమీటర్ల దూరంలోని బొమ్మకల్ పంపింగ్ స్టేషన్‌కు పంపిస్తారని ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ పాత్రికేయ బృందానికి వివరించారు. నదిలోకి వచ్చే నీరు అన్ని ప్రాంతాలను తాకుతూ వస్తుందని, అనేకరకాలుగా కలుషితమవుతుందని, అందుకే ఈ వాటర్‌ను మొదట్లో ముర్ముర్ ఆ తర్వాత బొమ్మకల్‌కు పంపింగ్ చేసి న అనంతరం ఆ నీటిని 48 కిలోమీటర్ల దూరంలోని మల్లారం అక్కడినుంచి 27 కిలోమీటర్ల దూరంలోని కొండపాకకు నీటిని పంపింగ్ చేసి ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా వివిధ దశల్లో నీటిని పూర్తిస్థాయిలో శుద్ధిచేసి క్లోరినేషన్ పరీక్షల అనంత రం నీటిని హైదరాబాద్ పంపించడం జరుగుతుందని జలమండలి ఇం జినీరింగ్ సిబ్బంది, అధికారులు పాత్రికేయులకు వివరించారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీరు రావాలంటే 495 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రతి స్టేజ్‌లోనూ 3 మెగావాట్ల విద్యుత్ అవసరమ్యే ఒక్కో మోటార్ ద్వారా ఈ నీటిని పంపింగ్ చేయ డం జరుగుతుందని, ఇందుకోసం మొత్తం ఆరు మోటార్లను ఉపయోగించడం జరుగుతుందని, వీటిలో మూడు మోటార్లు ఉపయోగిస్తే, మిగి తా మూడు మోటార్లు స్టాండ్‌బైగా ఉంటాయని, ఏ ఒక్క క్షణం కూడా నీటి ప్రవాహం ఆగకుండా 24 గంటలూ మోటార్లు పని చేసేవిధంగా అధికారులందరూ అప్రమత్తంగా పనిచేస్తూనే ఉంటారని, నీటి సరఫరాలోను, నీటి నాణ్యత విషయంలో కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు జలమండలి సిబ్బంది అనుక్షణం పనిచే స్తూనే ఉంటారని తెలిపారు.

manohara
గోదావరి, కృష్ణానదుల నుంచి మంచినీటిని తీసుకొని రావాలంటే రెండువైపులా నీటిని లిఫ్ట్ చేయడం తప్పనిసరి అని, ఇందుకోసం విద్యుత్ ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ, ప్రభుత్వ ఆదేశానుసారం పేదలకు తక్కువ ధరకే నీటిని అందించడం జరుగుతుందన్నారు. కొండపాక నుంచి 58 కిలోమీటర్ల దూరంలోని శామీర్‌పేటకు దగ్గరగా ఉన్న ఘనపూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని చేరుస్తామని, అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జలమండలి రిజర్వాయర్ల ద్వారా ఇంటింటికి మంచినీటిని సరఫ రా చేయడం జరుగుతుందని, ఇదంతా చేయడానికి అడుగడుగునా జలమండలి సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుందని పాత్రికేయ బృందానికి అధికారులు వివరించడం జరిగింది. తిరుగు ప్రయాణంలో మల్లారంలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను కూడా చూడటం జరిగింది. ఎల్లంపల్లి బ్యారేజీపైకి వెళ్లేముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ పనులను కూడా పాత్రికేయుల బృందం చూడటం జరిగింది.
పారదర్శకత అనేది అన్నిచోట్ల అవసరం. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి అనే పంచభూతాల ప్రాధాన్యం ప్రజలకు తెలియాలి. హైదరాబాద్ నగరానికి వచ్చే ఏడాది వరకు మంచినీటికి ఢోకా లేదని తెలిసిపోయింది. అంతమాత్రాన నీటి విషయంలో ప్రజలు అజాగ్రత్తలు చేయకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజు కు సుమారు కోటిన్నర మందికి హైదరాబాద్ జలమండలి మంచినీటిని అందిస్తున్నది. వ్యయప్రయాసలకు ఓర్చి తెస్తున్న ఈ నీటిని వృథా కానివ్వకుండా ప్రజలు జాగ్రత్తలు పడినపుడే ముందుతరానికి కూడా మనం మంచినీటిని అందించగలుగుతాం.

473
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles