ప్రాంతీయశక్తిగా బిమ్స్‌టెక్

Thu,September 6, 2018 10:46 PM

నేపాల్ రాజధాని ఖాఠ్మండులో ముగిసిన బిమ్స్‌టెక్ సమావేశం భారతీయులకు, మోదీకి శుభ సంకేతాలు ఇచ్చింది. ఇది సార్క్, చైనా తలపెట్టిన ఓబీఓఆర్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చినదిగా భావిస్తున్న స్థితి ఉన్నది. పాకిస్థాన్ టెర్రరిజానికి ఊతమిస్తుండటంతో దక్షిణాసియ దేశాల కూటమి సార్క్ తన ఉనికి కోల్పోయినట్లయ్యింది. అలాగే సార్క్ దేశాల కూటమిలో బంగ్లాదేశ్, భూటాన్, భారత్ లాంటి దేశాలకు తగిన ప్రాధాన్యం ఉండక పోవటంతో సార్క్ కూటమి తన ప్రాధాన్యాన్నే కాదు, ఉనికిని కూడా కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత పరిస్థితులు చూస్తే..

నేపాల్ విషయంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది దీర్ఘకాలిక స్నేహ సంబంధాలకు పెద్దపీట వేయాలి. నేపాల్ నుంచి దిగువకు ప్రవహిస్తున్న గంగానది నీరు వృథాగా పోతున్నది. ఆ నీటిని సద్వినియోగం చేసేందుకు ప్రయత్నం జరుగుతూనే, బిమ్స్‌టెక్ సభ్యదేశాల మధ్య అన్నిరకాల దౌత్య, వ్యాపార సంబంధ,
బాంధవ్యాలకు పెద్దపీట వేయాలి.

చాలా సందర్భాల్లో టెర్రరిజాన్ని ఖండించటంలో సార్క్ తడబాటు పడింది. ఈ ప్రాంతంలో చెలరేగిన ఉద్రిక్తతలను తగ్గించటంలో కూడా విఫలమైంది. ఈ పరిస్థితుల్లోంచే బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీసెక్టోరల్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్) టెర్రరిజాన్ని, వివిధ రూపాల్లోని టెర్రరిస్ట్ కార్యకలాపాలను ఎలాంటి శషబిషలు లేకుండా ఖండిం చింది. బిమ్స్‌టెక్ కేవలం టెర్రరిజాన్ని ఖండించటం వరకే పరిమితం కాకుండా, టెర్రరిస్ట్ సంస్థలను, దాని నెట్‌వర్క్‌ను అదుపుచేసే బాధ్యత ను ఆయా దేశాల ప్రభుత్వాలపైనే పెట్టింది. అలాగే టెర్రరిస్ట్ సంస్థలకు అందుతున్న అన్నిరకాల సాయాన్ని ముఖ్యంగా ఆర్థిక అండదండలను, మద్దతును నిర్వీర్యం చేసేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కృషిచేసే విధం గా బిమ్స్‌టెక్ ముందుకుపోతున్నది.

బిమ్స్‌టెక్ సభ్య దేశాలన్నీ పరస్పరం అన్నిరకాల సహాయసహకారా లు అందించుకోవాలని తీర్మానించాయి. అలాగే టెర్రరిజం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడం లాంటి వాటిలో సభ్య దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలని నిర్ణయించా యి. ఈ నిర్ణయాలన్నీ సభ్యదేశాల నుంచి హాజరైన జాతీయ భద్రతా సలహాదారులు, సైనికాధికారులు, హోంమంత్రులు ఉమ్మడిగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే పుణెలో సైనికాధికారుల సమావేశం జరుగనున్నది.

బిమ్స్‌టెక్ అనేది చైనా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓబీఓఆ ర్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నా, భారత్‌కు సమీప పొరుగుదేశాల కూటమిగా చెప్పవచ్చు. ఇది దక్షిణాసియా, సౌత్ ఈస్ట్ ఆసియాను భార త ఈశాన్య రాష్ర్టాల ద్వారా అనుసంధానం చేస్తుంది. ఈశాన్య రాష్ర్టాల భాషాసంస్కృతులు, దక్షిణాసియా దేశాల సంస్కృతులకు దగ్గరగా ఉండ టం కూడా ఒక అంశంగా భారత్ పరిగణిస్తున్నది. ఈ అన్నిదేశాల్లో బౌద్ధం ప్రబల ప్రాశస్త్యాన్ని పొంది, నేపాల్ నుంచి మయన్మార్ దాకా అన్ని దేశాలను సాంస్కృతికంగా ఏకం చేస్తున్నది. ఇది చైనాతో సహా మిగతా ప్రపంచంతో భారత్ సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు దోహదపడుతుంది. అయితే ఇది భారత్ అనుసరించే దౌత్యసంబంధాల్లోని పరిపక్వత, నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నేపాల్ సమ్మిట్‌కు ముందు భారత్ శాంతి, సుస్థిరత, ఆర్థికాభివృద్ధి దిశగా ముందడుగు అని పిలుపునిచ్చింది.

1997 జూన్ 6న బ్యాంకాక్‌లో బిమ్స్‌టెక్ ఏర్పాటయ్యింది. దీనిలో దక్షిణాసియా దేశాలు సభ్యదేశాలుగా చేరాయి. అవి ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్. బిమ్స్‌టెక్ ప్రారంభమైన కాడినుంచి ఇప్పటిదాకా మూడుసార్లు సమావేశమైంది. 1997లో బ్యాంకాక్, 2008లో కొత్త ఢిల్లీ, 2014లో మయన్మార్, ఇప్ప డు నాలుగో సమావేశం నేపాల్ రాజధాని ఖాఠ్మండులో జరిగింది. బిమ్స్‌టెక్ దేశాల కూటమిలో 14 రంగాల్లో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఈసారి ఖాఠ్మండు సమావేశంలో మరో రెండు రంగాలను చేర్చటంతో మొత్తం 16 అంశాలయ్యాయి. ఈ 16 అంశాల ను ఐదు విభాగాలుగా విభజించాలని థాయిలాండ్ నుంచి ప్రతిపాదన వచ్చింది. అవి.. దేశాల మధ్య అనుసంధానం, వ్యాపారం-పెట్టుబడు లు, ప్రజల మధ్య సంబంధాలు, శాస్త్ర సాంకేతికరంగాలు, భద్రతగా విభజించారు. అలాగే 2021 నాటికి బిమ్స్‌టెక్ సభ్యదేశాల్లో స్వేచ్ఛావ్యాపారానికి తలుపులు తెరువాలని థాయిలాండ్ ప్రధాని సూచించారు.
ఏదైనా ఒక సమ్మిట్ ఫలప్రదమైందా లేదా అనే దానికి ప్రమానం ఏమంటే.. అది తీసుకున్న నిర్ణయాలు, నిర్ణయాల అమలు, ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. పరస్పర అంగీకారంతో దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఏ మేరకు అమలవుతున్నాయన్నదే గీటురాయిగా సమ్మిట్ విజయానికి గీటురాయి. అయితే సభ్యదేశాల చొరవతో అమలయ్యేవి కొన్ని అయితే అంతర్జాతీయ అనుమతులు అవసరమయ్యేవి కూడా కొన్ని ఉన్నాయి. అలాగే స్వేచ్ఛా వ్యాపారం అనేది అనుకున్న వెంటనే అమలయ్యేది కాదు. దానికి భూమికగా అనేక చర్యలు సభ్యదేశాలన్నీ చేయాల్సినవి చాలా ఉంటాయి. మయన్మార్ అధ్యక్షుడు చెప్పినట్లు బిమ్స్‌టెక్ 2009లో ఏర్పాటుచేసిన ఎనర్జీ సెంటర్ ఇప్పటివరకు కార్యాచరణ లోకి రాలేదు. బిమ్స్‌టెక్‌కు సంబంధించిన కార్యానిర్వాహక వర్గం నిధు ల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. బిమ్స్‌టెక్ సమావేశాలు ఎంత కాల వ్యవధిలో నిర్వహించాలనేది కూడా ఇంకా తుదిరూపం తీసుకోలేదు. ఏదో సందర్భానుసారం జరుపుకోవటమే తప్ప, దానికంటూ కాల వ్యవ ధి లేకపోవటం పెద్ద లోపమే. సభ్యదేశాల అధినేతల ఉత్సాహం, అవసరంపై ఆధారపడి సమావేశం కావటం అనుసరణీయం అనిపించుకోదు. ఆ క్రమంలో బిమ్స్‌టెక్ సమావేశం 2019లో కూడా సమావేశమైతే అదికూడా విజయం ఖాతాలో పడుతుంది.

వాస్తవం మాట్లాడుకోవాలంటే.. వ్యక్తుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఏదైనా ముఖ్యంగా ఇలాంటి దేశాల కూటమి ఏర్పడి మనగలగటం అసాధ్యం. దానికి సంబంధించిన చారిత్రక, సామాజిక పరిస్థితులు నిర్ణయాత్మక పాత్ర వహిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిమ్స్‌టెక్ కూడా ఓ చారిత్రక అవసరంగా ముందుకువచ్చి సభ్యదేశాల ఆకాంక్షల ను, అవసరాలను తీర్చగలిగే స్థితి ఉండాలి. ఈ నేపథ్యంలోంచే కావచ్చు నేపాల్ ప్రధాని కేపీఎస్ ఓలి బిమ్స్‌టెక్ సభ్యదేశాలనుద్దేశించి మాట్లాడు తూ.. మనం మాటల నుంచి చేతలకు మారాలి. వాగ్దానాలు చేయటం నుంచి ఆచరణలో రుజువుచేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోంచే చూస్తే, బిమ్స్‌టెక్ గురించిన అంచనాలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉండి వాటిని అందుకోవటంలో తడబాటు కనపడుతున్నది.
giri
ఈ నేపథ్యంలో బిమ్స్‌టెక్ సమర్థవంతంగా, అర్థవంతంగా పనిచేయాలంటే నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. మొదటిది- బిమ్స్‌టెక్ తనదైన ముసాయిదా విధాన ప్రణాళికను రూపొందించుకోవాలి. అది బ్యాంకాక్ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఉండాలి. అలాగే బిమ్స్‌టెక్‌కు ఒక శాశ్వత కార్యనిర్వాహక వర్గం ఏర్పాటుకావాలి. అది విధి విధానాలను, నిబంధనలను రూపొందించాలి. కార్యనిర్వాహక వర్గం పనిచేయటానికి అవసరమైన నిధుల సమీకరణ కూడా జరుగాలి.దానికి సంబంధించి అవసరమైన నిధులను సమకూర్చాలి. ఇది సమర్థంగా పనిచేసినప్పుడే సమ్మిట్ సమర్థత వెలుగులోకి వస్తుంది. అంతర్జాతీయ సమాజంలో బిమ్స్‌టెక్ పాత్రను అన్ని సందర్బాల్లో ప్రదర్శించాలి. ఆ విధంగా అన్ని సందర్భాల్లో ఉనికిని చాటుతూ ఈ ప్రాంతీయ సంస్థగా ఉనికిని చాటుకుంటూ తనదైన ప్రాధాన్యాన్ని నిలుపుకోవాలి.
ముఖ్యంగా బిమ్స్‌టెక్ సభ్యదేశాల్లో టెర్రిరిజం నియంత్రణకు కట్టుబ డి సమర్థంగా పనిచేయాలి. ఆయా దేశాల ఆర్థికాభివృద్ధికి కృషిచేయాలి. సభ్యదేశాల్లోని పేదరిక నిర్మూలనకు సమైక్యంగా కృషిచేయాలి. ప్రపంచ జనాభాలో 22 శాతంగా ఉన్న బిమ్స్‌టెక్ దేశాల జనాభా అతితక్కువ ఆర్థిక జీవనంతో ఉన్న స్థితిని మెరుగుపర్చాలి. సభ్యదేశాలన్నీ టెర్రరిజా న్ని రూపుమాపేందుకు పరస్పర సహకారంతో పనిచేసి శాంతి సుస్థిరతలను నెలకొల్పాలి.

ముఖ్యంగా ప్రధాని మోదీ నేపాల్‌తో బెడిసిన దౌత్య, సౌహార్థ సంబంధాలను మెరుగుపర్చాలి. ఖాఠ్మండు సమావేశానికి ముందు మోదీ ప్రకటించినట్లుగా.. నేపాల్‌తో దౌత్య, వ్యాపార సంబంధాలే కాకుండా అంతకుమించిన సాంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చుకునే విధంగా కృషి జరుగాలి. నేపాల్ విషయంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది దీర్ఘకాలిక స్నేహ సంబంధాలకు పెద్దపీట వేయాలి. నేపాల్ నుంచి దిగువకు ప్రవహిస్తున్న గంగానది నీరు వృథాగా పోతున్నది. ఆ నీటిని సద్వినియోగం చేసేందుకు ప్రయత్నం జరుగుతూనే, బిమ్స్‌టెక్ సభ్యదేశాల మధ్య అన్నిరకాల దౌత్య, వ్యాపార సంబంధ, బాంధవ్యాలకు పెద్దపీట వేయాలి. బిమ్స్‌టెక్ సభ్య దేశాలన్నీ పరస్పర సహకారంతో ముందుకు పోవాలి.
(వ్యాసకర్త: అంతర్జాతీయ రాజకీయాల్లో ఆచార్యులు)
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

362
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles