ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

Thu,September 6, 2018 10:45 PM

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీలను విమర్శించలేదు. పక్క ఆంధ్ర రాష్ట్రం, కేంద్రం కలిసి ఎన్నిరకాలుగా అన్యాయాలు చేశారో చెప్పలేదు. నీటి దోపిడి ఇంకా ఎలా జరుగుతుందో ఉద్యోగులు ఇంకా ఎలా కష్టపడుతున్నారో, కేంద్రం ఇంకా హైకోర్టు విభజన జరుపకుండా ఏ గాడిదలు కాస్తోందోపట్టించుకోలేదు. 201 4, జూన్ 2 నుంచి 2018, సెప్టెంబర్ 1 వరకు నాలుగేండ్ల మూడు నెలల్లో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో వివరించారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి నాలుగేండ్లు గిర్రున తిరిగిపోయా యి. ఈ ఏడో, లేకపోతే వచ్చే ఏడో మళ్లీ సార్వత్రిక ఎన్నిక లు జరుగుతాయి. కొన్ని రాష్ర్టాలకు కూడా ఎన్నికలు జరుగబోతున్నాయి. మరి ఈ సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రజలకు ఏం చెప్పాలి? సభలో ఏం మాట్లాడాలి? చూద్దాం!
ఎన్నికల బరిలో రెండురకాల పార్టీలుంటాయి. ఒకటి అధికారంలో ఉండి అయిదేండ్లు పరిపాలించి, మళ్లీ తమను ఎన్నుకోమని ప్రజలను అడుగడానికి వచ్చిన పార్టీ అయితే, రెండోది పరిపాలనలోకి రాకుండా మొట్టమొదటిసారి అధికారం కోరుకుంటున్న పార్టీ. 2014లో తెలంగాణలోనూ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో జాతీయస్థాయిలో పోటీకి దిగిన బీజేపీ ఇంచుమించు ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి మొట్టమొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి అన్ని స్థానాల కు స్వతంత్రంగా పోటీచేసింది. తన ఉద్యమ అనుభవంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్న ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల ముందు ఉంచింది. అప్పటికే ఉద్యమంలో ఆ పార్టీ, నాయకుడు చూపిన నిబద్ధత, అంకిత భావం చూసి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. అంతేకాదు, ఎన్నికల అనంతరం ఇతర పార్టీలలో ఉన్నవారికి కూడా తమ పరిస్థితి అర్థమై చాలామంది ఈ పార్టీలో చేరిపోయారు. ఒకరకంగా ఓడిపోయిన పార్టీలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు, కమ్యూనిస్టు పార్టీలు అన్ని ప్రజల వల్ల తృణీకరింపబడ్డాయి.

ఇక జాతీయస్థాయిలో బీజేపీ ఇదివరకు అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఆ పార్టీని ఆదరించటానికి కారణాలున్నాయి. ఆ కాలంలో ఉన్న వాజపేయి అజాతశతృవు వివక్ష పార్టీల ప్రేమ కూడా పొందిన నాయకు డు. కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల బీజేపీ పార్టీ ఎక్కువ కాలం అధికారం నిలుపుకోలేకపోయింది. ఇక 2014 ఎన్నికల్లో పార్టీ పాతదయినా, నాయకుడు మోదీ కొత్తవాడు. తన రాష్ట్రమైన గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా మూడుసార్లు పరిపాలించిన అనుభవజ్ఞుడు. ఆ రాష్ట్ర ప్రగతికి ఎంతో నిజం గా లోకానికి తెలియదు కానీ, దానిని ఆయన భూతల స్వర్గంగా చేశాడన్న ప్రచారంతో ప్రజలందరినీ ఆకట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ. పైగా కుటుంబ పాలనలతో కాంగ్రెస్ అవకతవక, అవినీతి పరిపాలన చూసిన ప్రజలకు, కావలసినటువంటి ఒంటరివాడు. 2014 ఎన్నికలలో ఆయన ద్విముఖ ప్రచారం చాలా బాగా పండింది. ఒకవైపు 6 దశాబ్దాల కాంగ్రెస్ అవినీతికి, అసమర్థ పాలనను దుమ్మెత్తిపోశాడు. మరోవైపు తమ పార్టీ గెలిస్తే తన నాయకత్వంలో భారతదేశం స్వర్గమవుతుందన్న నమ్మకాన్ని తన పథకాలు చెప్పి ప్రజలలో కలిగించాడు. అందుకే ప్రజలు జాతీయస్థాయిలో ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు.

ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ, జాతీయస్థాయిలో బీజేపీ ఎన్నికలు గెలువగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీల నాయకులు ప్రజలకేం చెప్పాలి? సభలలో ఏం మాట్లాడాలి? అధికారంలో ఉండి తమను మళ్లీ గెలిపించాలని అర్థించే నాయకులు ఈ అయిదేండ్లు తాము అధికారాన్ని ఎందుకు ఎలా ఉపయోగించామో చెప్పాలి. ప్రజల అవసరలను బట్టి వారికి కావలసిన పథకాలు ఏవి ప్రవేశపెట్టి, ఎంత ప్రగతి సాధించామో చెప్పాలి. ముందు మ్యానిఫెస్టోలోని అంశాలు ఎంతవరకు తీర్చామో వివరించాలి. అవికాక ఇంకేం చేశామో, ప్రజా ధనాన్ని ప్రజల కోసం ఎంత వెచ్చించామో అవి ప్రజలకు ఎంత ఉపయోగపడ్డామో వివరించాలి. వెనుకపడిన వర్గాలకు ముఖ్యంగా ఎంత సేవ చేశామో, ఏయే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారి ప్రగతికి తోడ్పడ్డాయో చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రగతి దేశంలో ఇతర రాష్ర్టాలతో పోల్చినప్పుడు ఎలా ఉందో స్పష్టపర్చాలి.
kankadurga
ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీలను విమర్శించలేదు. పక్క ఆంధ్ర రాష్ట్రం, కేంద్రం కలిసి ఎన్నిరకాలుగా అన్యాయాలు చేశారో చెప్పలేదు. నీటి దోపిడీ ఇంకా ఎలా జరుగుతుందో ఉద్యోగులు ఇంకా ఎలా కష్టపడుతున్నారో, కేంద్రం ఇంకా హైకో ర్టు విభజన జరుపకుండా ఏ గాడిదలు కాస్తోందో పట్టించుకోలేదు. 2014, జూన్ 2 నుంచి 2018, సెప్టెంబర్ 1 వరకు నాలుగేండ్ల మూడు నెలల్లో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో వివరించారు. తమ హయాంలో ఏయే పథకాలు ప్రవేశపెట్టారో, అవి ఎంతవరకు విజయవంతమయ్యాయో స్పష్టీకరించారు. మిగతా రాష్ర్టాలకంటే పసికూన అయిన తెలంగాణ రాష్ట్రం చాలా విషయాల్లో ఎంత ముందుకెళ్లిందో చిత్రీకరించారు. అంతేకాదు, ఇకముందు సాధించవలసింది ఉందన్న విషయాన్ని వ్యక్తీకరించారు.

నిజానికి ఈ ప్రసంగం భారత రాజకీయాలకు కొత్త. ఇప్పటిదాకా ఏ పార్టీ ఎన్నికలయ్యాక మ్యానిఫెస్టోను ముట్టుకున్నది లేదు. అం దుకే 70 ఏండ్ల స్వాతంత్య్రానంతరం మనం ఇంకా మరుగుదొడ్లు కట్టడం, మంచినీళ్లివ్వడం, వ్యవసాయానికి సహాయం చెయ్యడం గురించే మాట్లాడుతున్నాం. ప్రతి ఎన్నికలలో, ప్రతి పార్టీ ఎదుటివారిని దుమ్మెత్తి పోసి, నకారాత్మక ఓట్లతో గెలుస్తోంది కానీ, తామేం చేశామో, చేస్తామో చెప్పి సకారాత్మక ఓట్లు సంపాదించటం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మీ, అవసరానికి తగ్గట్టు వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు, మైనార్టీ సంక్షేమం, పటిష్టమైన పోలీసు విభాగం షీ టీమ్స్ ప్రవేశపెట్టి దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ఇంకో బృహత్తర విషయంలో కూడా కొత్త పద్ధతికి నాంది పలుకబోతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు బంధువుగా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటంలోనే కాదు, ప్రజావసరాలను గుర్తించే ప్రభుత్వంగా, పేరు తెచ్చుకోవటమేకాదు ఇప్పుడు ఎన్నికల్లో సకారాత్మక ఓట్లను తెచ్చుకొని, కొత్త పం థాను తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలకు చూపించబోతున్నది. ప్రగతి నివేదన సభ ఉద్దేశం దశాబ్దాలుగా నెగెటివ్ ఓట్లు, అది కూడా రెండు శాతం కంటే తక్కువ ఎన్నికల్లో తెచ్చుకొని రాష్ట్రాలను, దేశాన్ని పాలించేవారికి కనువిప్పు కలుగాలన్నది. అది అర్థం కాని విపక్షాలు అవాకులు, చెవాకులు పేలడం అర్థం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి ఉద్దేశం ప్రజలకు అర్థం అయింది. వారు దానికి అనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో వారి కి ప్రగతినిస్తున్న పార్టీని ఎన్నుకొని ఇంకా అభివృద్ధి చెందుతారు.

455
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles