అతిశయోక్తులు, అసత్యాలు లేవు

Thu,September 6, 2018 12:02 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభలో చెప్పిన విషయాలలో అసత్యాలు, అతిశయోక్తులు ఏమీ లేవు. ఆయనే అన్నట్లు, అభివృద్ధి మీ కండ్ల ముందే ఉన్నది. తవ్విన చెరువులు, నాణ్యమైన కరెంటు మీ ముందటే ఉన్నాయి. ప్రాజెక్టులు కడుతున్నరు, కాలువలు తవ్వుతున్నరు. డప్పు కొట్టి చెప్పుకునే అవసరం లేదు. తన పాలనలో సాధించిన వాటి మరిన్ని వివరాలు సభలో పంచిన కరపత్రాలలో ఉండనే ఉన్నాయి. వాటిని బట్టి ఎవరి అభిప్రాయాలనికి వారు రావచ్చు. అటువంటి నమ్మకం వల్లనే కావచ్చు సీఎం ప్రసంగం 50 నిమిషాలకే పరిమితమైంది. స్వరం పెంచి అట్టహాసాలు చేయాల్సిన పని లేకపోయింది.స్వాతంత్య్రానంతరం కూడా ఆ కారణాలను అట్లా నిలిపి ఉంచుతున్నాయి. కేసీఆర్ మనస్సులో ఇదంతా ఏ మేరకు ఉన్నదీ మనకు తెలియదు గాని, ఆధునికార్థంలో ఫెడరలిస్టు భావనలు ఉన్నాయన్నంత వరకు మాత్రం చెప్పగలం. ఎందుకంటే, కేంద్రపు అనవసర ఆధిపత్యం లేని సహకార ఫెడరలిజం గురించి ఆయన ఇటీవలికాలంలో ఇతరత్రా కూడా మాట్లాడుతున్నారు.

కేసీఆర్ వంటి ప్రసంగ మాంత్రికుడు 50 నిమిషాలు కాదు, అంతకు నాలుగు రెట్ల సమయం ఉపన్యసించినా ప్రజలు కదలకుండా విని ఉండేవారే. అటువంటి మూడ్‌తోనే రాష్ట్రమంతటి నుంచి తరలివచ్చారు వారు. సభ చాలా కీలకమైనదని వారందికీ ముందుగానే అర్థమైంది. త్వరలో రానున్న ఎన్నికల గురించిన చర్చోపచర్చల గ్రామాల వరకు సాగుతున్నాయి. అటువంటి స్థితిలో ప్రజల దృష్టిలో ఆదివారం నాటి సభ, ఒకవైపు ఇంతకాలం సాధించిన వాటి విజయోత్సవ సభ కాగా, మరొకవైపు రానున్న ఎన్నికల కోసం యుద్ధభేరీ సభ. అందువల్ల వారు ఆ మూడ్‌లో, ఇంతకాలం సాధించిన వాటిపై అట్టహాసాలకు, ప్రత్యర్థులపై కర్కశ ప్రహారాలకు, ఎన్నికల యుద్ధభేరీలకు-అన్నిటికీ సన్నద్ధులయే వచ్చారు.

ఈ మూడ్‌ను గ్రహించలేని రాజకీయ నాయకుడు కాదు కేసీఆర్. కాని ఆయన తన వ్యూహాన్ని దశలవారీగా అమలుకు తేనున్నట్లు కనిపిస్తున్న ది. యథాతథంగా ప్రజలు ఎన్నికల వాతావరణంలోకి రావటమనే మొదటి దశ మొదలైపోయింది. వారిని అందుకు సన్నద్ధులు చేసేందుకు ఆరంభం కొంగరకలాన్ సభతో జరిగింది. ఇదంతా కూడా ఇందుకు సమాంతరంగా ఇక్కడ పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో, మరొకవైపు ఢిల్లీ స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటూ సాగుతున్నది. ఇటువంటి దశలో కొంగరకలాన్ వంటి సభ నిర్వహించినప్పుడు అక్కడ ప్రసంగాలు ఆ దశకు తగినట్లే ఉండాలి. కార్యక్రమం పేరు ప్రగతి నివేదన సభ అయినందున ప్రస్తుతానికి దానికి మాత్రమే కట్టబడాలి. తీవ్రతలు తర్వాతి దశలలో రావాలి. ముఖ్యంగా శాసనసభ రద్దు తీర్మానం నుంచి, ఎన్నికల ప్రకటన నుంచి మొదలుకొని. ప్రగతి నివేదన సందర్భంలో కేసీఆర్ గాని, ఇతరులు కొద్దిమంది గాని చేసిన ప్రసంగాలు అం దుకు పరిమితమై, అందుకు అనుగుణంగా సాగటం సహజమే తప్ప అం దులో విశేషం లేదు.

ముఖ్యమంత్రి ప్రసంగంలో స్థూలంగా మూడు పార్శాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, వాటి నుంచి బయట పడేందుకు సాగిన ప్రయత్నాలు. రెండు, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అభివృ ద్ధి కోసం చేసిన కృషి. మూడు, తాము అధికారానికి తిరిగి వచ్చినట్లయితే ఏమీ చేయగలమన్నది. ఇవి గాక నాల్గవది తమిళనాడుతో పోల్చుతూ చెప్పిన ఫెడరలిస్టు మాటలు. వాటికి ప్రగతి నివేదన అనే ఫ్రేమ్ వర్క్‌తో పరోక్ష సంబంధం, దీర్ఘకాలిక సంబంధం ఉందనుకున్నా ప్రత్యక్షమైన తక్షణ సంబంధం లేదు గనుక ఆ విషయం చివరికి మాట్లాడుకుందాం.

తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ధనిక-పాలక వర్గాలతో పాటు, అప్పుడు వారి ప్రభావంలో ఉండిన ఢిల్లీ పాలకుల వల్ల జరిగిన అన్యాయాల గురించి కేసీఆర్ సందర్భవశాత్తు, ఒక నేపథ్యంగా ప్రసంగించి చెప్పారు. గాని అదంతా తెలంగాణలో ఆబాలగోపాలానికి తెలిసిన విషయం. ఇక ఈ నాలుగేండ్ల ప్రగతి విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగంలో సభవద్ద పంచిన అభివృద్ధి అంశాల కరపత్రంలో కలిపి వందలాది అంశాలున్నాయి. టీఆర్‌ఎస్ ఒక పార్టీగా తమ మ్యానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి, ప్రభుత్వ బడ్జెట్లలో ప్రకటించినవి, తరచు ప్రజావర్గాల నుంచి వచ్చే కోర్కెలకు స్పందించి చేసినవి వాటిలో కన్పిస్తాయి. ఇవన్నీ ఇంతకుముందు ఏమి చెప్పినా, చెప్పకపోయినా, ఇప్పు డు కొత్త ఎన్నికల ముంగిట్లో నిల్చొని ప్రజలకు నివేదన అనే రూపంలో చెప్తున్నవి అయినందున, అందుకు ప్రత్యేకమైన ప్రాముఖం, విలువ ఏర్పడుతాయి. సమగ్రత ఉంటుందని కూడా అనవచ్చు.

అటువంటిస్థితిలో ముఖ్యమంత్రి ప్రసంగం. సభలో పంచిన కరపత్రం, టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో, ఇన్నేండ్ల బడ్జెట్లు అనే నాలుగు కలిపి చర్చకు ప్రాతిపదిక అవుతాయి. ఆ చర్చలో స్వయంగా అధికారపక్షం, ప్రభుత్వం, ప్రతిపక్షా లు, మేధావి వర్గాలు, ప్రజలు పాల్గొనాలి. అప్పుడది తెలంగాణ ముం దున్న ప్రగతి నివేదనపై తెలంగాణ జరిపే సమీక్ష అవుతుంది. అటువంటి సమీక్ష నిజమైన అర్థంలో ఫలప్రదంగా మారి, భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది. ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కొన్ని మాసాలు వ్యవధి ఉన్నందున అటువంటి చర్చలు నిర్మాణాత్మకమైన రీతిలో జరుగగలవని ఆశించాలి.

మొత్తం మీద ఇటువంటి సమీక్షలకు కొంగరకలాన్ సభ ఒక ప్రాతిపదిక అవుతున్నది. అది ఆహ్వానించవలసిన విషయం. కేసీఆర్ ప్రసంగం, సభలో పంచిన కరపత్రం కలిపి వ్యవసాయం, తత్సంబంధిత రంగాలు, వృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికాభివృద్ధి, విద్య-వైద్యం, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధులు, మానవాభివృద్ధి, కమ్యూనికేషన్ల అభివృద్ధి మొత్తం మీద ఆర్థికాభివృద్ధి గురించి ప్రస్తావించాయి. ఈ పనులు జరుగటం కొన్ని పూర్తికాగా కొన్ని వేర్వేరు దశలలో ఉన్నట్లు పేర్కొన్నాయి. మూడవది, తిరిగి అధికారానికి వచ్చినట్లయితే ఏమి చేయగలమన్నది. మరొక మాటలో చెప్పాలంటే అది ఎన్నికల మ్యానిఫెస్టో అన్నమాట. అట్లా అనిదానికి ఒకరూపంలో ప్రకటించలేదు. ఆ పని ఈ దశలో చేయటం జరిగేది కాదు కూడా. కాకపోతే, ఉదాహరణకు, పింఛన్లు ఇప్పటికన్నా మరికొంత పెం చటం, నిరుద్యోగ భృతి విషయం పరిశీలించటం వంటి రేఖామాత్ర సూచనలు ముఖ్యమంత్రి ప్రసంగంలో ఉన్నాయి. ఇటువంటివి ఇప్పుడు చెప్ప టం సమంజసం కాదని, ముఖ్యమంత్రి అయిన తాను వాటినిక్కడ ప్రకటిస్తే అమలు చేయవలసి ఉంటుందని, కనుక మళ్లీ అధికారానికి వస్తే ఇటువంటివి ఏమేమి చేయగలమన్నది కేశవరావు నాయకత్వాన ఏర్పడే ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ విచారించగలదని నర్మగర్భంగా చెప్పారాయన. ఎన్నికల గురించిన రాజకీయ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర క్యాబినెట్ తనకు ఇప్పటికే అప్పగించిందని, రాజకీయ నిర్ణయాలు త్వరలోనే ఉం డగలవని కూడా అన్నారు.
Ashok
ఇదంతా ఆర్థికాభివృద్ధికి, సంపదల పంపిణీకి సంబంధించిన విష యం కాగా గత నాలుగేండ్లలో జరిగిన ఒక ముఖ్యమైన పరిణామాన్ని కేసీఆర్ విస్మరించారు. అది, తెలంగాణ ప్రజలలో గతంలో ఎన్నడూలేని రీతిలో ఆత్మగౌరవ భావనలు పెంపొందటం. అటువంటి భావనలు పెం పొందటానికి సొంత రాష్ర్టాన్ని సాధించుకోగలగటం ఎంత ఆధారమో, ఆర్థిక-రాజకీయ సాంస్కృతిక-సామాజిక రంగాల్లో నిలదొక్కుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని సాధించటం కూడా అంతటి ఆధారమవుతున్నది. సొం త రాష్ట్రం ఏర్పడినా ఈ రంగాలలో నిలదొక్కుకోవటం జరుగనట్లయితే ఆత్మవిశ్వాసం కలిగేది కాదు. రాష్ర్టాన్ని తెచ్చుకున్న దాని ఫలితం ఏమిట నే ప్రశ్నలు తలెత్తి ఉండేవి. కాని ప్రబుత్వం ఒక పద్ధతి ప్రకారం రాష్ర్టాన్ని పట్టుదలతో ముందుకు తీసుకువెళుతున్న దాని ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ఆధారాలు లభ్యమవుతాయి. అవన్నీ మెటీరియల్ ఆధారాలు. కేవలం ఊహలు కాదు.

నాలుగవ విషయం తమిళనాడుతో తెచ్చిన పోలిక. ఇందులో కేసీఆర్ ఉద్దేశం స్పష్టంగా రాజకీయమైనది, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్నది, రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను గురిచేసుకున్నది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో ఓడిన తర్వాత యాభై ఏండ్లుగా అధికారానికి రాలేకపోయింది. వారికి అటువంటి దుస్థితి ఏర్పవటానికి కారణం అక్కడి ద్రవిడుల ఆత్మగౌరవ ఉద్యమం. అందులో అక్కడి భాష, సంస్కృతి, ఉత్తరాది ఆధిపత్య వ్యతిరేకత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆకాంక్షలు, వివిధ స్థానిక వివక్షల పట్ల ప్రతిఘటనలు కలగలసి ఉన్నాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అనే మరొక జాతీ య, లేదా ఉత్తరాది పార్టీ అక్కడ అడుగుపెట్టలేకపోవటానికి, పార్టీ ఏదైనా ద్రవిడులదే అధికారం కావటానికి వెనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి. వందల ఏండ్ల ద్రవిడ సంస్కృతి, చరిత్ర, వివిధ ఉద్యమాలు దేశ స్వాతంత్య్రానంతరం కూడా ఆ కారణాలను అట్లా నిలిపి ఉంచుతున్నాయి. కేసీఆర్ మనస్సులో ఇదంతా ఏ మేరకు ఉన్నదీ మనకు తెలియదు గాని, ఆధునికార్థంలో ఫెడరలిస్టు భావనలు ఉన్నాయన్నంత వరకు మాత్రం చెప్పగలం. ఎందుకంటే, కేంద్రపు అనవసర ఆధిపత్యం లేని సహకార ఫెడరలిజం గురించి ఆయన ఇటీవలికాలంలో ఇతరత్రా కూడా మాట్లాడుతున్నారు. ఫెడరలిజానికి అన్నింటికన్నా ముఖ్యమైన ప్రాతిపదిక రాజకీయమైనది. అది ఆయా ప్రాంతాలను ప్రాం తీయ రాజకీయ-ఆర్థిక-సామాజిక శక్తులు తామే పరిపాలించుకోవటం. ఫెడరలిజం మాట రాజ్యాంగంలో ఉన్నప్పటికీ దాని అమలులో విఫలమైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టాలను పాలించరాదనటం కేసీఆర్ ఉద్దేశమైతే ఆక్షేపించవలసింది లేదు.

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles