కృతజ్ఞతలు

Thu,September 6, 2018 12:00 AM

తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహించిన తెలంగాణ బీసీ ఇంజినీర్స్ ఫెడరేషన్ (టీబీసీఈఎఫ్) తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. విద్యుత్ ఇంజినీర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే విద్యుత్ వ్యవస్థ మెరుగు కోసం, పనితీరులో అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కృషిచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉండే డైరెక్టర్లలో బీసీ వర్గాల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి గత నాలుగేండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నది. బీసీ ఇంజినీర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు పాలనాధక్షుడు, సేవాతత్పరుడు అయిన జీ పర్వతం గారిని తెలంగాణ విద్యుత్ సంస్థలో ఒక డైరెక్టర్‌గా నియమించటం హర్షణీయం. తెలంగాణ బీసీ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా జీ పర్వతం నిలిచి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. జీ పర్వతం నియామకానికి పెద్ద మనసుతో సహకరించిన సీఎండీ ప్రభాకర్ రావు గారికి, సీఎం కేసీఆర్ గారికి బీసీ ఇంజినీర్స్ తరఫున కృతాజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం.
- దేవళ్ల సమ్మయ్య, తెలంగాణ బీసీ ఇంజినీర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు

కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలె

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేప థ్యంలో కాంగ్రెస్ పార్టీ అమలు నోచుకో ని హామీలన్ని ఇస్తున్నది. ఇందులో భాగంగానే ఒకింటిలో ఇద్దిరికి పింఛన్లు, ఇంటి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితం లాంటి ఎన్నో అమలుకు నోచు కోని హామీలన్ని ఇస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఇవన్నీ పథకాలు గుర్తు రాలేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోనే తీసుకొని దానినే అనుకరిస్తున్నట్లు స్పష్టంగా అర్థ మవుతున్నది. ఇది సరైంది కాదు. కాంగ్రె స్ ఇకనైనా తన బుద్ధిని మార్చుకోవాలి. లేకుంటే ప్రజలు విశ్వసించరు.
- పుల్కం సపంత్, రాములపల్లె, పెగడపల్లి

278
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles