అంతఃకరణశుద్ధితో ఆడబిడ్డల సంక్షేమం

Thu,August 9, 2018 12:23 AM

అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సురక్షితంగా సంచరించగలిగినప్పుడే నిజమైన స్వేచ్ఛ అన్నారు మహాత్మాగాంధీ. హిందీలో తండ్రిని బాపు అంటరు. తెలంగాణల కూడా తండ్రిని బాపు అనే పిలుస్తరు. ఆడపిల్లల సంరక్షణ బాధ్యతను వహించిన తండ్రి హృదయాన్ని కేసీఆర్‌లో చూస్తున్నాం. బాపూజీ కలలు నెరవేర్చే మా అందరి బాపు కేసీఆర్ అని నేటి మహిళలు భావిస్తున్నారు.

మన దేశంలో స్త్రీలను మనం వంటింటికి పరిమితం చేసి నం. ఇవి ఆడవాళ్లు చేసే పనులు, ఇవి మగవాళ్లు చేసే పనులు అనే దిక్కుమాలిన విభజన ఒక్క మన దేశంలో నే ఉన్నది. దేశంలో సగం జనాభా శక్తియుక్తులను అణిచివేస్తున్నం. ఈ ధోరణి దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు. ఏ సమాజంలో మహిళలకు సమానమైన గౌరవం, సాధికారత లభిస్తాయో ఆ సమాజం మాత్ర మే గొప్ప సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళల అభివృద్ధి పట్ల ఉన్న దృక్పథానికి అద్దంపట్టిన మాటలివి. సంప్రదాయిక మూలాలను గౌరవిస్తూనే, ఆధునిక ధోరణులను ఆహ్వానించే విలక్షణ నాయకుడు సీఎం కేసీఆర్.

కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విలువైనవి. మన దేశంలో స్త్రీలు గర్భం దాల్చిన దశలోనూ కూలీ పనుల కు వెళ్తున్నారు. ఇది గర్భస్థ శిశువుకు, తల్లికి ప్రమాదకరం. గర్భిణీ పొట్ట పోసుకునేందుకు శ్రమిస్తున్నది. ఇది మన వ్యవస్థలోని అమానుష పరిస్థితికి నిదర్శనం. ఆ సమయంలో స్త్రీలకు పూర్తి విశ్రాంతి కావాలి. అది వాళ్ల కు సమాజం కల్పించవలసిన హక్కు. గర్భిణీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. తెలంగాణ ప్రభుత్వం స్త్రీల పట్ల చాలా మానవీయంగా ఆలోచిస్తున్నదనడానికి కేసీఆర్ కిట్ పథకం ఒక ఉదాహరణ. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు ప్రభుత్వం మూడు విడుతల్లో రూ. 12,000 అందిస్తున్నది. పుట్టింది ఆడపిల్ల అయితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నది. ఆడపిల్ల వెంట ఇంటికి సౌభాగ్యం నడిచొస్తుందని ప్రభుత్వం ప్రతీకాత్మకంగా చాటుతున్నది.

వైద్యరంగం ఎంతో అభివృద్ధిని సాధించిన ఈ కాలంలో ఇంకా ప్రసూ తి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవ సమయంలో అయ్యే ఖర్చుకు భయపడి పేద స్త్రీలు ఇంటిలోనే ప్రసవిస్తున్నారు. నాటు పద్ధతులను ఆశ్రయించి ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటున్నారు. దవాఖానల్లో ప్రసవం అయ్యేవారికి ఏదైనా ప్రోత్సాహకం ఉండాలనే ఆలోచనలోంచే కేసీఆర్ కిట్ పథకం రూపొందింది. అమ్మకు ఆత్మీయంగా, బిడ్డకు ప్రేమతో అనే వాక్యం రాసి ఉండే కేసీఆర్ కిట్ ఒక మమకార మహాకావ్యం. కేసీఆర్ కిట్‌లో చంటి పిల్లలు ఆడుకునేందుకు ఇచ్చిన గలగల పేదల ఇండ్లల్లో సందడిగా మోగుతున్నది.

అమ్మఒడి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభుత్వం అంబులె న్సు సేవలను ప్రవేశపెట్టింది. అది కాకులు దూరని కారడవైనా, చీమలు దూరని చిట్టడివైనా సరే 102కు ఫోన్ చేస్తే చాలు. ప్రత్యేక సదుపాయాలు న్న అమ్మఒడి వాహనం వస్తుంది. సురక్షితంగా ఇంటినుంచి దవాఖాన కు, దవాఖాన నుంచి ఇంటికి చేరుస్తుంది. కేసీఆర్ మనసు కారుణ్యంతో నిండి ఉంటుంది , మాట నిక్కచ్చిగా ఉంటుంది. అందుకే ఆయన పాలన మానవీయ పరిమళాలను వెదజల్లుతున్నది. బిడ్డ కడుపులో పడ్డప్పటినుం చి, తల్లికి బిడ్డకు పౌష్టికాహారం ఇచ్చే పథకం ఆరోగ్యలక్ష్మి. గోధుమలు, గుడ్లు, పాలపొడి, ఇంకా కొన్ని ఆహారపదార్థాలు నిండిన ప్యాకెట్లను అం గన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. ఇదివరకు 15 గుడ్లు మాత్రమే ఇచ్చేవారు. ఆడబిడ్డలను అర్దాకలికి గురిచెయ్యడం కేసీఆర్ సర్కార్‌కు సుతరాము నచ్చదు కదా. అందుకే రోజుకొకటి చొప్పున నెలం తా 30 గుడ్లు ఇస్తున్నది. గుడ్లతో పాటు పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, తృణధాన్యాలతో చేసిన ఫలాహారాలూ ఇస్తున్నది.

హాస్టళ్లలో పిల్లలకు ఆహారం కొలిచి పెట్టడం ఏమిటి? ఇది ముఖ్యమం త్రి కేసీఆర్ వేసిన ప్రశ్న. ఈ ప్రశ్న ఇప్పటివరకు ఏ పాలకుడన్నా వేసుకున్నాడా? జవాబు వెతికిండా? ఇది అంత:కరణ శుద్ధితో పాలించేవాళ్లు మాత్రమే వేసుకోగలిగిన ప్రశ్న. తెలంగాణ హాస్టళ్లలో పిల్లలకు కొలిచి, తూకంవేసి ఆహారం పెట్టే దౌర్భాగ్య పద్ధతి లేదు. కేసీఆర్ దీన్ని తొలిగించి, కడుపునిండా అన్నం పెట్టే అమ్మతనాన్ని అమల్లోకి తెచ్చిండు. ఒంటరి మహిళలకు జీవన భృతిని ప్రకటిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ఒక గంభీరమైన మాట అన్నారు. పేదరికం పురుషులకన్నా స్త్రీలను ఎక్కువ వేధిస్తుంది. అసహాయులను చేస్తుంది. ఆపదల పాలు చేస్తుంది.ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన ఒక స్త్రీ వాదిలా కనిపించిండు. ఈ మాటలను వ్యాఖ్యానిస్తే స్త్రీల దుఃఖం విప్పిచెప్పే ఒక గ్రంథం తయారవుతుంది. వితంతువు లు, ఒంటరి మహిళలు అసహాయతకు లోనుకాకుండా 1000 రూపాయ ల భృతి ఆసరాగా నిలుస్తున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన వ్యవసాయ సంక్షోభం తెలంగాణ స్త్రీల జీవితాల మీద చాలా ప్రభావం చూపించింది. కుటుంబ పోషణ భారం పురుషులతో పాటూ స్త్రీలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లా ల్లో అట్టడుగువర్గాల స్త్రీలు, అగ్రవర్ణాల్లోని పేద మహిళలు బీడీలు చుట్టి కుటుంబాలను పోషిస్తున్నారు. అమానుషమైన దోపిడీకి లైంగిక వేధింపుల కు గురవుతున్నారు. తంబాకు వాసన పీల్చి రోగాల పాలవుతున్నారు. అయినా పొట్టకూటి కోసం పంటి బిగువున బాధలన్నీ భరిస్తున్నారు. బీడీ కార్మికులు కొన్ని దశాబ్దాలుగా హక్కుల కోసం అంగలార్చారు. ఏ ప్రభుత్వమూ కనికరించలేదు. బీడీ కార్మికుల కన్నీళ్లు తుడిచిన ఒకే ఒక్క పాలకు డు కేసీఆర్. ధర్నాలు, సమ్మెలు చేయకుండానే బీడీ కార్మికులకు 1000 రూపాయల జీవనభృతి లభించింది. ప్రభుత్వ ఎజెండాలో పేద మహిళల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఉంటుందనే నమ్మకాన్ని కేసీఆర్ ఈరోజు కలిగించారు.

కేసీఆర్ వరంగల్ జిల్లాలో ఒక లంబాడి తండాలో పల్లె నిద్ర చేస్తున్నప్పుడు, ఒక గిరిజన రైతు ఆడపిల్ల పెండ్లి కోసం దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ రైతు లబోదిబోమంటూ కేసీ ఆర్‌కు మొరపెట్టుకున్నడు. కేసీ ఆర్ ఆ రోజు ఆ రైతును ఆదుకున్నాడు. ఆ సంఘటన నేప థ్యంలో నుంచే కల్యాణలక్ష్మీ పథకానికి బీజం పడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత అది ఫలించింది. ఈ రోజు పేద ఆడపిల్లల పెండ్లికి కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా ప్రభుత్వం 1,00,116 రూపాయలు ఇస్తున్నది. ఈ మొత్తం ఆదివాసీల, గిరిజనుల ఇండ్లల్లో జరిగే సాంతం పెండ్లి ఖర్చులకు సరిపోతున్నది. కేసీఆర్ చెప్పిన ట్టు కళ్యాణలక్ష్మీ చెక్కులు తీసుకుంటూ ఆడపిల్లల తల్లులు చెమర్చిన కళ్ళ తో తెలంగాణ ప్రభుత్వాన్ని దీవిస్తున్నరు కళ్యాణలక్ష్మీ చెక్కులు తల్లికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వ నిబంధన. ఎందుకంటే తప్ప తాగి పిల్లలకు అన్యాయం చేసే తండ్రులున్నారు కానీ తల్లులు లేరు కదా!
Sridhevi
అంగన్వాడీ టీచర్లను ప్రగతిభవన్‌కు పిలుచుకొని, వారి సాధకబాధకాలను శ్రద్ధగా విని, వారి వేతనాన్ని పెంచి వారిపట్ల తనకున్న గౌరవాన్ని కేసీఆర్ ప్రకటించిండు. వారిని వర్కర్లు అని కాకుండా టీచర్లు అని పిలువాలని ఆదేశించిండు. ఎస్సీ కులాల ఆడపిల్లలు ఉన్నత చదువుల కోసం నగరాలకు వస్తే, వారికి అద్దెకు గదులివ్వని సంకుచిత సమాజం మనది. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ డిగ్రీస్థాయిలోనూ ఎస్సీ బాలికలకు హాస్టళ్లు ప్రారంభించిండు. కేసీఆర్ సర్కారు స్త్రీల సమస్యలను ఎంతో సూక్ష్మంగా గ్రహిస్తున్నదనడానికి ఇదొక ఉదాహరణ.

మహిళల భద్రత కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. షీ టీమ్స్ కృషితో వేధింపులు తగ్గుతున్నాయి. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సురక్షితంగా సంచరించగలిగినప్పుడే నిజమైన స్వేచ్ఛ అన్నారు మహాత్మాగాంధీ. హిందీలో తండ్రిని బాపు అంటరు. తెలంగాణల కూడా తండ్రిని బాపు అనే పిలుస్తరు. ఆడపిల్లల సంరక్షణ బాధ్యతను వహించిన తండ్రి హృదయాన్ని కేసీఆర్‌లో చూస్తున్నాం. బాపూజీ కలలు నెరవేర్చే మా అందరి బాపు కేసీఆర్ అని నేటి మహిళలు భావిస్తున్నారు.
(వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి మహిళా ప్రతినిధి)

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles