దేశానికి దిక్సూచిగా రైతుబంధు

Thu,July 12, 2018 02:01 AM

RythubanduNews

ఇప్పుడున్న వ్యవసాయ పథకాల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూబీఐ పథకం వల్ల నిధుల సార్థకత జరిగి ఆదాయం పెంపు జరుగుతుంది. నన్ను ఒక ప్రశ్న తరచుగా అడుగుతుంటారు. ఆర్థికసర్వేలోని తొమ్మిదవ అధ్యాయం (మహాత్మాతో, మహాత్మాలో సంభాషణ) మూలంగా సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (Universal Basic Income-UBI) ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. కానీ దీన్ని విధానకర్తలు పరిగణనలోకి తీసుకున్నారా? అనే ప్రశ్న తరచు వినిపిస్తున్నది. ఒక క్లిక్‌తో (క్యాష్ ట్రాన్స్‌ఫర్) కాకున్నా ఒక్క పెట్టున పేదరికాన్ని నిర్మూలించడానికి యూబీఐ పథకం ఒక అవకాశమని ఆర్థిక సర్వే అభిప్రాయపడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూబీ వంటి రైతు బంధు పథకాన్ని కొంత సవరించి, సంసిద్ధంచేసి, సహకారంతో ప్రవేశపెడితే పేదరిక నిర్మూలనకు ఒక అవకాశం లభిస్తుంది. ఈ రకమైన పథకం రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గిస్తుంది. ఇదొక సామాజిక పథకమే కాకుండా వ్యవసాయ పథకం కూడా అవుతుంది.

అంటే యూబీఐని దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అనే ప్రశ్న కూడా ఇందులో ఉన్నది. నా జవాబు- అవును చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం పిండ దశలో ఉన్న యూబీఐ వంటిదే. (పాక్షి క సార్వత్రిక ప్రాథమిక ఆదాయ పథకం- (Quasi universal Basic Income-Qubi) కూడా కాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం భవిష్యత్తులో భారతదేశ వ్యవసాయ విధానంగా కూడా మారవచ్చు. ఈ రెండింటి గురించి మరిం త వివరంగా చెబుతా.
ఆర్థికసర్వే స్పష్టం చేసినట్టు.. మన దేశంలో ప్రాథమిక ఆదాయం అందరికీ అందించడం జరుగదు. మన దేశ రాజకీయాలు ప్రభుత్వం ధనవంతులకు చెక్కులు ఇవ్వడాన్ని ఆమోదించవు. అయితే ఉన్నతవర్గాలకు మినహా మిగతా అందరికి ప్రభుత్వం నగదు బదిలీచేసే విధానం పరిశీలించవచ్చు. ఇదే పాక్షిక సార్వత్రిక ప్రాథమిక ఆదాయ పథకం.

సులభంగా గుర్తించదగిన ప్రాతిపదిక పరిధిలోకి వచ్చే వారందరికి నగదు బదిలీ చేయడమే క్యూబీ. సులభంగా గుర్తించదగిన విభాగంలో ఉండే వారందరికి ఇవ్వడమన్నమాట. రైతుబంధు పథకంలోకి భూమి ఉన్న రైతులు అందరూ వస్తారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని భూ రికార్డుల ప్రక్షాళన చేసింది కనుక ఈ భూమి ఉన్న వారు అనే ప్రాతిపదికను తీసుకోవడం సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనను వివాదాలకు తావులేకుండా, తక్కువ వ్యవధిలో ఎంతో చక్క గా చేసింది.

అయితే రైతుబంధు పథకాన్ని సామాజిక పథకంగా చూస్తే ఒక అవాంఛనీయ లక్షణాన్ని కలిగి ఉన్నది. భూ కమతాల పరిమాణాన్ని బట్టి చెల్లింపులుంటాయి కనుక తిరోగమనమైంది అవుతుంది. (అందుకే ఈ పథ కం నుంచి పెద్ద రైతులను మినహాయించాలనే ఒత్తిళ్ళు). ఇందుకు భిన్నం గా స్వచ్ఛ యూబీలో- అన్ని కుటుంబాలకు ఒకే మొత్తం చొప్పున సొమ్ము ఇస్తే ప్రగతిశీల పథకం అవుతుంది. అదే నగదు పేదలకు ఎక్కువ అవుతుంది, ఆదాయం పెరిగే కొద్దీ ఆయా వర్గాలకు తగ్గిస్తూ ఇచ్చినట్టవుతుంది.
కర్ణాటక కూడా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నది. ఇతర రాష్ర్టాలు కూడా ఇదే బాటలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భూ కమతాల ప్రక్షాళన ఒక పెద్ద సవాలు. అయితే రాష్ర్టాలు ఈ బాటలో ముందుకు కదులుతున్నాయి. అయితే రైతుబం ధు పథకం అనేది వ్యవసాయాన్ని బాగుపరుచడానికి ఉద్దేశించిందే తప్ప, సామాజిక విధానం కాదు. ఈ కోణంలో చూస్తే ఇదొక వ్యవసాయ విధా నం. ఈ కోణంలో ఒకసారి ఆలోచించి చూడండి. వ్యవసాయానికి ఇప్పు డు ఇస్తున్న మద్దతు ఏ విధంగా ఉన్నదో ఆలోచించండి.

ప్రస్తుతానికి అనేక రకాలైన పథకాలున్నాయి. వానలు పడక పంటలు దెబ్బతింటే పంట బీమా, రుణమాఫీ వంటి పథకాలున్నాయి. పంటలు బాగా పండితే ధర ఉండదు కనుక కనీస మద్దతు ధర- సేకరణ, ధర తగ్గుదల పథకాలున్నాయి. పంట పండటంతో నిమిత్తం లేకుండా పెట్టుబడి (ఎరువులు, విత్తనాలు, కరెంటు, నీరు)పై సబ్సిడీలు అనేక రకాలు గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి పథకాలకు అదనంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది కనుక ఆర్థికంగా నిలువలేకపోవచ్చు. అయితే ఇప్పుడున్న పథకాల స్థానంలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్టయితే కొన్ని కీలకమైన ఉపయోగాలు ఉంటాయి. అవి- మంచివో చెడ్డవో, ఈ పథకాల ను ఆవరించుకొని ఉన్న- పరిపాలనాపరమైన ఆర్థికపరమైన భారం, అవినీతి, అసమర్థత మొదలైన జాడ్యాలను వదిలించుకున్నట్టవుతుంది. వ్యవసాయ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ధాన్యాల అధిక ఉత్పత్తి (బియ్యం కుప్పలు పురుగులు పట్టిన గుట్టలుగా మారాయి) నీళ్ళు, ఎరువులు ఎక్కువ వాడకం వంటి పెడ ధోరణులు పోతాయి.

నగదు బదిలీ పెంచడం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని వేగంగా, భారీగా పెంచవచ్చు. ఉదాహరణకు- పంజాబ్‌లో ఎరువుల, కరెంటు సబ్సిడీ ఎత్తివేస్తే, ఆ సొమ్ముతో ప్రతి సాగుదారుకు 92 వేలు లేదా ప్రతి వ్యవసాయ కూలీకి యాభై వేల రూపాయలను అందించవచ్చు. 2013 లెక్కల ప్రకారం- పంజాబ్‌లో సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం లక్షన్న ర. ఈ లెక్కన ఒక కుటుంబానికి ఎంత మొత్తం ముడుతున్నదో పోల్చి చూసుకోవచ్చు. రైతుబంధు వంటి పథకాలను ఇతర రాష్ర్టాల్లో చేపట్టడా నికి కొంత ప్రయత్నంతో పాటు సమయం పట్టవచ్చు. అయితే ముందు గా భూ రికార్డుల ప్రక్షాళన జరుపాలె. దీన్ని వ్యవసాయ పథకంగా ప్రవేశ పెట్టాలా లేక సామాజిక పథకంగానా అనేది నిర్ణయించాలె. ఎకరానికి ఇంత మొత్తం అనే వ్యవసాయ విధానం హేతుబద్ధమైనది. కానీ దీన్ని సామాజిక విధానంగా చూస్తే మాత్రం కొంత పునరాలోచించుకోవాలె. మరింత ప్రగతిశీలమైన దానిని ప్రవేశపెట్టవచ్చు. ఉదాహరణ-రైతు అయి ఉంటే చాలు, ప్రతి కుటుంబానికి ఒకే మొత్తం ఇవ్వడం. వ్యవసాయం ద్వారా ఆదా యం పొందేవారంతా భూ యజమానులు కారు.
Aravind
అం దు వల్ల సాగుదారులు అందరిని ఈ పరిధిలోకి తేవడం ప్రధానం. రైతుబంధు ప్రకారం- మార్కెట్ శక్తుల మూలంగా భూ యజమానికి వచ్చిన ఆదాయం కొంత వ్యవసాయ కూలీకి చేరి లబ్ధి కలిగిస్తుందనే ఆశాభావం ఉంది. కానీ ఇది అంత ప్రభావవంతంగా జరుగకపోవచ్చు. భిన్నవర్గాలు తమకు తోడ్పాటు అందించాలనే ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు- భిన్నరకాల రైతులు తమకు భిన్నమైన తోడ్పాటును కోరుతారు. నీటి పారుదల ఉన్న, వానలపై ఆధారపడిన భూములున్నా వారు తమ కు భిన్నమైన తోడ్పాటు కావాలంటారు. దీనివల్ల ఒక్కో నిర్దేశిత వర్గాన్ని గుర్తిస్తూ తోడ్పాటు అందించవలసి వస్తుంది. దీనివల్ల జీఎస్టీ మాదిరిగా పథకాలు సంక్లిష్టంగా మారుతయి. అటువంటి కోరికలను పక్కన పెట్టాలె. అంతిమ సవాలు లేదా అవకాశం ఏమంటే- రైతుబంధు వంటి పథకాలను సహకార సమాఖ్య స్వరూపంలో జరుగాలె. కేంద్రం నిధులు ఇస్తే, రాష్ర్టాలు అమలుచేస్తాయి. ఈ విధంగా పరస్పర పూరకంగా ఉంటా యి. కేంద్ర రాష్ర్టాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించవచ్చు. ఉదాహరణకు- కేంద్రం ఎరువుల సబ్సిడీని తగ్గించడం ద్వారా- ఈ పథకానికి ఆర్థిక చేయూత ఇవ్వవచ్చు. భిన్నరకాల పథకాలను ఏకం చేసి వాటిని తమకు అనువైన రీతిలో ఉపయోగించుకునే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు క్యూబీ పథకాన్ని ప్రవేశపెట్టుకోవచ్చు.

ఒక క్లిక్‌తో (క్యాష్ ట్రాన్స్‌ఫర్) కాకున్నా ఒక్క పెట్టున పేదరికాన్ని నిర్మూలించడానికి యూబీఐ పథకం ఒక అవకాశమని ఆర్థిక సర్వే అభిప్రాయపడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూబీ వంటి రైతుబం ధు పథకాన్ని కొంత సవరించి, సంసిద్ధంచేసి, సహకారంతో ప్రవేశపెడితే పేదరిక నిర్మూలనకు ఒక అవకాశం లభిస్తుంది. ఈ రకమైన పథకం రైతు ల ఆదాయాన్ని పెంచుతుంది. వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గిస్తుంది. ఇదొక సామాజిక పథకమే కాకుండా వ్యవసాయ పథకం కూడా అవుతుంది.
(వ్యాసకర్త: భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు)
(ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో...)

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles