హరితంలో కీలకం ఇద్దరు

Thu,July 12, 2018 12:59 AM

పలు అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించే వారు పార్టీలలో, వాటికి బయట లెక్కలేనంత మంది ఉన్నారు. అది వారి స్వేచ్ఛ. కానీ వారంతా తమ సమాజం కోసం, ప్రకృతి కోసం ఉపయోగపడే మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కాకపోవటం ఎందువల్లనో బోధపడదు. ఆ కార్యక్రమం తగిన ఫలితాలనిస్తే ఆ పేరు ప్రభుత్వానికి పోతుందని, కనుక తాము పాల్గొనకూడదని, ఇంకా చెప్పాలంటే ఆ కార్యక్రమం విఫలమై ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని భావిస్తున్నారే మో తెలియదు.

తెలంగాణ ఆకుపచ్చగా మారటంలో కీలకపాత్ర ఇద్దరిది. ఒకటి సంబంధిత యంత్రాంగం. రెండు ప్రజలు. ఇప్పటికి మూడు విడుతలు జరిగిన హరితహారం కార్యక్రమంలో వీరిద్దరు తమ పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఉన్నట్లయితే మూడుసార్లు కలిసి నాటిన సుమారు 82 కోట్ల మొక్కలలో 75 శాతం లెక్కల 62 కోట్ల వరకు బతికి ఉండాలి. వాస్తవంగా ఉన్నవి అంతకన్న చాలా తక్కువ అన్న ది అనుమానం. త్వరలో మొదలుకానున్న నాలుగవ విడుత హరితహారంలోనైనా ఈ రెండు వర్గాలు తగు శ్రద్ధ చూపాలి.

హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న సమీక్ష జరుపుతూ పట్టువదలని విక్రమార్కుని వలె కొన్ని విషయాలు మళ్లీ చెప్పారు. అవన్నీ గత మూడు హరితహారల సందర్భంగా చెప్పినవే. కానీ అవి అధికార యంత్రాంగానికి, మన పౌర సమాజానికి ఎంతగా మనసున పట్టాలో అం తగా పట్టడం లేదు. అది ఆశ్చర్యం కలిగిస్తున్నది. ముఖ్యమంత్రి చెప్తున్న మాటలలో అర్థం కానీ మిస్టరీ, ఆల్జీబ్రా లెక్కలు ఏమీ లేవు. అయినప్పటి కీ వారు వాటిని అర్థం చేసుకొని వ్యవహరించకపోవటం విచారకరమైనది కూడా. అంతటా చెట్లు బాగా పెరుగటం, అడవులు దట్టంగా, విస్తారంగా ఉండటం ఎందువల్ల అవసరమో ఎవరూ ఎవరికీ చెప్పవలసిన విషయం కానే కాదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి అధికారుల సమావేశాలలోనే గాక, బహిరంగ కార్యక్రమాలలో ప్రజలకు పదేపదే వివరిస్తూనే ఉన్నారు. వానలు, చెట్లు, పర్యావరణంతో నిమిత్తం లేని సందర్భాలలో కూడా ఏదో ఒక మిషతో ఆ ప్రస్తావనలు తెస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం, సాధారణ పౌరులు చూపవలసిన శ్రద్ధ ఎందుకు చూపటం లేదు?

చెట్లు ఎక్కడైనా అవసరమే కాగా, తెలంగాణ వంటి ప్రాంతంలో చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి మాటలలోనే చెప్పాలంటే పచ్చదనం శాతం 33 వరకు ఉండవలసి రాగా, ఉన్నది సుమారు 20 శాతం. ఉండవలసిన అడవులు 24 శాతం కాగా ఉన్నవి అందులో సగం. ఒకప్పుడు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ శాతాలు ఉండేవి. తర్వాత దారుణంగా పడిపోయాయి. అందుకు బాధ్యత ఎవరిదో ఇక్కడ మరొకమారు చెప్పుకోవలసిన అవస రం లేదు గాని, అందువల్ల కలుగుతున్న నష్టాలన్నీ అందరికీ కళ్ల ఎదుట కన్పిస్తున్నాయి. కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ పరిస్థితి మారాలనటంలో అధికార యంత్రాంగానికి గాని, సామాన్య ప్రజానీకానికి గాని భిన్నాభిప్రాయం ఉండదు. అటువంటి స్థితిలో వీరు తగిన శ్రద్ధ చూపకపోవటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ వైఖరి ఎట్లా మారాలి?

సర్వసాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు అధికారంలో గలవారికి తగిన స్పృహ, శ్రద్ధ లేక దెబ్బతింటుంటాయి. తగు ఏర్పాట్లు జరుగక అరకొరగా మిగులుతాయి. అదొక మొక్కబడి వ్యవహారంగా మిగులుతుంది. ఇటువంటి ధోరణిని గమనించినందువల్లనే యంత్రాంగానికి, ప్రజలకు విశ్వాసం ఏర్పడదు. అందువల్ల భాగస్వామ్యం కూడా ఉండదు. అందువల్లనే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన వన మహోత్సవాలు ఒక ఆడంబరాలు పండుగవలె జరిగి ముగిసిపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త స్థితి కన్పిస్తున్నది. హరితహారం అవసరం గురించి అందరికీ మనస్సులలో నాటుకుపోయేట్లు చెప్పేందుకు విస్తృత ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రమంతటా వందలాది నర్సరీలలో కోట్లాది మొక్కలు తయారవుతున్నాయి. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నాటేవిగాక, ఉచితంగా మొక్కల పంపిణీ ద్వారా పౌరులను భాగస్వాము లు చేసేందుకు గట్టి ప్రయత్నాలు వర్షాకాలపు సీజన్ పొడవునా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర బాధ్యులూ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వటంతో పాటు చిన్నచిన్న హెచ్చరికలు కూడా చేస్తున్నారు. బాగా పనిచేసినవారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. స్వయంగా ముఖ్యమం త్రి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కార్యక్రమానికి ఎక్కడా నిధు ల కొరత లేకుండా చూస్తున్నారు.

అయినప్పటికీ పరిస్థితి ఈ ప్రయత్నాలకు తగినట్లు సంతృప్తికరంగా లేకపోవటం ఎందువల్ల? ఫలితాలు రావటం లేదని కాదు. రాష్ట్రం ఏర్పడటానికన్న ముందుతో పోల్చితే తగినంత తేడా కన్పిస్తున్నది. అయినప్పటికీ అది ప్రయత్నాలతో పోల్చదగినది కాదు. అదేవిధంగా ప్రజలలో, పిల్లలలో పచ్చదనం పట్ల స్పృహ క్రమంగా పెరుగటం కూడా కన్పిస్తున్నది. అయినప్పటికీ ఇవన్నీ ఇంకా ఆశించిన స్థాయిలో లేవు. అవి వారి భాగస్వామ్యంలో ఇంకా తగినంత ప్రతిఫలించటం లేదు. అధికార యంత్రాంగపు స్ఫూర్తి అంతకన్న తక్కువగా ఉంది. వారు వేతనాలు తీసుకునే ఉద్యోగులుగా యాంత్రికంగా భాగస్వామ్యం ఉంటున్నది గాని, నిజమైన స్ఫూర్తి చూపటం లేదు. లేనట్లయితే మూడు విడుతల హరితహారం, 82 కోట్ల మొక్కలు నాటడం జరిగిన తర్వాత వాటిలో 90 శాతం వరకైనా బతికి ఉండి పచ్చదనం చాలా వచ్చేది. యంత్రాంగం తన యాంత్రికతను పోగొట్టుకోవటం తాము తెలంగాణ పౌరు లు కూడా అయినందున ఆ స్ఫూర్తితో భాగస్వాములు కావటం, ప్రజలలో కూడా ఈ స్ఫూర్తి, భాగస్వామ్యాలు పెరుగటం ఈ నాలుగవ విడుత నుంచి అయినా తప్పక కన్పించాలి. ఇటీవలి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సంవత్సరం నుంచి ఏటా వంద కోట్ల మొక్కలన్నారు. దానిని బట్టి పచ్చదన పు అవసరం పట్ల ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంత పట్టుదల అని ఆలోచిస్తే అధికార యంత్రాంగం, పౌరులు అర్థం చేసుకోలేని విషయం కాదిది. ఇందులో రాజకీయాలు, ఎవరి స్వార్థాలు ఏమీ లేవు. ఇది స్వచ్ఛమైన రీతిలో సమాజానికి నూరు విధాలుగా ఉపయోగపడే విషయం.
Ashok
అట్లా అనుకున్నప్పుడు, ఆ మాట నిజమే అయినప్పుడు, రాజకీయాలకు, సిద్ధాంతాల కు, ఇతర విభేదాలకు అతీతం గా ప్రతి ఒక్కరు అదే స్ఫూర్తితో భాగస్వాములు కావలసిన కార్యక్రమం హరితహారం. ఉదాహరణకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించే వారు పార్టీలలో, వాటికి బయట లెక్కలేనంత మంది ఉన్నారు. అది వారి స్వేచ్ఛ. కానీ వారంతా తమ సమాజం కోసం, ప్రకృతి కోసం ఉపయోగపడే మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కాకపోవటం ఎందువల్లనో బోధపడదు. ఆ కార్యక్రమం తగిన ఫలితాలనిస్తే ఆ పేరు ప్రభుత్వానికి పోతుందని, కనుక తాము పాల్గొనకూడదని, ఇంకా చెప్పాలంటే ఆ కార్యక్రమం విఫలమై ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని భావిస్తున్నారే మో తెలియదు. ఇతర అంశాల్లో ఇట్లా ఆలోచిస్తే అది వారిష్టం గాని హరితహారం, మిషన్‌కాకతీయ తరహా కార్యక్రమాలను ఆ దృష్టితో చూసే సంకుచితత్వానికి వారు పాల్పడబోరని ఆశించాలి. వాటి పట్ల సానుకూల దృక్పథంతో భాగస్వాములు అయినట్లయితే ప్రజలలో ప్రభుత్వానికే గాక తమకు కూడా మంచిపేరు వస్తుంది. లేనట్లయితే, చెరువుల బాగును, మొక్కల పెంపకాన్ని కూడా సహించలేరా అనే చెడ్డపేరు వస్తుంది.

ఈ సందర్భంగా ఒకమాట చెప్పుకోవాలి. తెలంగాణ పౌరసమాజానికి దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లోని మేధావి, రాజకీయవర్గాల్లో కూడా ఎప్పటినుంచో మంచి గుర్తింపు ఉంది. ఇది ఎంతో చైతన్యవంతమైన సమాజమన్నది వారందరి అభిప్రాయం. అటువంటి గుర్తింపు అర్థం ఆ సమాజం లో పోరాటశీలత ఉన్నదనే కాదు, నిర్మాణాత్మకత కూడా ఉందని. నిర్మాణ దృష్టిలేని పోరాట శీలతకు అర్థం ఉండదు. ఆ రెండు పడుగుపేకల వలె కలిసి సాగినప్పుడే సార్థకత ఉంటుంది. ఎందువల్లనోగాని ఈ దృష్టి 2014 తర్వాత కనిపించవలసినంత స్థాయిలో కన్పించటంలేదు. దీనిపై తెలంగా ణ సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాలి.

450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles