భూగర్భంలో అద్భుత లోకం


Wed,July 11, 2018 12:56 AM

కాళేశ్వరం శివయ్య గంగను వెతుక్కుంటున్నడు. నా గంగను నాకివ్వమని భగీరథుడిని వేడుకుంటున్నడు. దాని ఫలి తమే కాళేశ్వరం ప్రాజెక్టు. నిజమే ఈ ప్రాజెక్టు మానవ అద్భుతం. పాతాళంలో సుందర నాగలోకాలుంటాయని కథలు చెప్పుకున్నాం. సినిమాల్లో చూశాం. ఆ కాల్పనికతను తలదన్నే వాస్తవమే భూగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ, అన్నారం, కర్నెపల్లి, సుందిల్ల, ఎల్లంపల్లి, మానేరు మల్లన్న సాగర్ ల ఝాటలను ముడివేసి కాళేశ్వరుని ఝటాఝాటం నుంచి తిరిగి తెలంగాణ భూమి పైరు పచ్చలను ఆ నీటిలో తడపడమంటే సాకారమైన స్వప్నమే కాళేశ్వ రం ప్రాజెక్ట్. వంద మీటర్ల మేడిగడ్డ నుంచి 540 మీట ర్ల ఎత్తుండే గుండ్ల పోచమ్మ ప్రాజెక్టు వరకు ఎగువ దిశ గా అల్లిన ఈ అల్లిక మానవ సంస్కృతికి, నైపుణ్యానికి, ప్రగతికి, మేధకు, నాయకత్వ నిబద్ధతకు నీరాజనం పడుతుంది.


భూ గర్భంలో దాదాపు 330 మీటర్ల లోతున ప్రాజెక్టు నిర్మాణమంటే అద్భుతాశ్చర్యాలతో కూడుకు న్న విషయమే. దాదాపు 9.5 కి.మీ. పొడవున్న జంట కాలువలు (ట్విన్ టన్నెల్స్) 25 మీటర్ల వెడల్పు, 375 మీటర్ల పొడవు 675 మీటర్ల ఎత్తున్న సర్జ్‌పూల్లను భూగర్భంలో నిర్మించడమంటే ఆశ్చర్యంకాక మరేమి టి? ఈ స్థావరం నుంచి అదే భూగర్భంలో నిర్మింపబడిన 7 పంపుసెట్ల ద్వారా రోజుకు 2 టీఎం సీల నీటిని ఎగువకు పంపించడమంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్లే. ఇంత నీటిని పంపుచేయడానికి కావల్సిన విద్యుత్తు వినియోగ ఏర్పాట్లు కూడా మరో విశేషం.

400/11 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సబ్‌స్టేషన్‌ను నిర్మించాలంటే దాదాపు 60-70 ఎకరాల భూమి కావాలి. భూగర్భంలో ఇది అసా ధ్యం. మరి భూ ఉపరితలంలో నిర్మించి సరఫరా చేయడానికి సాంకేతిక ఇబ్బందులుంటాయి. దీని పరిష్కారమే భూగర్భంలో నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్. ఇందులో మరో విశేషమేమంటే 25 ఏండ్ల వరకు ఈ సబ్‌స్టేషన్‌కు నిర్వహణ ఖర్చులుండవు. ఇలా భూగర్భంలో ఒక సర్జ్‌పూల్, నాలుగంతస్తుల భవంతిగా నిర్మించిన దాంట్లో పంపుసెట్లు, ట్రాన్స్ మిటర్స్, బ్యాటరీస్, విద్యుత్ సబ్‌స్టేషన్, ఇవన్నీ ప్రపంచంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలబెడుతున్నాయి.

కాళేశ్వరం యాత్ర

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు: 1) 18.25 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందించడం. 2) శ్రీరాం సాగ ర్ ఆయకట్టు కింద ఉన్న మరో 18 లక్షల ఎకరాలను స్థిరీకరించడం.3 నదినే రిజర్వాయర్‌గా ఉపయోగించడం.4) తద్వారా 365 రోజులు 150 కి.మీ.ల మేర నదిని సజీవంగా ఉంచడం. 5) నది ద్వారా రవాణాసౌకర్యాలను పెంచడం. 6) మత్స్య పరిశ్రమ అభివృద్ధి.7)టూరిజాన్ని అభివృద్ధి చేయడం. 8)ప ర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం. 9) భూగర్భ జలాలను పెంచడం. 10) సర్వతోముఖమైన సామాజికాభివృద్ధిని సాధించడం. 11) ఈ ప్రాజెక్టులో ఉన్న మరో విశేషం ఉత్తర తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే కాక దక్షిణ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చడం. హైదరాబాద్ దాహార్తిని ఎక్కువగా కృష్ణ జలాలతో తీర్చుకుంటున్నప్పటికీ రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలు కృష్ణ జలాల వల్ల సాధ్యం కాదనప్పుడు గోదావరి జలాలను వినియోగించుకోవాలన్న ముందుచూపున్న నాయకత్వం ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం.
Vijaynthi
దాదాపు 40 టీఎంసీల నీటిని పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు గోదావరి జలాల నుంచి పొందబోతున్నం. 12) నదీ పరీవాహక ప్రాంతాన్ని అధికం గా ఉపయోగించుకోవడం వల్ల భూ సేకరణ సమస్య కూడా తగ్గింది. 13) దేశంలో ఎక్కడా లేనివిధంగా అటవీ, పర్యావరణ, జలమండలి, రైల్వే తదితర శాఖలతో, పొరుగు రాష్ర్టాలతో సమన్వయం సాధిస్తూ, యుద్ధ ప్రాతిపదికతతో అనతికాలంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయడమనేది ఒక చారిత్రిక అద్భుతమే కాక నాయకత్వ నిర్వహణ సామర్థ్యాన్ని కూడా చాటుతున్నది.
2018, జూలై 1వ తారీఖు నాడు తెలంగాణ వికా స సమితి ఆధ్వర్యంలో దాదాపు 35 మంది రచయిత్రులు, కవయిత్రులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడమన్నది ఒక మధురానుభూతి. వీరంతా దీన్ని ఒక జల విప్లవంగా భావించి అక్కడ చిందే ప్రతి నీటిచుక్కలో అమరుల ఆశయాలుంటాయన్నారు. మంత్రి శ్రీదేవి తన అమృత గానంతో అమరులకు నీవాళులు అర్పించారు.
నీళ్లు, నిధులు, నియామకాలన్న నినాదంతో ఊపిరిపోసుకున్న తెలంగాణ ఉద్యమ ఆశయాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా జాతికి అంకితం చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
(వ్యాసకర్త: రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, టీవీఎస్)

675
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles