తరతరాలకు వెలుగు

Wed,July 11, 2018 12:54 AM

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నదని అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే విని మాకూ చూడాలనిపించింది. మా కోరిక మేరకు తెలంగాణ వికాస సమితి కవయిత్రులు, రచయిత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కు ఏర్పాట్లు చేసింది.తెలంగాణ వికాస సమితి అధ్యకులు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, నీటి పారుదల శాఖ కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఉదయమే వచ్చి తెలంగాణ కవయిత్రులు, రచయిత్రులకు అభినందనలు తెలుపుతూ సందర్శనకు పచ్చజెండా ఊపారు. 5 గంటల ప్రయాణం ముగిసి తెలంగాణకు వరప్రదాయిని కాబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకు న్నాం. అక్కడి కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా, ఓపికగా చిత్రాలు, డిజైన్లతో సహా చూపించి వివరించారు. ఆ వివరణ ద్వారా మాకు ప్రాజెక్టుకు సంబంధించిన సైద్ధాంతి క అవగాహన ఏర్పడింది. అనంతరం సీఈ మమ్మ ల్ని ప్రాజెక్టు చూపించడానికి తీసుకెళ్ళారు.

గోదారమ్మ జలాల్లో తెలంగాణ తన వాటాను సద్వినియోగం చేసుకోవ డం, లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 20 జిల్లాలకు తాగునీరు అందించే దృఢ నిశ్చయంతో ప్రారంభించిన మహా జలయజ్ఞం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు విరాట్ స్వరూపాన్ని వర్ణించడానికి మాట లు సరిపోవు. నంది మేడారం నుంచి సొరంగ మార్గాలు, అందులోపలి నిర్మాణాలు, ఎల్లంపల్లి, సర్జ్‌పూల్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఇలా సం భ్రమాశ్చర్యాలకు లోనయ్యే కట్టడాలెన్నో!
203 కి.మీ. పొడవుతో గ్రావిటీ టన్నెల్, 98 కి. మీ. పొడవుతో ప్రెషర్ పైప్‌లైన్, 22 లిఫ్టులు, 21 పంప్‌హౌజ్‌లు, 1832 కి.మీ. పొడవుతో నీటిని సరఫరా చేసే మార్గంతో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయాలు! సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌తో కూడిన పనులు, స్థానిక పరిజ్ఞానంతో కూడిన డిజైన్ల రూపకల్పన, ఆధునిక సాంకేతిక వినియోగం...

సుమారు ఆరు వేల మంది ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, 22 వేల మంది కార్మికులు ప్రాజెక్టును అతి త్వరగా ముగించడానికి మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్ళూ శ్రమిస్తున్నారు. ఒకే ప్రాజెక్టులో బారేజీలు, గ్రావిటీ కాలువలు, సొరంగాలు, భూగర్భ పంప్‌హౌజ్‌లు, సర్జ్ పూల్, విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉండటం... ప్రాజెక్టు ప్రయోజనాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండటం, మొత్తం 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, తాగునీటి కోసం 40 టీఎంసీల నీటి సరఫరా.. ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు వింతలు, విశేషాలు ఎన్నెన్నో! లక్ష్యిత ప్రయోజనాలే కాకుం డా అంతర్గత జల రవాణా అభివృద్ధి, ఊపందుకోనున్న మత్స్య పరిశ్రమ, పర్యాటకాభివృద్ధి, అడవు ల అభివృద్ధి, వలసలు తగ్గి స్వయం పోషక గ్రామా లు పెరుగడం వంటి వికాసాలకు కూడా బాటలు వేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలబెట్టనున్నది.
Drsarojja
కట్టడం పూర్తయిన తర్వాత ఇదిగో ఆ మహా నిర్మాణ దృశ్యాలంటూ తమ తర్వాతి తరం వారిని ఆశ్చర్యపరిచేందుకు, చరిత్ర పాఠాలుగా ఉంచేం దుకు ఈ జ్ఞాపకాల దొంతర ఉపయోగపడుతుందనే భావనతో చూడముచ్చటైన అక్కడి ప్రాజెక్టు నిర్మాణ పనులను, దృశ్యాలను జీవిత కాలపు జ్ఞాపకాలుగా కవయిత్రులు తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ప్రజలకు మేలు చేస్తుంది. కానీ ఈ ఆధునిక దేవ ళం యావత్ తెలంగాణకే అనేక రకాలైన ప్రయోజనాలను చేకూర్చబోతున్నది అని ఒక రచయిత్రి ఆనందాన్ని వ్యక్తంచేశారు. రెండు కన్నులకూ పట్టనంతగా, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసినా సరిపోనంత పెద్ద నిర్మాణమిది అని మరొక రచయిత్రి విస్మయపడ్డారు. ఇంతటి మహాద్భుత నిర్మాణపు ఆలోచన, ఆచరణ, ఎక్కడా రాజీపడకుండా కొన్ని వేల సంవత్సరాలకు కూడా చెక్కు చెదరని విధమై న ఈ మహా నిర్మాణ సంకల్పం మొక్కవోని దీక్షాపరుడు కేసీఆర్ సార్‌కే సాధ్యం అని అందరూ ముక్తకంఠంతో కొనియాడినారు. ఇంతటి అద్భుతమైన బృహత్‌కార్యాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్ సార్, పట్టుదలకు మారుపేరు అయిన మన నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు సార్, ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగు లు, శ్రామికులు ప్రతి ఒక్కరూ ఎంతగానో అభినందనీయులు. వీరి శ్రమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. తరతరాలకు తరగని వెలుగు కాళేశ్వరం.
(వ్యాసకర్త: ఉపాధ్యాయిని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్)

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles