ఫెడరలిజం రెండు విధాలు

Thu,June 14, 2018 12:16 AM

ప్రాంతీయ పార్టీలకు అధికారం కేవలం స్వప్రయోజనాల కోసం కావాలనుకోవటం ఒక తరహా ఫెడరలిజం కాగా, ఆ అధికారాన్ని తమ ప్రజల ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయి వరకు ఉపయోగించే ఆలోచన ఉండటం రెండు తరహా ఫెడరలిజం. వీటిలో ఏది ఎక్కువ
వాంఛనీయమో చెప్పనక్కరలేదు. ఇటీవలి మాసాల్లో ఫెడరలిజం గురించి మాట్లాడిన వారిలో తక్కిన వారందరిది మొదటి మోడల్ ఫెడరలిజం కాగా, కేసీఆర్‌ది రెండవ మాడల్. ఈ వ్యత్యాసాన్ని ఎవరూ గుర్తిస్తున్నట్లు లేరు. ప్రాంతీయ పార్టీలు అధికారం కోసమే
అధికారమన్నట్లు వ్యవహరిస్తే వాటికి, జాతీయ పార్టీలకు తేడా ఏమిటి? రెండు విధాలైన ఫెడరలిస్టు ఆలోచనలలో వాంఛనీయమైనది కేసీఆర్ సూచిస్తున్న రెండవ నమూనా. అది విధాన పత్రంలో స్పష్టంగా ముందుకు వచ్చినప్పుడు గత 70 ఏండ్ల సెంట్రలిజంతో పాటు, నెయ్యిలేని నేతిబీర వంటి ఫెడరలిస్టు ధోరణులతో ఒక బ్రేక్ అనదగ్గది వస్తుంది. దీని అర్థం గత 40 ఏండ్ల ఫెడరలిస్టు ధోరణులు అసలు ఏమీ సాధించలేదని కాదు. కానీ జరుగవలసినంత జరుగలేదు గనుక అక్కడి నుంచి మరొక దశలోకి ప్రవేశించవలసింది ఉంది. బ్రేక్ అనేది మొదట దృక్పథం-ఆలోచన-థియరీ రూపంలో రావాలి. తర్వాత ఆచరణలోకి వెళ్లాలి.

Parlament
ఫెడరలిజం అన్నది రాజకీయ, ఆర్థిక, అధికారాలతో పాటు, అభివృద్ధి బాధ్యతలు కూడా వీలైనంత వికేంద్రీకృతం కావటానికి సంబంధించిందినది.కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రస్థాయి కి, అక్కడినుంచి స్థానిక సంస్థల స్థాయి వరకు ఇది జరుగాలన్నది ఉద్దేశం. అప్పుడు మూడు స్థాయిలలోనూ అధికారాలతో పాటు బాధ్యతల వికేంద్రీకరణ జరుగుతుంది. అందరి భాగస్వామ్యాలుంటాయి. ఈ విధమైన ప్రజాస్వామిక వ్యవహరణ సక్రమమైన, సమగ్రమైన అభివృద్ధికి అందరికి అభివృద్ధికి దారితీస్తుంది. కేంద్రం, రాష్ర్టాలూ, స్థానికమైన యూని ట్లూ, తద్వారా ప్రజలూ బలపడుతారు. దేశం బాగుపడటంతో పాటు బలపడుతుంది. ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా భారతేదశం వంటి సువిశాలమైన, వైవిధ్యమైన దేశానికి అవసరం.

కేంద్రంలో పాలించిన వారికి ఇది మొదటినుంచి తెలియనిది కాదు. కానీ మొదటినుంచి ఒకవైపు తమ అధికార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. రెండవ వైపున తమ అధికార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. రెండవ వైపున తమ వెనుకగల జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయశక్తుల జోక్యాలు మితిమీరసాగాయి. మూడవ వైపున తమ పరిపాలనా వైఫల్యాలు, అవినీతి తోడయ్యాయి. వీటన్నింటి మధ్య ఫెడరలిస్టు దృక్పథం, సమస్యలు దెబ్బతింటూపోగా దానిపై తిరుగుబాటుగా వివిధ ప్రాంతాల్లో ఫెడరలిస్టు ధోరణులు, పార్టీలు ముందుకు రాసాగాయి. కాని దురదృష్టవశాత్తు ఈ ఫెడరలిస్టు శక్తులు పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. కేంద్రీకృత ధోరణులపై తిరుగుబాటు చేసిన తాము తిరిగి అదే నమూనాలో తయారయ్యారు.

జాతీయపార్టీల సెంట్రలిజం స్థానంలో వీరు సబ్-సెంట్రలిస్టులుగా మారారు. అనగా, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారాలను తమ చేతుల్లో కేంద్రీకరించుకోవటం. వాటిని అంతకన్నా కిందకు వెళ్లనివ్వకపోవటం. దీనినే సెంట్రలిజం స్థానంలో సబ్-సెంట్రలిజం అంటున్నా ము. అంతేతప్ప అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రతిస్థాయిలో భాగస్వామ్యాలు అనేవి అట్టడుగు స్థాయివరకు జరుగవన్న మాట. సూటిగా చెప్పాలంటే, ఫెడరలిస్టు ధర్మ జాతీ యపార్టీలకు వంటపట్టకపోగా, ప్రాంతీయ పార్టీలకు కూడా వంట పట్టలేదన్నమాట.

ఈ థియరెటికల్ వివరణలను ఇంతటితో ఆపి, ఇందువల్ల కలిగిన ఫలితాలు ఏమిటో చూద్దాం. అప్పుడుగాని కేసీఆర్ చెప్తున్న రెండవ మాడల్ ఫెడరలిజం మాట అర్థం కాదు. పైన అన్నట్లు జాతీయపార్టీల కేంద్రీకృత ధోరణులు పెరుగటంతో పాటు పలు విధాలైన వైఫల్యాల కారణంగా అవి ఎన్నికలలో, ఓడటం, శూన్యంలోకి ఇతర పార్టీలు రావటం అనే కొత్త మలుపు ఒకటి జనతా పార్టీతో 1970ల నుంచి మొదలైంది. లేదా 1967లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాల నుంచే అనవచ్చు. అనేక ఇతర ప్రాంతీయ పార్టీలు తర్వాత నుంచి పుట్టుకువచ్చాయి. అంతకుముందే ఉండినవి కొత్త బలం తెచ్చుకున్నాయి. అదే శూన్యంలో బీజే పీ, వామపక్షాల వంటి జాతీయ పార్టీలకు కూడా కొంత చోటు లభించింది. కానీ పైన అనుకున్నట్లు ఈ పార్టీలు అన్నీ కూడా తాము అధికారానికి వచ్చిన కాలంలో ఫెడరలిస్టు ధర్మాన్ని పాటించకుండా సబ్-సెంట్రలిస్టులుగా మారటంతో, అవి కూడా ఎన్నికలలో ఓడిపోసాగాయి.

స్థూలంగా చెప్పాలంటే ఈ పార్టీలకు కూడా అధికార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. తమ వెనుకగల ఆర్థిక, రాజకీయ శక్తుల జోక్యాలు మితిమీరసాగాయి. వాటిని ఆలంబన చేసుకున్నవాటి లో స్థానిక, జాతీయ కంపెనీల గురించి మొదలుకొని మల్టీనేషనల్స్, డబ్ల్యూటీవో, ప్రపంచబ్యాంకు వరకు అన్నీ ఉన్నాయి. మరొకవైపు తమ పరిపాలనా వైఫల్యాలు, అవినీతి తోడయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, జాతీయపార్టీలు ఏయే రుగ్మతలవల్ల విఫలమయ్యాయో, సరిగ్గా అవే రుగ్మతల కారణంగా ప్రాంతీయ పార్టీలు కూడా విఫలం కాసాగా యి. ప్రాంతీయ పార్టీల వైఫల్యంలో ఎక్కువ విచారాన్ని కలిగించేది ఏమంటే, అవి జాతీయపార్టీల వైఫల్యంలో ఎక్కువ విచారాన్ని కలిగించేది ఏమంటే, అవి జాతీయపార్టీల ఫెడరల్-వ్యతిరేక ధోరణులపై తిరుగుబాటు వల్ల వచ్చినటువంటివి. అటువంటప్పుడు వారికి ఫెడరల్ స్పృ హ బలంగా ఉండాలి. అటువంటి ధర్మం ప్రకారం పాలించాలి, వ్యవహరించాలి. కానీ అది జరుగలేదు. ఎక్కువ విచారాన్ని కలిగించేది ఇదే. సరిగ్గా ఈ కారణంగానే, లోగడ జాతీయ పార్టీలు ఎన్నికలలో ఓడటం జరుగుతూ వచ్చినట్లు, ఈ ఫెడరల్ పార్టీలనేవి తరచూ ఎన్నికల్లో ఓడ టం మొదలైంది.

మొదటి తిరుగుబాటు కేంద్రీకృత శక్తులపై ప్రాంతీయ పార్టీలది కాగా, రెండవ తిరుగుబాటు ప్రాంతీయ పార్టీలపై క్షేత్రస్థాయి ప్రజలది అయిందన్నమాట. మరొక విధంగా చెప్పాలంటే, సెంట్రలిస్టులపై ఫెడరలిజం పేరిట తిరుగబడినవారు సబ్-సెంట్రలిస్టులుగా మారగా, ఆ సబ్-సెంట్రలిస్టులపైన క్షేత్రస్థాయి నుంచి అసలుసిసలైన ఫెడరలిస్టు ప్రజల తిరుగుబాటన్న మాట అది. అందుకే చూడండి, గత సుమారు నలభై ఏం డ్లుగా ప్రాంతీయ పార్టీలలో సుదీర్ఘకాలం పాటు పాలించింది ఒక్కటైనా లేదు. వరుసగా తగినంతకాలం అధికారంలో ఉన్నవి కూడా చాలాకొద్ది. మరొక ప్రత్యామ్నాయం లేనందున ఉండగలుగుతున్నవి కొన్ని. మొత్తం మీద, జాతీయ పార్టీలది, ప్రాంతీయ పార్టీలది ఒకటే నమూనాగా మారటంతో, వాటన్నింటి సుస్థిరతలు-అస్థిరతలు కూడా ఒకే నమూనాలో సాగుతున్నాయి.

ఇప్పుడు ప్రస్తుత ఫెడరలిస్టు చర్చకు వద్దాం. జాతీయస్థాయిలో అధికారంలోగల ఎన్డీయే ప్రభుత్వం విఫలమవుతున్నదనే భావన వ్యాపిస్తుండటంతో, అందుకు ప్రత్యామ్నాయం ఆలోచనలు మొదలయ్యాయి. ఇవి మూడు విధాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పటికే ఉనికిలోగల కాంగ్రెస్-యూపీఏ వేదిక బలపడటం. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రెండవది, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికలకు ముందో తర్వాతనో ఒక వేదికగా ఏర్పడటం. లేదా కొన్ని అంతకుముందుగానే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయగా కొన్ని ఆ తర్వాత యూపీఏతో చేరటం. ఫలితాలు వెలువడిన తర్వాత బలాబలాలను బట్టి ప్రాంతీయ పార్టీల కూటమిని కాంగ్రెస్ బలపరుచటం, లేదా యూపీఏను ఈ కూటమి బలపరుచటం. ఇక మూడవది కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కాంగ్రేసేతర, బీజేపీయేతర వేదిక. దీనిని ఒక పేరు అంటూ ఇంకా నిర్ణయం కాకపోయినా, దాని స్వరూప-స్వభావాలు స్థూలంగా ఫెడరల్-ప్రజల ఫ్రంట్ అనదగ్గట్లు ఉంటాయనే అభిప్రాయం కలుగుతున్నది. ఆ ఫ్రంట్ లక్ష్యం ప్రజల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి, దేశాభివృద్ధి, ఇవన్నీ అన్నిస్థాయిలలో శక్తివంతం కావటం స్వాతంత్రోద్యమంతో ఆరంభించి ఆ తర్వాత రాజ్యాంగం, యూనిటరిస్టులు విఫలమైనప్పటినుంచి ఇప్పటివరకు దేశమంతటా ఫెడరలిస్టులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభివృద్ధి కాముకులు ఆకాంక్షించినది, ఆకాంక్షిస్తున్నది ఇదే. కేసీఆర్ తమ విధాన పత్రం ఇంకా ప్రకటించవలసి ఉందిగాని, తను మాట్లాడుతున్న దానిని బట్టి కలుగుతున్న స్థూలమైన అభిప్రాయం ఇది. ఇటువంటి అజెండా ఏదీ మొదటి నమూనా ఫెడరలిజంలో కన్పించదు. అధికారం ఒక్కటే వారి అజెండా.
Ashok
ఈ చర్చ అంతటి తర్వాత తేలుతున్నదేమిటి? రెండు విధాలైన ఫెడరలిస్టు ఆలోచనలలో వాంఛనీయమైనది కేసీఆర్ సూచిస్తున్న రెండవ నమూనా. అది విధాన పత్రంలో స్పష్టంగా ముందుకు వచ్చినప్పుడు గత 70 ఏండ్ల సెంట్రలిజంతో పాటు, నెయ్యిలేని నేతిబీర వంటి ఫెడరలిస్టు ధోరణులతో ఒక బ్రేక్ అనదగ్గది వస్తుంది. దీని అర్థం గత 40 ఏండ్ల ఫెడరలిస్టు ధోరణులు అసలు ఏమీ సాధించలేదని కాదు. కానీ జరుగవలసినంత జరుగలేదు గనుక అక్కడి నుంచి మరొక దశలోకి ప్రవేశించవలసింది ఉంది. బ్రేక్ అనేది మొదట దృక్పథం-ఆలోచన-థియరీ రూపంలో రావాలి. తర్వాత ఆచరణలోకి వెళ్లాలి. ఇందులో ఆశావహమైన పరిస్థితి ఏమంటే, ఈ దేశపు సామాన్య ప్రజలు, అనగా క్షేత్రస్థాయి ఫెడరల్ శక్తులు, ఇటువంటి బ్రేక్‌ను ఆహ్వానించగలరనటంలో సందేహం ఉండనక్కరలేదు. అందుకోసం వారు ఎప్పటి నుంచో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, వ్యక్తావ్యక్తంగానో తమ ఒత్తిడిలు తాము సృష్టిస్తూనే ఉన్నారు.

523
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles