నాగపూర్ అందించిన ఫలాలు

Thu,June 14, 2018 12:14 AM

ఆయన రాష్ట్రపతిగా ఉన్నకాలంలోనూ ఒక ప్రత్యేక, విశిష్టమైన మేధావిగా వ్యవహరించలేదు. గతంలో మేధావిగా, తత్త్వవేత్తగా ప్రత్యేక ముద్రవేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వలె ముఖర్జీ తనదైన ముద్ర చూపించుకోలేదు. అలాగే తనదైన వాగ్ధాటి, మాటచాతుర్యతతో పలువురిని ఆకర్షించే ప్రయత్నం చేయలేదు... అంతిమంగా ప్రణబ్ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించి ఆరెస్సెస్ లాభపడిందా, లేదా ఆ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లడం ద్వారా ప్రణబ్ విజయం సాధించారా అంటే సమాధానం కష్టమే. దీన్నుంచి ఇరువురూ అటు ఆరెస్సెస్, ఇటు ప్రణబ్ తమదైన ఫలాలను పొందారని చెప్పకతప్పదు.
bhagwat-pranab
మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్‌వాది ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తల ఉత్సవానికి హాజరుకావటం దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాం శం అయ్యింది. ఆయన ఆ కార్యక్రమానికి హాజరుకావటానికి ఒప్పుకోవ టంపైనే కాంగ్రెస్‌వాదుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో వైపు ఆరెస్సెస్ కార్యకర్తల శిక్షణా శిబిరానికి వెళ్లి వారికి ఏం సందేశం ఇస్తార నేది ఆసక్తిగా మారింది. అయితే అందరూ ఊహించిన విధంగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యానాలు, ప్రతిస్పందనలు లేకుండానే ముగిసింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఎప్పటిలాగానే ప్రణబ్ ముఖర్జీకి ముందు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి, ఆ తర్వాత ప్రణబ్‌కు అవకాశం ఇచ్చారు. భగవత్ ఉపన్యాసంలోనూ వైరుధ్యపూరితమైన, వివాదాస్పద అంశాలు ప్రస్తావించకుండానే ముగిసింది. ప్రణబ్ కూడా తనదైనశైలిలో భారతదేశ ఔన్న త్యం భిన్నత్వంలో ఏకత్వం మూలంగా సంతరించుకున్నదని వివరిస్తూ బహుళత్వంలోనే భారత జీవన సౌందర్యం ఉన్నదని వివరించారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆరెస్సెస్ ఆధిపత్య రాజకీయాలు ఎలా ఉంటాయో అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఒక స్వచ్ఛంద, సేవా, సాంస్కృతిక సంస్థగా చెప్పుకున్నా ఆరెస్సెస్ తన లక్ష్యాన్ని రహస్యం గా ఎలా అమలు చేస్తుందో తెలుస్తున్నది. మహాత్మాగాంధీ హత్య ఉదంతం కాన్నుంచి, అనేక సందర్భాల్లో నిషేధిత సంస్థగా మిగిలిన సందర్భాల దాకా ఆరెస్సెస్ ఆచరణ వివాదాస్పదమైనది. ఆరెస్సెస్ సిద్ధాంతమే మెజారిటీవాదం పునాదిపై హిందుత్వాన్ని నమ్మడం. హిందుత్వవాదాన్ని ఆరెస్సెస్ నిర్మాత కేబీ హెడ్గేవార్, ఆ తర్వాత ఆరెస్సెస్ పగ్గాలు చేపట్టిన సర్‌సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ రచనల్లో విస్తారంగా వివరించారు. కానీ ఇప్పటి వింతేమిటంటే.. హెడ్గేవార్‌ను భారతమాత ఉత్తమ పుత్రుడు అని ఆరెస్సెస్ కార్యాలయంలోని విజిటర్స్ బుక్‌లో ప్రణబ్ ముఖర్జీ రాశా రు! భారతదేశం హిందువులకే సొంతం, ముస్లింలు ఈ దేశంలో ఉండటానికి అనర్హులని అనేక సందర్భాల్లో ప్రకటించినవాడు హెడ్గేవార్. అతన్నిప్పుడు ప్రణబ్ ఉత్తమ పుత్రుడని కీర్తిస్తున్నారు. ఇక గోల్వాల్కర్ అయితే తనకు ఆదర్శం హిట్లర్ అని ప్రకటించుకున్నాడు. భారత్‌ను హిందుస్థాన్ గా మార్చాలంటే నాజీ జర్మనీ నుంచి మంచి అనుభవాలను గ్రహించాల ని చెప్పుకొచ్చారు. కానీ ఈ సిద్ధాంతాల వెలుగులో నేటి ఆరెస్సెస్ కార్యకర్తలు ఏ తీరుగా పనిచేస్తున్నారో తెలియదు.

మొదటి నుంచి ఆరెస్సెస్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థనని చెప్పుకుంటుంది. ఎక్కడైతే ప్రభుత్వ అంగాలు తమ సేవలను అందించలేవో అక్కడ ఆరెస్సెస్ తన సేవలను అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఆరెస్సెస్ నేతలు చెబుతారు. ముఖ్యంగా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు, పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు స్వచ్ఛందంగా ఆరెస్సెస్ తన సేవలందింస్తుందని చెబుతారు. అలాగే ఆరెస్సెస్ అనేది ఒక రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ వలె పనిచేస్తుందని చెప్పుకొస్తారు. కానీ ఆరెస్సెస్ గత చరిత్రను చూస్తే రాజకీయంగా ఆరెస్సెస్ ఎంతటి ప్రభావాన్ని కలుగజేస్తున్నదో, ఎంతటి హింసాత్మకత దాగి ఉన్నదో తెలుస్తుంది. అంతెందుకు ప్రణబ్ ముఖ ర్జీ వెళ్లిన నాగపూర్ సమావేశంలోనూ వందలాది ఆరెస్సెస్ కార్యకర్తలు కర్ర సాముతో తమ హింసాత్మకతను చెప్పకనే చెప్పుకున్నారు.

ఆరెస్సెస్ ఆహ్వానం మేరకు నాగపూర్ వెళ్లిన ప్రణబ్ వివాదాస్పదంగా ఏమీ వ్యవహరించలేదు, మాట్లాడలేదు. ఆరెస్సెస్ కార్యకర్తలకు చాలా సున్నితంగానే తనదైనశైలిలో తాను ఇవ్వాలనుకున్న సందేశా న్నిచ్చారు. ఆయన తన ప్రసంగంలో జాతీయవాదాన్ని, దేశభ క్తిని, బహుళత్వాన్ని నిర్వచించా రు. ఇంకా ముఖ్యంగా ప్రసం గం ముగింపులో భారతీయ ఆత్మ సహనంలోనే ఇమిడి ఉన్నదని చాటిచెప్పారు. ఇందులో కొత్తేమీ లేదు. ఈ క్రమంలో ఆరెస్సెస్ అధినేతలు ప్రణబ్‌ముఖర్జీని ఆహ్వానించటా న్ని అర్థం చేసుకోవాలి.
Drsen
మరోవైపు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ వ్యవహ రించిన శైలిని చూస్తే.., ఆయన ఎల్లప్పుడూ తాను తెరచాటున వెనుక ఉండే రాజకీయాలను నడిపించారు. అలాగే ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనూ ఒక ప్రత్యేక, విశిష్టమైన మేధావిగా వ్యవహరించలేదు. గతంలో మేధావిగా, తత్త్వవేత్తగా ప్రత్యేక ముద్ర వేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వలె ముఖర్జీ తనదైన ముద్ర చూపించుకోలేదు. అలాగే తనదైన వాగ్ధాటి, మాట చాతుర్యతతో పలువురిని ఆకర్షించే ప్రయత్నం చేయలేదు.

అంతిమంగా ప్రణబ్ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించి ఆరెస్సెస్ లాభపడిందా, లేదా ఆ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లడం ద్వారా ప్రణబ్ విజయం సాధించారా అంటే సమాధానం కష్టమే. దీన్నుం చి ఇరువురూ అటు ఆరెస్సెస్, ఇటు ప్రణబ్ తమదైన ఫలాలను పొందారని చెప్పక తప్పదు.
(వ్యాసకర్త: నేషనల్ యూనివర్సిటీ సింగపూర్ అధ్యాపకులు)

491
Tags

More News

VIRAL NEWS