పొక్కిలి నేలపై పచ్చని అలుకు

Mon,June 11, 2018 10:39 PM

కేసీఆర్ పాలనకు ఒక ఆశయం ఉన్నది. దశాబ్దాల ప్రజల సమస్యలను తీర్చి కన్నీరు లేని పల్లెలను, కడగండ్లు లేని పట్నాలను చేయాలనే తపన కేసీఆర్ పరిపాలనలో కనిపిస్తుంది. ఇన్ని చేసినా ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉండవచ్చు. అరువై యేండ్లలో తీరని అన్ని సమస్యలు నాలుగేండ్ల లో తీర్వాలని, అట్లాకాకపోతే ఏమి కానట్టే అనే నాయకులు.. గత 60 యేండ్లల్లో ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదో చెప్పాలి?

మైకు కనపడంగనే ప్రతిపక్షాలు పదే పదే వేస్తున్న ఈ ప్రశ్న ను చూస్తే ప్రజలకే జాలేస్తుంది. దోచుకోవడం - దాచుకోవడం, ముంచడం - వంచించడం, పుణ్యం పిసరంత - పాపం పాల సముద్రమంత సాగిన గత పార్టీల పాలనను చూసి విసుగు చెందిన ప్రజలు.. కేసీఆర్ సంక్షేమ ప్రభుత్వంలో సంబురంగా ఉంటే.. ప్రతి పక్షనాయకులు మాత్రం ఇంకా ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నరు. ఇంకొందరు విపక్ష భజన కళాకారులు ఏం మారిందని పాటలను కైగట్టి విమర్శలను ఎక్కుపెడుతున్నరు. పార్టీ ఆఫీసుల కోసం బస్తీవాసుల జాగలను కబ్జా చేసేందుకు వెనుకాడని నాయకులు, జీతాలడిగితే గుర్రాలతో తొక్కించి, ప్రజల వీపులపై లాఠీ పోటీలు పెట్టిన పార్టీలు సక్కగ నడుస్తున్న కేసీఆర్ పాలనపై దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నయి. అసలు వాళ్లు ఆరోపిస్తున్న ఏ విమర్శకు పస లేదని వాళ్ళకు కూడా తెలిసి నా మాట్లాడకపోతే తమ పార్టీని ప్రజలు మరిచిపోతరనే దుగ్ధతోనే గార డీ మాటలు మాట్లాడుతున్నరు.

కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు నూరుతున్న ఈ కుట్రల కత్తికి జవాబు చెప్పాలంటే 360 స్కీంల ముచ్చట చెప్పాలే. కానీ.. దానికన్నా ఆ పథకా ల వల్ల మారిన తెలంగాణ బతుకు చిత్రం చెప్తే చాలు. గోరటి వెంకన్న గొంతెత్తిన పల్లె కన్నీటి గోసను ఇప్పుడు కేసీఆర్ తీర్చుతున్నడు. గెట్టు పం చాయితీల్లేని ఎవుసం సృస్టించిండు. లంచం లేకుండా ఇంటికి పాసుబుక్కు పంపుతున్నడు. పెట్టుబడి కోసం చూడాల్సిన అవరసరం లేని పునాసను తీసుకొచ్చిండు. రైతు సచ్చిపోతే ఆగమయ్యే కుటుంబానికి రైతు బీమా పథకం తెచ్చిండు. నకిలీ విత్తన కంపెనీలు లేని వ్యవస్థను రూపుదిద్దిండు. మోటరు కాలకుండా ఇరాం లేకుండా 24గంటల కరెంటు ఇచ్చిం డు.ఆకారం కోల్పోయిన చెరువుకు పునర్వైభవం తెచ్చిండు.ఆగిపోయిన అలు గుకు, పరుగు మరిచిన వాగుకు ఉరుకుడు పందెం పెట్టిండు. వరద మరిచిన కలల కాలువను నిజం చేస్తుండు. పండించిన పంటను దాచుకునేందుకు గోదాములు కట్టించిండు. గిట్టుబాటు ధరలియ్యని కేంద్రంపై కత్తిగట్టిండు. ఒక్కమాటలో చెప్పాలంటే పొక్కిలి అయిన తెలంగాణ వాకిలిపై పచ్చని అలుకేసిండు కేసీఆర్. ధాన్యపురాసిపై చూడచక్కని ముగ్గును గీసిండు కేసీఆర్. గర్భం దాల్చిన దగ్గర్నుంచి బాలింత వరకు, పిలగాడు పుట్టిన దగ్గర నుంచి యాడాది అయ్యేదాక కేసీఆర్ కిట్ పథకం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటున్నడు.

తల్లికాబోతున్న మహిళా ఉద్యోగికి ముచ్చటగా జీతంతో కూడిన ఆరు నెలల సెలవులిస్తుండు. బడి ఈడు వచ్చిన పిలగానికి ఇంగ్లీష్ మీడియం సదువు చెప్తుండు-మూడుపూటల సన్నబియ్యం బువ్వపెట్టి సౌవులత్ చేస్తుండు. దేశం దాటే బడుగులు, బలహీనులు, గిరిజనులు, మైనార్టీ ప్రతిభావంతులకు 20లక్షల సాయం చేస్తుండు. యువతకు ఆలో చన ఉంటే టీహబ్‌లో ఆకారం ఇస్తుండు, స్కిల్స్ కావాలంటే టాస్క్‌లో ట్రేనింగ్ ఇస్తుండు. ఇంటింటికి కండ్ల పరీక్షలు చేపిస్తానంటున్నడు - కావలసిన ప్రతి మనిషికి ఉచితంగా కండ్లజోడు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నడు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసి ఆరోగ్య తెలంగాణ నిర్మించేందుకు ప్రణాళికను రచించిండు. ఆడతల్లులు క్యాన్సర్ బారిన పడకుండా ముంద స్తు రక్తపరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నడు. పెండ్లీడుకొచ్చిన పేదింటి బిడ్డలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీం పెట్టి పెద్ద నాయిన అయి పెండ్లిళ్లు చేస్తుండు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తున్నడు. పరిశ్రమలు పెడతనంటే ఇరువై నాలుగు గంటలో పర్మిషన్ ఇస్తున్నడు. అందమైన రోడ్లేస్తుండు - అపురూపమైన కార్యాలయ భవనాలు కడుతుండు.

40 లక్షల మంది బీదా, బిక్కి, పేదా, సాదాకు పించిన్లిస్తుండు. ముదిరాజ్, బెస్త బిడ్డల కోసం చెరువుల్లో చేపలు వేసిన్రు, పద్మశాలిమగ్గానికి తోడుగుంటుండు. గొల్లోల్ల మందల్ల గొర్లు నింపుతుండు. లంబాడీల పంచాయతీ కలను నిజం చేసిండు. మూలవాసుల ముఖచిత్రానికి చిరునవ్వు అద్దిండు. ఎరుకల భాషకు, ఆదివాసీ గోసకు పరిష్కారం చెప్తుండు. చిందు, యానాది, బుడుబుక్కల, గంగెడ్ల, రొంజ, కాటిపాపల ఆటపాటలకు రాగం, తానం అవుతుండు. సబ్బండవర్గాల సంబురానికి రూపు అవుతుండు. ఇన్ని చేసినా ఇంకా కేసీఆర్ ఏం చేసిండంటే ఎట్లా చెప్పేది? ఒక్కటని కాదు.. సమస్త సమస్యలను తీర్చుతూనే అద్భుతమైన రాష్ట్రంగా అవతరించేందుకు కావల్సిన భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తున్నడు.

దశాబ్ధాల నల్లగొండ ఫ్లోరైడ్ భూతాన్ని మిషన్ భగీరథతో పారదోలుతున్నడు. ప్రాజెక్టులు కట్టి మహబూబ్ నగర్ వలసకూలీలను తిరిగి సొంతుల్లకు రప్పిస్తున్నడు. వరంగల్‌లో ఐటీ హబ్‌కు ఊపిరి పోసిండు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరిస్తున్నడు. మెదక్ మెతుకు గోసను తీర్చేందుకు గోదారిని తీసుకొస్తున్నడు. ఖమ్మంలో భక్తరామదాసు పేరుమీద ప్రాజెక్టు కట్టి నీళ్లు పారిస్తున్నడు. రంగారెడ్డిలో కాలుష్య కాసారాలుగా మారి జనాన్ని సంపుకతింటున్న దుర్మార్గపు పరిశ్రమలను ఊరవతలికి పంపిస్తున్నడు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి నిజాయితీగా కృషి చేస్తున్నడు. మూసి మురిసిపోయేటట్టు, హుస్సేన్‌సాగర్ చిరునవ్వులు చిం దించేటట్టు అలుపెరగక కృషి చేస్తున్నడు. జోకులకు వేదికలుగా మారిన హైదరాబాద్ రోడ్లను ఎత్తువంపులు లేకుండా సక్కగ చేస్తున్న డు. ఇందిరమ్మ ఇండ్లలెక్క దోపిడీ లేకుండా శాతనైన కాడి కి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిజాయితీగా ఇస్తున్నడు. ఇవేకాదు చెప్తే ఓడవని పథకాలెన్నో అమలు చేస్తున్నడు. ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నడు. చెప్పినవి కాదు చెప్పనివి అమలు చేస్తూ ఔరా అనిపిస్తున్నడు. అందుకే ఎల్‌ఐ సీ ఛైర్మన్ వీ.కే శర్మ కేసీఆర్‌ను మించిన దార్శినిక నేతను చూడలేదని పొగిడిండు. ఒక్క శర్మ గారే కాదు యావత్ దేశమే ఇప్పుడు తెలంగాణను రోల్ మోడల్ గా చూస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు ఇంకా ఈ వెకిలి ప్రశ్నల ను సంధించడంలో అర్థం లేదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.
sripadha-ramana
కేసీఆర్ పాలనకు ఒక ఆశయం ఉన్నది. దశాబ్దాల ప్రజల సమస్యలను తీర్చి కన్నీరు లేని పల్లెలను, కడగండ్లు లేని పట్నాలను చేయాలనే తపన కేసీఆర్ పరిపాలనలో కనిపిస్తుంది. ఇన్ని చేసినా ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉండవచ్చు. అరువై యేండ్లలో తీరని అన్ని సమస్యలు నాలుగేండ్ల లో తీర్వాలని, అట్లాకాకపోతే ఏమి కానట్టే అనే నాయకులు.. గత 60 యేండ్లల్లో ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదో చెప్పాలి? ప్రతి పక్షాలు అధికార పీఠంపై యావతో ఆరోపణలు గుప్పించవచ్చు. కానీ అభివృద్ధికి అడ్డుపడరాదన్న ఇంగితాన్ని గ్రహిస్తే బావుంటుంది. ఒకవైపు తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలనను కండ్లకు అద్దుకుంటున్న తరుణంలో ఇలాంటి చౌకబారు ఆరోపణలతో అమాయక ప్రజలను అయోమయానికి గురిచేయడం ప్రతిపక్షాలకు తగదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా జాగరూకతతో ఉండాలి. పనికిమాలిన రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలు పసలేని మూటలుగా మిగల్చాలి. ఈ ఉత్తమ పాలన ఇలాగే సాగేందుకు తోడుండాలి. బంగారు తెలంగాణలో భాగం కావాలి.

873
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles