కవన కడలి

Mon,June 11, 2018 10:38 PM

Narayana-Reddy
ఆషాడ శుద్ధపౌర్ణమి నాడు
మొలకెత్తిన ఓ కళానిధి..!!
విశ్వంభరతో జ్ఞానపీఠాన్ని
అధిరోహించిన ఓ సింహేంద్ర..!!
నీ కలము.. గళం విరతి శయ్యపై
నిద్రించినదా ఓ మట్టి మనిషి ..!!

ఆ రెక్కల సంతకాలు
మా హృదిలోకంలో పదిలమేలే..!!
భూగోళమంత మనిషివై
శూన్యంలో కవన తారవై వెలిగిపో..!!

నీతో కలసి నడిచే ఆ రోచిస్ సాక్షిగా
కవనాన్ని ముఖాముఖీ చేసి
ఆకాశ సాగరానికి తపస్సుకై
కొనగోటి జీవితాన్ని వదిలి
తేజస్సువై నిలిచిపో..
ఓ విశ్వనాథ నాయుడా..!!

నీ వ్యక్తిత్వం.. దృక్పథం..
మా కలాలకు ఓనామాలై నిలుస్తాయి
శాశ్వత శాయికలోనున్న నీకు
నా చిరు కవితాభిషేకం
అందుకో ఓ కర్పూర వసంతరాయల..!!
- లై, 9491977190
(నేడు సినారె వర్ధంతి)

588
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles