తెలంగాణలో చంద్రోదయం

Wed,May 16, 2018 01:11 AM

పాలమూరు జిల్లాలో అదో పల్లెటూరు. నేనొక పెళ్లి వేడుక కోసం ఆ ఊరి పక్కనుంచి వెళ్తుంటే అక్కడ కేరింతలు, ఆనోందోత్సాహాలతోచిందులు వేస్తున్నరు యువరైతులు. బతుకమ్మ ఆడుతున్నరు మహిళలు. విషయమేంటని ఆరాతీస్తే.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకం కింద జారీచేస్తున్న చెక్కులు, పాస్‌బుక్కుల పంపకం. మండుటెండలో పండువెన్నెలలా నాట్యం చేస్తున్నట్లుగా కనిపించింది గ్రామ ప్రజల ఉత్సాహభరిత వాతావరణం. సమాజంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలతో సుపరిపాలన చేస్తున్న తెరాస ప్రభుత్వ హయాం రాష్ట్ర ప్రజలకు ఉషోదయం. గత ప్రభుత్వాల హయాంలో అలుముకున్న కాళరాత్రిని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో పటాపంచలు చేస్తూ వ్యవసాయరంగంలోనే కాకుండా రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపితే తెలంగాణలో చంద్రోదయం.

ఒకరిద్దరిని నేను పలుకరిస్తే వారి కళ్లల్లో ఆనందంతో జాలువారుతున్న కన్నీటి ధారలు. సార్ మేం కలలో కూడా ఊహించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సహాయం అందుతుందని గద్గదస్వరంతో చెప్పారు. ఒక యువరైతు సుధీర్ఘంగా మాట్లాడుతూ సార్ వ్యవసాయానికి కావాల్సిన కరెంటు వస్తున్నది. మాకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వల్ల ఈ సీజన్‌లో నీళ్లు కూడా వచ్చాయి. రైతు బంధు పథకం కింద ఇక ఇప్పటినుంచి పెట్టుబడి సాయం కూడా అందుతున్నది. ఇక మాకు ప్రభుత్వం నుంచి కావాల్సింది గిట్టుబాటు ధర. అది కూడా మన ముఖ్యమంత్రి గారి మాటలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వ్యవసాయాన్ని పండుగ చేస్తారన్న నమ్మకం కలిగింది. సమయానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా చేస్తే మాకు పరిపూర్ణ న్యాయం చేసినవారవుతారు. ప్రభుత్వంతో పాటు రైతుకు ప్రకృతి కూడ సహకరించాలి. ఆరుగాలం మేం కష్టించి పండించిన పంటను తుఫాను భూతం ఆఖరి దశలో అతలాకుతలం చేసినప్పుడు, బీమా పథకం కూడా ప్రవేశపెడితే మాకు, మా జీవితాలకు భరోసా కల్పించినవారవుతారు అని తన మనసులోని భావాలను ఉద్వేగతంతో చెప్పాడు. రైతు ఆత్మహత్యలకు ముఖ్య కారణం చెప్పమని అడిగితే.. అతను సార్ మొట్టమొదట కల్తీ విత్తనాల బెడద. చేను ఏపుగా పెరిగి పంట రాకపోతే రైతు గుండెకోత ఎవ్వరికి చెప్పుకోవాలి. విత్తనం అమ్మిన వ్యాపారి అడిగితే బెదిరిస్తాడు. లేదా ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. విత్తనాలు కొన్నప్పుడు వ్యాపారి ఇచ్చిన రశీదు ఎక్క డో పోగొట్టుకుంటాడు. దాంతో దిక్కుతోచని నిస్సహాయుడవుతాడు. రెండవ కారణం గిట్టుబాటు ధర లేకపోవడం. వడ్డీలకు తెచ్చిన పెట్టుబడి పెరిగి, ఇంట్లో ఉన్న అమ్మాయి పెళ్లి చేయలేని స్థితిలో ఉరితాడే శరణ్యం అనుకుంటాడు రైతు అని దైన్యంగా చెప్పాడు. ఆ యువరైతు మాటల్లో నిజాయితీ ధ్వనించింది. దానితోపాటు ఆత్మవిశ్వాసం కనిపించింది.

ఇంతకు ముందు ఏపార్టీ అధికారంలో ఉన్నా రైతు సంక్షేమం గురించి ఉపన్యాసాలు ఇచ్చేది. రైతే రాజు, రైతు రాజ్యం రావాలి అన్న గొప్పగొప్ప మాటలతో మభ్యపెట్టేవారు. అధికారంలోకి వచ్చాక రైతు సంక్షే మం ఊసే ఉండదు. దురదృష్టం ఏమంటే అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మెజార్టీ నాయకులు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారే. కానీ ఒకసారి అధికార పీఠం ఎక్కగానే వ్యవసాయాన్ని, వ్యవసాయదారుల్ని విస్మరించడమే గాక చులకనగా చూస్తారు. ఇదీ రైతుల పట్ల గత పాలకులకు ఉన్న నిర్లక్ష్యం.ప్రత్యేక రాష్ట్రం కోసం 14ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ రంగంలో అపార అనుభవం ఉన్నది. రైతులపై అవ్యాజానురాగం ఉంది. స్వయంగా వ్యవసాయంపై గ్రామీణ జీవితంపై సమగ్ర అవగాహన ఉంది కాబట్టే ఏం చేస్తే వ్యవసాయరంగం బాగుపడుతుందో, అలాంటి ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాడు సీఎం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అనేక సభల్లో రెప్పపాటు పోకుండా కరెంటు వస్తుందని చెప్పారు. అది ఈ రోజు మన కళ్లముందు కనపడుతూనే ఉన్న ది. అలాగే వ్యవసాయానికి కావాల్సింది నీటి వసతి. తెలంగాణ దక్కన్ పీఠభూమి. నీటి వసతి గానీ, రేవు పట్టణాలు గాని లేవు. కాబట్టి బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని నైజాంకు అప్పగించారు. ఇలాంటి ప్రాంతాల్లో రాళ్లలో రత్నాలు పండించవచ్చునని నిరూపించడానికి సీఎం కేసీఆర్ ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచారు. తాను కలలు గంటున్న బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని ఆధునీకరిస్తే తప్పా అది సాధ్యం కాదని పట్టుబప్రాజెక్టుల పూర్తికోసం అలుపెరుగని కృషి చేస్తున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా కష్టించే నీటి పారుదల శాఖ యువమంత్రి హరీశ్‌రావును ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ కాళేశ్వ రం లాంటి భారీనీటి ప్రాజెక్టు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తికావాలంటూ నిరంతరం పరితపిస్తున్నాడు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రగతిని చూసి దేశమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ప్రజలు ఒక పర్యాటక క్షేత్రంగా భావిస్తూ సందర్శిస్తున్నారు.కరెంటు నీటి వసతి తరువాత రైతుకు కావాల్సింది పెట్టుబడి. రైతులు బ్యాంకుల చుట్టూ, ప్రవేట్ వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరిగే అగ త్యం లేకుండా చేయాలనే సదుద్దేశంతోనే ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారరరరరు. ఇక పంటకు గిట్టుబాటు ధర. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేయలేదు. దీని కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలి. రైతు గిట్టుబాటు ధర లేక నష్టపోవడానికి కారణం ప్రభుత్వమే కాకుండా రైతు స్వయంకృతం కూడా. లాభసాటిగా ఉందని ఒక పంటను ఒక ప్రాంతం వారు పండిస్తే అదే పంటను వేసి దానికి డిమాం డ్ లేకుండా చేసుకుంటున్నారు. ఉదాహరణకు పత్తి ధర బాగా పలుకుతే అందరూ పత్తి పంటనే పండిస్తారు. రైతు బలహీనతలను, అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు ధరలను తగ్గించడం, లేదా కొనుగోలు ఆపివేయడం లాంటివి చేస్తారు. అలాగే నిల్వ ఉండలేని కూరగాయలు, పండ్లు కూడా. ఒక్కసారి టమాట ధర ఆకాశానికి తాకితే ఇంకోసారి కొనేవారే లేక రోడ్లపై పారేస్తున్న సందర్భాలు అనేకం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పూర్తి బాధ్యత తీసుకోవాలి. రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎప్పుడేం పంట వేయాలో సూచన లు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది.
reedy
రైతుబందు చెక్కుల పంపిణీ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలన్నారు. అనుసంధానం చేయడమే కాకుండా దానిని నామమాత్రంగా అమలవుతున్న ప్రస్తుత తీరునుమార్చి పటిష్ఠస్థితిలోకి తీసుకెళ్లాలన్నారు. నేడు ఉపాధి హామీ పథకం అంటే ప్రజల్లో చులకనభావం ఏర్పడింది. శ్రమలేకుండా వచ్చే డబ్బుతో వ్యవసాయానికి కూలీ లు దొరుకకుండా పోయారు. తత్ఫలితంగా వ్యవసాయమే భ్రష్టుపట్టిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా కల్తీ విత్తన వ్యాపారం జోరుగా సాగుతున్నది. కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నా దాని బెడద పూర్తిగా పోలేదు. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వ్యాపారస్తులను కట్టడి చేయాల్సి ఉన్నది. రైతు పండించిన పంట సకాలంలో ఇంటికి చేరాలంటే ప్రభుత్వమే కాదు, ప్రకృతి కూడా సహకరించాలె. ఆరుగాలం కష్టించి ఇంటికి వచ్చే పంట నేల పాలయితే రైతు నిస్సహాయుడిగా మిగిలిపోకూడదు. దానిని అధిగమించాలంటే సులువైన బీమా పథకం ఉండాలి. ఇప్పుడూ బీమా పథ కం ఉంది. కానీ దాని గురించి సరైన అవగాహన లేదు. బ్యాంకుల్లో అప్పు తీసుకున్నప్పుడు బీమా ప్రీమియం రైతు అప్పు ఖాతాకు డెబిట్ చేస్తారు.ఎప్పుడు క్లయిమ్ చేయాలో, ఎలా చేయాలో కూడా తెలియదు. అందువల్ల బీమాను సులభతరం చేసి రైతుకు అవగాహన కల్పిస్తే ప్రకృతి వైపరీత్యాలను కూడా అధిగమించినవారవుతారు. వ్యవసాయంపై అవగాహన, రైతులపై అభిమానం ఉన్న మన ముఖ్యమంత్రి దక్షతోనే రైతులకు రక్షణ దొరుకుతుంది.

బంగారు తెలంగాణ స్వాప్నికుడు సీఎం కేసీఆర్ సమాజంలోని ప్రతి వర్గాభివృద్ధికి వివిధ నూతన పథకాలు, అనూహ్య ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గొల్లకురుమలకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, రాష్ట్రంలోని ఏ వర్గాన్ని విస్మరించడంలేదు. నిర్లక్ష్యం చేయడం లేదు.కులమతాలకు అతీతంగా అభివృద్ధికి సోపానాలు వేస్తున్నారు. ఉందిలే మంచికాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా అన్న సినీ కవి గీతం నిజం కాబోతున్నది.రైతే రాజ్యం ఏలాలి రామరాజ్యం రావాలి అన్న మరో కవి మనోగతం ఆకృతి దాల్చబోతున్నది. సమాజంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలతో సుపరిపాలన చేస్తున్న తెరాస ప్రభుత్వ హయాం రాష్ట్ర ప్రజలకు ఉషోదయం. గత ప్రభుత్వాల హయాంలో అలుముకున్న కాళరాత్రిని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో పటాపంచలు చేస్తూ వ్యవసాయరంగంలోనే కాకుండా రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపితే తెలంగాణలో చంద్రోదయం.

670
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles