దేశం కోరుతున్న నాయకుడు

Wed,May 16, 2018 01:09 AM

కేసీఆర్ వేసిన ఈ అడుగుకు తప్పకుండా దేశవ్యాప్త మద్దతు లభిస్తుంది. ఆయనలోని నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం, మేధస్సు ఆయనకు పెద్ద బలం. దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాలంటే కేసీఆర్‌లాంటి నాయకుడు అవసరం.

నేడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. 70 ఏండ్ల స్వతంత్ర దేశంలో పేదవాడి ఎదుగుదల ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిం ది. తరాలు మారుతున్నా తలరాతలు మారలేని స్థితి. పాలకులు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు. ఇంకా భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే 70 ఏండ్లుగా చెప్పుకుంటూ వస్తున్నం. రైతు రాజు అవుతాడనుకుంటే రాజ్యం విడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తున్నది. పార్టీలు మారుతున్నయ్ తప్పితే పరిస్థితిలో ఇసుమంతైనా మార్పులేదు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏకత్వా న్ని చెడగొడుతూ రాజకీయవసరాలను తీర్చుకుంటున్నాయి. ఈ ఆటలో పావులవుతున్నది మాత్రం సామాన్య ప్రజానీకం. దేశంలో సమూల మార్పులు అవసరం. రాజకీయవ్యవస్థ పూర్తి ప్రక్షాళన అవసరం. ఆ దిశ గా ప్రయత్నం జరుగాలంటే స్పష్టమైన అవగాహన కలిగిన నాయకత్వం అవసరం. సమస్యను మూలాల్లోకి వెళ్ళి పరిశీలించే, వ్యవస్థపై మంచి పట్టున్న నాయకుడు అవసరం. కేసీఆర్ అందుకు సరితూగుతారు.

కాంగ్రెస్, బీజేపీ వరుసగా ఒక పార్టీ పోతే మరో పార్టీ అధికారంలోకి వస్తూ పోతున్నాయి. ప్రజలు ఈ పార్టీలతో విసిగి వేసారిపోయారు. అయి నా గెలిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ రెంటికీ ఇప్పటివరకు సరైన ప్రత్యామ్నాయం లేదు. గతంలో ప్రత్యామ్నాయం పుట్టుకొచ్చినా దానికి నాయకత్వం వహించి, ఆ కూటమిని సరైన పద్ధతిలో నడిపించే నాయకు డు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అందరిని నడిపించగల చతురత కేసీఆర్‌లో ఉందనేది నిజం.దేశంలో 70 ఏండ్లుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. రైతు తను పండించిన పంటకు తాము ధర నిర్ణయించుకోలేని పరిస్థితి. రోడ్డుపై అమ్ముకునే చిన్నాచితకా వ్యాపార సంస్థల నుంచి బడాబడా కార్పొరేట్ సంస్థల వరకు తమ ధరను తామే నిర్ణయించుకొని ఏకతాటిపై వ్యాపారం చేస్తూ ఎదుగుతున్నారు. ఎంతసేపూ పేదవారిని, రైతులను ఎన్నికల కోసమే వాడుకున్నారు తప్పిస్తే వాళ్ల బతుకు మార్పు కోసం ఏనాడూ ఆలోచించలేదు.

అందుకే కేసీఆర్ కరీంనగర్‌లో రైతు సమన్వయ సమితి సమావేశంలో చేసిన ప్రసంగంపై దేశవ్యాప్త చర్చ జరిగింది. ప్లీనరీ వేదికగా చేసిన ప్రసం గం రైతులను ఆలోచనలోకి నెట్టింది. కేసీఆర్‌తో రైతు బాగుపడుతాడని వారు విశ్వసిస్తున్నరు. కేసీఆర్ చెప్పిన ఆధారాలతో కూడిన విషయాలపై దేశవ్యాప్తంగా పెద్దస్థాయిలో చర్చ జరిగింది. దేశప్రజలు ఒక ప్రత్యామ్నా యం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేసీఆర్ ఈ చర్చను తెరలేప డం, ఆ దిశగా పావులు కదుపడం మంచి పరిణామం.కేసీఆర్‌కు ఇది సాధ్యపడుతుందా? ఒక్కడితో ఇదెలా సాధ్యం? ప్రాం తీయ పార్టీలు ఒకే కూటమిలో మసులగలయా? అనేవి విమర్శకులు వెలిబుచ్చుతున్న సందేహాలు. అయితే ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ప్రజలకు సమస్య తీవ్రతను వివరించడంలో సఫలమయ్యారు. ప్రజల్లోకి వెళ్లడం, వారి సమస్యను తెలుసుకోవడం, దాని మూలాల్లోకి వెళ్లి పరిశీలించి పరిష్కారం కోసం పట్టుబట్టడం నాయకత్వ లక్షణాలు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వేసిన ప్రతి అడుగుపై విమర్శలు వచ్చాయి. ఈయనతో అవుతుందా, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధ్యమా, అనే సందేహాలను కొందరు వ్యక్తంచేశారు. కానీ ఆ తర్వాత ఆయన వేసిన ప్రతి అడు గు విజయం దిశగా పయనింపజేసింది. ప్రతి ఆటుపోటులో విజయాన్ని వెతుక్కున్నారాయన. ఎక్కడా వెనక్కితగ్గక ప్రజలకు వివరిం చి, వారికి అర్థమయ్యే విధంగా చైతన్యపరిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించి గమ్యాన్ని చేర్చారు. నేడు పాలనలో సైతం భేష్ అనిపించుకుంటున్నారు. ఈయన పాలనపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది. తెలంగాణ పథకాలను చాలా రాష్ర్టాలు మోడల్‌గా తీసుకుంటున్నాయి. ఇదే కేసీఆర్‌కున్న అనుకూలాంశం. ఒక ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా అతన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానిస్తారు.
vijay
తెలంగాణ ఉద్యమకాలంలో దేశంలోని దాదాపు అన్ని పార్టీలతో కేసీఆర్‌కు సత్సంబంధాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట కాంక్షను జాతీయస్థాయిలో అన్నీ మీడియా సంస్థలకు, అన్ని పార్టీల నాయకులకు వివరించారు కేసీఆర్. గంటల తరబడి వారితో సమావేశమయ్యారు. ఇప్పుడు ఆయన సామాన్య ముఖ్యమంత్రే అయితే దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరిగేది కాదు. కేసీఆర్ గారి పిలుపుతో ఆయనకు ఒక్కొక్కరుగా మద్ద తు తెలుపుతున్నారు.వ్యవసాయం పట్ల కేసీఆర్‌కు ఉన్న అవగాహన చాలా గొప్పది. రైతుల కు పెట్టుబడి సాయం అనేది ఒక గొప్ప నిర్ణయం. దీనిపై దేశవ్యాప్త చర్చజరుగుతున్నది. కొద్దిరోజులుగా రైతుబంధు పేరుతో రైతులకు చెక్కులు అందించడం జరుగుతున్నది. రైతుల మొహాల్లో ఆనందం కనిపిస్తున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జాతీయపార్టీలు అని చెప్పుకుంటున్నవారు ఆ దిశగా కనీసం ప్రయత్నాలు కూడా చేయలేదు. ఉపాధి హామీ పథకం అసలు ఉద్దేశమే లేకుండా పోయింది. చెరువుల పక్కన కాలువలు తీపించడం, మళ్ళీ అవే కాలువలు పూడ్చటం మరికొన్ని రోజులకు అవే కాలువలను తిరిగి తవ్వ డం ఇలా వేల కోట్ల రూపాయల ధనం వృథా అవుతున్నది. కనీస అవగాహన లేని పాలకులు ఈ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచన ఏనాడూ చేయలేదు. కేసీఆర్ ఉద్యమం నుంచి ఇది చెప్తూనే ఉన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా రైతులకు వ్యయం తగ్గుతుంది. ఉపాధి లేనివాళ్లకు పని కల్పించినట్టు ఉం టుంది.

అధికారమే పరమావధిగా, ఎన్నికలే అజెండాలుగా, కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగివేసారిపోయారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టే తిరిగి వాళ్లనే గెలిపిస్తూ వస్తున్నారు. దేశానికి నాయకత్వం వహించడానికి మోదీకి ఉన్న అర్హత ఏమిటి, కేసీఆర్ గారికి లేని అర్హత ఏమిటి? మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, అనంతరం ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై విసిగివేసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పవ చ్చు. ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకే పట్టం కట్టారు తప్పితే రైతుల గురిం చి ఏనాడూ ఆలోచన చేసింది లేదు. పైగా నల్లధనం వెనక్కు తీసుకొస్తామంటూ పెద్ద నోట్లను రద్దుచేశారు.కానీ స్వేచ్ఛగా బడాబాబులు నల్లధనాన్ని మార్చుకునేందుకు నోట్లరద్దు సహకరించిందనే విమర్శలున్నాయి. దేశంలో చైతన్యం ఏర్పడింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.ఈ సమయంలో కేసీఆర్ వేసిన ఈ అడుగుకు తప్పకుండా దేశవ్యాప్త మద్దతు లభిస్తుంది. ఆయనలోని నాయకత్వ లక్షణాలు, పోరాడే తత్వం, మేధస్సు ఆయనకు పెద్ద బలం. దేశ రాజకీయాల్లో సమూలమార్పు రావాలంటే కేసీఆర్‌లాంటి నాయకుడు అవసరం. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ యం దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలువబోతున్నది. ఇదో చరిత్రాత్మక సందర్బం. దేశంలో కేసీఆర్ ఒక నూతన అధ్యాయం సృష్టించనున్నారనడంలో సందేహం లేదు.

632
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles