సాక్షుల తెగువ, అధికారుల నిబద్ధత

Mon,May 14, 2018 11:24 PM

నేరాలను విచారించిన కోర్టుల తీర్పులు స్థిరంగా ఉంటాయా ఉండవా చెప్పలేం. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో అవి నిలబడకపోవచ్చు. నిలవచ్చు కూడా. ప్రముఖులు ముద్దాయిలుగా వున్న కేసులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. బలవంతుల కేసుల్లో సాక్షులు సంవత్సరాలుగా వేచి ఉండి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంతో తీవ్రమైన ఒత్తిడిని వాళ్ళు అనుభవించి ఉంటారు.
law
అది ఆసారమ్ బాపు కేసే కావొచ్చు. సల్మాన్‌ఖాన్ కేసే కావచ్చు. సాక్షులకు మన దేశంలో సరైన రక్షణ లేదు. అలాంటి పరిస్థితులు వున్న మన దేశంలో బలమైన వ్యక్తులకు ఎదురుగా నిలిచి సాక్ష్యం చెప్పడం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు.
ఆసారామ్ బాపు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి మధుసూదన శర్మ. జోద్‌పూర్‌లో వున్న షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన లైంగికదాడుల ప్రత్యేక కోర్టుకు ఆయన న్యాయమూర్తి. ఆసారామ్ బాపు కేసును ఆయన విచారించారు. గత ఏప్రిల్ చివరి వారంలో కేసులో తీర్పు చెప్పి బాపుకు జీవిత ఖైదు శిక్షను విధించారు. మే మొదటి వారంలో ఆయనకు బదిలీ అయ్యింది. జాయింట్ లా సెక్రటరీగా ఆయనను బదిలీ చేశారు. ఆ వార్త చదివి ఓ జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఓ కామెంట్ పంపించాడు. శిక్ష వేసినందుకు శిక్ష అని ఆ కామెంట్. అలా అయివుండకపోవచ్చు అని మిత్రునితో చెప్పినా అతను విన్పించుకోలేదు. అలాంటి అభిప్రాయం ఏర్పడటం సహజమే! ఎందుకంటే అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న రోజుల్ల ఆయనతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇప్పటి ప్రధాని మోదీ, అద్వానీ లాంటి ఎందరో ప్రముఖులు ఆయనతో సన్నిహితంగా మెదిలారు. అయినా సరే! అలాంటి బదిలీ కాదని చెప్పడానికి రాజస్థాన్‌లో వున్న ఓ న్యాయమూర్తితో సంప్రదించి విషయం కనుక్కొన్నాను. ఆ న్యాయమూర్తి ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ కోర్టులో అతని పదవీ కాలం ముగిసిందని అది రొటీన్ బదిలీ అని అంతేకాదు అతను ఇష్టపడిన పదవీలోకి వెళ్తున్నాడని. మా జర్నలిస్ట్ మిత్రునికి ఆ సమాచారం చెప్పి కోర్టుల్లో ఇంకా కొంత న్యాయం మిగిలి ఉందని చెప్పాను.

2013 సెప్టెంబర్‌లో ఆసారామ్ బాపు బెయిల్ పిటీషన్‌ను విచారిస్తున్న అప్పటి సెషన్స్ జడ్జి మనోజ్‌కుమార్ వ్యాస్‌ను బెయిల్ ఇవ్వకపోతే బాగుండదని బెదిరించారు. కోర్టు విచారణ సమయంలో ఆసారామ్ బాపుకు సరైన రక్షణ ఇవ్వాలని పోలీస్‌స్టేషన్ అధికారిని బెదిరించారు. కేసు విచారణ సమయంలో రాజీ చేసుకోవాలని బాధితురాలిని బెదిరించారు. మరో కీలక సాక్షిపైన యాసిడ్ దాడి కూడా జరిగింది. ఇలా చాలా మంది సాక్షులపైన దాడి జరిగింది.

ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ అధికారి డీజీ వంజారా మరోరకమైన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆసారామ్ బాపూని రేపిస్ట్ అనకూడదని, తనను రేప్ చేశాడని బాధితురాలు ప్రథమ సమాచారంలో చెప్పలేదని చార్జిషీట్‌లో కూడా పేర్కొనలేదని అతని వాదన. బాధితురాలి ప్రకారం.. బాపు అసభ్యకరంగా ఆమె శరీరాన్ని తాకినాడని మాత్రమే ఆమె చెప్పిందని. తన వాదనను సమర్థించుకోవడానికి అతను తన దగ్గర ప్రథమ సమాచార నివేదిక కాపీ, అదేవిధంగా చార్జిషీట్ కాపీ ఉందని అతను చెప్పాడు. చాలా సంవత్సరాలు పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తికి సాక్ష్యానికి, ప్రథమ సమాచార నివేదిక, చార్జిషీట్ భేదం తెలియకపోవడం ఆశ్చర్యం కన్నా బాధను ఎక్కువ కలుగజేసింది. నేరానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రమే ఎఫ్‌ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)లో ఉంటుంది. అది ఎన్‌సైక్లోపీడియా కాదు. చార్జిషీట్ సాక్ష్యమూ కాదు. బాధితులు కోర్టుల్లో చెప్పిందే సాక్ష్యం అవుతుందన్న కనీస పరిజ్ఞానం లేకపోవడం జాలి కలిగిస్తుంది.

రేప్ కాదని అతని మరో స్టేట్‌మెంట్ తొమ్మిది సంవత్సరాలు జైలులో ఉన్నాడు కాబట్టి చట్టంలో వచ్చిన మార్పులను అతను గమనించటం లేదని మనకు అర్థమవుతుంది. ఈ సంఘటన ఆగస్టు 2013లో జరిగింది.
ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామం. ఆమె చదువుకుంటున్నది మధ్యప్రదేశ్‌లోని ఆసారామ్ బాపు ఆశ్రమంలో. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగులేక అప్పుడప్పుడూ ఆమెకు మూర్చలు వస్తుండేవి. ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి హాస్టల్ వార్డెన్ శిల్పి ఆమెను జోద్‌పూర్ ఆశ్రమానికి తీసుకొనివెళ్ళి చికిత్స చేయించమని సలహా ఇచ్చింది. ఆమెపై కొన్ని చెడు ఆత్మలు ఉన్నాయని అక్కడికి వెళ్తే అవి తొలిగిపోతాయని కూడా ఆమె సలహా ఇచ్చింది. ఆ బాధితురాలి తల్లిదండ్రులు ఆమె జోద్‌పూర్‌లోని ఆశ్రమానికి తీసుకొనివెళ్లారు. అక్కడ ఆశ్రమంలో ఆసారామ్ బాపు ఆమె మీద లైంగికంగా దాడి చేశాడు. ఈ సంఘటన ఆగస్టు 2013లో జరిగింది. లైంగిక దాడికి ఆమె అంగీకరించకపోతే ఆమె తల్లిదండ్రులను చంపివేస్తానని ఆసారామ్ బాపు ఆమెను బెదిరించాడు.
ఆ తర్వాత ఢిల్లీలో ఓ మతపరమైన సమావేశాన్ని ఆసారామ్ బాపు ఏర్పాటుచేశాడు. బాధితురాలు ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. ఆసారామ్ బాపు చేసిన దుశ్చర్యలను అక్కడ తల్లిదండ్రులకు వివరించింది బాధితురాలు. బాధితురాలి తల్లిదండ్రులు ఆసారామ్ బాపుతో సమావేశమైనారు. కానీ ఆ సమావేశం ఫలప్రదం కాలేదు. ఫలితంగా వాళ్ళు కమలా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి 2013 ఆగస్టు 20న ఫిర్యాదును దాఖలు చేశారు. జోద్‌పూర్‌లో నేరం జరిగినందున ప్రథమ సమాచార నివేదికను జోద్‌పూర్‌కు ఢిల్లీ పోలీసులు బదిలీ చేశారు. ఆమెను చంపివేస్తామని బెదిరింపులు ఎన్ని వచ్చినా ఆమె భయపడకుండా స్టేట్‌మెంట్‌ను పోలీసులకు ఇచ్చింది. 2013 సెప్టెంబర్ 1న ఆసారామ్ బాపును అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తిచేసి 2013 నవంబర్‌లో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.

గత నాలుగేండ్ల కాలంలో అంటే కోర్టులో విచారణ మెదలైనప్పటి నుంచి రెండు కేసుల్లో ఉన్న 9 నుంచి సాక్ష్యుల మీద దాడి జరిగింది. అందులో ముగ్గురు చనిపోయారు. అరెస్టు అయినప్పటి నుంచి ఆసారామ్‌బాపూ జైళ్లోనే వున్నాడు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఏ కోర్టూ అతనికి బెయిల్ మంజూరు చేయలేదు.
అసహజరీతిలో లైంగికచర్యలో పాల్గొనాల్సిందిగా ఆసారామ్ బాపు ఒత్తిడి చేశాడని బాధితురాలు సాక్ష్యం చెప్పింది. అది రేప్ నేరం కాదని వంజారా లాంటి వ్యక్తుల వాదన. నిర్భయ సంఘటన తరువాత భారతీయ శిక్షాస్మృతిలోని రేప్ (సెక్షన్ 375) నిర్వచనాన్ని పూర్తిగా మార్చివేశారు. అందులోని సెక్షన్ 375 (డి) ప్రకారం అసహజ కృత్యాలన్నీ లైంగికదాడిగానే పరిగణించబడుతాయి.
బాధితురాలి సంఘటన కన్నా ముందే ఈ చట 3-2-2013 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో మాదిరిగా పురుషుడు తన మర్మాంగాన్ని స్త్రీ మర్మాంగంలో జొప్పిస్తేనే రేప్ అన్న నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఈ విషయం గమనించని వంజారా లాంటి ఐపీఎస్ అధికారులు మాట్లాడుతున్నారు. వాళ్ళ అజ్ఞానాన్ని ఇది బయటపెడుతుంది.
పెద్దవాళ్ళు కేసులను దర్యాప్తు చేస్తున్న, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. వాళ్లకు కూడా బెదిరింపులు వస్తూ ఉంటాయి. అధికారులూ, న్యాయమూర్తుల పరిస్థితే ఈ విధంగా ఉంటే మామూలు సాక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
mangari-rajender
2013 సెప్టెంబర్‌లో ఆసారామ్ బాపు బెయిల్ పిటీషన్‌ను విచారిస్తున్న అప్పటి సెషన్స్ జడ్జి మనోజ్‌కుమార్ వ్యాస్‌ను బెయిల్ ఇవ్వకపోతే బాగుండదని బెదిరించారు. కోర్టు విచారణ సమయంలో ఆసారామ్ బాపుకు సరైన రక్షణ ఇవ్వాలని పోలీస్‌స్టేషన్ అధికారిని బెదిరించారు. కేసు విచారణ సమయంలో రాజీ చేసుకోవాలని బాధితురాలిని బెదిరించారు. మరో కీలక సాక్షిపైన యాసిడ్ దాడి కూడా జరిగింది. ఇలా చాలా మంది సాక్షులపైన దాడి జరిగింది.
ఇన్ని దాడులను ఎదుర్కొని నాలుగైదు ఏండ్ల వరకు వేచి ఉండి సాక్షం చెప్పడం చాలా గొప్ప విషయంగా భావించాల్సి ఉంటుంది.
ఈ కేసు పై కోర్టుల్లో ఎన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం కానీ సాక్షుల తెలగువ, అధికారుల నిబద్ధత ఇతరులకు ఆదర్శం కావాలి.

445
Tags

More News

VIRAL NEWS