ఇంకా వంకర బుద్ధి మారదా?venu-gopal

Sat,May 12, 2018 11:34 PM

1990 దశకంలో మొదలైన వ్యవసాయ సంక్షోభానికి మౌలిక పరిష్కారం చూపడానికి ఏ రాజకీయపార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధితో కృషిచేయలేదు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ విధానం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ప్రాంతీయపార్టీలు, పరివర్తనాభిలాషులు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకు పోతే ఉత్తర, పశ్చిమ భారతంలో రైతులతో పాటు భిన్నవర్గాలలో కదలిక వస్తుందని ఆశించవచ్చు.

పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టుమన్నాడట వెనుకటికెవడో! తెలంగాణ ఏర్పడి నాలుగేండ్లయిన తర్వాత కూడా కొందరు రాజకీయ నాయకు లు సీమాంధ్ర పోషకుల మెప్పు కోసం తమ వంకరబుద్ధిని వదులుకోలేకపోతున్నారు. రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కూడా రాజకీయంగా బురద జల్లుకోవడానికి వాడుకోవ డం అవసరమా? తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుతగులు తూ, చివరికి నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా అడ్డుపుల్ల వేయజూసిన సీమాంధ్ర భృత్యువర్గానికి రైతుబంధు పథకం వంకరటింకరగానే కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభు త్వం చెరువులను తవ్వినా తప్పే. మల్లన్నసాగర్ నిర్మిస్తామన్నా మహా పాపమే. నీటిపారుదల ప్రాజెక్టులు కడుతామంటే నేరమే! రైతులను ఆదుకుంటామంటే ప్రళయమే! ఆనా డు సీమాంధ్ర పాలకులు ఒక్క నీటిచుక్క కూడా ఇవ్వకపోతే వీరికి ఏ బాధా లేదు. బీడు భూముల్లో తుమ్మలు మొలిచిననాడు ఈ నాయకులు నోరు మెదుపలేదు. నాడు సీమాం ధ్ర నేతలకు కాళ్ళు పిసుకుతూ బతికిన పెద్ద మనుషులకు, ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న వ్యవసాయ విధానం తప్పులతడకగా కనిపిస్తున్నది! తెలంగాణవాదాన్ని అంగడి సరుకుగా వాడుకున్న ఒక నాయకుడికి రైతులకు ఇచ్చే తోడ్పాటు పాపపు సొమ్ము గా కనిపిస్తున్నది. రైతులు ఈ సొమ్ము తీసుకొని తప్ప తాగుతారనేది మరో నాయకుడి సూత్రీకరణ! రైతులు పండించిన అన్నం తింటూ మాట్లాడవలసిన మాటలేనా ఇవి?

తెలంగాణ ప్రభుత్వం ఎంతో తర్కించి ఒక పథకం ప్రవేశపెడితే చాలు అందులో వం కలు తీయడానికి సీమాంధ్ర పెంపుడు మేధావులు సిద్ధంగా ఉంటారు. రైతులకు పెట్టుబ డి మద్దతు ఇస్తున్నారు. అంతవరకు అదొక ముందుడుగే కదా! కౌలు రైతులకు ఇవ్వడం లేదనేది కొత్త వాదన. కౌలుదారులకు ఇవ్వడమనే అంశం ప్రభుత్వం ముందు చర్చకు వచ్చింది. కానీ అది ప్రస్తుతానికి ఆచరణ సాధ్యంకాదని విరమించుకున్నది. దానివల్ల ఫలితం ఉండదనేది మార్కెట్ సూత్రాలు తెలిసిన వారెవరికైనా అర్థమవుతుంది. ఒక యజమాని తన భూమిని ఎకరానికి పదివేలకు కౌలుకు ఇస్తున్నాడనుకుందాం.కౌలుదారుకు ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తే ఎట్లా ఉంటుంది ? యజమాని కౌలును పద్నాలుగు వేలకు పెంచుతాడు. కౌలుదారు కాదనడానికి వీలుండదు. ఆ సొమ్ము చివరికి భూమి యజమానికే చేరుతుంది. పైగా ఆంధ్రలో మాదిరిగా యజమాని పత్రం రాయించుకొని కౌలుదారు నుంచి కచ్చితంగా వసూలుచేసే పద్ధతి మన దగ్గర లేదు. వ్యవహారం నోటి మాటగా సాగుతుంది. పండితే ఇస్తారు, లేకపోతే యజమాని కూడా అంతగా బలవంత పెట్టడు. ఈ పరిస్థితులలో పెట్టుబడి తోడ్పాటును రైతులకు అందించడం ఒక ఆశించదగిన చర్యే కదా ! తెలంగాణ ప్రభుత్వం ఏదిచేసినా బదనాం చేయడమే రాజకీయమా?

రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న మొత్తం వ్యవసాయ విధానంలో భాగంగా చూడాలె. ఈ వ్యవసాయ విధానాన్ని, తెలంగాణను సంక్షోభం నుంచి బయటపడేసే మొత్తం అభివృద్ధి విధానాలలో భాగంగా చూడాలె. గతంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారనేది వాస్తవం. దేశవ్యాప్త సంక్షోభానికి తోడు, సీమాంధ్ర దమననీతి అనే అదనపు భారం తెలంగాణ రైతుపై పడ్డది. ఒక్క వ్యవసాయరంగమే కాదు, మొత్తం సామాజిక, ఆర్థిక వ్యవస్థలనే సంక్షోభంలోకి నెట్టారు నాటి పాలకులు. కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి న కేసీఆర్ ముందు అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసే కుట్రలు సాగినయి. కేసీఆర్ ఆ కుట్రలను తిప్పికొడుతూ తెలంగా ణ సమాజాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి సమగ్ర వ్యూహాలు అమలుచేసిన తీరు అసాధారణం. అందులో వ్యవసాయ విధానం చెప్పుకోదగినది. రైతు బంధు పథకమే కాదు, రైతుకు విత్తనాలు, ఎరువులు సజావుగా అందించడం, నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం, భూసార పరీక్షలు, వ్యవసా య అధికారుల నియామకం, గోదాముల నిర్మా ణం, రైతు సమితుల ఏర్పాటు మొదలైనవన్నీ వ్యవసాయ సమస్యలను అధిగమించడానికి చేపట్టిన సమగ్ర విధానంలో భాగం.

సీమాంధ్ర పాలకులు, వారి తాబేదారులు ఎంత అడ్డుపడినా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకొని తీరుతాం. ఎవరు ఎంత ఏడ్చినా రేపటి రోజు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తాం. తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల ని, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యం కాదనే నిర్ధారణకు వచ్చారు. అదను చూసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. విజయం సాధించారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సమూల మార్పులు తీసుకువస్తున్నప్పటికీ, ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి. వాటి పరిష్కారం రాష్ట్రస్థాయిలో సాధ్యం కాదు. దీంతో జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడ్డ ది. కేసీఆర్ జాతీయ స్థాయిలో క్రియాశీలంగా మారడానికి కేంద్ర రాష్ర్టాల సంబంధాలలో మార్పులు తేవడం మొదలుకొని విస్తృత ఎజెండా ఉన్నది. అం దులో వ్యవసాయ విధానం కూడా కీలకమైనది. కేసీఆర్ వ్యూహం- భావ సారూప్య పార్టీలతో కలిసి కేం ద్రంలో అధికారం చేపట్టి దేశంలో వ్యవస్థాగత మార్పులు తేవడం. దీంతోపాటు దేశవ్యాప్తంగా వ్యవసాయదారులను చైతన్యపరిచి వారిని ఈ కొత్త రాజకీయం వైపు పురికొల్పడం. తద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో తెలంగాణ విధానాల ను వర్తింపజేయడం. ఇందుకు దేశ రాజకీయ పరిస్థి తి కూడా అనుకూలంగా ఉన్నది.

బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని రాష్ర్టాలు మినహాయిస్తే మిగతా చాలా రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వీటిని కూటమిగా ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని కేసీఆర్ ఇప్పటికే ప్రారంభించారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిస్తే బీజేపీని దెబ్బతీయడం సాధ్యమేనని ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. యూపీలో పార్లమెంటు సీట్లు ఎనభై ఉన్నయి. 39 సీట్లున్న తమిళనాడులో డీఎంకే బలమైన పార్టీ. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రె స్ అజేయంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో 42 సీట్లున్న యి. ఇట్లా లెక్క చూస్తే కశ్మీర్ నుంచి దక్షిణాది వరకు ప్రాంతీయ కూటమి బలం ముందు ఏ జాతీయ పార్టీ నిలబడలేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ బలం గా ఉన్న గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హర్యా నా వంటి రాష్ర్టాలను కూడా కేసీఆర్ ఆ రెండు పార్టీలకు వదిలి పెట్టరు. ఈ రాష్ర్టాలలో రెండు పార్టీలు విశ్వసనీయత కోల్పోయి ఉన్నాయి. ఒక పార్టీ మీద యాష్టకొస్తే మరో పార్టీకి ఓటేయడం తప్ప వేరే దిక్కులేదు. వ్యవసాయ సంక్షోభం ఈ రాష్ర్టాలలో తీవ్రంగా ఉన్నది. రైతులలో అసంతృప్తే కాదు, ఆగ్ర హం పెల్లుబుకుతున్నది. ఉత్తరాది రాష్ర్టాలలో జాట్లు ఉద్యమాలు చేస్తున్నారు. గుజరాత్‌లో పటేండ్లు ఆం దోళన బాట పట్టారు. బీజేపీ అంటేనే వారు మండి పోతున్నారు. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, బీజేపీకి మూడు చెరువుల నీళ్ళు తాగించగలిగిందీ అంటే పటేండ్ల మద్దతే కారణం. పటేం డ్లు బీజేపీపై కుతకుతలాడుతున్నప్పటికీ, కాంగ్రెస్ తమ సమస్యలను పరిష్కరించగలుగుతదనే ఆశ వారిలో ఏ కోశానా లేదు. కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్న రాష్ర్టాలలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. చరణ్ సింగ్ తరువాత రైతులకు ఒక బలమైన నాయకత్వం దొరుకలేదు. ఇప్పుడు సమగ్ర వ్యవసాయ విధానం ముం దుపెడితే స్వీకరిస్తారు.
venu-gopal
బీజేపీ- కాంగ్రెస్ రాష్ర్టాలలో రాజకీయ క్షేత్రం కేసీఆర్ సందేశాన్ని స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నది. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలకు మాత్రమే పరిమితం కాదలుచుకోలేదు. దేశవ్యాప్తంగా మేధావులతో, వ్యవసాయవేత్తలతో, ఇతర రంగాల ప్రముఖులతో చర్చలు జరుపదలిచా రు. ఈ మేధోమథనం ద్వారా దేశ సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడమే కాకుండా, వారిని తన ఉద్యమంలో భాగస్వాములను చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ సందేశం బీజేపీ- కాంగ్రె స్ రాష్ర్టాలలోకి బలంగా చొచ్చుకుపోతుందా? ఎన్నికలలోగా ఇది సాధ్యమా అనే సందేహాలు అవసరం లేదు. కానీ ప్రజలలో చైతన్యంపెరిగి ప్రత్యామ్నా యం కోసం ఎదురుచూస్తున్న దశలో భావవ్యాప్తి వేగంగా సాగుతుంది. ఫ్రాన్స్‌లో తన విధానాలను ప్రజల ముందు పెట్టిన ఎమాన్వెల్ మాక్రాన్ అతి తక్కువ వ్యవధిలోనే దేశాధ్యక్షుడయ్యాడు. 2016 లో ఉద్యమాన్ని ప్రారంభించి, 201 7 ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పదవి చేపట్టారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా విస్తృతమైన కాలంలో ప్రజాభిప్రాయం కూడగట్ట డం సులభమవుతున్నది. ఫ్రాన్స్‌లో మాదిరిగా మన దేశ ప్రజలు తొందరగా కొత్త విషయాన్ని గ్రహించగలరా అనే అనుమానం అవసరంలేదు. 1970 దశ కం చివరలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రముఖులు చాలామంది ఇందిరాగాంధీకి ఎదురుతిరిగారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ప్రధాన గ్రూపులు ఇందిరాగాంధీ వ్యతిరేక శిబిరంలోనే ఉన్నాయి. పార్టీ వ్యవస్థ అంత బలంగా లేని కాలంలో చెన్నారెడ్డి పీసీసీ సారథ్యం స్వీకరించారు. కాంగ్రెస్(ఐ) కొత్త ఎన్నికల గుర్తు చేయి. ఈ మార్పును ప్రజలు గ్రహించి ఇందిరాగాంధీ చేయి గుర్తుకే ఓటు వేశారు. ఆనాడు అక్షరాస్యత ఇప్పటి క న్నా తక్కువ. మీడియా ప్రభావం చెప్పనవసరం లే దు. అయినా ప్రజలు మార్పును తెలుసుకున్నారు. ప్రజలను తక్కువగా అంచనా వేయకూడదు. 1990 దశకంలో మొదలైన వ్యవసాయ సంక్షోభానికి మౌలి క పరిష్కారం చూపడానికి ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు చిత్తశుద్ధితో కృషి చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ విధానం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ప్రాంతీయపార్టీలు, పరివర్తనాభిలాషులు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకు పోతే ఉత్తర, పశ్చిమ భారతంలో రైతులతో పాటు భిన్నవర్గాలలో కదలిక వస్తుందని ఆశించవచ్చు.తెలంగాణ వస్తే ఏమొస్తది? అని ఒకప్పుడు తెలంగాణ వ్యతిరేకులు వంకర ప్రశ్నలు వేశారు. తెలంగా ణ బాగుపడుతున్నది, దేశానికి దారి చూపుతున్నది!
pvegos@gmail.com

851
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles