రైతు నవ్విన రాజ్యం

Thu,April 19, 2018 11:45 PM

రైతుకు ముందుగానే పెట్టుబడి కోసం ఏడాదిలో రూ.8 వేలు ఇస్తున్నది. దీనికి సంబంధించిన చెక్కులను నేరుగా రైతుకే అందించనున్నారు. ఆయిటి మూనిందంటే చాలు ఆసాముల దిక్కు అప్పుకోసం, ఆకాశం దిక్కు వానకోసం చూసే రైతుకు చెరువు నీళ్లు, చేతికి పెట్టుబడి అందినయంటే మొఖం మీద చిరునవ్వు కాక మరేముంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తొలిసారిగా రైతు నవ్వుతున్నాడు.

ఎద్దు ఏడ్చిన ఎవుసం నడువదిరైతు ఏడ్చిన రాజ్యం నిలువది..ఇది చరిత్ర చెప్పిన సత్యం. నాటి నుంచి నేటి దాకా రైతును ఏడిపించిన ఏ రాజ్యమూ నిలువలేదు. రైతు ఏనాడూ మణులో, మాణి క్యాలో కోరలేదు. మడులకు నీరు కావాలని కోరాడు. షడ్రుచుల వంటలు కోరలేదు. పంటకు తగిన రేటు కోరాడు. బోర్లువేసి బోర్లపడ్డప్పుడు, ఆప్పు లు కుప్పలై తిప్పలు పడ్డప్పుడు, కరువులు వచ్చి చెరువులు ఎండినప్పుడు, ఎరువులు అందక ఎవుసం ఆగినప్పుడు కొంత చేతి ఆసరా కోరాడు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు కోరిన ఈ సాధారణ కోరికలు కూడా తీరలేదు. పంటకు ఇచ్చే ఆ కొద్దిపాటి కరెంటు అయినా సక్రమంగా ఇయ్యిమన్నందుకు కేసులుపెట్టారు. పెరిగిన కరెంటు ఛార్జీలను తగ్గించుమన్నందుకు నడీ రోడ్డుమీద పట్టపగలు ముగ్గురు రైతులను కాల్చిచంపిన చరిత్ర ఒకరిదైతే, రైతు వేషమేసి ప్రాజెక్టుల పేరుచెప్పి పదేండ్లు మోసంచేసి ఏ చెరువు కట్టకూ తట్టెడు మన్నుపోయని చరిత్ర మరొకరిది.

ఓ నాయకుడు రైతులు ఎక్స్‌గ్రేషియా కోసమే చస్తున్నారని ఎద్దేవా చేస్తే, మరో నాయకుడు రైతులకు అప్పులెక్కడియండీ బీరు బిర్యాని తిని తాగి అప్పుల పాలయ్యారని ఎకసెక్కాలాడాడు. ఆకలి విలువ తెలియని ఓ పాలకుడు పచ్చని పంట భూములను పారిశ్రామిక కేంద్రాలుగా చేస్తే పోటీపడి మరో పాలకుడు రింగు రోడ్డుల్లో అంగడి సరుకును చేసి సాప్ట్‌వేర్ ఉండగా ఎవుసమెందుకు దండుగ అని నినాదమే ఇచ్చాడు.
ఇన్ని అవహేళనల నడుమ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. టీఆర్‌ఎస్ మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. అప్పటికి రైతుకు మూడురకాల భయాలున్నాయి. ఒకటి.. ఆ మాత్రం కరెంటు అయినా దొరుకుతుందా లేదా అని. రెండవది.. సాగునీరు అందుతుందా లేదా అని. మూడవది.. అప్పులు ఎరువుల మాటేమిటని. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే సంస్కరణలను ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం మూడేండ్లలోనే రైతుకు మేమున్నామని ఆ మూడు భయాలకు పూర్తిగా భరోసా ఇచ్చింది.

తెలంగాణలో 55.49 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డా రు. 49.62 లక్షల హెక్టార్ల భూమి సాగులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లున్నాయి. తెలంగాణకు రోజుకు అవసరమైన విద్యుత్ 9500 మెగావాట్లు. కానీ రాష్ట్రం వచ్చేనాటికి అందుబాటులో ఉన్నది 6574 మేగావాట్లు మాత్రమే. అప్పుడు చాలినంత కరెంటు లేక పోవడంతో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించారు. గ్రామల్లో 6 గంటలు, పట్టణాల్లో 4 గంటలు, హైదరాబాద్‌లో 2 గంటలు కరెంటు కోత ఉండేది. ఇది అధికారికంగా మాత్రమే. కానీ ఇం తకు ఒకటి రెండు గంటలు ఎక్కువగానే కోత ఉండేది.

రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు నెలల్లోనే కరెంటు కష్టాలకు తెరదించింది కేసీఆర్ ప్రభుత్వం. సోలార్ విద్యుత్‌ను 32 మెగావాట్ల నుంచి 3283 మెగావాట్ల వరకు, జనరల్ విద్యుత్‌ను 6574 నుంచి పదిహేను వేల మెగావాట్ల వరకు పెంచుకొని వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తు న్నది ప్రభుత్వం. ఆటోమేటిక్ స్టాటర్లతో చిక్కువచ్చిపడింది. భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనికి రెండే పరిష్కారాలున్నాయి. ఒకటి ఆటోమెటిక్ స్టార్టర్లను తీసివేయడం. అది సాధ్యంకాకపోతే 9 గంటల నిర్విరామ కరెంటును మాత్రమే ఇవ్వడం. సమస్య తీవ్రం కాకముందే నివారణ చర్యలు చేపట్టడం మంచిది.

రైతుకున్న రెండవ భయం సాగునీటి విషయం. ఇప్పటికే సాగునీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకుపోతు న్నది. మిషన్ కాకతీయతో మూడు దఫాలుగా రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులకు మరమ్మతు చేసింది. కాలం కలిసివచ్చి ఈ సారైనా వానలు నిలిచి కొట్టి చెరువులు నిండితే రెండేండ్ల వరకు పల్లెలు పచ్చగా ఉంటాయి. గతేడాది సాగునీటి ప్రాజెక్టులకు 22 వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఏకంగా 25 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 23 పెద్ద, 13 మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు ఫ్లడ్ బ్యాంకుల ఆధునీకరణ పనులను మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇం దులో 5 మేజర్, 4 మీడియం ప్రాజెక్టులతో పాటు 57 ఎత్తిపోతల పథకాలు సిద్ధమయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు ప్రాజెక్టు పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంతో నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు, సీతారామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి.

నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అన్నది ఒకప్పటి సామెత. నీరు ఎత్తు నెరుగు నిజం కేసీఆర్ ఎరుగు అని సామెతను తిరుగరాసి నిజం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. 235 టీఎంసీల నీరును ఎత్తిపోసి గోదావరి జలాలతో 13 కొత్త జిల్లాలలోని పల్లెల కాళ్లు కడిగి రైతుకు పట్టిన శనిని తొలిగించబోతున్నది కాళేశ్వరం. ఇదొక మహాద్భుతం. దేశంలోనే అతి పె ద్ద లిఫ్ట్‌లు, ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌తో 3 బ్యారేజీ లు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్‌లతో 45 వేల ఎకరాలను సాగులోకి తేనున్నది. 60 ఏండ్ల ఉమ్మడిపాలనలో ప్రభుత్వాలు 25 లక్షల ఎకరాలకు సాగునీరిస్తే, కేవలం నాలుగేం డ్ల పాలనలో కేసీఆర్ ప్రభు త్వం 15 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చింది. కాళేశ్వరం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే రైతు తలరాతనే మారుతుంది.
Ashok
మూడవది ముఖ్యమైనది ఎరువులు, అప్పుల భయం. తెలంగాణలో 1970 వరకు ప్రకృతి సంబంధమైన వ్యవసాయమే జరిగింది. దేశీయ ఉత్పత్తులు సేంద్రియ ఎరువులు వాడకం వల్ల ఎక్కువ పెట్టుబడులు అవసరం కాలేదు. కొద్దిపాటి అప్పులకు కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎల్‌ఎంబీ బ్యాంకులు సాయం చేశాయి. తర్వాత వచ్చిన హరిత విప్లవంతో సంప్రదాయ వ్యవసాయం కుప్పకూలి వ్యవసాయం ఖరీదైన జూదమైంది. పం ట పండక, పండిన పంటకు ధరలు గిట్టక అప్పులు పెరిగిపోయాయి. రైతు కష్టాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం17 వేల కోట్ల రుణమాఫీతో 35,29,944 మంది రైతులను రుణవిముక్తులను చేసింది. అంతే కాకుం డా రైతు మరణిస్తే అతని కుటుంబం వీధిన పడకుండా 5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని 5 వందల కోట్లతో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా రూ.522 కోట్లు ఖర్చుచేసి వ్యవసాయ పనిముట్లు ఇవ్వనున్నది. ఇప్పటికే వ్యవసాయ సంబంధమైన ఏవో 120 ఏఈవో 2162 పోస్టులను నింపడమే కాకుండా రూ.132 కోట్లతో గోడౌన్లు నిర్మిస్తున్నది. ఇవన్నీ ఒకెత్తయితే రైతుబంధు పథకం మరో ఎత్తు. ఇది దేశంలో ఎక్కడా అమలుకాని ఏ ప్రభుత్వాలు అందించని అరుదైన పథకం. రైతుకు ముం దుగానే పెట్టుబడి కోసం ఏడాదిలో రూ.8 వేలు ఇస్తున్నది. దీనికి సంబం ధించిన చెక్కులను నేరుగా రైతుకే అందించనున్నారు. ఆయిటి మూనిందంటే చాలు ఆసాముల దిక్కు అప్పుకోసం, ఆకాశం దిక్కు వానకోసం చూసే రైతుకు చెరువు నీళ్లు, చేతికి పెట్టుబడి అందినయంటే మొఖం మీద చిరునవ్వు కాక మరేముంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తొలిసారిగా రైతు నవ్వుతున్నాడు.

610
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles