దిశానిర్దేశం చేయనున్న ప్లీనరీ

Sat,April 14, 2018 11:17 PM

2019లో జరిగే పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సమీకరణలననుసరించి పోలరైజేషన్ జరుగనున్నది. ఫెడరల్ ఫ్రంట్ అనే గొప్ప ప్రజాస్వామిక స్వభావం సమాఖ్యగా ఎదుగుతూ కలిసి జీవించడం అనే నూతన కోణాన్ని ముందుకు తెస్తున్నది.

టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు దేశానికి ఒక దిక్సూచిని, మార్గదర్శకాన్ని, నూతన ఎన్నికల ప్రణాళికల రూపకల్పనకు దారితీయనున్నాయి.2019లో జరుగనున్న లోక్ సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలను టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ చారిత్రక ప్రాధాన్య సన్నివేశంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు, మహాసభల రూపకల్ప న సాగుతున్నది. దేశంలోని అనేక స్థానిక, ప్రాంతీయ, జాతీయ పార్టీలను ప్రభావితం చేయనున్నాయి. కేసీఆర్ ఉద్య మ అనుభవాలు, పాలనా అనుభవాలు, పరిణతి, అందరిని కలుపుకుపోయే తత్వం, దూరదృష్టి, మార్గదర్శ నం ఎంతగానో ఉపకరిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం ఎందరినో కలుపుకుం టూ ప్రజా ఉద్యమంగా విస్తరించింది. కేసీఆర్, జయశంకర్ నాయకత్వం దేశంలోని అనేక పార్టీలను ఒప్పించి, మెప్పించి ఆమోదం సాధించింది. అప్పటి నుంచి ఎదిగివస్తున్న తరాలకు ఒక నూతన వాతావరణం, చైతన్యం తెలంగాణ అస్తిత్వ చైతన్యం తోడై విస్తరిస్తూ వచ్చింది. కుల, మత వివక్ష, మహిళా వివక్ష, ఆవేశం, విద్వేషం వంటి ఎన్నింటినో అధిగమిస్తూ ఒకేఒక నినాదంతో కలిసి సాగడంలో తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రక పాత్ర నిర్వహించింది. తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్యాన్ని, కళలను, చైతన్యాన్ని, సైన్స్, టెక్నాలజీ అధ్యయనాలను, విశ్లేషణలను, తెలంగాణ దృష్టికోణాలను ముందుకు తెచ్చింది.

2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ, చరిత్ర, సంస్కృ తి, కళలు, సాహిత్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, నూతన అభివృద్ధి వికాసం నూతన దశలోకి మలుపు తిరిగింది. సాగు, తాగు నీరు, విద్యుత్, విద్య, వైద్యం, శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. ఆ క్రమంలో తెలంగాణ దృష్టి కోణంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, తెలంగాణ విశిష్టత గురించి పాఠ్యాంశాలను నిర్ణయించడం, నూతన పరిశోధనలు, వందలాది పుస్తకాల ప్రచురణతో అధ్యయనం చేయడం వేగం పుంజుకున్నది.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు, ప్రణాళికలు, వస్తు న్న ఫలితాలు చూసి, దేశం, రాష్ర్టాలు, తెలంగాణను ఒక దిక్సూచిగా మార్గదర్శిగా స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నాయి. సరిగ్గా అలాగే తాత్విక, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా తెలంగాణ దేశానికి ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా ముందుకు సాగుతున్నది. అందుకు నిదర్శనమే బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ బీసీ కమిషన్ చేసిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం, శాసనసభ, శాసనమండలి ఆమోదించినా, కేంద్రం నిరాకరించడం వల్ల పార్లమెంటులో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆందోళన చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో అన్నిపార్టీలు అటో ఇటో తేల్చుకునే అనివార్యతను ముందుకు తెచ్చింది.

తెలంగాణ భాషకు, సంస్కృతికి పట్టం కట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించింది. తరతరాలుగా కొనసాగుతున్న జానపద కళలు, వృత్తికళలు, సగౌరవంగా రవీంద్రభారతిలో తలెత్తుకొని ప్రదర్శించబడ్డాయి. తెలంగాణ తనదైన సినిమారంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ సినిమా రంగ పరిణామాలను, వైవిధ్యాన్ని పరిచయం చేస్తూ, విశ్లేషిస్తూ రవీంద్రభారతిలో ఆయా సినిమాలను ప్రదర్శించడం జరుగుతున్నది. చిత్రసీమలో తెలంగాణవారు ఎంతమంది ఉన్నారో, వారి కృషి,పాత్ర,ప్రాధాన్యం ఎంత గొప్ప దో కూడా వెలికితీస్తున్నారు. ఇలా తెలంగాణ సమాజం సమస్త రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నది.

ఇవాళ 560కి పైగా గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, కళాశాలల్లో లక్షలాది బాలబాలికలతో భవిష్యత్ సమాజ నిర్మాణం సాగుతున్నది. బంగారు తెలంగాణ ఎలా రూపుదిద్దుకుంటున్నదో అది దేశానికి ఎలా మార్గదర్శ నం చేస్తున్నదో వాటిని సందర్శిస్తే తెలుస్తుంది.

తెలంగాణలో తిరిగి నాటకరంగం తలెత్తుకొని ముందుకు సాగుతున్నది. అందుకు ఆయా రాష్ర్టాల్లోని నాటక సమాజాల అభివృద్ధి వికాసాలు, వస్తు వైవిధ్యం, ప్రదర్శన వైవిధ్యం తెలుసుకోవడానికి రవీంద్రభారతిలో ఎప్పటికప్పుడు ప్రదర్శనలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శిల్పారామం, కళాభారతి వంటి కూడళ్ళలో తెలంగాణ గ్రామీణ, కుటీర, మహిళా ఉత్పత్తులను, కుటీర ఉత్పత్తులను, గడిచివచ్చిన దశల సమాజాల పరికరాలను, జీవ న విధానాన్ని ప్రత్యక్షంగా చూసేవిధంగా, ప్రదర్శనలు ఏర్పాటు చేయబడుతున్నాయి. హైదరాబాద్ బుక్‌ఫెయిర్, హైదరాబాద్ ఫెస్ట్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ మొదలైనవి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆహ్వానించి అందరికి అందుబాటులోకి తెస్తున్నాయి. రైలు, రోడ్డు, విమాన మార్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం విస్తరిస్తున్నది.ఉపాధి పెంచడానికి స్టార్టప్‌లు విస్తరిస్తున్నాయి.

గిట్టుబాటు రాక కష్టపడుతున్న రైతుల కోసం లక్షలాది టన్ను ల ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కొత్త గోదాములు కట్టబడి నాయి. వ్యవసాయానికి ఎకరానికి నాలుగువేలు ఆర్థిక సాయం అందుతున్నది. పేదలకు రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణం, అన్ని వసతులతో ఏర్పాటుచేయడం, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు, ఇతర వృత్తిదారులకు ఆసరా పథకంతో ఆదుకోవడం జరుగుతున్నది. వారి జీవన ప్రమాణాలు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతున్నది. హెల్త్ చెకప్, కంటి పరీక్షలు, ఆయా వృత్తుల్లో ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు 5 లక్షలు సహాయం, సొంత కాళ్ళమీద నిలబడటానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల ద్వారా, పరిశ్రమల శాఖ ద్వారా, ఇంకా అనేకశాఖల ద్వారా అప్పులు, ఆర్థికసాయం, సబ్సిడీలు, గ్రాంట్లు ఇస్తున్నారు. ఉచిత వైద్యం, ప్రభుత్వ దవాఖానల వైద్య ప్రమాణాలను పెంచడం, ప్రసూతి ఆపరేషన్లు తగ్గించడం, కేసీఆర్ కిట్, పేదలకు, పేద మహిళల పెండ్లికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరున లక్షకు పైగా చేయూతనందిస్తున్నది. ఉన్నత విద్యకు సహకరిస్తున్నది. విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి రూ.20 లక్షల గ్రాంటు ఇస్తున్నది. ఇంటింటికి నల్లా, ప్రతి ఎకరానికి నీరు, నిరంతర విద్యుత్ సరఫరా మొదలైనవి విజయవంతంగా అమలవుతున్నాయి. ఇప్పుడు బియ్యం రేషన్‌ను ఎక్కడైనా తీసుకోవచ్చనే ఒక కొత్త ఒరవడిని ఏటీఎం కార్డు వలె ప్రవేశపెట్టడం దేశానికే మార్గదర్శనం. ఈ నేపథ్యంలో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు, వాటిలో జరిగే సమీక్ష, చర్చలు, తీర్మానాలు, భవిష్యత్ కార్యక్రమాలు, తెలంగాణకే కాకుండా, దేశానికి, ఆయా రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
ramulu
2019లో జరిగే పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సమీకరణలననుసరించి పోలరైజేషన్ జరుగనున్నది. ఫెడరల్ ఫ్రంట్ అనే గొప్ప ప్రజాస్వామిక స్వభావం సమాఖ్యగా ఎదుగుతూ కలిసి జీవించడం అనే నూతన కోణాన్ని ముందుకు తెస్తున్నది. ఇంతదాకా నిర్లక్ష్యం చేసిన, మరుగున పడిన ఫెడరల్ స్వభావాన్ని, హక్కులను, బాధ్యతలను, కర్తవ్యాలను, ప్రణాళికలను ముందుకు తేవటం లో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషించనున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

650
Tags

More News

VIRAL NEWS