భాషపై మమతగల్ల ప్రభుత

Sat,April 14, 2018 11:15 PM

వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. తమిళ మీడియంలో చదివిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వం అమలుచేస్తుంది. మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మీడియం విద్యార్థులకు ఇస్తూ వచ్చిన 5 శాతం రిజర్వేషన్ అనేక లిటిగేషన్‌ల పాలుచేసి జాతీయ సమగ్రత పేరు మీద కొట్టివేయించిన 1995 నాటి సంగతులు గుర్తున్న విద్యావంతులకు ఇది షాక్ అనిపించకమానదు.

ఉన్నవాళ్లను అద్దంలా దిద్దే పేదవాళ్లే భాషనూ కాపాడుతారు. ఎదిగినకొద్దీ తమదికాని భాషలో మాట్లాడేటందు కు మోజుపడుతరు పెద్దవాళ్లు. తమ పిల్లలను ఇం గ్లీషులో చదివిస్తరు. కనీసం ఒక భాషగా కూడా మాతృభాషను చదువకుండా చూస్తరు. ఫలితం గా 15 కోట్ల మంది తెలుగువాళ్ల భాష ప్రభావశీలమైన భాష కాకుండాపోయింది. యునెస్కో వారి సర్వే ప్రకారం ప్రపంచంలోని ప్రభావశీలమైన 25 భాషల్లో హిందీ, తమిళం, బెంగాళీ, పం జాబీలున్నాయి కానీ 15 కోట్ల తెలు గు లేదు. 7 కోట్ల తమిళనాడు జనాభాలో రెండు కోట్లు తెలుగువారు. కర్ణాటకలో కోటి మహారాష్ట్రలో కోటి తెలుగు ప్రజలుంటారు. ఒరిస్సా, ఢిల్లీ తదితర రాష్ర్టాలలో, మలేషి యా, మారిషస్ దేశాలలో లక్షలాది తెలుగువాళ్లున్నారు. తెలుగు మాతృభాషగా కలిగిన రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థుల్లో వేలాదిమంది విద్యార్థులు ఏ స్థాయిలోనూ అసలే తెలుగు చదువకుండా తెలుగేతరుల అవతారం ఎత్తుతున్నారు. తెలుగు మీడియం చదువు కూలిపోతున్న కోటగోడలాంటిది అన్న విషయం జగద్విదితమే. ఇక రాష్ర్టాలేతర తెలుగువారి తెలుగు ప్రాపకం ఊహించడం కష్టం. ఇలాంటి దారుణమైన తెలుగు ప్రమాద ఘంటికలు 2017 డిసెంబ ర్, 15 నుంచి 19 వరకు జరిగిన హైదరాబాద్ ప్రపంచ తెలు గు మహాసభలలో బలంగా చర్చకువచ్చాయి. స్వతహాగా భాషా, సాహిత్యాల ప్రేమికుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించి ఒక పురోగామి ప్రకటన చేస్తూ 1 నుం చి 10వ తరగతి వరకు తెలుగును అన్ని పాఠశాలల్లో తప్పనిసరి భాషగా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు కేంద్ర, రాష్ట్ర, స్వతంత్ర సం స్థల నిర్వహణలో ఉన్న తెలంగాణలోని పాఠశాలలన్నింటిలోనూ తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం.

తమిళనాడు మాదిరి: తమిళనాడు ప్రభుత్వం గత పదేండ్ల నుంచి ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినందున అక్కడి తమిళ నిర్బం ధ భాష అమలు విధానాన్ని పరిశీలించి రమ్మని ముఖ్యమంత్రి నంది ని సిధారెడ్డి, బుర్రా వెంకటేశం, ఎస్వీ సత్యనారాయణ, ఏనుగు నరసింహారెడ్డిలను ఆదేశించారు. తదనుగుణంగా మేం మార్చి 7, 2018 ఉదయం 10 గంటలకు బయల్దేరి చెన్నై చేరుకున్నాం. తమిళనాడు విద్యాశాఖకు చెందిన బాలాజీ అనే మిత్రుడు మమ్మల్ని విమానాశ్ర యం నుంచి ఎగ్‌మోర్‌లోని వెస్టిన్ పార్క్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. తమిళనాడు పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు నరేష్ విద్యాశాఖ డైరెక్టరేట్‌కు తీసుకువెళ్లారు. సంచాలకులు ఇలంగోవన్, ఎలిమెంటరీ విద్య సంయుక్త సంచాలకులు శ్రీదేవి, నరేష్ తప్పనిసరి తమిళ భాష ఆరంభం నుంచి కోర్టు కేసుల దాకా పవర్ పాయింట్ ద్వారా వివరించారు. తమిళనాడు తమిళ అభ్యాస చట్టం, 2006 గురించి 2012లో తదనుగుణంగా తయారైన నిబంధనలను వివరించారు. దశలవారీగా అమలైన తమిళ అభ్యాసం రాష్ట్రంలోని అన్నిరకాల యాజమాన్యాల నిర్వహణలోని పాఠశాలల్లో విజయవంతంగా అమలు అవుతున్నట్లు మాకు అర్థమయింది. కేంద్ర విద్యాబోర్డుల ఆధీనంలోని పాఠశాలల్లో చట్టప్రకారం 10వ తరగతి అమలుకు ఇంకా కొంత సమయం ఉన్నట్లు తెలిసింది. తమిళేతర మాతృభాషల విద్యార్థులు పార్టు-4లో ఐచ్ఛిక భాషగా ఇతర భాషలకు అధ్యయనం చేయవచ్చు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ ఆధీనంలోని పాఠశాలల్లో గత మూడేండ్ల నుంచి తమిళం తప్పనిసరి చేశారు. అంటే 2023-24 విద్యా సంవత్సరానికి కేంద్రీయ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో తమిళం చదివి, పాసై తీరాల్సి ఉంటుంది.

మంత్రుల ఉన్నతాధికారులతో భేటీ: సాయంత్రం 4 గంటలకు తమిళనాడు పాఠశాల విద్యామంత్రి కె.ఎ.సింగోటయ్యను కలిశాం. తన శాఖ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ యాదవ్‌గారి తో కలిసి అనేక విషయాలపై చర్చించారు. 8వ తేదీ ఉదయం తమిళనాడు సాంస్కృతి శాఖ మం త్రి పాండ్యరాజన్‌ను కలిశాం. ఆయనకు తన శాఖపట్ల ఉన్న ఆసక్తి, అవగాహన మమ్ముల్ని చకితుల్ని చేశాయి. తమిళ తెలుగు ప్రభుత్వాలు భాషా, సాహిత్య, సాంస్కృతిక వ్యవహారాలలో ఆదాన ప్రదానాలు మొదలుపెడుదామని పేర్కొన్నారు. సాంస్కృతిక శాఖ కమిషనర్ రామలింగంను, తమిళనాడు ఇైళ్లె, ఇస్పై నాటక మండ్రం (సంగీత నాటక అకాడెమీ) అధ్యక్షులు దేవాను, ప్రపంచ తమిళ సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయరాఘవణ్‌ను, అనువాదశాఖ సంచాలకులు డాక్టర్ అరుణ్‌ను, తమిళనాడు సంగీత, శాస్త్రీయ కళల విశ్వవిద్యాల య ఉపకులపతి డాక్టర్ ప్రమీలా గురుమూర్తిని మా కోసం పిలిపించి విలువైన సమాచార మార్పిడికి ప్రయత్నించారు. మంత్రి పాండ్లరాజన్ తెలుగువాళ్ళు కోటిమంది తమిళనాడులో ఉన్నారు. మీ వాళ్లు మాత్రం మేం రెండు కోట్లు ఉన్నామంటారు అని చమత్కరించారు.

పాఠశాలల సందర్శన: మార్చి 8 ఉదయం చెన్నైలోని శోలింగ నల్లూర్‌లో ఉన్న నారాయణ ఈ-టెక్నో స్కూల్, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, వేలు నాయకర్ వీధిలోని శ్రీ అయ్యప్ప మెట్రికులేషన్ హైయర్ సెకెండరీ స్కూళ్లకు వెళ్ళి తమిళ భాష అమలుతీరుతెన్నులను చూడగలిగాం. మధ్యాహ్నం మామల్లాపురం దగ్గరలోని పయ్యనూర్ ఎలిమెంటరీ స్కూల్, హైస్కూల్‌లను సందర్శించడం ద్వారా తమిళం అమలులోని అడ్డంకులను, కోర్టు కేసులను దాటి విద్యాశాఖ ముం దుకు నడువగలిగిందని అర్థం చేసుకోగలిగాం.

పనిలోపనిగా ఎస్వీగారు మద్రాసు విశ్వవిద్యాలయం ఉప కులపతిని కలిసారు. కేంద్ర సాహిత్య అకాడెమీ దక్షిణ భారత ఉప కార్యాలయాన్ని సందర్శించి, అక్కడి ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఇలంగోవన్‌ను కలి శాం. తెలుగు సాహిత్యం పట్ల, సాహిత్యకారుల పట్ల ఆయనకున్న ఆదరణకు మాకు చాలా సంతోషం కలిగింది.

విజయేంద్ర సరస్వతి ప్రశంస: బుర్రా వెంకటేశం సర్ సిఫార్సుల వల్ల కామాక్షి ఆలయ ప్రధానార్చకులు నటరాజ శాస్త్రి మాకు సత్వర అమ్మవారి దర్శనం చేయించటంతోపాటు కంచి పీఠాధిపతి విజయేం ద్ర సరస్వతిని కలుసుకునే అవకాశం ఏర్పాటుచేశారు. కేసీఆర్ నిర్వహించిన ఆయత చండీయాగాన్ని సిధారెడ్డి విజయేంద్ర సరస్వతి దృష్టికి తేగా ఆయన చాలా సంతోషపడ్డారు. ముఖ్యమంత్రి గారిని అభినందించారు. తెలంగాణలో తాను పర్యటించిన కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలోని పట్టణాల పేర్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల సమాచారం తమిళంలోకి, తమిళనాడులోని దేవాలయాల సమాచారం తెలుగులోకి అనువదించి ప్రచురించినట్లయితే భక్తులకు ఉపయుక్తంగా ఉంటుందని అభిభాషించారు.

మా మూడు రోజుల పర్యటనలో కరికులమ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉదయ్‌ను, వెనుకబడిన కులాల సంక్షేమశాఖ కార్యదర్శి కార్తీక్‌ను కలిశాం. విభాగాధికారి శంకర్ నారాయణన్ మమ్మల్ని అన్ని కార్యాలయాలు తిప్పి సహకరించారు. విద్యాశాఖ మాకు మంచి మద్ద తు సమకూర్చింది.
enugu
తమిళమీడియం రిజర్వేషన్: వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. తమిళ మీడియంలో చదివిన అభ్యర్థులకు ప్రభు త్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వం అమలుచేస్తుంది. మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మీడియం విద్యార్థులకు ఇస్తూ వచ్చిన 5 శాతం రిజర్వేషన్‌ను అనేక లిటిగేషన్‌ల పాలుచేసి జాతీయ సమగ్రత పేరు మీద కొట్టివేయించిన 1995 నాటి సంగతులు గుర్తున్న విద్యావంతులకు ఇది షాక్ అనిపించకమానదు. చిత్తశుద్ధి ఉంటే ఏమేం చేయొచ్చో అవన్నీ తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నది.

500
Tags

More News

VIRAL NEWS