సారస్వత పంచ సప్తతి

Sat,April 14, 2018 12:04 AM

షిరిడి వెళ్లుతూ షోలాపూర్‌లో ఒక మిత్రుడి అడ్రసు కోసం వెతుకవలసి వచ్చింది. ఓ కూడలిలో రోడ్డు మీద ఐదారుగురు యువకులు నిల్చొని బాతాఖానీ చేస్తున్నారు. ఓ కాగితం ముక్క చూపించి హిందీలో అడిగాం. మాకూ భీ తెలుగు వస్తది అని వాళ్లు టూటీ పూటీ
తెలుగులో మాట్లాడారు. మాటల్లో తెలిసింది వాళ్లు ఎన్నడో తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డారని.వాళ్లు ఇంత కాలమైనా తమ మాతృభాష తెలుగును మరిచిపోలేదు.తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1955లో) పొందిన మొదటి గ్రంథం ఇది. రజతోత్సవం, స్వర్ణోత్సవం, వజ్రోత్సవం జరుపుకున్న పరిషత్తు ప్రాంగణంలో, కార్యాలయంలో అడుగుపెట్టని తెలుగు పండితులు, కవులు,రచయితలు, పరిశోధకులు లేరని చెప్పవచ్చు. విభిన్న భావజాలాల వారికి నిండు హృదయంతో ఒక వేదికగా,ఒక కాహళిగా ఉపకరిస్తూ తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి అంకితమైన మహాసంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తుకు పంచ సప్తతి శుభవేళ హార్థిక శుభాకాంక్షలు, అభినందనలు.


తమ పెద్దోళ్లు పరిషత్తు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనారని, పరిషత్తు కార్యకర్తలుగా కూడా పని చేశారని ఆ యువకులు వచ్చిరాని తెలుగులోనే మాట్లాడుతూ చెప్పారు. మహారాష్ట్రలోని భివాం డీ నుంచి ఒకాయన వచ్చి వరంగల్లులో ఒక ఫొటోస్టూడియో పెట్టి బాగా నడుపుతున్నాడు. ఎన్నోతరాల కిందట భివాండి వెళ్లి - తెలంగాణ నుంచి - అక్కడే స్థిరపడినప్పటికీ తమ తెలుగును మరిచిపోలేదని, ఈ మధ్యకాలంలో తమ వాళ్లు తెలుగు పరీక్షలు రాస్తున్నారని భివాండి మిత్రుడు అన్నాడు. అజమ్‌జాహీ మిల్లు వర్కర్లు ముత్యాలు, సమ్మయ్య కొడుకులు వరంగల్లులో దర్జీ పనిమానేసి బొంబాయి వెళ్లారు. అక్కడ సంపాదన ఎక్కువ ఉంటుందన్న గంపెడాశతో. ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పుతుంటారు తెలుగులోనే మాట్లాడుతుంటామని. ఢిల్లీ, కలక త్తా తదితర నగరాలకు ఎన్నడో పొట్టకూటి కోసం గుంపులుగా వెళ్లినవా ళ్లు సైతం తమ తెలంగాణ మట్టిని ప్రేమిస్తుంటారు. ఇక్కడికి వచ్చినప్పు డు, అక్కడున్నప్పుడు తమ తీయని తెలుగు మాట్లాడి తన్మయిలవుతా రు.

ఇటు తెలంగాణలో రాచరిక వ్యవస్థ నిరంకుశ పాలనను, అణచివేతను, ఆంక్షలను, నిర్బంధాలను, బెదిరింపులను, హెచ్చరికలను, ఫర్‌మానాలను, అవమానాలను, ఆంధ్రుల అవహేళనలను ఎదుర్కొంటూ, తట్టుకుంటూ ప్రజల భాష తెలుగును, తెలుగు వాఙ్మయాన్ని రక్షించుకున్నది, అటు బయటి రాష్ర్టాలలో, ఇతర ప్రాంతాలలో తెలుగు దీపం ఆరిపోకుండా కాపాడింది పరిషత్తు. అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అది తెలంగాణ సారస్వత పరిష త్తు. సర్కారోళ్లు, పాలకులు కొన్ని సందర్భాల్లో అలుక పాన్పు ఎక్కి, కిను క వహించినా, ఆగ్రహం ప్రదర్శించినా పరిషత్తు ప్రజాబలంతో తన అస్తి త్వాన్ని కాపాడుకుంటూ తన ఆశయాల ఆచరణకు, తన లక్ష్యాల సాధనకు నడుం బిగించి ముందడుగు వేసిందే కానీ వెనుకకు చూడలేదు, వెన్నివ్వలేదు, కుందలమొందిన డెందంతో కుదిలపడలేదు, కుప్పకూలలేదు. కునారిల్లలేదు. అదీ పరిషత్తు, అదే పరిషత్తు విశిష్టత, ఔన్నత్యం, ఔదాత్యం. పరిషత్తు ప్రస్థానం మొదలై 75 ఏండ్లవుతున్నది, పంచసప్తతి మహోత్సవం జరుగబోతున్నది.

75 ఏండ్ల కిందట హైదరాబాద్ నగరంలో నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తు స్థాపన జరిగిన రోజుల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, పరిపాలనా సంబంధ క్లిష్ట పరిస్థి తులను పరికిస్తే పరిషత్తు స్థాపన నాడు ఒక చరిత్రాత్మక పరిణామమని, అనివార్య ఆవశ్యకత అని, అదొక మహత్తర సంఘటన అని అవగతమ వుతుంది. 1942లో దేశమంతటా క్విట్ ఇండియా ఉద్యమ జ్వాలలు ఎగిసిన పిదప అక్కడ బ్రిటిష్ పాలకులు, ఇక్కడ అసఫ్‌జాహీ రాజ్య పాలకులు ప్రజల అభిప్రాయాలను, వాంఛలను, ప్రజా ఉద్యమాలను, ప్రజాహిత సంస్థలను అణచడానికి సర్వశక్తులను, కఠిన దమననీతిని, దుష్ట చర్యలను నిర్దాక్షిణ్యంగా, విచక్షణారహితంగా అమలు జరుపుతున్న రోజులవి. కారుచీకట్లు కమ్మినప్పుడే కరదీపికల, కాంతి కిరణాల అవస రం ఏర్పడుతుంది. కంస చర్యలు మితిమీరినప్పుడే కృష్ణావతారం అవసరం అవుతుంది. 1943, మే 26న, హైదరాబాద్ రెడ్డి హాస్టల్ ఉద్యమ భూమిపై ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనకు, స్థూల ఆశయాలకు, లక్ష్యాలకు, నామకరణానికి, చేపట్టవలసిన సారస్వత విప్లవ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది.

తర్వాత అయిదు రోజులకే 1943 జూన్ 1న హైదరాబాద్ నగరంలో నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తు మొద టి మహాసభ జరిగింది. (తర్వాత 71 ఏండ్లకు 2014 జూన్ 2 ఉషోదయంతో తెలంగాణ ప్రజల పోరాటఫలంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడం యాదృచ్ఛికం కాదు, అదొక చారిత్రక అనివార్య పరిణామం). అప్పటికి 13 ఏండ్ల కిందట 1930లో జోగిపేటలో మొగ్గ దొడిగిన తెలంగాణ ఆం ధ్ర మహాసభ 10వ వార్షిక మహాసభ హైదరాబాద్ నగరంలో 1943లో జరిగింది. ఒకవంక ఆంధ్ర మహాసభ 13 వార్షిక మహాసభలు జరిగి క్రమంగా అస్తమించనున్న సంధికాలంలో, క్లిష్ట తరుణంలో ఆంధ్ర సార స్వత పరిషత్తు ఆంధ్ర మహాసభ మిగిల్చిన బాధ్యతల నిర్వహణ పవిత్ర కర్తవ్యాన్ని తన భుజనా వేసుకొని ఉదయించడం అపూర్వ విశే షం. విధాన సంబంధ విభేదాల (అతివాదులు, మితవాదుల మధ్య) కారణంగా తెలంగాణ ఆంధ్ర మహాసభలో చీలికలు వచ్చాయని, అదొక అవతారం చాలించి నిష్ర్కమించనుందని 1944లో భువనగిరిలో జరిగిన 11వ మహాసభలో స్పష్టమైంది. అన్నింటా తన అస్తిత్వం నిలుపుకుని, క్రమంగా రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాం తం ముందంజ వేయడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ఆంధ్ర మహాసభ కృషి జరుపుతున్నదని నిజాం ప్రభుత్వం పసిగట్టింది. విశాల వేదికపై వివిధ రంగాల విస్తృత కార్యక్రమాలను చేపట్టిన తెలంగాణ ఆంధ్ర మహాసభ తన నిష్ర్కమణ అనంతరం ఆవిర్భవించనున్న సారస్వత పరిషత్తుకే తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధి, తెలుగు సారస్వత వికాసం గురుతర బాధ్యతను అప్పగించినట్లు అనిపించింది.

ఈ పవిత్ర బాధ్యతను, కర్తవ్యాన్ని సారస్వత పరిషత్తు ఒక సవాలుగా, ఛాలెంజ్‌గా స్వీకరించిందని, విజయం సాధించిందని గత 75 ఏండ్ల ఉజ్వల చరిత్ర ఘోషిస్తున్నది. పరిషత్తు గమనం, పురోగమనం గంగోత్రి వలె ఆరంభమైంది. నాడు పరిషత్తును ఒక పసి, పసిడి మిసిమి మొక్క గా, నేడు ఒక వటవృక్షంగా, సారస్వత బోధివృక్షంగా చూడగలగుతున్న అదృష్టవంతుల్లో నేనొకణ్ణి. ఉన్నత పాఠశాలలో చేరడానికి వరంగల్లు - మట్టెవాడ నుంచి హైదరాబాద్ రాగానే మొట్టమొదట చూడాలనిపించినవి సారస్వత పరిషత్తు, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ - చార్మినార్, గోల్కొండ కావు. ఆర్ట్స్ కాలేజ్ కామర్స్ విభాగం క్లాసులో వెనుక కుర్చీలలో కూర్చొ ని తాను, సాగర్ (మా ఒక అన్నగారు దేవులపల్లి విద్యాసాగర్‌రావు షరాబి కలం పేరుతో ఉర్దూ కవితలు రాసేవాడు) అల్లరిచేసే వాళ్లమని జువ్వాడి గౌతమరావు అన్నారు. అందువల్ల కామర్స్ క్లాసును చూడాలనిపించింది. అప్పుడు పరిషత్తు కార్యాలయం రామ్‌కోట్‌లోని రామాలయం గల్లీలో ఒక చిన్న గదిలో ఉండేది. ఓ రోజు దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మ, రామ ప్ప ఆ గదిలో కూర్చుని మాట్లాడుతుండగా చూసే అవకాశం లభించిం ది. తర్వాత బొగ్గులకుంటలో (తిలక్‌రోడ్) మూడు చిన్న గదులు కట్టి వాటిలోకి 1954లో పరిషత్తు కార్యాలయాన్ని తరలించారు.

ఈ నూతన కార్యాలయానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రారంభోత్సవం జరిపారు. పరీక్షలు, ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాలు, సదస్సుల నిర్వహణ, పుస్తక ప్రచురణ, వార్షికోత్సవాలు వంటి బహుముఖ సారస్వత కార్యక్రమాలతో పరిషత్తు స్థితప్రజ్ఞతో ముందడుగు వేసింది. సర్కారు పెద్దలు సహకరించినా, సహకరించకపోయినా, దయతలచినా, తలవకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరిషత్తు వెనుకంజ వేయలేదు. రాచరిక పాలకులకు తెలంగాణ తెలుగుభాష, సారస్వతాలు గిట్టనిరోజుల్లో గుట్టల వంటి అవరోధాలను అధిగమించి తెలంగాణ సామాన్య జనకోటికి, ఇతర రాష్ర్టాల్లో పొట్టకోసం తట్టలుమోసిన తెలంగాణోళ్లకు తెలుగు అక్షరభిక్ష పెట్టిన, ఇం టింటా తెలుగు వెలుగుల దీపాలు వెలిగించిన ఏకైక సంస్థ నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు. తెలుగు భాషా సారస్వతాల వికసనంలో, నిరక్షరాస్యతా నిర్మూలనలో, వయోజన విద్యాప్రచారంలో పరిషత్ నిర్వహించిన పాత్ర దేశంలో ఇంకెక్కడా లేని ది, అద్వితీయమైనది. పరిషత్తు రెండవ వార్షిక మహాసభను 1944 డిసెంబర్‌లో వరంగల్ పట్టణంలో నిర్వహించడం అసామాన్యులకు మాత్రమే సాధ్యమైన ఒక సాహసకృత్యం. అప్పుడు వరంగల్లు పట్టణం మతోన్మాదుల అమానుష కృత్యాలతో, పట్టపగలే హత్యలతో భగ్గుమంటున్న అగ్నిగుండం. పరిషత్తు కవిసమ్మేళనం కోసం వరంగల్లు ఖిల్లాలో నిర్మించిన వేదికను మతోన్మాదులు దగ్ధం చేసి వల్లకాడుగా మార్చారు. ఆ బూడిద రాశి మీదనే కవి సమ్మేళనం జరుపడానికి నిర్వాహకులు సం కల్పించారు. అక్కడే, ఆ భయానక వాతావరణంలో మహాకవి దాశరథి శిరమెత్తి, గళంవిప్పి అగ్నిధార గీతాలను పఠించారు. 1943-1953 దశాబ్ది స్వల్పకాలంలోనే పరిషత్తు సహస్ర సర్గల స్వర్ణాధ్యాయాన్ని లిఖిం చగలిగింది.

1953 జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురం క్షేత్రంలో, కృష్ణానదీతీరంలో సారస్వత పరిషత్తు సప్తమ వార్షిక మహాసభను అప్పటి భారత ఉప రాష్ట్రపతి, ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త సర్వేప ల్లి రాధాకృష్ణ అద్భుత, అనర్గళ ప్రసంగంతో ప్రారంభించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పరిషత్తు నిర్వాహకులు ఉపరాష్ట్ర పతిని ఆహ్వానించగలిగారు. వేలాది ప్రజలు, తెలుగు నేల నాలుగు చెరగుల నుంచి అసంఖ్యాక పండితులు, కవులు, రచయితలు అలంపురం సభల్లో పాల్గొన్నారు. అలంపురం సభల సందర్భాన కాళోజీ నా గొడవ మొదటి సంపుటిని మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. 1949 ఫిబ్రవరిలో తూప్రాన్‌లో జరిగిన పరిషత్తు 5వ వార్షిక మహాసభలు భాషాపరంగా చరిత్రాత్మకమైనవి. అంతవరకు ఉర్దూ బోధనా భాషగా ఉన్న తెలంగాణ పాఠశాలల్లో, కళాశాలల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (అప్పుడు తెలంగాణలో ఉన్న ఒకేఒక విశ్వవిద్యాలయం) తెలుగును బోధనా భాష గా ప్రవేశపెట్టాలని పరిషత్తు తూప్రాన్ మహాసభ తీర్మానించింది. ఈ తీర్మానం అమలుకోసం దేవులపల్లి రామానుజరావు, ప్రొఫెసర్ తణికెళ్ల వీరభద్రుడు సభ్యులుగా ఒక కమిటీ నియమితమైంది. కమిటీ కృషి వల్ల ప్రప్రథమ పర్యాయం తెలంగాణ పాఠశాలలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధనా భాష అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వ హిందీ విశ్వవిద్యాలయంగా మార్చే ప్రయత్నాలను ప్రతిఘటించి పరిషత్తు విజయం సాధించింది.
prabhakarrao
సారస్వత పరిషత్తు స్థల మహాత్మ్యం, సంకల్పబలం చాలా గొప్పవి. 12, 13 ఏండ్ల కౌమార దశలోనే పరిషత్తు ప్రాంగణంలో, 1955లో భారతోపన్యాసాలు, 1956లో భాగవత ఉపాన్యాలు తెలుగు సాహిత్యరంగంలో చరిత్రను సృష్టించాయి. చాలాకాలం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యస్థలం పరిషత్తు కార్యాలయమే. మహాపండితులు, పరిశోధనా ఉద్ధండులు అనేకులు కూర్చొని పోతన భాగవతం ప్రామాణిక ప్రతిని రూపొందించింది పరిషత్తు కార్యాలయంలోనే. మూడు వందల కు మించిన పరిషత్తు అమూల్య ప్రచురణలలో తలమానికం సురవరం ప్రతాపరెడ్డి వారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర (1949 ప్రచురణ). తెలు గులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1955లో) పొందిన మొదటి గ్రంథం ఇది. రజతోత్సవం, స్వర్ణోత్సవం, వజ్రోత్సవం జరుపుకున్న పరిషత్తు ప్రాంగణంలో, కార్యాలయంలో అడుగుపెట్టని తెలుగు పండితు లు, కవులు, రచయితలు, పరిశోధకులు లేరని చెప్పవచ్చు. విభిన్న భావ జాలాల వారికి నిండు హృదయంతో ఒక వేదికగా, ఒక కాహళిగా ఉపకరిస్తూ తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి అంకితమైన మహాసంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తుకు పంచ సప్తతి శుభవేళ హార్థిక శుభాకాంక్షలు, అభినందనలు.

635
Tags

More News

VIRAL NEWS