అంబేద్కర్ ఆశయాల దిశగా..

Sat,April 14, 2018 12:00 AM

మనమేం ప్రకటిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, మనమేం ఆచరిస్తున్నామనేది ప్రధానం. గత ప్రభుత్వాలు, పాలకులు అంబేద్కర్ గురించి, ఆయన వర్ధంతి, జయంతిల సమయంలోఉపాన్యాసలు ఇవ్వడం తప్పా చేసిందేం లేదు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నది.
Ambedkar
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ఆయన ఆశయసిద్ధి కోసం పునరంకితమవుతున్నది. ఆయన ఆశయ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం వినూత్న పథకాలతో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమతా సమాజం కోసం కృషిచేస్తున్నది. అంబేద్క ర్ అడుగుజాడలో సీఎం కేసీఆర్ పేద జన బాంధవుడిగా జనరంజక పాల న అందిస్తుండటం ముదావహం.

అంబేద్కర్ అంటరాని కులంలో పుట్టి దారుణమైన వివక్షను అనుభవించారు. ఆ వివక్ష, అణచివేతల్లోంచే గొప్ప పట్టుదలతో విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆయన ప్రజ్ఞాపాటవాలకు విదేశాల్లోనే గొప్ప ఉద్యోగాలతో బతికే అవకాశాలున్నా వాటిని తృణప్రాయంగా వదులుకున్నారు. దేశంలోని కోట్లాదిమంది దళితులు, మహిళలు, వెనుకబడిన వర్గా లు, ఆదివాసీ జాతుల అభ్యున్నతికోసం తన జీవితాన్ని అర్పించారు. తన నలుగురు పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టి కోట్లాదిమంది పీడిత కులాల తలరాతలు మార్చిన మహానుభావుడు అంబేద్కర్. ఆయన జయంతి ఐరాస ప్రపంచ విజ్ఞాన దినంగా ప్రకటించింది. అంబేద్కర్ మన దేశం లో పీడిత కులాలకు రిజర్వేషన్లు, మైనార్టీ మతాలకు మతస్వేచ్ఛ, మహిళలకు స్వేచ్ఛా సమానత్వాల కోసం జీవితాంతం పోరాడారు. ఈరోజు సమాజంలోని వివిధ సామాజిక సమూహాలు చట్టపరమైన రక్షణలు, హక్కులు పొందుతున్నాయంటే.., అది అంబేద్కర్ పోరాడి సాధించిపెట్టినవేనని ప్రతీపౌరుడూ గుర్తుంచుకోవాలి.

భూస్వామ్య, ఆధిపత్య వర్గాల నుంచి పాలనావ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేతిల్లోకి తీసుకురావడంలో అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది. నేడు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తున్న ప్రతి నాయకుడూ దీన్ని గుర్తించాలి. కానీ దేశంలో ఎక్కడా అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాల వెలు గులో ప్రయాణిస్తున్న ఒక్క నేత కూడా కనిపించటం లేదు. దీనికి భిన్నం గా ఒక తెలంగాణ ప్రభుత్వమే దేశానికి చేసిన అంబేద్కర్ సేవలను గుర్తిం చి, ఆయన ఆశయాల వెలుగులో ప్రయాణిస్తున్నది. సబ్బండవర్ణాల సంక్షేమానికి పాటు పడుతున్నది.
అంబేద్కర్ సమాజంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలను పట్టించుకొ ని పోరాడారు.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీలు, బీసీలు రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్నారంటే ఆయన చేసిన పుణ్యమే అనడంలో సందేహం లేదు. అలాగే స్వాతంత్య్ర ఫలాలు ప్రతీ పౌరుడు పొందాలని ఆయన కలలుగన్నారు. నేడు ఆయన కలలను మనం నిజం చేయాలి. అనేక అసమానతలు, వివక్షలను తట్టుకొని ప్రతీ విషయాన్ని సవాల్‌గా తీసుకొని అధ్యయనం అనే ఆయుధం ద్వారా దేశాన్ని, ప్రపంచాన్ని జయించిన మేధావి అంబేద్కర్. భారతీయ సమాజంలోని అనేక రుగ్మతలను శాస్త్రీయంగా విశ్లేషించి వాటి పరిష్కారం కోసం కృషిచేశాడు. అమానవీయమైన కులవ్యవస్థను కూకటివేళ్లతో కూల్చివేయటం కోసం కుల నిర్మూలన అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే సమస్త దోపిడీ పీడనలు, వివక్షలు అంతం కావాలంటే ఇండియాలో ఏం చెయ్యాలి? అని ప్రబోధించిన గొప్ప తాత్వికుడు అంబేద్కర్.
vemula
దేశవ్యాప్తంగా ఆయన ఆలోచనలు నేటికీ ప్రజలను చైతన్యపరుస్తున్నా యి. ఆయన ఆశయాలను, ఆలోచనలను ఆచరణ రూపంఇచ్చే ప్రభుత్వం కోసం ఏడు దశాబ్దాల నుంచి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకుని కేసీఆర్ లాంటి నాయకుడు ఆవిర్భవించారు. ప్రజా ఆకాంక్షల్లోంచి ఎదిగివచ్చిన కేసీఆర్ సహజంగానే అంబేద్కర్ స్ఫూర్తిగా సమాజ ఉద్ధరణకు, అభివృద్ధి కి పాటుపడుతున్నారు. అంబేద్కర్ ఆలోచనలను అమలుచే స్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను స్థాపించారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి లక్షా ఇరువై ఐదు వేల రూపాయలను ఖర్చుపెడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను వెళికి తీస్తున్నారు. దీనికోసం నిబద్ధత, త్యాగనిరతి గల ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను గురుకులాల సెక్రటరీగా నియమించి భావితరాలను తీర్చిదిద్దటం కోసం కృషిచేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్, జ్యోతిరావుపూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను విదేశీ విద్యకోసం రూ.20 లక్షలను అందజేస్తున్నది. మనమేం ప్రకటిస్తు న్నాం అన్నది ముఖ్యం కాదు, మనమేం ఆచరిస్తున్నామనేది ప్రధానం. గత ప్రభుత్వాలు, పాలకులు అంబేద్కర్ గురించి, ఆయన వర్ధంతి, జయంతిల సమయంలో ఉపాన్యాసలు ఇవ్వడం తప్పా చేసిందేం లేదు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నది. వివిధ సంక్షేమ పథ కా ల అమలులో, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయనటంలో సందేహంలేదు.
(వ్యాసకర్త: నకిరేకల్ ఎమ్మెల్యే)

807
Tags

More News

VIRAL NEWS