గుణాత్మక మార్పు తప్పనిసరి!

Tue,March 13, 2018 11:59 PM

తెలంగాణ రాష్ట్రం తన వినూత్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ ఎజెండా అయితే గుణాత్మక మార్పు కోసం ఏర్పడే రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.

రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే తెలంగాణ తరహా లోనే భారత జాతి పునర్నిర్మాణం, పునర్నిర్వచనం, పునఃసృష్టి జరుగాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా మొదటగా చేయాల్సింది వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాల ను, పద్ధతులను, అలవాట్లను, నడవడులను సేకరించి, అధ్యయనం చేసి, వాటిని మన దేశ స్థితిగతులకు అనుగుణంగా ఉపయోగించుకోవడమే! దేశ ఆర్థిక పరపతిని గణనీయంగా పెంచి, ఏయే రంగాల్లో మనం వెనుక బడి ఉన్నామో అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా తప్పొప్పులు సరిచే సుకుంటూ ముందడుగు వేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమనే విషయం కూడా సీఎం మాటల్లో స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో, ఇవ న్నీ దృష్టిలో ఉంచుకొని, జాతీయ అభివృద్ధి ఎజెండా రూపొందించుకోవా ల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. దేశంలోని వివిధ రాష్ర్టాల, సమాజంలో ని వివిధ వర్గాల, అవసరాలను ప్రతిబింబించేదిగా ఆ ఎజెండా ఉండాలని సీఎం కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తున్నది.పలురంగాల నిపుణులు, సీనియర్ పాలనాధికారులు, ఆర్థిక శాస్త్రవేత్త లు, సమాజ అభ్యున్నతి కోరే ప్రతి ఒక్కరు, తమవంతు పాత్రగా, ప్రస్తు తం అమల్లో ఉన్న చట్టాలను, విధానాలను, శాసనాలను, పద్ధతులను, అధ్యయనం చేయాలి. సంస్కరణల కోణంలో అవసరమైన మార్పుచేర్పు లు చేసి, మార్పు దిశగా మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రయ త్నంలో అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు చురుగ్గా భాగస్వాములు కావా లి. ఇదే క్రమేపీ జాతీయ అభివృద్ధి ఎజెండా రూపకల్పనకు దారితీస్తుంది. సీఎం కేసీఆర్ అంటున్న రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు ఇవి పునా దులు అవుతాయి.

బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల దేశాభివృద్ధి కాని, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవ డం కాని జరిగే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ఇప్పటికే నాలు గేండ్లు గడిచిపోయాయి. ప్రజలు ఒకవిధంగా నరేంద్ర మోదీ పాలనతో విసిగిపోయారు. కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాధాన్యం సంతరించుకున్న, ప్రజలకు అవసరమైన పథకం ఆలోచించడం కాని, అమలు చేయడం కానీ జరుగలేదంటే బహుశా అతిశయోక్తి కాదేమో! దళితులకు కాని, రైతు లకు కాని ఏదన్నా పథకం అమలైందా? కాలేదన్న విషయంలో ప్రజల ను చైతన్యవంతులను చేయగలిగితే, వాళ్లు ప్రశ్నించడం మొదలుపెడితే మార్పురావడం కష్టం కాదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఓడితే మరో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. రెండింటికీ పెద్ద తేడా ఏముంది? సీఎం కేసీఆర్ చెప్పినట్లు, పథకాల పేర్లు మారుతాయి, కానీ గుణాత్మక మార్పు వచ్చే అవకాశం లేదు. మన దేశం గురించి తక్కువగా అంచనా వేసుకుం టూ, ఫలానా దేశం ఇంత గొప్పది, అంత గొప్పది, అనే మాటలు ఎన్నా ళ్ళు వినాలి? ఈ స్థితి మారదా? ప్రజలు ఇప్పుడున్న వ్యవస్థతో తీవ్ర ఆవే దన చెందుతున్నారు. గుణాత్మక మార్పుకోసం ఎదురు చూస్తున్నారు. మార్పు రావాలి, వచ్చి తీరాలి. అదే అంటున్నారు సీఎం కేసీఆర్.

జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల పునరేకీకరణ జరుగడానికి, ఒక ఆకృతిగా రూపుదిద్దుకోవడానికి సమయం ఆసన్నమైంది. అయితే, ఇది కేవలం రాజకీయ పార్టీల కలయిక మాత్రమే కాకుండా, ప్రజలు సమన్వి తం కావాలి. గుణాత్మక మార్పు కోసం పిలుపునిచ్చిన కేసీఆర్, ఆయన నాయకత్వంలోని దేశవ్యాప్త బృందం, ఇదే ఎజెండాగా జాతీయ రాజకీ యాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నది. అత్యంత అభ్యుదయకర, ప్రగతిశీల ఎజెండా దేశాభివృద్ధికి రూపుదిద్దుకోనున్నది. భారత్ సంపన్న దేశంగా కావాలి. కేవలం రెండు దశాబ్దాలలో అత్యంత సంపన్నమైన దేశం గా రూపుదిద్దుకున్న చైనాను ఆదర్శవంతంగా తీసుకొని వారేం చేశారో అదే మనం చేయగలుగాలి. దేశంలోని సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్తలు, వారి తోపాటు దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే నిబద్ధత గల వ్యక్తులు, వాళ్ల ఆలోచనలను ఈ దిశగా కార్యరూపందాల్చేలా చేయాలి. రాజకీయా ల్లో రాబోయే గుణాత్మక మార్పునకు శ్రీకారం చుట్టనున్న రాజకీయశక్తి మూడో ఫ్రంట్ కాని, ఫెడరల్ ఫ్రంట్ కానీ కాదు. ఇది కొత్తగా రూపుదిద్దు కోనున్న మరో ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ పార్టీ. ఇది ఏక సారూ ప్యత ఉన్న పలు రాజకీయ పార్టీల సహవ్యవస్థ (కన్సార్షియం), లేదా, కలయిక. ఇదే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికా రంలోకి రావాలి. అలా జరుగాలంటే, దాని ఎజెండా కాని, ఎన్నికల మ్యానిఫెస్టో కాని అత్యంత జాగరూకతతో తయారుచేయాలి. దేశానికి ఒక బృహత్తర ప్రణాళిక రూపొందించాలి.

మన రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తితో రాయడం జరిగింది. రాష్ర్టాలకు, కేంద్రానికి వేర్వేరు రకాల అధికారాలు పొందుపరిచారు. అర్థంకాని విషయం. కేవలం రాష్ర్టాల పరిధిలోనే ఉండాల్సిన అంశాలై న గ్రామీణాభి వృద్ధి, గ్రామీణ రహదారులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, విద్య, వైద్యం లాంటి మరికొన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఎందుకుండాలని కేసీఆర్ అడుగడం సమంజసం. విదేశాంగ విధానమో, దేశ రక్షణకు సంబంధించి న అంశమో, దేశ సమగ్రత సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమో కేంద్ర పరిధిలో ఉంటే తప్పులేదు. సమాఖ్య జాబితా అని, రాష్ర్టాల జాబి తా అని రెండు ఉంటే సరిపోతుంది. ఉమ్మడి జాబితా అవసరం లేదు. ప్రభుత్వ విధానంలో, సంవిధానంలో, వ్యవస్థీకృత మార్పులతోపాటు న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలి. గుణాత్మక మార్పులో ఇవన్నీ భాగం కావాలి. ఏ వర్గానికి ఎంత మేరకు ఉపాధి అవకాశాలు కల్పించాలో సరిగ్గా తెలిసేది ఆయా రాష్ర్టాలకే కాబట్టి రిజర్వేషన్ల వ్యవహా రం పూర్తిగా రాష్ర్టాల పరిధిలోనే ఉండాలి. అసలు రాష్ట్రం అంటే ఏమిటి? సమాఖ్య అంటే ఏమిటి? అనే విషయంలో పునర్నిర్వచనం చేయడానికి కూడా సమయం ఆస న్నమైంది. రాష్ర్టాలకు మరిన్ని అధి కారాలు బదలాయించి, వాటికి సాధికారత కలిగించాలి. అదే విధం గా రాష్ర్టాలు కూడా సముచితమైనరీతిలో స్థానిక సంస్థలకు అధికారా లు ఇవ్వాలి. ఇదే అసలుసిసలైన సమాఖ్యస్ఫూర్తి.

స్వాతంత్య్రం వచ్చి డ్బ్భై ఏండ్లయినా జరుగాల్సినంత అభివృద్ధి జరు గలేదు. ప్రజావసరాలు తీరలేదు. ప్రజలందరికీ కనీసం రక్షిత మంచినీటి వసతి కలిగించలేకపోయాయి ప్రభుత్వాలు. దేశంలో 70,000 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా పూర్తిస్థాయి ఉపయోగంలోకి తేలేకపోయాం. అంతర్రా ష్ట్ర జల వివాదాలు పరిష్కారం కావడానికి ఏండ్ల తరబడి పడుతుంది. దేశం మొత్తం మీద 3.30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా, సగం దేశం అంధకారంలోనే ఉంటుంది. ఇదేమన్నా పద్ధతా? వ్యవస్థ ఇలా ఉం డాలా? ఒక రాష్ట్రంలో మిగిలి ఉన్న వనరులను మరో తరుగు రాష్ర్టానికి ఇచ్చే పధ్ధతి ఎందుకు ఉండకూడదు? తొలిసారి, నాలుగేండ్ల క్రితం, ఒక కాంగ్రెసేతర పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎంతో ఆశించారు ఆ ప్రభుత్వం నుంచి. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ దుస్థితి చూసి ఎంతకాలం ప్రేక్షకులుగా ఉండాలని ప్రజలు అడుగుతున్నా రు. ఎందరో నిపుణులు, ఎన్నో కమిషన్లు కేంద్ర, రాష్ట్ర సంబంధాల విష యంలో సూచించిన అంశాలు అమలుకు నోచుకోలేదు. సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా కొరవడింది.
Vanam
అభివృద్ధి, సంక్షేమ, మౌలిక వసతుల కల్పనా పరంగా, తెలంగాణ రాష్ట్రం ఎన్నో మైలురాళ్ళను అధిగమించింది. తెలంగాణ రాష్ట్రం తన వినూత్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలి చింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ ఎజెండా అయితే గుణాత్మక మార్పు కోసం ఏర్పడే రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాజకీయ నాయకులు, రంగాల నిపుణులు, పాలనానుభవం కలిగిన అధికారులు, ఇతరులు తమ సూచనలు, సలహాలు ఇచ్చి ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి.

497
Tags

More News

VIRAL NEWS