అంతరిక్ష స్టార్టప్‌లను ప్రోత్సహించాలె

Sun,March 11, 2018 02:00 AM

ఇప్పుడు సుమారు 26 వేల కోట్ల మేర ఉన్న ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో భారత్ వాటా 0.01 శాతం మాత్రమే!అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్ లో మన దేశపు ప్రముఖ సంస్థ అయిన ఆంత్రిక్స్ కార్పొరేషన్‌కు 290 మిలియన్ డాలర్ల మేర రాబడి ఉన్నది. ఇది పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థ. స్టార్టప్ అనుకూల వాతావరణం నెలకొల్పితే, దీని ఆధారంగా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా విధానా లు కూడా సఫలమవుతాయి. అంతరిక్ష రంగంలో మేక్ ఇన్ ఇండియా విధానానికి ఎంతో అవకాశం ఉన్నది. వ్యవస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా ఈ రంగంలోకి ప్రవహిస్తాయి.
Sit-light.jpg
ఇటీవలి కాలంలో అంతరిక్షరంగం లోకి ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించ డం పెరిగిపోతున్నది. భారత్‌కు అంతరిక్ష మార్కెట్‌లో పోటీ శక్తియుక్తులు పుష్కలంగా ఉన్నాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా సుమారు 26 వేల కోట్ల అంతరిక్ష మార్కెట్‌లో భారత్ వాటా 0.01 శాతమే! అంతరిక్షంలో స్టార్టప్‌లను పెంచే పరిస్థితులను కల్పించడం ఎట్లా?

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంపై దృష్టిపెట్టిన స్టార్టప్ సంస్థలు వేయికిపైగా ఉన్నాయనే ది నమ్మలేని నిజం. కానీ భారత్ నుంచి వేళ్ళమీద లెక్కపెట్టేంత తక్కువగా ఉన్నాయి. భారత్ ప్రపంచశక్తిగా అవతరిస్తున్న దేశం. ఉపగ్రహాలను, రాకెట్లను తయారుచేయగల దు, ప్రయోగించగలదు, నడిపించగలదు. భారత్ అంతరిక్ష కార్యక్రమంలో అయిదు వం దలకు పైగా చిన్న, మధ్య తరహా కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ స్టార్టప్ రంగంలో భారత్ వాటా ఒక్కశాతం కూడా లేదు. నేడు మన దేశంలో చెప్పుకోదగిన స్టార్టప్‌లు అంటే.. టీమ్ ఇండస్ గూగుల్ లూనార్ ఎక్స్‌ప్రైజ్‌లో భాగంగా చంద్రుడిపై రోవర్‌ను దింపడం), ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ (సాట్‌లైట్ బేస్డ్ బ్రాండ్ వృద్ధి) బెల్లాట్రి క్స్ ఏరోస్పేస్ సొంత లాంచ్ వెహికిల్స్ రూపొందించే దూరదృష్టితో ప్రస్తుతం థ్రస్టర్స్ తయారుచేయడం) మొదలైనవి ఉన్నాయి. వీటితోపాటు సాట్‌ష్యూర్ వంటి స్పేస్ డేటా ఉపయోగించేవి, రాకెటీర్స్ వంటి విద్యాసేవలు వృద్ధి చేసేవి ఉన్నాయి. స్టార్టప్స్ ప్రాతిపదికగా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను పెంచుకోకపోతే స్థానికంగా అత్యున్నత నైపుణ్యంగల వారిని కాపాడుకోలేము. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బడ్జెట్ తక్కువ. ఏటా కొన్ని వందల మంది శాస్త్రవేత్తలను లేదా ఇంజినీర్లను మాత్రమే నియోగించుకోగలదు.

టెక్ రంగంలో మాదిరిగా కాకుండా అంతరిక్షరంగంలో స్టార్టప్‌లు మార్కెట్‌కు అనుగుణంగా కుదురుకోవాలంటే ఐదు నుంచి ఏడేండ్లు పడుతది. అంతరిక్ష రంగంలో పెట్టుబడి పెట్టేవారు చాలాకాలం ఓపిక పట్టవలసి ఉంటుంది. భారత్‌లో ఇప్పటివరకు స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టిన సంస్థాగత ఇన్వెస్టర్లు లేరు. స్థానిక స్టార్టప్ వాతావరణాన్ని వృద్ధిచే యాలనే దృక్పథం గల వ్యక్తుల ద్వారా జరుగుతున్నది. మన దేశం అంతరిక్ష కార్యక్రమాలకు ఏటా వందట కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నది. చంద్రుడి మీద, అంగారకుడి మీద ప్రయోగాలు చేస్తున్నది. అయినా స్టార్టప్‌లకు పెంచి పోషించే కార్యక్రమాలు లేకపోవడం ఆశ్చర్యకరం. మరి ఇస్రో అంతరిక్ష కార్యక్రమాలలో దాదాపు 125 ప్రైవేటు సంస్థలు ఎట్లా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? దీనికి కారణం ఉన్నది. 1970 దశకంలో ప్రొఫెసర్ సతీశ్ ధావన్ ఇస్రో చైర్మన్‌గా ఉన్నప్పుడు, ఈ దిశగా పెద్ద ప్రయత్నం జరిగింది. సాం కేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహించారు.

2010 నాటి ఆంత్రిక్స్ కార్పొరేషన్ పత్రంలో ఈ వివరాలు ఉన్నాయి. అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన- సాలిడ్ ప్రొపెల్లంట్స్, బ్యాటరీ సెల్స్ మొదలైన పరికరాలు, వ్యవస్థలపై కీలక పరిజ్ఞానాన్ని ఇస్రో చిన్న తరహా వ్యాపార సంస్థలకు అందించింది. తమ ప్రమాణాలకు అనుగుణంగా, నమ్మదగినవిగా తయారుచేస్తే, ఆయా పరికరాలను కొంటామని ఇస్రో ఈ సంస్థలకు హామీ ఇచ్చింది. ఆనాడు ఇస్రో అనుసరించిన ఈ విధానం వల్ల ఇవా ళ మంగళ్‌యాన్ వంటి కార్యక్రమాలకు కూడా చిన్నతరహా పరిశ్రమలు పరికరాలను సమకూర్చగలిగాయి. ఈ క్రమంలో అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఇతర పరిశ్రమలకు వినియోగించడం ద్వారా మరింత అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు మంటలార్పడానికి పొడులను వాడటం మొదలైనవి. ఆనాడు ఇస్రో ఏర్పరిచిన పునాది వల్ల- ఇవాళ నావిగేషన్ సాట్‌లైట్ నిర్మాణంలో మన దేశ ప్రైవేట్ పరిశ్రమల ను నమ్మడానికి ఆస్కారం ఏర్పడ్డది. నావిగేషన్ సాట్‌లైట్ నిర్మాణంలో పాలుపంచుకున్న పరిశ్రమల కాన్సార్టియం 2020 నాటికి పీఎస్‌ఎల్‌వీలో సం యుక్త భాగస్వామ్యం పొందుతున్నది.

భారత్‌లో స్టార్టప్‌లను ప్రోత్సాహక వాతావరణా న్ని మరింత వేగంగా వృద్ధి చేయడం ఎట్లా అనేది ఇప్పుడున్న ప్రశ్న. 1970 దశకంలో తీసుకున్న చర్యలను మళ్ళా ప్రవేశపెట్టాలె. మన స్టార్టప్‌లు దేశ అవసరాలు తీర్చడమేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడగలుగాలె. అంతరిక్ష సేవలకు సంబంధించి దేశంలో ఉపయోగించుకోవలసిన మార్కెట్ ఎంతో ఉన్నది. ఉదాహరణకు- ఉపగ్రహ ఆధార బ్రాడ్‌బ్యాండ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 75 కోట్ల మందికి కనెక్టివిటీ అందించవచ్చు.
ఇస్రోకు సాటివచ్చే సంస్థలైన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ), నాసా సంగతి వేరే విధం గా ఉన్నది. ఈఎస్‌ఏ ఇటీవలే 500వ స్టార్టప్‌ను ఇం క్యుబేట్ చేసినందుకు ఉత్సవాలు జరుపుకున్నది. నాసా చిన్న వ్యాపార సృజన పరిశోధన (ఎస్‌బీఐఆ ర్) చిన్న వ్యాపార సాంకేతిక బదిలీ కార్యక్రమం (ఎస్‌బీటీటీపీ) వంటి పథకాల ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నది.

తొలి దశ అంతరిక్ష కార్యక్రమాల కు తోడ్పడటానికి లగ్జంబర్గ్ 15 వందల కోట్ల రూపాయల మేర నిధిని కేటాయించింది.బ్రెగ్జిట్ నేపథ్యంలో సొంత సంస్థలను ప్రోత్సహించేందుకు యూకే 15 స్టార్టప్ సముదాయాలను వృద్ధి చేస్తున్నది. 2030 నాటికి పది శాతం ప్రపంచ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని పథకాలను రచిస్తున్నది. ఫ్రాన్స్ ఏరోస్పేస్ వ్యాలీని నిర్మిస్తున్నది. ఏరోనాటిక్స్, స్పేస్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌కు సంబంధించిన సముదాయంలో లక్షా ఇరువై నాలుగువేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2025 నాటికి ఇందులో దాదాపు నలభై వేల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని యత్నిస్తున్నది. చైనాలో ఒకప్పుడు ప్రభుత్వ సంస్థలే ఉండేవి. కానీ ఉపగ్రహాలను తయారు చేయడానికి, ప్రయోగించడానికి ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇస్తున్నట్టు 2014లో ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గల 400 బిలియన్ డాలర్ల పరిశ్రమలో లాభాలు పొందడానికి భారీ ఎత్తున చైనా పరిశ్రమ లు వెలిశాయి. లింక్ స్పేస్ అనే సంస్థ ఉనరుపయోగ రాకెట్ డిజైన్‌ను వెలువరించింది. ఇది ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ వంటి అతిపెద్ద సంస్థలతో పోటీకి దిగుతున్నది.

ఇస్రోకు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు గల సంస్థలు ఉన్నాయి. బెంగళూరులోని ఐసాక్ కేంద్రం లో అంతరిక్ష నౌకల నిర్మాణం జరుగుతుంది. త్రివేంద్రంలోని వీఎస్‌ఎస్‌సీ, ఎల్‌పీఎస్‌సీ కేంద్రాలలో ప్రయోగ కేంద్ర పరిజ్ఞానం ఉన్నది. అహ్మదాబాద్‌లోని ఎస్‌ఏసీలో పేలోడ్ వృద్ధి సామర్థ్యం ఉన్నది. హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీలో అంతరిక్ష డేటా ఉపయోగ సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఉపయోగించుకొని స్పేస్ స్టార్టప్‌లను ప్రోత్సహించవ చ్చు. దేశంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన పునాది స్టార్ట ప్‌ల వృద్ధికి ఎంతో ఉపయోగకరం.

ఇస్రో భవిష్యత్ అవసరాల దృష్ట్యా పెంపొందించ దలుచుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి, శక్తి స్థోమతల కు స్టార్టప్ ఆలోచనలు ఉపయోగపడుతయి. దేశం లో సాంకేతిక పరిజ్ఞానం, సేవలు వృద్ధి చెందుతయి. ఈఎస్‌ఏ సాంకేతిక కేంద్రాల పరిసరాల్లో ఇం క్యుబే షన్ కేంద్రాలను వృద్ధి చేయవచ్చు.కొత్త ఆలో చనల ను గుర్తించి నిధులిచ్చే విధానంలో నాసాను ఆదర్శం గా తీసుకోవచ్చు. ఇస్రో ప్రోత్సాహం వల్ల స్థానిక స్టార్టప్‌లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం కుదురుతుంది.
Prasad.jpg
ఇప్పుడు సుమారు 26 వేల కోట్ల మేర ఉన్న ప్రపం చ అంతరిక్ష మార్కెట్‌లో భారత్ వాటా 0.01 శాతం మాత్రమే! అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్ లో మన దేశపు ప్రముఖ సంస్థ అయిన ఆంత్రిక్స్ కార్పొరేషన్‌కు సుమారు 19 వందల కోట్ల మేర రాబడి ఉన్నది. ఇది పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థ. స్టార్టప్ అనుకూల వాతావరణం నెలకొల్పితే, దీని ఆధారంగా డిజిటల్ ఇండి యా, మేక్ ఇన్ ఇండియా విధానా లు కూడా సఫలమవుతాయి. అంతరిక్ష రంగంలో మేక్ ఇన్ ఇండియా విధానానికి ఎంతో అవకాశం ఉన్నది. వ్యవస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా ఈ రంగంలోకి ప్రవహిస్తాయి. 2025 నాటికి పది బిలియన్ డాలర్ల మేర అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకునే పాటవం భారత్‌కు ఉన్నది. ఇందులో లక్షమందికి పైగా అత్యున్నత నైపుణ్యంగల ఇంజినీర్లకు, శాస్త్రవేత్తలకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇది సాకారం కావాలంటే స్పేస్ స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్ కార్యక్రమం అవసరం. దీనివల్ల ఆధునిక అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
(వ్యాసకర్త: అంతరిక్ష ఇంజినీర్)ది వైర్ సౌజన్యంతో...

636
Tags

More News

VIRAL NEWS