ఆధునికతవైపు అడుగులు సాధ్యమా?

Mon,February 12, 2018 11:06 PM

డిజిటల్ ఇండియా,బుల్లెట్ ట్రేన్, మేక్ ఇన్ ఇండియా లాంటి వన్నీ ఇలాంటి పురాణగాథల విశ్వాసాలపై ఆధారపడి నిజం చేస్తారా? హేతుబద్ధమైన, శాస్త్రీయమైన విద్యావిధానం లేకుండా శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధి ఎలా సాధ్యమో ఏలికలే చెప్పాలి. మేధస్సుకు బూజు పట్టించి ఆధునికతవైపుకు అడుగులు ఎలా వేస్తారు?

బీజేపీ నేతల మాటలు చాలా సందర్భాల్లో వింతగా, వివాదస్పదంగా ఉండటం గత కొంతకాలంగా ఎక్కువ అవున్నది. వ్యక్తిగతంగా ఎవరికైనా ఏ విధమైన విశ్వాసాలు, అభిప్రాయాలు అయినా ఉండవచ్చు. వాటిని ప్రకటించుకోవచ్చు. కానీ బాధ్య తాయుతమైన పదవుల్లో ఉంటూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యాఖ్యలు చేసేటప్పుడు తప్పకుండా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, యూనివర్సిటీల వేదికలపై నుంచి విశ్వాసాలు పునాదిగాగల పుక్కిటి పురాణాల గొప్పతనాన్ని చెప్పటం బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు, మూర్ఖత్వం.

కొంతకాలం కిందట రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి వాసుదేవ్ దేవ్నా ని- ఈనాడు చెప్పుకుంటున్న గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతాన్ని న్యూటన్ కన్నా ముందే వెయ్యేండ్ల కిందటే బ్రహ్మగుప్తుడు కనుగొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇది ఏదో ప్రైవేటు కార్యక్రమంలోనో, మరోచోటనో కాదు. రాజస్థాన్ యూనివర్సిటీ 72వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొంటూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మన పురాణ ఇతిహాసాలను, భారతీయ చరిత్ర ను లోతుగా అధ్యయనం చేస్తే ఈ విషయం ఎవరైనా కనుగొనవచ్చునట! ఆయన చెబుతున్న దాని ప్రకారం ఈ భూమిపై ఆవులు మాత్రమే ఆక్సీజన్‌ను ప్రాణికోటికి అందించే ఏకైక వనరులు. ఆవులకు దగ్గరగా ఉంటే సాధారణ రోగాలు, దగ్గు, జలుబు లాంటివి రావు. అలాగే ఆవు పేడ రేడి యోధార్మిక శక్తి నుంచి మనలను రక్షిస్తుంది. దేవ్నానీ చెబుతున్నది ఎంత అసంబద్ధమైనదో, అశాస్త్రీయమైనదో తెలుస్తూనే ఉన్నది. ఆవులు మాత్ర మే ఈ భూమిపై ప్రాణవాయువైన ఆక్సీజన్‌ను అందిస్తాయని చెప్పటం ఎంతటి మూర్ఖత్వమో చెప్పాల్సిన పనిలేదు. ఆవు పేడ నుంచి ఆక్సీజన్ కాదు, మీథేన్ మాత్రమే విడుదల అవుతుంది. ఇక బ్రహ్మగుప్తుడు కనిపెట్టాడంటున్న గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, ఆయన రాసిన బ్రహ్మస్ఫుత సిద్ధాంత గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని తీసుకుని, దాని ఆధారంగా దేవ్నాని ఈ విధంగా చెబుతున్నారు. నిజానికి బ్రహ్మగుప్తుడు రాసిన గ్రంథంలో.. భూమిపై నీరు పల్లంవైపు ఎలా సహజంగా ప్రవహిస్తుందో, అలాగే భూమి పైకి విసిరిన రాయి తిరిగి భూమినే చేరుతుందని చెప్పా డు. దీన్ని మన బీజేపీ నేత వాసుదేవ్ దేవ్నాని న్యూటన్ కనుగొన్న గురుత్వాకర్షణ సిద్ధాంతం కన్నా ముందే కనుగొన బడినదిగా చెప్పుకొస్తున్నారు.

ఇలా ఈనాటి శాస్త్రీయ విషయాలు, ఆవిష్కరణలన్నీ మా పురాణ, ఇతిహాసాల్లోనే ఉన్నాయని చెప్పిన వారిలో దేవ్నాని ఒక్కరే కాదు.ఆర్‌ఎస్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాభారతి ముఖ్య నిర్వాహకుడిగా ఉన్న దీననాథ్ బత్రా కూడా ఇలాంటి వెన్నో చెబుతుంటారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు రచిస్తుంటారు. ఆయన ఎనిమిది పుస్తకాలను రాశారు. ఆ పుస్తకాల్లో ఆయన నేడు గొప్ప ఆవిష్కరణగా చెబుతున్న సంకరకరణం(హైబ్ర డైజేషన్) నాటి మహాభారత కాలంలోనే ఉన్నదని రాశారు. మహాభారతంలోని కుంతి, కౌరవుల జననం కూడా స్టెమ్ సెల్ సిద్ధాంతం అనుగుణంగానే జరిగిందని తెలిపారు. ఆయన ప్రకారం- మహాభారత కాలంలోనే నేడు గొప్ప ఆవిష్కరణగా చెప్పుకుంటున్న టెలివిజన్ కనుగొన్నారు. అలాగే మోటార్ కార్ కూడా వేద కాలంలోనే కనుగొన్నారు.

ఇదీ నరేంద్ర మోదీ పాలనలో ఆధునిక భారతంలో గుజరాత్ రాష్ట్రంలో విద్యార్థులకు చెబుతున్న శాస్త్రీయ బోధన. దీన్నే గుజరాత్ రాష్ట్ర విద్యాశాఖ విలువలతో కూడిన గుణాత్మకమైన విద్య అని చెబుతున్నది. అది ఇంకా ఏం చెబుతున్నదంటే- ఎవరైనా దంపతులకు పిల్లలు కలుగకుంటే వారు ఆవులను చేరదీసి సంరక్షిస్తే వారికి సంతానం కలుగుతుంది. ఇలాం టి ఎన్నో విషయాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. ఇదే కోవలో గాంధీనగర్‌లోని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ హర్షద్ షా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయత, విలువలతో కూడిన విద్య ఇలాంటి పాఠ్యాంశాల ద్వారా అందుతుందని చెబుతున్నారు. ఇంకా నేడు గుజరా త్ రాష్ట్రంలోని పాఠ్యాంశాలతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయని గుజరాత్ పాఠ్యపుస్తకాల డైరెక్టర్ భరత్ పండిట్ అంటున్నారు.
karan
దీనానాథ్ బత్రా అయితే పురాణాలే మన విద్యార్థులకు శాస్త్రీ య విజ్ఞానాన్ని, ఆవిష్కరణల ను తెలుపుతాయని అంటున్నా రు. పురాణ గాథల్లో ఉన్న దేనికీ శాస్త్రీయ పునాదులు ఉండవు. నిరూపణలు దొరకవు. అవి కేవ లం ఊహా కల్పనలు మాత్రమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. రెండో విషయమేమంటే.. పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయని చెబుతున్న దానికి ఏ నిరూపణ హేతుబద్ధత ఉండదు. ఇక 2014లో నరేంద్రమోదీ చెప్పిందేమంటే.. మన వేదకాలంలోనే, పురాణ ఇతిహాసాల కాలంలోనే జన్యు శాస్త్రం, ప్లాస్టిక్ సర్జరీ ఉన్నదని చెప్పుకొచ్చారు!

ఆధునిక విశ్వవిద్యాలయ పాలకులుగా, విధానకర్తలుగా, పాలకులుగా ఉండి శాస్త్రీయ విషయాలను పురాణాల్లో వెతుకడానికి ప్రయత్నించటం విషాదం. బీజేపీ దేశాన్ని ఆధునిక భారతంగా 21వ శతాబ్దంలోకి తీసుకెళ్తామని చెబుతున్నది. స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని అంటున్నది. రాబోయే రోజుల్లో మిషన్ మార్స్ పేరుతో అంతరిక్ష విజయాలకు బాటలు వేస్తున్న ది. డిజిటల్ ఇండియా,బుల్లెట్ ట్రేన్, మేక్ ఇన్ ఇండియా లాంటి వన్నీ ఇలాంటి పురాణగాథల విశ్వాసాలపై ఆధారపడి నిజం చేస్తారా? హేతుబద్ధమైన, శాస్త్రీయమైన విద్యావిధానం లేకుండా శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధి ఎలా సాధ్యమో ఏలికలే చెప్పాలి. మేధస్సుకు బూజు పట్టించి ఆధునికతవైపుకు అడుగులు ఎలా వేస్తారు?
వ్యాసకర్త: ప్రముఖ జర్నలిస్టు
(Rediff.com నుంచి)

531
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles