హక్కులకు మాలిమత్ ముప్పు

Sun,February 11, 2018 01:26 AM

నేరాల దర్యాప్తు సత్వరంగా ముగించాలన్న తొందరలో శాస్త్రీయ దర్యాప్తులకు వెళ్లకుండా పోలీసులు అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్నారు. తాము ఏమి చేసినా ఏమీ కాదన్న భరోసాలో
పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని బలీయంగా చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.ఆరుషి, తల్వార్-హేమరాజ్ కేసు నుంచి మొన్నటి బస్సు కండక్టర్ కేసు వరకు ఎన్నో ఉదాహరణలు.మన రాష్ట్రంలో కూడా ఎన్నో కేసులను ఉదహరించవచ్చు.

నేర న్యాయవ్యవస్థ ప్రక్షాళన కోసం అద్వానీ కేంద్ర హోంశాఖామం త్రి గా ఉన్నప్పుడు న్యాయమూర్తి మాలి మత్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2003 సంవత్సరంలో ఆ కమిటీ తన సిఫా ర్సుల ను ప్రభుత్వానికి అందజేసింది. తక్కువ మంది నేరస్తులకు శిక్షలు పడటం, కేసుల విచారణల్లో జాప్యం అన్న రెండు అంశాలు నేరన్యాయ వ్యవస్థ ను పట్టిపీడిస్తున్నాయని కమిటీ గుర్తించి వాటిని తగ్గించుట సంస్కరించడానికి అవసరమైన సూచ నలను చేసింది. ఆయితే ఆ సూచనలు చాలావర కు నేర న్యాయవ్యవస్థ మౌలిక రూపురే ఖలను మార్చేవిధంగా వుండటం వల్ల ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ప్రభుత్వం స్వీకరించలేదు. అయితే ఇప్పు డు ప్రభుత్వం ఆ సిఫార్సులను తిరిగి పరిశీలిస్తుందన్న వార్తలు పత్రిక ల్లో వచ్చాయి. ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం.
కమిటీ సిఫారసు చేసిన చాలా సూచనలు మన నేర న్యాయవ్యవ స్థ జ్యూరిస్ ప్రుడెన్స్‌కు విరుద్ధం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేర న్యాయ మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఆ సిఫారసులను ప్రభు త్వం పరిశీలిస్తుందన్న అంశం నేరన్యాయ వ్యవస్థలో సంబంధం ఉన్న వ్యక్తులను కలిచివేస్తున్నది.

నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగ ణించాలి. నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ఈ విషయాన్ని మెల్లగా ముద్దాయిపైకి తోసేవిధంగా మాలిమత్ కమిటీ సిఫారసు చేసింది. దానివల్ల క్రిమినల్ జ్యురిస్ ప్రుడెన్స్‌కు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. పోలీసుల దర్యాప్తులు ఇప్పుడే అంతంత మాత్రంగా వున్నాయి. ఈ రకంగా నిబంధనలు వస్తే పోలీసులు, ఆ మాటకొస్తే సీబీఐ కూడా దర్యాప్తులో శ్రమించదు.

సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తును పోలీసులు ముగించాలి. 24 గంటల కాలంలో దర్యాప్తు పూర్తికానప్పుడు 15 రోజుల్లో పూర్తి చే యాలి. అందుకే ముద్దాయిలను జ్యుడీషియల్ కస్టడీలో వుంచుతా రు. తీవ్రమైన నేరాల్లో 90 రోజులలోగా, ఇతర కేసుల్లో 60 రోజు ల్లోగా కేసు దర్యాప్తులు పోలీసులు పూర్తిచేయాలి. అలా చేయనప్పుడు ముద్దా యిని తప్పనిసరిగా బెయిల్ మీద విడుదల చేయాల్సి వుంటుంది. ఈ నిర్బంధ కాలపరిమితిని మొదటి 15 రోజుల నుంచి 30 రోజులవరకు, 90 రోజుల నుంచి 180 రోజుల వరకు పెంచాలని మాలిమత్ కమిటీ సూచించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధం. అంతేకాదు ఈ సూచనలు అమల్లోకి వస్తే పోలీసుల శ్రద్ధ కేసుల దర్యాప్తులో పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అమాయకులు అనవసరంగా జైల్లో మగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన సాక్ష్యాలకు ముద్దాయు జవాబు చెప్పుకునే అవకాశాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో సె.313 కల్పిస్తుంది. ఈ నిబం ధన ప్రకారం కోర్టు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ముద్దాయి మౌనంగా వుండవచ్చు. మౌనంగా వున్నంతమాత్రాన అతనికి వ్యతిరే కంగా కోర్టు ఎలాంటి భావనకు రావడానికి వీల్లేదు. అదేవిధంగా పోలీ సులు ముద్దాయిని ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ముద్దాయి మౌనంగా వుం డవచ్చు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 20 (3) ప్రకారం ముద్దాయికి వచ్చిన రాజ్యాంగపు హక్కు.

ఈ నిబంధనలకు వ్యతి రేకంగా సవరణ లు చేయాలని మాలిమత్ కమిటీ సూచించింది. అప్పుడు ముద్దాయి మౌనంగా వుంటే అతనికి వ్యతిరేకంగా భావనలను స్వీకరించే అవకా శం ఏర్పడుతుంది. మౌలిక న్యాయసూత్రాలకు, రాజ్యాంగం ప్రసా దించిన ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధం.ఇవి అన్నింటికన్నా ముఖ్యమైన మార్పును భారతీయ సాక్ష్యాధా రాల చట్టంలోని నిబంధన 25కు కమిటీ సూచించింది. పోలీసుల ముం దు ముద్దాయి నేరం అంగీకరిస్తే అది ఆమోదయోగ్యం కాదు. ఈ రక్షణ ముద్దాయికి వున్నప్పుడే ముద్దాయి పోలీసుల చేతుల్లో చిత్ర హింసలకు గురి అవుతున్నాడు. పోలీసులు సూపరింటెండెంట్ ముందు నేరం అం గీకరిస్తే అది ఆమోదయోగ్యం చేయాలని కమిటీ సూచించింది. అప్పు డు ముద్దాయి తన న్యాయవాదితో సంభాషించుకునే వెసులుబాటును కూడా సూచించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే పోలీసులు కేసులను దర్యాప్తు చేయకుండా, నేరాంగీకారాలను నమోదుచేసి చేతులు జరు పుకునే దిశ గా ప్రయత్నాలు చేస్తారు. సెక్షన్ 23 ఉన్నప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంది. దీన్ని ఆమోదయోగ్యం చేస్తే పరిస్థితి భయంకరంగా మారిపోతుంది.

నేరాల దర్యాప్తు సత్వరంగా ముగించాలన్న తొందరలో శాస్త్రీయ దర్యాప్తులకు వెళ్లకుండా పోలీ సులు అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్నారు. తామేం చేసినా ఏమీ కాదన్న భరోసాలో పోలీసు లు ఉన్నారు. ఈ విషయాన్ని బలీయంగా చెప్పడా నికి ఎన్నో ఉదా హరణలు చెప్పవచ్చు. ఆరుషి, తల్వార్-హేమరాజ్ కేసు నుంచి మొన్నటి బస్సు కండక్టర్ కేసువరకు ఎన్నో ఉదాహరణలు. మన రాష్ట్రంలో కూడా ఎన్నో కేసులను ఉదహరించవ చ్చు. ఈ మధ్య పత్రికల్లో ప్రముఖంగా కన్పించిన రేయాన్ స్కూల్ హత్యకేసును ప్రస్తావిస్తాను.

ప్రద్యుమ్న అనే పదేండ్ల కుర్రవాడు రేయాన్ అంతర్జాతీయ స్కూల్‌లోని టాయిలెట్ రూంలో హత్యకావించబడినాడు. ఆ వార్త కార్చిచ్చులా వ్యాపించింది. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పోలీ సుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. స్కూల్ బస్ కండక్టర్ అంతకు ముందు అదే టాయిలెట్‌లోకి వెళ్లివచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. దాంతో అతన్ని అనుమానించి, ఆ కుర్రవాడిని లైంగికంగా వేధించి హత్యచేశాడని అతన్ని ఘోరమైన చిత్రహింసల కు పోలీసులు గురిచేశారు. బాధితుడి భాషలో చెప్పాలంటే అతని కాళ్లను, చేతులను ఇనుప గొలుసులతో బంధించి ఎలక్ట్రిక్ షాకులకు గురిచేశారు. ఓ చీకటి గదిలో బంధించారు. అతని బట్టలు వూడదీ సి, తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశారు. అతను స్పృహ కోల్పేయేంత వరకు చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత కూడా చిత్రహింసల పాలుచేశారు. బస్ కండక్టరే హత్య చేశాడని మీడియాకు తెలియజేశారు. అతని నేరాంగీకారం (confesson) ఆధారంగా కత్తిని కూడా జప్తు చేశారు. మరిగే నీటిలో చేతులు పెట్టిం చడం లాంటి మరెన్నో చిత్రహింసలకు అతన్ని గురిచేసి చివరకు కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

బస్ కండక్టర్ హత్య చేశాడన్న ఆరోపణను ప్రద్యుమ్న తల్లిదండ్రు లు నమ్మలేదు. చివరకు వాళ్ళ ఒత్తిడివల్ల సీబీఐ దర్యాప్తునకు ప్రభు త్వం ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం బస్ కండక్టర్ కుమార్ కన్నా ముందు అదే స్కూలుకు చెందిన మరో విద్యార్థి టాయ్‌లెట్ లోకి వెళ్ళినట్టుగా ఆధారం దొరికింది. బస్ కండక్టర్ టాయ్‌లెట్‌లోకి వెళ్లినప్పుడు ఆ విద్యార్థి ప్రద్యుమ్నని క్యూబిక్‌లోకి తీసుకొని వెళ్లాడు. అందువల్ల వాళ్ళిద్దరినీ బస్ కండక్టర్ కుమార్ చూడలేకపోయాడు. ఈ సీసీ ఫుటేజీని హర్యానా పోలీసులు జాగ్రత్తగా పరిశీలించకుండా బస్ కండక్టర్‌ను చిత్రహింసల పాల్జేసి రిమాండ్‌కు పంపించారు.
rajendar
సీబీఐ దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేటతెల్లమయ్యాయి. పరీక్ష వాయిదా వేయించడం కోసం తోటి విద్యార్థి ప్రద్యుమ్మని మరో విద్యార్థి హత్య చేశాడు. సీబీఐ దర్యాప్తు ప్రకారం బస్ కండక్టర్ అమా యకుడు. అతనికి నేరంతో సంబంధం లేదు. సె.25 లాంటి నిబం ధనలు వున్నప్పుడే ఇలాంటి చిత్రహింసలు జరుగుతున్నాయి. పోలీ సుల ముందు నేరాంగీకారం ఆమోదయోగ్యం అయితే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.

సుప్రీంకోర్టు ఈ విషయాలను గమనించి కర్తార్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఈ రకంగా అభిప్రాయపడింది. ...బార్‌లో, బేంచి మీద వున్న అనుభవం ప్రకారం పోలీసుల అరాచకాల గురించి ఎన్నో కథలను చూశాం. అమానవీయ అనాగ రిక, పురాతన పద్ధతులతో అనుమానితులను చిత్రహింసలకు గురిచే సి కొందరు పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు.పోలీసులకు జవాబుదారీతనం కోసం తగు నిబంధనలు చేయ కుండా, ఎలాంటి నిబంధనలు చేయకూడదు. చేస్తే అవి అనర్థం వైపు దారితీస్తాయి. మాలిమత్ కమిటీ సిఫారసులను అమలుచేస్తే పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. పోలీసుల నైపుణ్యం పెంపొందిం చేందుకు ఎన్ని అకాడమీలను ఏర్పాటుచేసినా ఫలితం ఉండదు.
(వ్యాసకర్త: కవి, రచయిత)

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles