ఏపీ చేసిన అవాస్తవ ప్రచారాలు

Sat,January 13, 2018 01:09 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో ఈ ట్రిబ్యున ల్‌కు నివేదించిన పరిధి చాలా తక్కువ కాబట్టి మనకు న్యాయం ఎంతవర కు జరుగుతుందో చెప్పలేం. కేంద్రం వెంటనే చట్టాన్ని సవరించాలి, ట్రిబ్యునల్ పరిధి పెంచాలి. ఈ విషయంలో ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం, 1956లోని సెక్షన్-3 కింద తెలంగాణ 2014లో చేసిన ఫిర్యాదు, కేం ద్రం వద్ద గత మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్నది.

తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడం భౌగోళికంగా అసా ధ్యం, తెలంగాణకు ఇవ్వడానికి కృష్ణానదిలో నీళ్లెక్కడున్నా యి. ఈ రెండూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రచారాలు. తెలంగాణ ప్రజలు కూడా నమ్మే విధంగా చేసిన ఈ ప్రచారాలను పూర్వ పక్షం చేస్తూ, కృష్ణా ట్రిబ్యునల్ (బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్) ఎదుట తెలం గాణ రాష్ట్రం కృష్ణానది బేసిన్‌లో తెలంగాణ నీటి అవసరాలు రిపోర్టులో ను, తెలంగాణ తరఫున మాజీ కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్, ఘన్‌శ్యామ్ ఝా అఫిడవిట్‌లోను నివేదించింది.

బేసిన్‌లోని సాగుకు అనువైన తెలంగాణ భూములకు కనీసం ఒక పం టకైనా సాగునీటి వసతి కల్పించాలనే లక్ష్యంగా, ఏప్రిల్‌లో, తెలంగాణ కేసు ప్రకటన (Statement of case)ను ట్రిబ్యునల్‌కు నివేదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాలను క్రోడీకరించడంతో పాటుగా, బేసిన్ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనీ ఆ తర్వాతే బేసిన్ ఆవల అవసరాల గురించి ఆలో చించాలనీ చెపుతూ, బేసిన్ ప్రాతిపదికలైన పరీవాహక ప్రాంత విస్తీర్ణం, కరువు ప్రాంత విస్తీర్ణం, జనాభా తదితర అంశాల ఆధారంగా తెలంగాణ కు పునఃకేటాయింపులు చేయాలని ట్రిబ్యునల్‌ను కోరింది. కోస్తాంధ్రలోని ప్రాజెక్టుల కింద పంటలకు అవసరమైన వాస్తవ నీటి పరిమాణాన్ని లెక్కిం చి, ట్రిబ్యునళ్ల ఎదుట అవసరానికంటే ఎక్కువ డిమాండ్స్ పెట్టడం ద్వారా పొందిన అధిక కేటాయింపులను తగ్గించాలని కోరింది. అట్లాగే, కోస్తాంధ్ర ప్రాజెక్టులకు నాగార్జునసాగర్ దిగువన లభించే నీటిని వినియోగించుకో గలిగినా, వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని బహిర్గతం చేసింది. వీటన్నింటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సాక్షి కె.వి.సుబ్బారావును కూడా ప్రశ్నించి, తగు సమాచారాన్ని రాబడుతున్నది. గతవారం ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్ తిరిగి జనవరి చివరలో మొదలవుతుంది.

నాడు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం ప్రతిపాదించిన భీమా ప్రాజెక్టు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కాలువ, తుంగభద్ర ప్రాజెక్టు ఎడమ కాలు వల ద్వారా 174.3 టీఎంసీల నీటిని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల కు గ్రావిటీ ద్వారానే అందిఉండేవి. నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతి కారణంగా, 1969లో, బచావత్ ట్రిబ్యునల్ ఎదుట 150 టీఎంసీ ల శ్రీశైలం ఎడమకాలువ కెనాల్ స్కీమ్‌ను ప్రతిపాదించిన ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం, తర్వాతి కాలంలో దాన్ని పట్టించుకోలేదు. ఇవన్నీ కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుకు గ్రావిటీ మార్గాన నీటిని అం దించేవే. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలవల్ల, ఈ ప్రాజె క్టులు నిర్మాణాని కి నోచుకోక, నేడు వాటిని తెలంగాణ ప్రభుత్వం చేపట్టా లన్నా అసాధ్యమై న పరిస్థితులు ఏర్పడి, లిఫ్ట్ చేస్తే తప్పా సాధ్యంకాని స్థితి ఏర్పడింది.
ఉమ్మడి ప్రభుత్వం, బచావత్ ట్రిబ్యునల్ వద్ద 1973 నాటికి, నికర జలాలను అవసరానికంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ నీటిని కృష్ణా డెల్టా సిస్టం (ప్రకాశం బ్యారేజీ)కి, నాగార్జునసాగర్ కుడికాలువ కింద, రక్షణల ద్వారా కృష్ణా బేసిన్ ఆవల ఆయకట్టుకు కేటాయింపజేసుకొని, మళ్లీ కృష్ణా డెల్టా, కేసీ కెనాళ్లకు ఇంకా మిగిలిన నికర జలాల్లో కేటాయిం చాలని కోరింది. బేసిన్‌లోని శ్రీశైలం ఎడమ కాలువకేమో మిగులు జలా లు కేటాయించాలని కోరింది. ఆ మిగులు జలాల డిమాండ్లలో కూడా మళ్లీ మొదటి ప్రాధాన్యం కృష్ణా సిస్టంలోని ఆయకట్టు రెండవ పంటకు ఇవ్వాలని, తర్వాత నాగార్జునసాగర్ కుడికాలువ అదనపు ఏరియాకు, ఆ తర్వాత సంగమేశ్వరం కెనాళ్ల(అంటే, శ్రీశైలం కుడి కాలువల)కు ఇవ్వా లని కోరింది. సంగమేశ్వరం కెనాళ్ల విషయంలో ఎందుకు ఇవ్వాల్సిన అవ సరం ఉన్నదో రెండు పేజీల్లో వివరించారు. వాటి తర్వాత శ్రీశైలం ఎడ మ కాలువ 150 టీఎంసీలను చేర్చారు. బచావత్ ట్రిబ్యునల్, అప్పటికే రక్షణల రూపంలో, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక, మహారాష్ట్రల కంటే చాలా ఎక్కువగా కేటాయించి ఉన్నందున, కేవలం జూరాలకు మాత్రమే (17.8 4 టీఎంసీలు), మహబూబ్‌నగర్ జిల్లా రాష్ర్టాల పునర్విభజన వల్ల చాలా నష్టపోయింది కాబట్టి కేటాయిస్తున్నామని పేర్కొంటూ, సానుభూతితో కేటాయించింది.

శ్రీశైలం ఎడమ కాలువను 150 టీఎంసీల నుంచి కేవలం 30 టీఎం సీలకు కుదించి, ఆయకట్టును కూడా కుదించారు. టన్నెల్ అలైన్‌మెంట్ మారింది. మెల్లమెల్లగా నికర జలాల జాబితా నుంచి మిగులు జలాల జాబితాలోకి మార్చి, 2014 రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన (అసంబద్ధమైన) ప్రాజెక్టుల జాబితా లో కూడా చోటులేకుండా చేశారు. ఇక శ్రీశైలం ఎడమకాలువ కోసం టన్నెల్ నిర్మించాల్సిన ప్రదేశం, 197 8 నాటికి శ్రీశైలం అభయారణ్యంగా, ఆ తర్వాత 1983 నాటికి ప్రాజెక్ట్ టైగర్ రక్షిత ప్రాంతంగా ప్రకటితమైంది. ఆంధ్ర ప్రదేశ్ వైపేమో ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగా ప్రాజెక్టులను 1981 నాటిక ల్లా ప్లానింగ్ కమిషన్, అంతర్రాష్ట్ర ఒప్పందాల ముసుగులో పోతిరెడ్డిపా డు రెగ్యులేటర్ ద్వారా మార్గం సుగమం చేసుకున్నారు.
vijay
ఈ విధంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగ ల్ జిల్లాల కృష్ణా బేసిన్ ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా 324.3 టీఎంసీలు (174.3+150=324.3 టీఎంసీలు) ప్రధాన కృష్ణానది ద్వారా లభించ కుండా చేసి, నేడు తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లివ్వడం భౌగోళికంగా అసాధ్యం లాంటి ప్రచారాలను చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీట న్నింటిని నేడున్న బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏకరువు పెట్టింది మన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో ఈ ట్రిబ్యున ల్‌కు నివేదించిన పరిధి చాలా తక్కువ కాబట్టి మనకు న్యాయం ఎంతవర కు జరుగుతుందో చెప్పలేం. కేంద్రం వెంటనే చట్టాన్ని సవరించాలి, ట్రిబ్యునల్ పరిధి పెంచాలి. ఈ విషయంలో ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం, 1956లోని సెక్షన్-3 కింద తెలంగాణ 2014లో చేసిన ఫిర్యాదు, కేం ద్రం వద్ద గత మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్నది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
(వ్యాసకర్త: రాష్ట్ర ఇంజినీర్స్ జేఏసీ సెక్రెటరీ)

701
Tags

More News

VIRAL NEWS