స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

Fri,January 12, 2018 12:22 AM

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం, పాటలు, పద్యాలు పాడటం,ఊహాజనిత విషయాల గురించి రాయటం వంటివి అప్పటిదాకా బోధించాలి, శిక్షణనివ్వాలి. స్పష్టంగా సరైన ఉచ్చారణ చేయటం, తప్పులు లేకుండా మూడు భాషలలోనూ తేలికపాటి పదాలు, వాక్యాలు ఉపయోగించి రాయటం, స్వయంగా చదువటం 5వ తరగతి అయ్యే సమయానికి గరిపితే,6వ తరగతి నుంచి వారు విన్నది, చదివినది వారే అర్థం చేసుకుంటారు.

ఇటీవల నమస్తే తెలంగాణలో కర్ణాటక రాష్ట్రంలో ఒకరోజు స్కూలు బ్యాగు లేకుండా పిల్లలకు స్కూలు నడిపే విధానాన్ని గురించిన వార్త వచ్చింది. ప్రభుత్వం తలుచుకుంటే ఈ స్కూలు బ్యాగు మోతకు శాశ్వత పరిష్కారాలు ఉన్నా యి. దానివల్ల విద్య కూడా గుణాత్మకంగా గరుపవచ్చు. ఒక హైస్కూలు లో ఈ వ్యాసకర్త ఎకడమిక్ అడ్వైజర్‌గా పనిచేసినపుడు ఈ బ్యాగు బరువు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడమైనది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించటానికి పూనుకున్నారు గనుక సమస్యను తేలికగా పరిష్కరించవచ్చు. అసలు సమస్య ఏమిటో చూద్దాం.
ఒకటో తరగతి నుంచి పదవ తరగతిదాకా కనీసం ఆరు సబ్జెక్టులు ఉం టాయి. మూడు భాషలు (తెలుగు, ఇంగ్లీష్, హిందీ), సామాన్య, సాంఘి క శాస్ర్తాలు, లెక్కలు. ఈ టెక్స్‌బుక్స్ రోజూ విద్యార్థులు తీసుకెళ్లాలి. ఇంక వాటికి క్లాస్‌నోట్ బుక్స్ 6, హోంవర్క్ బుక్స్ 6, మొత్తం 6 టెక్స్ బుక్స్, 12 నోట్‌బుక్స్. ఇంకా టెక్నో స్కూల్స్, ఈ-స్కూల్స్, మిషనరీ స్కూళ్లల్లో ఇంకో రెండు, మూడు సబ్జెక్టులు ఎక్కువగా ఉంటాయి. మినరల్ నాలెడ్జ్, మోరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అంటూ ఇంకో రెండు మూడు టెక్ట్స్ బుక్స్, వాటి నోట్‌బుక్స్ ఉంటాయి. ఇవి కాక 1 డైరీ, 1 రఫ్ నోట్‌బుక్! అంటే 18 నుంచి 24 దాకా!

ఇక రెండవ సమస్య ఒకరోజులో అని సబ్జెక్టులు చెప్పాలా అన్నది. నిజానికి మనో వైజ్ఞానికులు చెప్పే సిద్ధాంతం ప్రకారం ఒక అంశం నుంచి వేరొక అంశం మీదికి దృష్టి మరల్చాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది. అలాంటిది మన పాఠశాలల్లో 40 లేక 50 నిమిషాల నిడివి ఉన్న పీరియడ్స్‌ను పెట్టి ఒకదాని తర్వాత ఒక సబ్జెక్టు చెప్పుకుంటూపోతే అసలు పిల్లలకు ఎంత అర్థమవుతుంది? వాళ్ళు టీచర్ చెప్పేదానిమీద ఎంత ఫోక స్ పెట్టగలుగుతారు? ఆ పీరియడ్ అయిపోయి, ఇంకో పీరియడ్ మొదలు పెట్టేసరికి ఎంత వారికి బుర్రకెక్కి, గుర్తుంటుంది? విద్యారంగం, మనో వైజ్ఞానిక రంగంలోని నిపుణులు, పరిశోధకులు చెప్పే ఒక అంశం గుర్తించటం చాలా ముఖ్యం. ఏదైనా ఒక అంశం నేర్చుకున్నప్పుడు, దానిమీద కొన్ని యాక్టివిటీస్ చేస్తే, ఎక్కువ సమయం దాని గురించి ఆలోచిస్తే ఆ అంశం మీద వారికి అవగాహన పెరిగి గుర్తుండిపోతుంది. అందుకే ప్రతి పీరియడ్ కనీసం గంటన్నర చేసిన ఒక అంశం మీద విద్యార్థులకు పూర్తి పట్టు వచ్చేవరకు రకరకాల యాక్టివిటీస్‌తో వారికి ఉత్సాహం కలిగేటట్టు ఆ అంశాన్ని బోధించాలి. ఉదాహరణకు ఆరు సబ్జెక్టులు-మూడు భాషలు, సాంఘిక, సామాన్య శాస్ర్తాలు, లెక్కలు-ఉన్నాయనుకోండి. ఇప్పుడు టైంటేబుల్ ఈ విధంగా ఉంటుంది. రోజూ ప్రతి సబ్జెక్టు 50 నిమిషాల చొప్పున 6 పీరియడ్స్‌లో బోధించడం జరుగుతుంది. చిన్న పీరియడ్ వల్ల ఈ కింది నష్టాలు ఉంటాయి.

1.టీచర్లు తాము బోధించవలసిన అంశాలు బోధించడమే కానీ పిల్లలకు వాటిగురించి ఆలోచించే సమయం ఇవ్వలేరు, అంశం గురించి ఆలోచించే సమయంలో విద్యార్థులకు అవగాహన దాని అంశాల మీద ప్రశ్నలడిగే అవకాశం ఉండదు. ఒకదానివెంట ఒకటి అన్ని సబ్జెక్టులు చెప్పడంతో అవి పిల్లల మెదడులో కలగాపులగమౌతాయే కానీ సరైన అవగాహన రాదు. వారంలో ఒక పాఠం పూర్తిచేసి దానిమీద ప్రశ్నలడగాలన్నా యాక్టివిటీస్ చేయించాలన్నా మొదట చెప్పిన అంశాలు పిల్లల బుర్రల్లో మరుగున పడుతాయి. ఉదాహరణకు 6 పేజీల పాఠం ఉందనుకుంటే గంటన్నర పీరియడ్‌లో 1 పేజీ బోధించడం పూర్తిచేసి, దాని మీద ప్రశ్నలు, జవాబులు, కొత్త పదాలు, ఊహాజనితమైన ప్రశ్నలు అన్ని పూర్తిచేయవచ్చు. రోజూ చిన్న పీరియడ్లలో ప్రతి సబ్జెక్టు చెపితే వారానికి 6 పీరియడ్లు (300 నిమిషాలు) వస్తాయి. అలాగే గంటన్నర పీరియడ్స్ చేసి ప్రతి సబ్జెక్టు వారానికి 4 సార్లు బోధిస్తే అంతకంటే ఎక్కువ సమయం వస్తుంది (90X4=360) పైగా ఒక అంశం/ లెక్కను థరోగా చదివి, అర్థం చేసుకొ ని, దానిమీద యాక్టివిటీస్ చేస్తే అది జ్ఞాపకం ఉంటుంది. ఉపాధ్యాయులకు కూడా ప్రతి యాభై నిమిషాలకు ఒక క్లాసు నుంచి ఇంకొక క్లాసులోకి మారడంతో వృథా అయ్యే సమయం కూడా కలిసివస్తుంది.

2. ఇక పుస్తకాల మోత గురించి కూడా సంస్కరణలు ప్రవేశపెట్టచ్చు. విద్యార్థుల టెక్స్ బుక్స్, క్లాసు నోట్‌బుక్స్ క్లాసులలోనే చదివి వెళ్లే ఏర్పా టుచేస్తే బాగుంటుంది. కూర్చున్న కుర్చీకి చిన్న డెస్స్ అమర్చి తాళం వేసుకునే సౌకర్యం కల్పిసే వారు ఆయా పీరియడ్స్‌లో అవి తీసుకొని ఉపయోగించుకుని మళ్లీ అందులోనే పెట్టుకొని తాళం వేసుకుంటారు. ఆ తాళాన్ని క్లాసు డైరీకి దారంతో కట్టే ఏర్పాటు చేయాలి. వారమంతా వారు క్లాసులో ఏం చదివారో, ఏమి అర్థమయిందో ప్రశ్నలు వారికి ప్రతిరోజూ క్లాస్ రఫ్ నోట్‌బుక్‌లో రాసుకొని ఇంటికెళ్లి హోంవర్క్ బుక్‌లో రాయమనాలి. అలా వారమంతా రాసినది వారంలో ఒకరోజు స్కూలుకు తీసుకురావాలి. ఆ హోంవర్క్ బుక్స్ తెచ్చేది కూడా రోజుకు మొదటి పీరియడ్ ఉన్న సబ్జెక్టు తెస్తే, ఆయా టీచర్లు ఆ రోజు మర్నాడు కరెక్షన్స్ పూర్తిచేసి ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే రోజూ విద్యార్థి పుస్తకాలు మాత్రమే మోసుకురావాలి. అవి.. క్లాస్ డైరీ, క్లాస్ రఫ్ నోట్‌బుక్, ఆ రోజు సమ్మిట్ చేయాల్సిన హోంవర్క్ నోట్‌బుక్. మళ్లీ ఇం టికి వెళ్లేటప్పుడు మూడు పుస్తకాలే ఉంటాయి.. క్లాస్ డైరీ, రఫ్ నోట్‌బు క్, టీచర్ కరెక్ట్ చేసి ఇచ్చిన హోంవర్క్ బుక్. ఈ రకంగా చేస్తే విద్యార్థులు హోంవర్క్ చేయటానికి తాము అవగాహన చేసుకున్న విషయాలు టెక్స్ పుస్తకం, క్లాస్ నోట్ పుస్తకం లేకుండా రాయాలి కాబట్టి క్లాసులో ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళ పోరు లేకుండానే వెళ్ళగానే తన హోంవర్క్ తాను చేసుకుంటాడు (మర్చిపోతానేమో అన్న భయంతో). టీచర్ల ఇచ్చే ప్రశ్నలు కూడా వారి అవగాహన, విమర్శనాశక్తి, విశ్లేషణాశ క్తి, ఊహాశక్తి ఉపయోగించి రాసేవిధంగా ఉంటే, ఇప్పుడు నడుస్తున్న రోట్ లర్నింగ్ పోయి, పిల్లల మేధ, ఆలోచనాశక్తి, ధారణ పెరుగుతాయి. ఎంతసేపు టెక్స్‌బుక్‌లోంచో, టీచర్ రాయించిన నోట్స్‌లోంచో కాకుండా తమ ఆలోచనలను విస్తృతం చేసుకునే అవకాశం పిల్లలకు ఇచ్చినట్టవుతుంది.
kankadurga
3. పైన చెప్పినవి జరుగాలంటే ఆ విధానాన్ని 6వ తరగతి నుంచి అమ లుచేయాలి. 5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం, పాటలు, పద్యాలు పాడటం, ఊహాజనిత విషయాల గురించి రాయటం వంటివి అప్పటిదాకా బోధించాలి, శిక్షణనివ్వాలి. స్పష్టంగా సరైన ఉచ్చారణ చేయటం, తప్పులు లేకుండా మూడు భాషలలోనూ తేలికపాటి పదాలు, వాక్యాలు ఉపయోగించి రాయటం, స్వయంగా చదువటం 5వ తరగతి అయ్యే సమయానికి గరిపితే, 6వ తరగతి నుంచి వారు విన్నది, చదివినది వారే అర్థం చేసుకుంటారు. దానిగురించి భయం, బెరుకు లేకుండా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. ఈ విధానాలు ప్రవేశపెట్టి, అవి ఎలా పాటించి, బోధించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తే, తెలంగాణలో పాఠశాల విద్యారంగం చాలా బలోపేతమవుతుంది.

438
Tags

More News

VIRAL NEWS