భారత వ్యవస్థకు మూడవ సవాలు

Wed,January 10, 2018 11:27 PM

స్వతంత్య్ర భారతదేశ వ్యవస్థ ప్రస్తుతం మూడవ సవాలును ఎదుర్కొంటున్నది. మొదటి సవాలు పేదరికం. దానిని పరిష్కరించటంలోని వైఫల్యం వల్ల తలెత్తిన రెండవ సవాలు సామాజిక అశాంతి, ప్రాంతీయ ధోరణులు, కుల సమస్యలు, అస్తిత్వ ఉద్యమాలు, తిరుగుబాటు ఉద్యమాలు మొదలైనవి. ఈ రెండు సవాళ్లను చక్కబెట్టడంలోని వైఫల్యం వల్ల ఉత్పన్నమవుతున్న మూడవ సవాలు ఇటీవలి కాలంలో ముందుకు వస్తున్న మతతత్వ ధోరణి. ఈ మూడు సవాళ్లు ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో ఏమి కాగలదన్నది అగమ్యగోచరమే.

ఈ మూడు సవాళ్లను , వాటి క్రమాన్ని, పర్యవసానాలను ఇపుడు ఒకటొక్కటిగా చూద్దాం. మొదటిది పేదరి కం. భారతదేశంలో సహజ సంపదలు ఎన్ని ఉన్నా, అత్యధిక ప్రజల జీవిత స్థితిగతులను బట్టి స్వాతంత్య్రానికి ముందు వరకు పేద దేశమే. అప్పటివరకు ఇక్కడి వర్గాలు, బయటివారు చేసిన ఎటువంటి దోపిడీల వల్ల, ప్రజలను నిర్ల క్ష్యం చేసినందువల్ల పేదరికం ఒక సవాలుగా మారిందో తెలిసిన విషయ మే. అందువల్లనే స్వాతంత్రోద్యమ నాయకత్వం మనకు ఇంకా స్వాతం త్య్రం సిద్ధించటానికి ముందే, పేదరికం నిర్మూలనను, అభివృద్ధిని అన్నింటికి మించిన లక్ష్యాలుగా ప్రకటించింది. అందుకో స్వాతంత్య్రానికి ముం దు, 1947లో స్వాతంత్య్రాన్ని సాధించినప్పుడు, 1951లో రాజ్యాంగం అమలుకు వచ్చినప్పుడు అనేక ప్రణాళికలను వెల్లడించింది. వీటన్నింటిని గమనించిన దేశ ప్రజలు ఇక అభివృద్ధి జరుగగలదని, పేదరికం సవాలు మనం అధిగమించగలమని చాలా ఆశలు పెట్టుకున్నారు.

మొదటి సవాలు, రెండవ సవాలు 1947-1980ల మధ్య పరిష్కారం అయి ఉంటే, ఈ మూడవ సవాలుకు అసలు ఆస్కారమే లేదు. దాని ప్రవేశానికి వీలు కల్పించే శూన్యమన్నదే దేశవ్యవస్థలో ఉండేది కాదు. ఏ దేశ వ్యవస్థకైనా, దాని నిర్వహణకైనా మతం అనే కేవలం వ్యక్తిగత అంశంతో నిమిత్తం ఉండకూడదు. కాని, మొదటి రెండు సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవస్థ, నాయకత్వాలు విఫలమై అసలు మతమన్నది ఒకసారి రంగప్రవేశం చేసిన తర్వాత, అది కేవలం మతమా లేక మతతత్వమా అనే చర్చ అర్థం లేనిదవుతుంది.

కాని 15-20 సంవత్సరాలైనా గడువకముందే, ఈ మొదటి సవాలు అయిన పేదరికాన్ని మన నాయకత్వాలు పరిష్కరించగలవనే ఆశలు అడియాసలు కావటం మొదలైంది. ఆ కాలంలో అసలేమీ జరుగలేదని కాదు. కాని ఇంత పెద్ద దేశం, ఎన్నెన్నో సమస్యలు, తీవ్రమైన పేదరికం మధ్య అది కొరగాకుండా పోయింది. అంతకన్నా ముఖ్యమైంది మరొక టి ఉంది. పేదరికం సవాలు పరిష్కారం కాకపోయినా, కనీసం ప్రభు త్వం రాజకీయ నాయకులకు, అధికారయంత్రాంగం, సామాజిక నాయకత్వాలు ఆ దిశలో నిజాయితీతో పనిచేస్తున్నట్లు కనిపించి ఉంటే ప్రజలకు ఆ మేరకు విశ్వాసం, సంతృప్తి కలిగి ఉండేవి. కాని ఈ నాలుగింటి లో ఏ ఒక్కటీ ప్రజలు మెచ్చగలిగినట్లు జరుగలేదు. మొదటి ప్రధాని నెహ్రూ వంటి ఒకరిద్దరు తగినంత నిస్సహాయస్థితిలో చిక్కుకుని విరోధ శక్తులను ఎదుర్కొంటూ వీలైనంత ప్రయత్నం చేసి ఉండవచ్చు గాక. కాని అది ఎంతమాత్రం చాలలేదు. వారు స్థూల స్థాయిలో (మ్యాక్రో లెవల్స్) కొన్ని చేయగలిగినా సూక్ష్మమైన క్షేత్రస్థాయిలో (మైక్రో లెవల్స్) ఫలితాలు సంతృప్తికరంగా లేవు.

ఈ విధంగా మొదటిసవాలు కొనసాగటమే గాక, కొన్ని విషయాల్లో ఇంకా తీవ్రమవుతున్నట్లు కనిపించటంతో రెండవ సవాలు ఆవిర్భావానికి బీజాలు పడ్డాయి. సుమారు 1960ల మధ్య నుంచి ఇది ఒక రూపుతీసుకోవటం మొదలైంది. ఆ సవాలు రూపం బహుముఖాలుగా విస్తరించింది. ఆ బహు ముఖాలలో సామాజిక అశాంతి ఒకటి. 1960ల మధ్య నుంచి ఆరంభించి గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తుల వారు, అటవీ ప్రాంతాలలో ఆదివాసీలు, పట్టణ ప్రాంతాలలో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులకు చివరకు ఉద్యోగు లు కూడా అశాంతికి గురికాగా సామాజిక అశాంతి విస్తరించసాగింది. అనేక సమ్మెలు, ఆందోళనలు జరిగాయి. నక్సలైట్ ఉద్యమం తలెత్తింది. అట్లా కొద్దికాలం గడిచి 1970లు వచ్చేసరికి ఇదే అశాంతి ఇంకా పెరుగటమే గాక ప్రాంతీయ రాజకీయ-ఆర్థికశక్తులు, కుల అస్తిత్వ ధోరణులు, ఇతర అస్తిత్వ ఉద్యమాలు ముందుకు రాసాగాయి. కేంద్రీకృత రాజకీయ ప్రాబల్యం బలహీనపడటం మొదలైంది.

గమనించదగినది ఏమంటే, మొదటి సవాలు అయిన పేదరికం ఇం కా గణనీయస్థాయిలో కొనసాగుతూనే ఉండగా, ఆ వైఫల్యం నుంచి పుట్టుకువచ్చిన ఈ రెండవ సవాలు దానిని సమాంతరంగా ముందుకువచ్చి విస్తరించటం మొదలైంది. మొదటి సవాలును అధిగమించలేకపోయిన భారతదేశ వ్యవస్థ, లేదా నాయకత్వం, ఈ రెండవ సవాలు కూడా వచ్చేసరికి దిక్కుతోచనదిగా మారింది. ప్రవాహంలో కొట్టుకుపోతూ, తన సొంత ఉనికి కాపాడుకునేందుకు ఆరాటపడుతూ, అపుడపుడు ప్రాప్తకాలజ్ఞత అనదగ్గ ఎత్తుగడలను అనుసరిస్తూ పోయింది. ఆ క్రమం లో మరింతగా బలహీనపడుతూ వచ్చింది. అది తార్కికమైనది, సహజమైనది కూడా. ఎందుకంటే, సవాళ్లను అధిగమించే వ్యూహమంటూ ఉన్నపుడు అందులో భాగంగా ఎత్తుగడలు పనిచేస్తాయి గాని, వ్యూహ మే లేనపుడు ఎత్తుగడలన్నవి తెరచాప, చుక్కాని, తెడ్లు లేని పడవను చేతులతో నీటిని తోస్తూ నడిపినట్లు ఉంటుంది. దేశ నాయకత్వానికి, దానితో పాటు దేశవ్యవస్థకు సరిగా అదే జరిగింది.

ఈ రెండు సవాళ్లు సమాంతరంగా సాగి, వ్యవస్థలో రెండు శూన్యాల ను సృష్టించాయి. ఆ సవాళ్ళు, శూన్యాల పర్యవసానంగా భారతదేశంలో జాతీయవాదం, జాతీయత అన్నవి, ఒక జాతీయ వ్యవస్థ అన్నది ఆరోగ్యకరమైన, బలమైన పునాదులపైన నిర్మాణం కాకుండాపోయాయి. 1960లలో మొదలైన అస్తవ్యస్త స్థితులు పాతికేండ్ల పాటు 1980ల వర కు కొనసాగాయి. కాని మొదటి వైఫల్యపు 15-20 ఏళ్లు, మొదటిది-రెండవది కలగలసిన వైఫల్యాల మొత్తం 40-45 సంవత్సరాల సుదీర్ఘకాలంలో భారతవ్యవస్థ, నాయకత్వాలూ (ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అన్నీ కలగలిపి) సవాళ్లను అధిగమించలేకపోవటమే గాక, పైన అన్నట్లు కేవలం స్వీయ అస్తిత్వాల కోసం, అధికార స్పృహలతో, తెరచాపలు లేని పడవలను చేతులతో నీటిని తోస్తూ ముందుకు పోజూస్తూ వస్తున్నారు.

కాని సుడిగుండాలు, సుడిగాలులు, రోదసిలో కృష్ణబిలాలు ఎవరినీ క్షమించవు. సమాజంలో పాత సవాళ్లు పరిష్కారం కానపుడు ఆ స్థితి సరికొత్త సవాళ్లను పుట్టిస్తుంది. రోగ కారకాలయ్యే పాత వైరస్‌లు కొత్త సంతానాన్ని కంటాయి. మ్యుటేట్ అవుతాయి. సరిగా ఈ స్థితి నుంచి లేదా శూన్యం నుంచి తలెత్తి వస్తున్నదే మత సమస్య. ఇందుకు మూలా లు 1980ల చివరి నుంచే ఉండగా 1990లు వచ్చేసరికి ఆకారం స్పష్టం గా కాసాగింది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతున్నది మతతత్వం గురిం చి కాదని దయచేసి గమనించాలి. అది ఉండటం సరే. కాని అంతకన్నా ముఖ్యమైన మౌలిక ప్రశ్న ఒకటుంది. అది మతమనేది దేశ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థల అజెండాపైకి ప్రవేశించటం. పైన పేర్కొన్న మొదటి సవాలు, రెండవ సవాలు 1947-1980ల మధ్య పరిష్కారం అయి ఉంటే, ఈ మూడవ సవాలుకు అసలు ఆస్కారమే లేదు.
ashok
దాని ప్రవేశానికి వీలు కల్పించే శూన్యమన్నదే దేశవ్యవస్థలో ఉండే ది కాదు. ఏ దేశ వ్యవస్థకైనా, దాని నిర్వహణకైనా మతం అనే కేవలం వ్యక్తిగత అంశంతో నిమిత్తం ఉండకూడదు. కాని, మొదటి రెండు సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవస్థ, నాయకత్వాలు విఫలమై అసలు మతమన్నది ఒకసారి రంగప్రవేశం చేసిన తర్వాత, అది కేవలం మతమా లేక మతతత్వమా అనే చర్చ అర్థం లేనిదవుతుంది. శూన్యంలోని మతం ప్రవేశించిందే మతతత్వంగా మారటానికి. ఇపుడిది మూడవ సవాలు అయింది. దేశ వ్యవస్థ ఈ మూడు సమాంతర సవాళ్లను ఎదుర్కొనలేకపోతే భవిష్యత్తు ఆందోళనకరంగా కనిపిస్తున్నది. ఈ మూడింటి మిశ్రమం భయంకరమైనది. చివరికి పరిష్కారం ఎట్లా జరుగుతుందో గాని ఈ లోపల దేశం మరొక కల్లోల స్థితిని ఎదుర్కోవచ్చుననిపిస్తున్నది.

507
Tags

More News

VIRAL NEWS