సాహితీ తెలంగాణ

Wed,December 6, 2017 11:26 PM

తెలుగు భాషా వికాసానికి
పుట్టినిల్లు తెలంగాణ
ద్విసహస్ర వసంతాల వెన్నెల సొన
మన ఘన సాహితీ తెలంగాణ
అందమైన అలంకారాలు
హృద్యమైన పదాలు
యతి యాస ప్రాసలు
సాహితీ మణిపూసలు
కొలమానాలకందని సాహిత్య
సంపద కొలువు తీరింది
కవులెందరినో కవన మార్గాన
కదిపి కావ్య కర్మాగారమయింది
సాహితీ ప్రక్రియలకు
కాణాచి అయింది
అలంకార గ్రంథానికి
ఆదియై నిలిచింది
తెలుగు సాంస్కృతిక
వికాసంలో తెలుగు ఖ్యాతి
మహాసభలు నలుదిక్కులా
వెలుగులు నింపే అఖండ జ్యోతి
ఎలుగెత్తి పాడే పాటలకు
పరుగెత్తే ద్విపదులు
ఆధునిక రచనా ప్రక్రియలకు
ఆలవాలమైన ప్రయోగాల క్షేత్రం
జిగిబిగిన అల్లుకున్న తెలంగాణ
తెలుగు పదదీప్తి
తెలుగు ప్రాభవం గుభాళించే
నలుచెరుగులా సాహితీ కీర్తి
- యాదయ్య కొప్పోలు, 9494273703

274
Tags

More News

VIRAL NEWS