ఉద్యోగులకు నైతిక బోధ

Wed,December 6, 2017 12:10 AM

నైతిక విలువలు పాటించడమనేది సమిష్టి యత్నమైనప్పటికీ, వ్యక్తుల నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తుల ఆలోచనాసరళిని బట్టి, వారి నీతి, నిజాయితీలను బట్టి, వాటి మనుగడ సాధ్యమవుతుంది. ఇందుకోసం మనం అనాదిగా పాటిస్తూ వస్తున్న పాత సిద్ధాంతాలను మరొక్కమారు పునశ్చరణ చేసుకోవాలి.
jwala
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల అనైతిక-అవినీతి కార్యకలాపాల గురించి మీడియాలో వార్తలు రావడం తెలిసిన విషయమే. ఇవన్నీ విశ్లేషణ చేసి చూస్తే, పునశ్చరణ శిక్షణా కార్యక్రమాల ద్వారా సిబ్బందిలో మానసిక పరివర్తన తేవాల్సిన అవసరం ఉన్నదనాలి. సుపరిపాలన కావాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, పాలనలో నైతిక విలువలు పెంపొందించడం అవశ్యం. అవినీతిని అరికట్టడం ద్వారానే, ఆర్థికాభివృద్ధి, అట్టడుగువర్గాల వారి అభివృద్ధి, జాతీయాభివృద్ధి జరిగే వీలున్నది. ప్రభుత్వ సిబ్బందికి కనీసం ఒక వారం రోజులపాటు పాలనలో నైతిక విలువలు అనే అంశం మీద శిక్షణ నిర్వహించాలి. దీనివల్ల పరిస్థితిలో కొంత మార్పువచ్చే అవకాశం ఉంది.

శిక్షణ అంటే మూడురకాలుగా సిబ్బందిలో మార్పు తేవడం. ఒకటి.. సంబంధిత అంశంలో విజ్ఞానాన్ని కలిగించడం. రెండోది.. నేర్చుకున్న దాన్ని అమలు చేసే నైపుణ్యం కలిగించడం. మూడోది.. మానసిక పరివర్తన తేవడం. మొదటి రెండు తేలికైనవే కానీ మూడోది మాత్రం కష్టతరం. జాతీయ శిక్షణావిధానం కూడా మానసిక పరివర్తన తేవడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ సిబ్బందికి పౌరుడిపట్ల, పౌరుల హక్కుల పట్ల గౌరవం ఉండాలి. దీనికోసం నిరంతరం నైతిక విలువల పరిరక్షణకు మానసిక పరివర్తన తెచ్చేలా శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలి. వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధి, సౌశీల్యం, నిబద్ధత, నీతినిజాయితీ అలవడటానికి శిక్షణ దోహదపడాలి.

వ్యక్తిగతంగా, సామాజికంగా ప్రవర్తనా నియమావళి పాటించడమే నైతి క విలువలని అర్థం చెప్పుకోవాలి. ఏ సమాజమైనా ఇవిలేకుండా అభివృ ద్ధి చెందలేదు. సంస్థలకు, వ్యవస్థలకు ఐదురకాల నైతిక మౌలిక సూత్రాలుండాలని మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఎన్.విట్టల్ చెప్పారు. అవి.. సంకల్పం, అభిమానం, సహనం, పట్టుదల, దృష్టికోణం. సమాజ సం స్కృతిని బట్టి కూడా నైతిక విలువల పరిస్థితి మారుతుంటుంది. భారతదేశంలో అనాదిగా నెలకొన్న ఒక సంస్కృతి ఉన్నది. పాలనలో నైతిక విలువలకు మనం అనాదిగా ఆచరిస్తున్న ధర్మం ప్రాతిపదిక. తక్కువస్థాయి, వ్యక్తిగత ఆసక్తుల కంటే, ఉన్నతమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ధర్మాన్ని మించింది ఏదీ లేదు.

ప్రభుత్వ పరిపాలనలో నీతిశాస్త్రం మూలాల్లోకి పోతే, మనకొక మహత్తరమైన సంప్రదాయం-ఆచారం ఉండేదని అవగతమవుతున్నది. మన సాహిత్యం-వాంగ్మయంలోకి తొంగి చూస్తే, సంప్రదాయిక సమాజపరమైన లక్ష్యాలకు, వ్యక్తులకూ మధ్య చక్కటి సామరస్యం ఉన్నదని అర్థమవుతుంది. వాస్తవానికి ఆ సామరస్యమే ప్రభుత్వ పాలనలో అర్థవంతమై న నైతిక విలువలకు మూలం. సమాజంలోని ప్రతి వ్యక్తీ అందరి క్షేమాన్ని కాంక్షించాలి. వేల-లక్షల సంవత్సరాల పూర్వం నుంచి ఆచరణలో ఉన్న మన సంస్కృతీ-సంప్రదాయాల పరంపరలో భాగమైన ధర్మం ఆధారంగానే సమాజంలోని వ్యక్తుల జీవన లక్ష్యం నిర్దేశించడం జరిగింది. ప్రతి వ్యక్తీ ధర్మాన్ని ఆచరిస్తే, అదే స్వీయ క్రమశిక్షణకు దారితీస్తుంది. స్వీయ క్రమశిక్షణ ఉన్న సమాజంలో శాంతి-సౌభాగ్యం సహజంగానే ఉంటా యి. దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలో నూటికి-నూరు పాళ్లు స్వచ్ఛమైన ప్రవర్తన కలవాళ్లు అరుదనే అనాలి. ప్రభుత్వ పాలనకు ధర్మమే పునాది అనేది సుస్పష్టం.

నైతిక విలువలను ప్రభుత్వ పాలనలో పాటించకపోతే సుపరిపాలనకు అవకాశం లేదని అంటారు మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఎన్.విట్టల్. చట్టం ముందర-న్యాయపాలన ముందర అందరూ సమానమనే విష యం, ప్రతి వ్యక్తినీ గౌరవించాలనే విషయం, పరిమితంగా ఉన్న మన దేశ వనరుల వినియోగంలో వ్యర్థం కాకుండా జాగ్రత్తపడే విషయం, సుపరిపాలనకు గీటురాళ్లు. చట్టాలను పటిష్టంగా అమలుచేయడంలో విఫలమైతే సుపరిపాలనకు బదులు దుష్పరిపాలన చోటుచేసుకుంటుంది. అవినీతి బాగా ఉన్నచోట నైతికవిలువలు ధ్వంసమవుతాయి. నీతి, నిజాయితీలకు తావుండదు. మేధోపరమైన అవినీతి, ఆర్థిక సంబంధమైన అవినీతి, నైతిక విలువలకు తిలోదకాలు, సంకుచిత మనస్తత్వం అవినీతి చర్య లే. అవినీతికి పాల్పడిన వారిని జాతి వ్యతిరేకిగా, ఆర్థికాభివృద్ధి వ్యతిరేకి గా, పేదవారికి వ్యతిరేకిగా భావించాలి.

అవినీతిని అరికట్టడానికి, ప్రభుత్వ పాలనలో నైతిక విలువల ప్రోత్సాహానికి శిక్షణ అవసరం. శిక్షణలో సాధారణంగా ఇచ్చే వృత్తి నైపుణ్యపరమైన అంశమే కాకుండా, నైతి క విలువల పరమైన అంశాలు కూడా ఉంటే, సిబ్బంది మానసిక పరివర్తనకు అవకాశం ఉం టుంది. ఒక వ్యక్తి గొప్పతనా న్ని నిర్ణయించేది, ఆ వ్యక్తి ఎం తమేరకు మానవ విలువలను, నైతిక విలువలను పాటిస్తున్నాడనేది మాత్రమే. డబ్బు సంపాదించాలన్న వ్యామోహం, అధికారం మీద మోజు, గుర్తింపు రావాలన్న తహతహ, పనిచేయకుండా ఉండే అనైతిక మనస్తత్వం సిబ్బందిలో పెరుగడం దురదృష్టకర పరిణామం. కాంట్రాక్టు లు ఇప్పించేటందుకు, పదోన్నతుల కోసం, మరెన్నో రకరకాల రాయితీల కోసం, వ్యక్తుల మధ్య, బృందాల మధ్య అనైతిక అవగాహనలు, ఒప్పందాలు ఉండటం వింటూ ఉంటాం.
image
ఇలాంటి విపరీత పరిణామాలను అధిగమించడానికి అవసరమైన సం స్థలు-వ్యవస్థలు పాలనారంగంలో కావాల్సినన్ని ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకొని పరిస్థితులను చక్కదిద్దే యంత్రాంగం కొరవడింది. నైతిక విలువలు పాటించడమనేది సమిష్టి యత్నమైనప్పటికీ, వ్యక్తుల నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తుల ఆలోచనాసరళిని బట్టి, వారి నీతి, నిజాయితీలను బట్టి, వాటి మనుగడ సాధ్యమవుతుంది. ఇందుకోసం మనం అనాదిగా పాటిస్తూ వస్తున్న పాత సిద్ధాంతాలను మరొక్కమారు పునశ్చరణ చేసుకోవాలి. తదనుగుణంగా, మన వ్యక్తిగత జీవనంలోను, ఉద్యో గంలోను మసులుకోవాలి. మౌలికమైన నైతిక, మానవ విలువలకు సం బంధించిన ప్రేమ, వాత్సల్యం, దయ, నిబద్ధత, నీతి-నిజాయితీ, సత్ప్రవర్తన-న్యాయబద్ధత, సామాజిక బాధ్యత, గౌరవం నెలకొని ఉండాలనేది అందరూ అంగీకరిస్తారు.

504
Tags

More News

VIRAL NEWS