యాదగిరి సంకీర్తనాచార్యుడు

Sat,December 2, 2017 11:18 PM

అదివో అల్లదివో శ్రీహరివాసముయని తాళ్లపాక అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడిని ఆలపించినట్లే.. ఎంతో రుచిరా.. శ్రీరామ నీనామమెంతో రుచిరా:యని భద్రాద్రి రాముని కంచర్ల గోపన్న కొనియాడినట్లే.. యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహునికి పదహారతి పట్టినవాడు ఈగ బుచ్చిదాసు. యాదగిరిపై కొలువైన లక్ష్మీ నరసింహునికి వీను ల విందైన సంగీతంతో సేవచేసిన బుచ్చిదాసు సాహిత్యం వెలుగులోకి తెచ్చేందు కు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అడుగువేసింది. వేలాది కీర్తనలు రాసి, పాడి ఒకనాటి భక్తజన కోటిని లక్ష్మీనరసింహ సేవకు సన్నద్ధు లను చేసిన ఈగ బుచ్చిదాసు పదాలన్నింటినీ కూర్చిన సమగ్ర సాహిత్యాన్ని మనకందిస్తున్నది సాహిత్య అకాడమీ.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కాలం మరిచిన వాగ్గేయకారుడిని వెలుగులోకి తేవాలని, జనం మరిచిన పదాలను మళ్లీ అందరి నోళ్లలో నానేలా అందుబాటులోకి తేవాల ని సాహిత్య అకాడమీ తలపెట్టింది. యాదాద్రి లక్ష్మీనరసింహ భక్తులకు ఇదో తీపికబురు. ఈగ బుచ్చిదాసు సాహిత్యం కొం తమేరకే అందుబాటులో ఉన్నది. భజన మండళ్లకే ఈ సాహిత్యం పరిమితం కాకుండా అందరికీ చేరువ చేసేందుకు ఈగ బుచ్చిదాసు రచనలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించిన ఈ వ్యాసకర్తకు సంకలన బాధ్యతలను అప్పగించారు. ఈగ బుచ్చిదాసు రాసిన ఆరు గ్రం థాలతోపాటు ఆయన జీవిత విశేషాలు, ఆయన శిష్యుల సేవలను ఈగ బుచ్చిదాసు సమగ్ర సాహత్యంలో వివరించే ప్రయత్నం చేశారు.

తెలంగాణలో భక్తరామదాసు ఇచ్చిన భజన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎందరో కవులు సంకీర్తనలు రాశారు. వారిలో రాకంచర్ల వేంకటదాసు, వేపూరి హనుమద్దాసు, పల్లా నారాయణాద్వరి, చిలుక కృష్ణదాసు, భాగవతుల కృష్ణదా సు ప్రముఖులు. ఈ కోవకు చెందినవారే ఈగ బుచ్చిదాసు. ఆయన భక్తిని, తత్త్వాన్ని సమపాళ్లలో రంగరించి లక్ష్మీ నరసింహునికి పదహారతి పట్టిండు. యాదగిరిలో ఎటువంటి సదుపాయాల్లేని కాలంలో తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ నరసింహుని సన్నిధిలో సంకీర్తనలు ఆలపించేవాడు.

ఈగ బుచ్చిదాసు శిష్యుల్లో సాదు బుచ్చిమాంబ ముఖ్యురాలు. ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని కొనసాగించిందామె. బుచ్చిమాంబ కృషితో యాదగిరి నరహరి శతకం, యాదగిరి లక్ష్మీ నరసింహశతకం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మంగళహారతులు, లక్ష్మీ నరసింహస్వామి బతుకమ్మ పాట, లక్ష్మీనరసింహస్వామి కీర్తనలు, యాదగిరి శివభజన కీర్తనలు నాటి భక్తులకు అందుబాటులో ఉంచడమే కాకుండా నేటి పరిశోధకులకూ ఆధారమయ్యాయి.
ఈగ బుచ్చిదాసు సాహిత్యం అధారంగా ఆయన భక్తితత్త్వాన్నే కాకుండా సామాజిక విషయాలనూ స్పృశించిండని అర్థమవుతుంది. బుచ్చిదాసు రచనల్లో ప్రశంసించదగిన రచన లక్ష్మీనరసింహ స్వామి కీర్తనలు. ఇందులో 127 కీర్తనలున్నాయి. హైందవ మత విశ్వాసాల్లో 108 దివ్యక్షేత్రాలు ఉన్నట్లుగానే, బుచ్చిదాసు రాసిన యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంలో 108 పద్యాలున్నాయి. ఇవన్నీ సీస పద్యాలే!

బుచ్చిదాసు కీర్తనల్లో ఎక్కువగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికే అంకితమై ఉన్నయి. యాదగిరి శ్రీవైష్ణవ సంప్రదాయానికే కాదు శైవ ఆరాధనకూ నిలయం. అందుకే ఇక్కడ ఆలయం చుట్టూ కాకుండా గుట్టచుట్టూ ప్రదక్షిణ చేస్తారు. యాదగిరి గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహుడిని, శివుడిని ఆరాధించే భక్తులలాగే బుచ్చిదాసు శివుడినీ ఆరాధించిండు. బుచ్చిదాసు లక్ష్మీ నరసింహుడి సేవకే పరిమితం కాకుండా శ్రీయాదగిరి శివభజన కీర్తన లు ద్వారా శివుడినీ కీర్తించిండు. బుచ్చిదా సు తెలంగాణ ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక, వేదాంత తత్త్వాన్ని తన కీర్తన ద్వారా వెల్లడించాడు. కీర్తన ల్లో ప్రాస, అంత్యప్రాసలతో సలక్షణంగా ఉంటాయి. ఆయన సాహిత్యంలో సామాజిక అభ్యుదయమూ ఉన్నది. అందుకు ఆయన రాసిన ఈ కీర్తనలో రైతు బాధను వేదాంత ధోరణిలో వ్యక్తంచేసిన తీరు తెలు స్తుంది.
నాటేస్తారమ్మా వరీ నాటేస్తారమ్మా వొయి.. నాటక
సూత్రధారి నాణ్యమయిన వరి మొలకలు.. (నాటే)
దోరెడ్లా గొర్రుగట్టి దారిమోట నీళ్లు విడిచి పారేటి
పొలములోన భళి భాళి యనుకుంటూ.. నా.. అయిదూ
బుడ్లా మొలకా.. ఆరూమళల్లరింపి.. పైనా వుండేటి
మడిలో పాటలు బాడుకుంటు.. (నాటే)
వరయాదగిరి పొలము.. వన్నె మీరిన పొలము.. నన్నుతించిన
బుచ్చిదాసుడు తిన్నగచేసేటి పొలము.. (నాటే)
తత్త కవులందరి లాగే బుచ్చిదాసు కులతత్వాన్ని నిరసించిండు. ధర్మమార్గంలో మనుషులు నడువాలని కోరుకున్న డు.
పచ్చి చర్మమూ పూతా.. దీని..
విచ్చిచూచితే రోతా
తుచ్ఛవరములా చాతూనీకు.. వచ్చును యెపుడో గాతా..
ఓ కీర్తనలోని ఈ మాటలు బుచ్చిదాసు సాహిత్యంలోని సామాజిక దృక్పథానికి నిదర్శనం.
బుచ్చిదాసు సాహిత్యంలో అందమైన తెలంగాణ నుడికారామూ ఉన్నది. తన సంకీర్తన ల్లో సంస్కృత పదాల కంటే తెలంగాణ పదాలకే పెద్దపీట వేసిండు. బుగులు బాపి, సరళున, పొంకము, యాదిలోనే దోసిలొగ్గితి, గం తులు వేసేది, మొద్దు సోపతి, కొండ పొడు గు, సారె సారెకు (మళ్లీ మళ్లీ), వొనరుగాను (అనుకూలం కాను), తాళజాలక, సాపుగ , దగులుబాజీ, తల్లడి ల్లు, జాలిబొడమి (భగవంతుడు జాలి చూపాలని ఆర్తితో కోరిండు) వంటి వినసొంపైన పదాలెన్నో బుచ్చిదాసు సంకీర్తనల్లో ఉన్నాయి. తెలంగాణలో ప్రయోగించే కట్టేలని చెరు వు (భగవంతుడు లేకుంటే కట్టలేని చెరువు లాంటిది జీవి తం), (గుట్టు తెలిసిన గువ్వపిల్ల) మొదలైన జాతీయాలను గుర్తించవచ్చు.
yogi
ఈగ బుచ్చిదాసు సంకీర్తనా సాహిత్య లక్షణం బాగా తెలిసినవాడు. ప్రతి కీర్తనకు రాగ, తాళాలు నిర్దేశించారు. తత్తా ల్లో దేశీ పదాలుండాలన్నాడు. ఆయన భజన కీర్తనల్లో తాళానికి ప్రాధాన్యం ఇచ్చిండు. ఈయన అరుదైన రాగాలు పాడిండు. బిళహరి, కాంబోభ, ఫ్ఫీలు రాగం, ఎదుకుల కాం భోజి, భూపాల, కేదారిగౌళ, నామనాధ క్రియరాగం, శహాన రాగం, కురుచ జంపె వంటి అరుదైన రాగాలలో పదాలను స్వరపరిచిండు. ఈ కవిని గురించి డాక్టర్ శ్రీరంగాచార్య సంక్షిప్తంగా పరిచయం చేశారు. కానీ ఈయన సాహిత్యం తెలంగా ణ సమాజానికి పూర్తిగా అందుబాటులోకి రాలే దు. ఆ ప్రయ త్నం ఇప్పుడు జరుగుతున్నది. తెలంగాణ సంకీర్తనా సాహిత్య క్షేత్రంలో ఆయనో మరుగున పడిన మాణిక్యం. ఆయన కీర్తనలన్నింటినీ సాదు బుచ్చిమాంబ ముద్రించారు. పీఠాధిపతి శంకరానంద స్వామి వాటిని నాకు అందించారు. వీటిని వెలుగులోకి తీసుకురావడానికి సాహిత్య అకాడమీ కృషిచేయటం మహాభాగ్యం. యాదగిరిగుట్ట కింద ఉన్న ఈగ బుచ్చిదాసు ఆశ్రమం కృషితో ఆయన సాహిత్యం ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నది.

1323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles